వర్షాకాలంలో కలుషిత ఆహారానికి 10 వంటింటి చిట్కాలు

Posted By: Deepti
Subscribe to Boldsky

అందరికీ తెలిసిన విషయమే, కలుషిత ఆహార అనారోగ్యం వర్షాకాలంలో తరచుగా కన్పించేదే. వర్షాకాలంలో ఉండే అధిక తేమ మన జీర్ణశక్తిని తగ్గించి,అనేక ఇన్ఫెక్షన్లకు కారణమవుతుంది.బ్యాక్టీరియా,వైరస్ లు,పరాన్నజీవులు,విషపదార్థాల వల్ల ఆహారం,నీరు కలుషితమవటంతో ఈ అనారోగ్యంను వర్షాకాలంలో తప్పించుకోవటం అనివార్యం.ఇంకా సమస్యలు పెంచడానికి,ఇది కేవలం కలుషిత ఆహారం,చల్లని వైరస్ లకి అనుకూలమైన పదార్థాలను తీసుకోవటం వల్ల వెంటనే రావచ్చు. ప్రమాదకర రోగం కాకపోయినా, ఇది మీ దైనందిక పనుల నుండి ఒక వారంపాటు మిమ్మల్ని దూరం చేయవచ్చు.ఒళ్ళునొప్పులు,వాంతులు,విరోచనాల వంటి లక్షణాలు అసౌకర్యంగా మారతాయి.

సాధారణంగా, ఈ లక్షణాలు పెరిగినప్పుడల్లా మీరు నీరసపడవచ్చు, కానీ కొన్ని కేసులలో ఒక వ్యక్తికి ఇన్ఫెక్షన్ సోకిన తర్వాత కూడా ఈ లక్షణాలు నిలబడతాయి.కలుషిత ఆహార అనారోగ్యం కలిగించే కొన్ని ఆహారపదార్థాల గూర్చి తెలుసుకోండి.సామాన్యంగా బలహీన వ్యాధి నిరోధకశక్తి ఉన్నవారు తొందరగా ఇన్ఫెక్షన్ కి గురౌతారు.ఒకటి లేదా రెండు వారాలు ఉండే ఈ ఇన్ఫెక్షన్ ను పోరాడటానికి కు సరియైన మొత్తంలో నీరు తీసుకోవడం అత్యవసరం.నీరు అధికంగా తీసుకుంటూ,ఈ కింది 10 వంటింటి చిట్కాలను పాటించి మీ కలుషిత ఆహార సమస్యను తగ్గించుకోండి.

అల్లం

అల్లం

అల్లం అనేక వ్యాధులను నయంచేస్తుంది. అది ముఖ్యంగా కలుషితాహార సమస్యకు సాయపడుతుంది.జీర్ణశక్తిని పెంచి మీ జీర్ణాశయ పనిని సులభం చేస్తుంది. ఈ అద్భుత అల్లం వేరు కలుషిత ఆహార సమస్య లక్షణాలైన వికారానికి,వాంతులకి చిట్కాగా పనిచేస్తుంది.అల్లాన్ని మీ టీ లో కాని,పళ్లరసంలో కానీ కలుపుకొని తీసుకోండి.రోజులో చాలాసార్లు కొంచెం కొంచెంగా అల్లాన్ని నేరుగా కూడా తీసుకోవచ్చు.

తులసి

తులసి

తులసి కేవలం కడుపులోని అస్వస్థతకు ఉపశమనం కలిగించటమే కాదు, దానికున్న వైద్యలక్షణాలు కడుపులో సూక్ష్మజీవుల పెరుగుదలను కూడా నిరోధిస్తుంది. ఈ ప్రభావవంతమైన సహజ మూలికను దాని ఆకుల రసం లేదా తులసినూనె రెండు చుక్కలను మీరు తాగే ఏ పానీయంలోనైనా కలిపి రోజంతా అప్పుడప్పుడు తీసుకోవచ్చు.

యాలకులు

యాలకులు

యాలకులు జీర్ణవ్యవస్థకి చాలా మంచిది.కలుషిత ఆహార సమస్య లక్షణాలైన వికారం,అజీర్తి,ఒళ్ళునొప్పులను ఉపశమింపచేయటంలో ఇది పనిచేస్తుంది. ఈ లిస్ట్ లో ఇతర పదార్థాల లాగా యాలకులకు కూడా సూక్ష్మజీవులను నిరోధించే శక్తి ఉన్నది.అందుకని నేరుగా తీసుకోవచ్చు లేదా ఆహారంలో కలిపి వండుకుని రోజంతా తీసుకోవచ్చు.

