For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

కాఫీ మీకు మంచిది కాదు అనడానికి 10 కారణాలు

కాఫీ, మొక్క లో పెరిగిన కాఫీ బీన్స్ నుండి సేకరించబడిన ముఖ్యమైన కాచిన పానీయం. కాఫీ మొక్క మొట్టమొదటి సారి ఇథియోపియాలో కనిపెట్టడం వల్ల అక్కడి నుండి పుట్టింది అని చెప్తారు, కానీ ఈ పానీయం పుట్టింది మటుకు యె

By Gandiva Prasad Naraparaju
|

కాఫీ, మొక్క లో పెరిగిన కాఫీ బీన్స్ నుండి సేకరించబడిన ముఖ్యమైన కాచిన పానీయం. కాఫీ మొక్క మొట్టమొదటి సారి ఇథియోపియాలో కనిపెట్టడం వల్ల అక్కడి నుండి పుట్టింది అని చెప్తారు, కానీ ఈ పానీయం పుట్టింది మటుకు యెమెన్ లో. కాఫీ అమెరికా, భారతదేశం, ఆఫ్రికా తోపాటు ప్రపంచం మొత్తం మీద 70 దేశాలకు పైగా విస్తృతంగా వృద్ది చెందుతుంది.

రెండు రకాల కాఫీ బీన్స్ లో అరబికా, ఇది చాలా ఆధునాతనమైనది, రోబుస్టా, ఇది చాలా గట్టిది, తక్కువ ధరకు దొరుకే బీన్స్ రకం.

10 reasons why coffee is bad for you

ఈ అభివ్రుద్దిచెండుతున్న యాంత్రీకరణ సమాజంలో, ప్రజలకు ఎలాంటి సమయం ఉండదు. కాఫీ మన జీవితంలో ప్రతి అంశంలోకి అడుగుపెట్టింది; అది అల్పాహారం కావొచ్చు లేదా డిన్నర్ తరువాత తీసుకునేది కావొచ్చు. రాత్రిపూట ఎక్కువసేపు పనిచేసుకోవడానికి లేదా చదువుకోవడానికి మెలుకువగా ఉండాలి అంటే కాఫీ చాలా సహాయకారిగా ఉన్నప్పటికీ, దీనివల్ల ఎన్నో సైడ్ ఎఫెక్ట్ లు ఉన్నాయి.

మనకు కాఫీ ఎందుకు మంచిది కాదో ఇక్కడ 10 కారణాలు ఇవ్వబడ్డాయి!

#1 రక్తపోటును పెంచుతుంది

#1 రక్తపోటును పెంచుతుంది

కాఫీ వివిధ రకాల హృదయ వ్యాధులతో అనుకూల సంబంధాలు ఉన్నాయని, వినియోగదారులలో ఒత్తిడి స్థాయిలను పెంచుతుందని అధ్యయనాలు చెప్తున్నాయి. గుండె సమస్యలు ఉన్నవారు కాఫీ ని తాగకూడదని సూచన, ఎందుకంటే ఇప్పటికీ ఉన్న అధిక రక్తపోటు పెరిగి, ముందు ముందు అనేక ఆరోగ్య సమస్యలకు కారణం కావొచ్చు.

#2 ఇన్సులిన్ ఇన్సెన్సిటివిటీ

#2 ఇన్సులిన్ ఇన్సెన్సిటివిటీ

కాఫీ వ్యసనం ఇన్సులిన్ ఇన్సెన్సిటివిటీ కి దారితీస్తుంది, దీనివల్ల చివరికి మీ శరీర కణాలు అధిక బ్లడ్ షుగర్ స్థాయికి స్పందించకుండా అవుతాయి. దీనివల్ల ధమనుల క్షీణత, హృదయ వ్యాధులు ఎక్కువయ్యే అవకాశాలకు దారితీస్తుంది.

ఇది కూడా చదవండి: రక్తపోటు ను త్వరగా, సహజంగా తగ్గించే 20 ఆహారపదార్ధాలు.

#3 అసిడిటీ పెరుగుదల

#3 అసిడిటీ పెరుగుదల

కాఫీ ఆసిడ్ పదార్ధం కలిగి ఉండడంలో పేరుగాంచింది, కెఫీన్ కంటెంట్ వల్ల ఉపశమన ప్రభావం కలుగుతుంది, ఇది అత్యంత వ్యసనంతో కూడుకున్నది. ఈ అసిడిటీ వల్ల అరుగుదలలో అసౌకర్యం, అజీర్ణం, గుండెల్లో మంట, అనేకరకాల ఇతర హృదయ సంబంధ వ్యాధులకు దారితీయవచ్చు. మధుమేహం కలవారికి ఈ పరిస్థితి చాలా బాధాకరంగా ఉంటుంది.

