Latest Updates
-
వడగాల్పుల వేళ గర్భిణులు, పీసీఓఎస్ బాధితులు ఈ జాగ్రత్తలు తీసుకోకపోతే ప్రమాదమే! -
టాక్సిక్ మ్యారేజెస్ అంటే ఏంటి? అనుపమ సీరియల్ చూశాక మహిళలు ఎందుకు మారుతున్నారు? -
బండి మీద దొరికే క్రిస్పీ సమోసా..ఇక ఇంట్లోనే చాలా ఈజీగా! -
మ్యాట్రిమోనీలో ఇస్రో శాస్త్రవేత్తనని నమ్మించి.. మహిళను రూ. 26 లక్షలకు ముంచేసిన కేటుగాడు! -
ఉత్తర భారత్లో మండుతున్న ఎండలు.. వడదెబ్బ నుంచి ప్రాణాలు కాపాడుకోవాలంటే ఈ చిట్కాలు తప్పనిసరి! -
బరువు తగ్గుతున్నా పొట్ట తగ్గట్లేదా? అయితే మీరు చేస్తున్న పెద్ద తప్పు ఇదే! -
ఒక్క చుక్క నూనె లేకుండా స్ట్రీట్ స్టైల్ రగడా చాట్.. ఇలా చేస్తే టేస్ట్ అదుర్స్! -
JEE అడ్వాన్స్డ్ 2026 రిజిస్ట్రేషన్ మొదలైంది.. ఇంజనీరింగ్ సీటు మీ సొంతం కావాలంటే ఈ జాగ్రత్తలు తప్పనిసరి! -
రొటీన్ ఇడ్లీ, దోశలు బోర్ కొట్టాయా? అయితే ఈ కమ్మటి వెజిటబుల్ ఎగ్ సేమియా ట్రై చేయండి! -
మీ కిడ్నీలు ఆరోగ్యంగా ఉండాలంటే..ఈ పొరపాట్లు అస్సలు చేయకండి!
షార్ట్ టర్మ్ మెమరీని పెంపొందించే 11 ఫుడ్స్
మన మెదడు ఎంతో శక్తివంతమైనది. మన ప్రతి ఆలోచనని అలాగే, కదలికల్ని, సెన్సేషన్స్ ని కేలిక్యులేట్ చేస్తూ రెప్పపాటు కాలంలో అవసరమైన చర్యలను ఆదేశిస్తుంది.
మన మెదడు ఎంతో శక్తివంతమైనది. మన ప్రతి ఆలోచనని అలాగే, కదలికల్ని, సెన్సేషన్స్ ని కేలిక్యులేట్ చేస్తూ రెప్పపాటు కాలంలో అవసరమైన చర్యలను ఆదేశిస్తుంది.
మెదడులో అపారమొత్తమైన డాటా పొందుపరచబడి ఉంటుంది. ఆ డాటా ఇమేజెస్ రూపంలో, కాన్సెప్ట్స్ రూపంలో అలాగే టెక్స్ట్ రూపంలో ఉంటుంది. అలాగే, హార్మోన్ బాలన్స్, శ్వాస సంబంధిత, రక్త ప్రసరణ, అపస్మారక దశలో సంభవించే చర్యలు వంటి వేలాది రకాల వివిధ క్లిష్టమైన పనులను మన మెదడు నిరంతరం నిర్వహిస్తూ ఉంటుంది.
నిద్రావస్థలో ఉన్నప్పుడు కూడా మెదడు అనేది నిరంతరం పనిచేస్తూనే ఉంటుంది. అలాగే, మన మెదడు ఎంతో సున్నితమైనది కూడా. మనం కొన్ని సార్లు కొన్ని విషయాలను మరచిపోతూ ఉంటాము. ఇక్కడే, షార్ట్ టర్మ్ మెమరీ యొక్క ప్రాముఖ్యత తెలుస్తుంది. ఏదైనా ఫోన్ నంబర్ ను గానీ ఏదైనా సంభాషణలో మీరు చెప్పదలచుకున్న విషయాన్ని గానీ తాత్కాలికంగా గుర్తుంచుకోవడానికి షార్ట్ టర్మ్ మెమరీ అవసరపడుతుంది.
ప్రతి వ్యక్తికీ షార్ట్ టర్మ్ మెమరీ అనేది అవసరం. మెదడుని ఫిట్ గా ఉంచుకోవడానికి అలాగే షార్ట్ టర్మ్ మెమరీని పెంపొందించుకోవడానికి మీరు కొన్ని రకాల ఆహారపదార్థాలను తీసుకోవాలి. మెమరీని పెంపొందించి తద్వారా షార్ట్ టర్మ్ మెమరీ పనితీరును మెరుగుపరచడానికి ఈ 11 ఆహారపదార్థాలను మీరు ఖచ్చితంగా తీసుకోవాలి.