వెల్లుల్లి

వెల్లుల్లి

వెల్లుల్లి ప్రభావవంతమైన వైరస్,బ్యాక్టీరియా,ఫంగస్ వ్యతిరేక లక్షణాలను కలిగిఉంది.కనుక కలుషిత ఆహార సమస్యకి మంచి మందుగా పనిచేస్తుంది. విరోచనాలను,కడుపు నొప్పికి ఉపశమనాన్ని అందిస్తుంది. చాలామందికి వెల్లుల్లి వాసన నచ్చదు కాబట్టి, దీన్ని నీరుతో కలిపి మింగుతూ రోజంతా అనేకసార్లు తీసుకోవచ్చు.

నిమ్మ

నిమ్మ

నిమ్మకాయ మీ కలుషిత ఆహార అనారోగ్యం నుంచి చాలా శాంతిని కలిగిస్తుంది.అది తీసుకోగానే అందులో ఉన్న వైరస్,బ్యాక్టీరియా వ్యతిరేక లక్షణాల వల్ల కడుపులోని సూక్ష్మజీవులను సంహరిస్తుంది.నిమ్మకాయ రసం రోజుకి మూడుసార్లు తీసుకోవచ్చు.

జీలకర్ర

జీలకర్ర

జీరాగా పిలవబడే జీలకర్ర కడుపునొప్పిని,వాపును తగ్గిస్తుంది.జీలకర్రను నేరుగానే తీసుకోవచ్చు.కానీ మరింత ప్రభావం కోసం,ఒక కప్పు నీటిలో జీలకర్రను మరిగించి రోజంతా కొన్నిసార్లు దాన్ని తాగండి.

కొత్తిమీర

కొత్తిమీర

కొత్తిమీర బ్యాక్టీరియాను సంహరించటంలో అధికప్రభావం చూపిస్తుంది.కొత్తిమీరను ప్రతిదినం మీ వంటలలో ఉపయోగించటం మంచిది. సిలాంట్రోగా పిలవబడే కొత్తిమీర, కొత్తిమీర నూనెగా కూడా కలుషిత ఆహారసమస్యను నయం చేయటంలో సాయపడుతుంది.ఆ నూనెను కూడా మీ ఆహారంలో భాగం చేసుకోవచ్చు.

మెంతులు మరియు పెరుగు

మెంతులు మరియు పెరుగు

పెరుగుకి వైరస్,బ్యాక్టీరియాలతో పోరాడే శక్తులు ఉన్నాయని ఎప్పుడో నిరూపితమైన విషయం.మెంతులు కడుపునొప్పిని సమర్థవంతంగా నయం చేస్తాయి.ఈ రెండు అద్భుత పదార్థాలను కలిపి తీసుకోవటం వల్ల మీకు మంచి ఉపశమనం కలుగుతుంది.ఒక చెంచాడు మెంతులు,ఒక చెంచా పెరుగుతో మీకు కడుపునొప్పి,వాంతుల నుండి వెంటనే ముక్తి కలుగుతుంది.

తేనె

తేనె

మిఠాయిలంటే ఇష్టమైన వారికి ఈ పద్ధతి. తేనెకి బ్యాక్టీరియా,ఫంగల్ వ్యతిరేక లక్షణాలుండటంతో అది ఈ సమస్యను పూర్తిగా ఎదుర్కోటంలో సాయపడుతుంది.నేరుగా కానీ,టీతో కానీ కలిపి తీసుకోవచ్చు.రోజులో అనేకసార్లు తీసుకోవచ్చు.కలుషిత ఆహార అనారోగ్యంపై తేనె తీపి ప్రభావాన్ని చూపిస్తుంది.

సోంపు

సోంపు

సోంఫు జీర్ణశక్తిని పెంచి ఆహారాన్ని పాడుచేసే బ్యాక్టీరియా,ఫంగైలతో పోరాడే శక్తి కలిగిఉన్నదని అనేక పరిశోధనలలో నిరూపితమైంది.సోంఫు రోజులో అనేకసార్లు తీసుకోవచ్చు.కడుపులో కలిగే బాధలకు వెనువెంటనే ఇది ఉపశమనం కలిగిస్తుంది.

For Quick Alerts
ALLOW NOTIFICATIONS
For Daily Alerts

    English summary

    10 Home Remedies To Treat Food Poisoning This Monsoon in Telugu

    Apart from hydrating one's self adequately, below mentioned are 10 best home remedies to treat food poisoning this monsoon.
    Story first published: Monday, June 19, 2017, 8:15 [IST]
    We use cookies to ensure that we give you the best experience on our website. This includes cookies from third party social media websites and ad networks. Such third party cookies may track your use on Boldsky sites for better rendering. Our partners use cookies to ensure we show you advertising that is relevant to you. If you continue without changing your settings, we'll assume that you are happy to receive all cookies on Boldsky website. However, you can change your cookie settings at any time. Learn more