#4 వ్యసనం

#4 వ్యసనం

ఇంతకు ముందే చెప్పినట్టు, కాఫీ లో కెఫీన్ అనే పదార్ధం ఉండడం వల్ల కాఫీ తగిన తరువాత ఎంతో ఉపశమనాన్ని అందిస్తుంది. దీనిని తాగేవారిలో ఇది వ్యసనంగా మారితే చాలా కష్టం, తన శరీరంలోని శక్తి స్థాయిని బట్టి ఉంటుంది. దీన్ని మానుకోకపోతే ఇది మాదకద్రవ్యం కంటే చెడ్డది!

#5 ఎక్కువ మూత్రవిసర్జన

#5 ఎక్కువ మూత్రవిసర్జన

కాఫీ మూత్రవిసర్జనక పేరుగాంచింది, అంటే దీన్ని ఎక్కువ తీసుకోవడ౦ వల్ల తరచుగా మూత్రవిసర్జన జరుగుతుంది. మూత్రవిసర్జన ఎక్కువగా ఉంటే శరీరానికి అవసరమైన క్యాల్షియం, మెగ్నీషియం, ఇతర మినరల్స్ తగ్గిపోయి, వివిధ లోపలకు దారితీస్తుంది.

#6 కాలేయం, డ్రగ్ జీవక్రియలో నిర్విషీకరణ

#6 కాలేయం, డ్రగ్ జీవక్రియలో నిర్విషీకరణ

కాఫీలో ఉండే పదార్ధాలు సాధారణ డ్రగ్ జీవక్రియను, కాలేయ నిర్విషీకరణ తో కలిసి అంతరాయం కలిగించ వచ్చు. ధైరాయిడ్ కోసం మందులు వాడే వ్యక్తులు, కాఫీ తాగడం వల్ల, ఈ మందులు శరీరంలో శోషించబడక దుష్ప్రభావాలు కలిగే అవకాసం ఉంది.

#7 నిద్రలేమి, ఆందోళన, డిప్రెషన్ పెరుగుతుంది

#7 నిద్రలేమి, ఆందోళన, డిప్రెషన్ పెరుగుతుంది

మీకు నిద్రలేమి ఉంటె, మీ పరిస్ధితి మరింత దిగజారే ముందే, మీరు బాగా ఆలోచించుకోండి. కాఫీలోని కెఫీన్ మెదడును ప్రేరేపించడం ద్వారా ఆందోళన, మాంద్యంతో బాధపడుతున్న వారి పరిస్ధితిని మరింత తీవ్రతరం చేస్తుంది.

#8 హానికర మలబద్ధకం

#8 హానికర మలబద్ధకం

కాఫీ మలబద్ధకానికి సహాయపడుతుందని అనుకుంటున్నారా, లేదు! కాఫీ ఈ పరిస్ధితి నుండి క్షణిక ఉపశమనం మాత్రమే కలిగిస్తుంది; కానీ అది మళ్ళీమళ్ళీ వచ్చే అవకాశాలు ఉన్నాయి. కాఫీ పెద్ద డి-హైడ్రేటింగ్ ఏజెంట్, ఇది మలబద్ధకాన్ని మరింత తీవ్రతరం చేస్తుంది. ఇది జీర్నంచేసే ఫైబర్ కి మూలం కాదు, కాబట్టి మలబద్ధకం సమయంలో దీన్ని అసలు తీసుకోవద్దు.

#9 ఫెర్టిలిటీ ని తగ్గిస్తుంది

#9 ఫెర్టిలిటీ ని తగ్గిస్తుంది

కాఫీ ముఖ్యంగా ఎక్కువశాతం స్త్రీలలో సంతానలేమికి కారణం కావొచ్చు. గర్భం పొందాలి అనుకునే స్త్రీలు ఈ పానీయానికి దూరంగా ఉండండి, ఇది ఎగ్ సేల్స్ అభివృద్ధిని నిరోధించి, శక్తిహీనుల్ని చేస్తుంది.

#10 గర్భస్రావానికి కారణం కావొచ్చు

#10 గర్భస్రావానికి కారణం కావొచ్చు

కెఫీన్, స్టిములేటింగ్ ప్రభావాల కారణంగా, కాఫీ గర్భస్రావం విషయంలో ఒక పెద్ద ఆటగాడిగా ఉంటుంది. అందువల్ల కడుపుతో ఉన్న స్త్రీలు రోజుకు 2 కప్పుల కాఫీని మాత్రమే తీసుకోవాలని సూచన. దీనిలోని ఉత్తేజిత స్వభావ కారణంగా ప్రీ-డెలివరీ అవకాశాలను పెంచుతుంది.

English summary

Why Men Praise | Are Men's Compliments Honest | Do You Have Take His Compliments Seriously

Read to find out more about the 10 shocking and heart-breaking reasons as to why coffee is bad for you.
Desktop Bottom Promotion