1. సాల్మన్
సాల్మన్, సార్డీన్, ట్యూనా, మ్యాకెరెల్ వంటి ఫ్యాటీ ఫిషెస్ లో ఒమేగా 3 ఫ్యాటీ యాసిడ్స్ పుష్కలంగా లభిస్తాయి. ఇవి మెదడుని ఆరోగ్యవంతంగా చేసి తద్వారా సెల్స్ మధ్య సమాచార వ్యవస్థని మెరుగుపరుస్తాయి. సాల్మన్ లో లభించే పోషకాలు ఏకాగ్రతను మెరుగుపరచడంలో పాటు సమాచారాన్ని పొందుపరచడంలో ఉపయోగపడతాయి.

2. బ్లూబెర్రీ
ఫ్లెవనాయిడ్స్ అనేవి బ్లూబెర్రీస్ లో పుష్కలంగా లభిస్తాయి. ఇవి మెదడులోని న్యూరాన్ కనెక్షన్లను పెంపొందిస్తాయి. అలాగే, న్యూరాన్స్ పునరుత్పత్తికి కూడా ప్రోత్సహిస్తాయి. ఈ రెండు ఫంక్షన్స్ వలన షార్ట్ టర్మ్ మెమరీ మెరుగుపడుతుంది. అలాగే, యాంటీ ఆక్సిడెంట్స్ అనేవి బ్లూబెర్రీలో అధికంగా లభిస్తాయి. ఇవి, మెదడు పనితీరుకు ముఖ్యమైనవి.

3. కేపేర్స్
క్వేర్సెటైన్ అనే కెమికల్ కేపేర్స్ లో పుష్కలంగా లభిస్తుంది. గ్రీన్ టీలో కూడా ఈ కెమికల్ లభిస్తుంది. ఈ కెమికల్ అనేది మెదడుకు సరైన రక్తప్రసరణ కలిగేందుకు తోడ్పడుతుంది. షార్ట్ టర్మ్ మెమరీ లాస్ తో మీరు ఎక్కువగా సతమతమవుతూ ఉన్నట్టయితే మీరు కేపేర్స్ ని మీ ఆహారంలో భాగంగా చేసుకోండి.

4. తృణధాన్యాలు
గోధుమ, కార్న్, రైస్, ఓట్స్ వంటి తృణధాన్యాలు మన మెదడును ఆరోగ్యవంతంగా అలాగే ఉత్తేజంగా ఉంచేందుకు తోడ్పడతాయి. కోలైన్ అనే పదార్థం తృణధాన్యాలలో అధికంగా లభిస్తుంది. ఈ కీలకమైన న్యూట్రియెంట్ వలన మీ ఎటెన్షన్ స్పాన్ మెరుగవుతుంది. తద్వారా, షార్ట్ టర్మ్ మెమరీ కూడా వృద్ధి చెందుతుంది.

5. బ్రొకోలీ
బ్రొకోలీలో అనేక రకాలైన వ్యాధులను ఎదుర్కొనే గుణాలున్నాయి. అందుకే, మెదడుకి కూడా ఇది మంచి ఆహారం. ఫోలిక్ యాసిడ్ తో పాటు విటమిన్ కే వంటి రెండు మెమరీ బూస్టింగ్ న్యూట్రియెంట్స్ అనేవి బ్రొకోలీలో పుష్కలంగా లభిస్తాయి. మీరు ఏవైనా విషయాలను గుర్తుతెచ్చుకోవడానికి పదే పదే ఇబ్బంది పడుతున్నట్టయితే ఈ వెజిటబుల్ ను మీ డైట్ లో భాగంగా చేసుకోండి.

