For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

జాస్మిన్ టీలో దాగున్న అద్భుతమైన ఆరోగ్య ప్రయోజనాలు..!

By Sindhu
|

మగువల అందాన్ని వర్ణించడానికి, ఎందరో కవులు ఉపయోగించింది. అందానికిచిరునామ మల్లె పువ్వు అని చెబితే అతిశయోక్తి కాదేమో. అయితే ఈ మల్లెపు వ్వు తియ్యదనంతో పాటు సువాసనకు మారుపేరుగా నిలుస్తుంది. ఈ పరిమళాన్ని ఇప్పటికీ జపాన్‌, ఆఫ్రికా దేశాలలో ఎక్కువ గా ఉపయోగిస్తారు. గమ్మత్తుఏమిటంటే, కాలనుగుణంగా పూచే పూలలో ఈ మల్లె పువ్వుకి ఒక ప్రత్యేకత ఉంది. అది ఏమిటం టే ఈ మల్లె రాత్రి పూట మాత్రమే పూస్తుంది. అందుకే దీనిని చీకటి పడిన సమయాల్లో కోస్తారు. అయితే దీంతో తయారు చేసిన ఆయిల్‌ ఎంతో సువాసనబరితమైంది. దీనిని తయారు చేయడానికి ఎన్నో మల్లెపూల రేకులను ఉపయోగిస్తారు. ఇది చాలా అరుదుగా దొరికేది అయినప్పటికి ఎంతో ప్రఖ్యాతిగాం చింది. మల్లె పువ్వు మనస్సుకు, శరీరానికి ఎన్నో రకాలుగా ఉపయోగపడుతుంది.

మల్లెపువ్వు మనలోని నిస్సహాయతను దూరం చేసి, విశ్వాసాన్ని పెంచుతుంది. అంతే కాకుండా ఇది మన శరీరంపై యాంటి డిప్రెసంట్‌, యాఫ్రొడిసియాక్‌గా పనిచేసి మనలోని ఆత్మ విశ్వాసాన్ని పెంచుతుంది. గాలీ, వెలుతురు, ఇలా ఏమీలే కుండా నిశబ్దం అల్లుకున్న గదులలో, తన సుగంధ పరిమళా లతో మళ్లీ జీవాన్ని తెచ్చి సువాసన పరిమళంగా మారుస్తుంది. మల్లెపువ్వులను బ్లాక్ టీ , ఊలాంగ్ టీ, వైట్ టీలో మిక్స్ చేస్తారు. వీటిలో ఆరోగ్యానికి సంబంధించిన న్యూట్రీషియన్స్ అధికంగా ఉంటాయి. జాస్మిన్ టీలో ఫాలీఫినాల్స్ మరియు యాంటీ ఆక్సిడెంట్స్ అధికంగా ఉంటాయి. ఇవి మనషికి కావల్సిన ఉల్లాసాన్ని, ఆరోగ్యాన్ని అందిస్తాయి. జాస్మిన్ టీ తాగడం వల్ల ఆరోగ్యానికి కలిగే 15 అద్భుతమైన ప్రయోజనాల గురించి మనం ఇప్పుడు తెలుసుకుందాం...

యాంటీ బ్యాక్టీరియల్, యాంటీసెప్టిక్, యాంటీ వైరల్ లక్షణాలు అధికం:

యాంటీ బ్యాక్టీరియల్, యాంటీసెప్టిక్, యాంటీ వైరల్ లక్షణాలు అధికం:

జాస్మిన్ టీ లో ఉండే యాంటీసెప్టిక్ లక్షణాలు, క్రిములను ఎఫెక్టివ్ గా నాశనం చేస్తుంది. అంతే కాదు జాస్మిన్ టీలో ఉండే బెంజోయిక్ యాసిడ్, బెంజిల్ బెంజోయేట్ మరియు బెంజల్ డీహైడ్ వంటి కంపౌండ్స్, వైరల్ మరియు బ్యాక్టీరియల్ ఇన్ఫెక్షన్స్ ను దూరం చేస్తుంది. జాస్మిన్ ఆయిల్ ను ను స్కిన్ కేర్ , కాస్మోటిక్ ప్రొడక్ట్స్, షాంపులు మరియు కండీషనర్స్ లో ఎక్కువగా ఉపయోగిస్తుంటారు.

క్యాన్సర్ నివారిస్తుంది:

క్యాన్సర్ నివారిస్తుంది:

బొటానికిల్ ఎక్స్ ట్రాక్ట్ జాస్మిన్ టీలో చర్మం మీద ఏర్పడ్డ మొటిమలు, మచ్చలు, గాయలను నివారించే గుణాలు అధికంగా ఉన్నాయి. జాస్మిన్ టీ తాగడం వల్ల స్కిన్ మాయిశ్చరైజ్ అవుతుంది. చర్మానికి తగిన హైడ్రేషన్ పొందుతారు. స్కిన్ ఎలాసిటి పెరుగుతుంది.

