For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

నీరసం..అలసటను తగ్గించేందుకు వెంటనే ఇమ్యూనిటిని పెంచే హెల్తీ ఫ్రూట్స్.!

By Super Admin
|

మనం తీసుకునే ఆహారం మన ఆరోగ్యాన్ని సూచిస్తుంది. తరచుగా చిన్న చిన్న ఆరోగ్య సమస్యలు వేధిస్తున్నాయంటే మీరు తీసుకునే ఆహారం సరైనది కాదు అని తెలుపుతుంది. కాబట్టి శరీరానికి కావాల్సిన రోగ నిరోధక శక్తి అందితేనే.. ఆరోగ్యంగా ఉంటారు. రోగనిరోధక శక్తి తక్కువగా ఉంటే తరచుగా జలుబు, జ్వరం, అలసట, ఎలర్జీల బారిన పడుతూ ఉంటారు. కాబట్టి నిత్యం తినే ఆహారంలో రోగ నిరోధక శక్తిని పెంచే ఆహారం ఉండేలా జాగ్రత్త పడాలి.

మారుతున్న కాలానికి తగ్గట్టు సరైన పోషకాహారం తీసుకోవాలి. విటమిన్లు, మినరల్స్‌, పోషకాలు సమృద్ధిగా ఉండే ఆహార పదార్థాలను డైట్ లో చేర్చుకుంటే.. శరీరానికి కావాల్సిన రోగనిరోధక శక్తి అందుతుంది.

1. సిట్రస్ ఫ్రూట్స్ :

1. సిట్రస్ ఫ్రూట్స్ :

నారింజలో విటమిన్‌ సి ఎక్కువగా ఉంటుంది. ఇది సూర్యుని నుంచి వచ్చే అల్ట్రావయోలెట్‌ కిరణాల ప్రభావం చర్మంపై పడకుండా చేస్తుంది. చర్మం ముడుతలు పడకుండా, టైట్‌గా ఉంచే కొలాజిన్‌ ను ఉత్పత్తి చెయ్యడంలో సహాయపడుతుంది. ప్రతిరోజు ఒక నారింజను తినడం మంచిది. రోజుకు రెండు వందల గ్రాముల విటమిన్ సి అవసరమవుతుంది. నారింజ జ్యూస్‌ తాగడం కన్నా పండు రూపంలో తినడమే మంచిది. నారింజ తొనల గుజ్జు తీసుకుని అందులో కీరదోస కాయ తురుము, నాలుగైదు చుక్కల నిమ్మరసం, చెంచా తేనె లేదా కలబంద గుజ్జు కలిపి ముఖానికి పూతలా వేసుకొని పదిహేను నిమిషాల తర్వాత చల్లటి నీటితో కడిగేసుకోవాలి. ఈ మిశ్రమాన్ని కళ్ళమీద కూడా పెట్టుకోవచ్చు.

2. బొప్పాయి

2. బొప్పాయి

బొప్పాయి, పుచ్చకాయలలో బీటా క్రిపొక్సాంథిన్ గుణాలు ఎక్కువగా వుంటాయి. ఇవి లంగ్ క్యాన్సర్ దరిచేరకుండా కాపాడతాయి. బొప్పాయిలోని పపెయిన్ ఎంజైమ్ జీర్ణశక్తికి సహకరిస్తుంది. అజీర్తితో బాధపడేవారికి బొప్పాయి దివ్యౌషధం. ఇందులో విటమిన్ సి, విటమిన్ ఏ ఉంటాయి.ఇంకా ఇందులో ఉండే పొటాషియం, ఫొల్లెట్ మరియు విటమిన్ ఎ మరియు బి లు ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తుంది.