6. డార్క్ చాక్లెట్
డార్క్ చాక్లెట్ ను ఇష్టపడని వారెవరు? మనలో చాలా మందికి డార్క్ చాక్లెట్ అంటే మక్కువ ఎక్కువ. చాక్లెట్ లో లభించే కోకో అనేది మూడ్ బూస్టర్ గా పనిచేస్తుంది. అలాగే, మెదడుకి రక్తప్రసరణని మెరుగుపరుస్తుంది. ఆ విధంగా మెమరీ రిటెన్షన్ ను మెరుగుపరుస్తుంది.

7. కాఫీ
కాఫీ అనేది షార్ట్ టర్మ్ అలాగే లాంగ్ టర్మ్ మెమరీ లాస్ పేషంట్స్ కు అద్భుతమైన ఔషధంలా పనిచేస్తుంది. ఒక అధ్యయనం ప్రకారం, రోజుకు రెండు కప్పుల కాఫీ తాగితే మతిమరుపు అనేది తగ్గిపోతుందట. కెఫైన్ లో నొరెపినెఫ్రిన్ అనే పదార్థం అత్యధికంగా లభిస్తుంది. ఈ స్ట్రెస్ హార్మోన్ అనేది మెదడు పనితీరుని మెరుగుపరచి మెమరీలను నిలుపుకునే శక్తిని పెంపొందిస్తుంది.

8. గుడ్లు
కోలైన్ అనే పదార్థం ఎగ్ వైట్స్ లో పుష్కలంగా లభిస్తుంది. కాగ్నిటివ్ ఫంక్షనింగ్ ను మెరుగుపరిచేందుకు ఉపయోగపడే సెల్ సిగ్నలింగ్ కు అలాగే ఫోస్ఫటిడీల్సేరిన్ కు కోలైన్ పోషించే పాత్ర కీలకం. ఈ పదార్థం మెదడుకి బూస్ట్ ఇచ్చి తద్వారా విషయాలను గుర్తుపెట్టుకునే శక్తిని మెరుగుపరుస్తుంది.

9. సేజ్
సేజ్ అనేది కాగ్నిటివ్ ఫంక్షనింగ్ ను మెరుగుపరచి మెమరీని ఇంప్రూవ్ చేయడానికి ఉపయోగపడుతుంది. సేజ్ ఆయిల్ లో మెదడులోని న్యూరోట్రాన్స్మిట్టర్స్ పనితీరుని మెరుగుపరిచే ఎంజైమ్స్ కలవు. కాబట్టి, ఇకమీదట ఎప్పుడైనా షార్ట్ టర్మ్ మెమరీ లాస్ ప్రాబ్లెమ్ తో ఇబ్బంది పడుతున్నట్టయితే కాస్తంత సేజ్ ఆయిల్ సప్లిమెంట్ ను తీసుకుంటే మెమరీలు తిరిగి పదిలంగా ఉండేలా మెదడు చూసుకుంటుంది.

10. టమాటో
టమాటోలో శక్తివంతమైన యాంటీ ఆక్సిడెంట్లు కలవు. ఇవి, సెల్స్ ను ఫ్రీ రాడికల్ డేమేజ్ నుంచి రక్షిస్తాయి. అలాగే, షార్ట్ టర్మ్ మెమరీని పెంపొందిస్తాయి. అంతే కాదు, డిమెన్షియాతో సతమతమవుతున్న పేషంట్స్ లో కలిగే సెల్ డేమేజ్ ను అడ్డుకుంటాయి.

11. బ్లాక్ కరెంట్స్
విటమిన్ సి అనేది బ్లాక్ కరెంట్ లో అత్యథికంగా లభిస్తుంది. ఇది మెదడు యొక్క చురుకుదనాన్ని అమాంతం పెంచుతాయి. ఈ విటమిన్ అనేది అల్జీమర్స్ తో పాటు డిమెన్షియాను అరికట్టేందుకు తోడ్పడుతుంది. అంతే కాదు, ఒత్తిడిని అలాగే ఆందోళనను కూడా తగ్గిస్తుంది.



Click it and Unblock the Notifications