3.కివి

3.కివి

కివి ఫ్రూట్ సీజనల్ ఫ్రూట్. అయినా కూడా ఈ ఫ్రూట్ అందుబాటులో ఉన్నప్పుడు తీసుకుంటే చాలు సంవత్సరం అంతా కొన్ని ప్రధానమైన వ్యాధులకు దూరంగా ఉండవచ్చు .వ్యాధినిరోధకశక్తిని పెంచడంలో గ్రేట్ ఫ్రూట్ . ఈ ప్రూట్ తినడానికి కొద్దిగా పుల్లగా ఉన్నా, ఇందులో విటమిన్ ఇ మరియు ఎలు పుష్కలంగా ఉంటాయి. వీటి వల్ల వివిధ రకాల వైరల్ మరియు బ్యాక్టీరియల్ ఇన్ఫెక్షన్స్ ను నివారించుకోవచ్చు . ఈ హాట్ సమ్మర్లో వీటిని తప్పనిసరిగా ఆహారంలో చేర్చుకోవడం చాలా అవసరం.

4. జామపండు

4. జామపండు

తక్కువ ధరకే దొరికే ఒక కప్పు జామపండు ముక్కల్లో లభించే విటమిన్ సి రోజువారీ అవసరాని కంటే ఐదు రెట్లు ఎక్కువ వుంటుంది. వీటిని తరచుగా తీసుకుంటూ ఉండాలి. ఇందులో విటమిన్‌ ఎ, విటమిన్‌ బి, క్యాల్షియం‌, ఫాస్పరస్‌, పొటాషియం, ఐరన్‌, ఫోలిక్‌యాసిడ్‌ వంటివి మెండుగా ఉన్నాయి. జీర్ణశక్తిని పెంపొందించే ఫైబర్‌ ఇందులో పుష్కలంగా ఉంటుంది. ఇది శరీరానికి పూర్తి ఇమ్యూనిటిని అందిస్తుంది.

5. కోకనట్ :

5. కోకనట్ :

కోకనట్ వాటర్ ను రెగ్యులర్ గా తాగడం వల్ల వ్యాదినిరోధకతను పెంచుకోవచ్చు. బాడీటెంపరేచర్ ను మెయింటైన్ చేస్తుంది.

6.యాపిల్స్:

6.యాపిల్స్:

రోజుకు ఒక్క యాపిల్ తింటే చాలు డాక్టర్స్ అవసరం ఉండదు. ఇన్ఫెక్షన్స్ ను నివారిస్తుంది. యాపిల్స్ లో విటమిన్స్, మినిరల్స్ అధికంగా ఉన్నాయి. కొలెస్ట్రాల్‌ను తగ్గించగల పీచుపదార్థం యాపిల్స్‌లో ఎక్కువగా లభిస్తాయి. రోజుకు అవసరమైన పీచులో నలభై శాతం ఈ పండ్ల నుంచి లభిస్తుంది. పీచుపదార్థాలు ఎక్కువగా తినేవారిలో కొలెస్ట్రాల్ స్థాయి తక్కువగా ఉంటుంది.

7. స్ట్రాబెర్రీస్

7. స్ట్రాబెర్రీస్

ఇది సీజనల్ ఫ్రూట్ , వ్యాధి నిరోధకతను పెంచడంలో గ్రేట్ గా సహాయపడుతుంది. బ్లూ బెర్రీ మరియు రెడ్ గ్రేప్స్ స్ట్రాంగ్ కాంపోనెంట్స ఉంటాయి.ఇందులో విటమిన్ ఎ మరియు సి పుష్కలంగా ఉంటుంది, వ్యాధినిరోధకశక్తిని పెంచడంలో గ్రేట్ గా సహాయపడుతాయి. శరీరానికి వ్యాధినిరోదక శక్తిని పెంచుతుంది. స్ట్రాబెరీస్ ఆరోగ్యానికే కాదు... అందానికి కూడా చాలా అద్భుతంగా పనిచేస్తుంది. చూడగానే నోరూరిస్తూ ఎర్రని రంగులో చిరుపులుపుతో, స్వీట్ గా స్వభావం కలిగి, చక్కటి ఆకారం కలిగినటువంటి పండు స్ట్రాబెరీ. ఈ ఫ్రూట్ తినడానికి మాత్రమే కాదు సౌదర్య సాధనంగా కూడా ఉపయోగించుకోవచ్చు. స్ట్రాబెరీలతో ఫేస్‌ మాస్క్‌ వేసుకుంటే ముఖానికి చక్కటి మెరుపు వస్తుంది. ముఖం మీద మచ్చలు తగ్గి ముఖం చంద్రబింబంలా వుంటుంది. చక్కటి నిగారింపు వస్తుంది. అంతేకాదు. దీని వలన ఫేస్‌ ప్రెష్‌ గా కనిపిస్తుంది.

8. మామిడిపండ్లు మామిడిపండ్లు సీజనల్ ఫ్రూట్స్ .

8. మామిడిపండ్లు మామిడిపండ్లు సీజనల్ ఫ్రూట్స్ .

ఇందులో విటమిన్స్, మినిరల్స్ అధికంగా ఉంటాయి.ఇది వ్యాధినిరోధకతను ప్రోత్సహిస్తుంది. .శరీరానికి కావాల్సిన ఎనర్జీని అందిస్తుంది.

9. పుచ్చకాయ

9. పుచ్చకాయ

90 శాతం నీరు వుండే కాయ పుచ్చకాయ. దాహార్తిని తీర్చడం తోపాటు ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తుంది. శరీరానికి చలువను ఇస్తుంది. అందాన్ని ఇనుమడింపజేస్తుంది. పుచ్చకాయ జూసును తీసుకోవడం వల్ల చర్మం మరింత తేటగా మారుతుంది.పుచ్చకాయలో ఉండే లైకోపిన్ అనే కంటెంట్ వ్యాధులను నివారించడంలో ఇన్ఫెక్షన్స్ నివారించడంలో గ్రేట్ గా సహాయపడుతుంది.

10. అరటిపండ్లు:

10. అరటిపండ్లు:

ఏడాది పొడవునా దొరికే అరటి పండు తీసుకుంటే శరీరానికి కావాల్సిన శక్తి, సహజ చక్కెరలు తక్షణం శరీరానికి అందుతాయి. అరటిపండులో పీచు పదార్థాల మోతాదు కూడా ఎక్కువగా వుంటుంది. అరటి పండ్లలో యాంటీఆక్సిడెంట్స్, విటమిన్ బి6, మ్యాంగనీస్, పొటాషియం వ్యాధినిరోధకతను పెంచుతుంది. రక్తపోటును తగ్గించే పొటాషియం అత్తి, అరటిపండ్లలో లభిస్తుంది. అరటిలో పొటాషియం ఎక్కువగా ఉంటుంది. అరటి పండు ఆరోగ్యాన్ని, జీర్ణశక్తిని పెంచడమే కాదు. చర్మాన్ని శుభ్రపరచడంలో కూడా అద్భుతంగా పనిచేస్తుంది. కాబట్టి ప్రతి రోజూ రెగ్యులర్ ఒక అరటిపండు తినాలి. మరియు బనానా స్మూతిని రెగ్యురల్ డైట్ లో చేర్చుకోవచ్చు. పొడి చర్మానికి మాయిశ్చరైజర్ గా ఉపయోగపడటమే కాకుండా చర్మాన్ని టైట్ గా ఉంచుతుంది.

11. దానిమ్మ:

11. దానిమ్మ:

దానిమ్మ మెదడులో వాపును తగ్గించడంతో పాటు ఆల్జీమర్స్ ను నియంత్రిస్తుంది. విటమిన్ సి, కె కాకుండా రకరకాల పోషకాలతో నిండిన దానిమ్మ శరీరంలో రోగనిరోదక శక్తిని పెంచుతుంది. దానిమ్మ రుచికి మాత్రమే కాదు. దానిమ్మ గింజల్లో యాంటిఆక్సిడెంట్స్ అధికంగా ఉండి శరీరాన్ని శుభ్రపరుస్తుంది. ఎరుపు రంగులో ఉండే దానిమ్మ మధుమేహగ్రస్తులకు చాలా మంచిది. రక్తంలో చక్కెర గణాంకాలు మెరుగుపరచడానికి సహాయం చేస్తుంది.

English summary

11 Immune-Boosting Fruits

The most important cells involved in making the immune system stronger are the white blood cells. The immune system functions better, with healthy foods and regular exercises. Boosting the immune system will help to keep you healthy by eradicating many diseases.
Desktop Bottom Promotion