బ్లడ్ ప్రెజర్ క్రమబద్దం చేసి, హార్ట్ డిసీజ్ లను నివారిస్తుంది:

బ్లడ్ ప్రెజర్ క్రమబద్దం చేసి, హార్ట్ డిసీజ్ లను నివారిస్తుంది:

జాస్మిన్ టీని రెగ్యులర్ గా తాగడం వల్ల లో డెన్సిటి లిప్పో ప్రోటీన్ మరియు కొలెస్ట్రాల్ ను శరీరంలో తగ్గిస్తుంది. టీలో ఉండే క్యాచసిన్స్, ఎపిగాలక్టెచిన్ గాలేట్ మరియు ఎపిక్యాటెక్చిన్ గాల్లెట్ ఎల్ డిఎల్ ఆక్సిడేషన్ ను నిరోధిస్తుంది, దాంతో హార్ట్ సమస్యలను నివారించుకోవచ్చు.

మనస్సును ప్రశాంత పరుస్తుంది:

మనస్సును ప్రశాంత పరుస్తుంది:

మల్లెపూలలో ఉన్న పరిమళ భరితం , టీలో రూపంలో తీసుకోవడం వల్ల మనస్సును ప్రశాంత పరుస్తుంది. హార్ట్ రేట్ తగ్గిస్తుంది. జాస్మిన్ టీ రెగ్యులర్ గా తాగడంవల్ల మూడ్ మార్చుతుంది, హార్ట్ రేట్ ను తగ్గిస్తుంది. జాస్మిన్ టీ తాగడం వల్ల, మైండ్ ను రిలాక్స్ చేస్తుంది.

స్టోక్ నివారిస్తుంది:

స్టోక్ నివారిస్తుంది:

జాస్మిన్ టీ రెగ్యులర్ గా తాగడం వల్ల దీర్ఘకాలంలో వచ్చే స్ట్రోక్ ను నివారిస్తుంది. కొలెస్ట్రాల్ తగ్గిస్తుంది. దాంతో స్ట్రోక్ వచ్చే అవకాశాలు పూర్తిగా తగ్గుతాయి.

బరువు తగ్గిస్తుంది:

బరువు తగ్గిస్తుంది:

వెయిట్ లాస్ డైట్ లో జాస్మిన్ టీ చేర్చుకోవడం వల్ల , ఇందులో ఉండే యాంటీ ఆక్సిడెంట్స్ బరువు తగ్గడానికి గ్రేట్ గా సహాయపడుతాయి.

మెటబాలిజం రేటు పెంచుతుంది, ఓబేసిటి తగ్గిస్తుంది:

మెటబాలిజం రేటు పెంచుతుంది, ఓబేసిటి తగ్గిస్తుంది:

జాస్మిన్ టీలో ఉండే యాంటీఆక్సిడెంట్స్ మెటబాలిజం రేటు పెంచుతుంది. శరీరంలో జీవక్రియలు చురుకుగా ఉండటం వల్ల కొవ్వు ఏర్పడదు, దాంతో ఓబేసిటి సమస్యలు ఉండవు. ఇదివరకే ఒబేసిటితో బాధపడే వారికి, ఇది బెస్ట్ ట్రీట్మెంట్ .

నిద్రను మెరుగుపరస్తుంది:

నిద్రను మెరుగుపరస్తుంది:

నిద్రలేమి సమస్యలతో బాధపడేవారికి ఇది గ్రేట్ రిలీఫ్ ఇస్తుంది. జాస్మిన్ టీ ఉపశమనం కలిగించే హెర్బల్ రెమెడీ. పీస్ ఫుల్, రెస్ట్ ఫుల్ స్లీప్ పొందుతారు, నిద్రలేమి సమస్యతో బాధపడే వారికి ఇది నేచురల్ ట్రీట్మెంట్ .

స్ట్రెస్ తగ్గిస్తుంది:

స్ట్రెస్ తగ్గిస్తుంది:

జాస్మిన్ టీ పవర్ ఫుల్ స్ట్రెస్ బూస్టర్ గా పనిచేస్తుంది. గ్రీన్ టీతో మిక్స్ చేసి, తాగితే స్ట్రెస్ , ఆందోళనను తగ్గిస్తుంది. డిప్రెషన్, తలనొప్పి, టెన్షన్ వంటి సమస్యలను నివారిస్తుంది.

క్యాన్సర్ నివారిణి:

క్యాన్సర్ నివారిణి:

జాస్మిన్ టీలో ఫాలీఫినాల్స్ ఎక్కువగా ఉంటాయి. ఇది వివిధ రకాల క్యాన్సర్స్ ను నివారిస్తుంది. ముఖ్యంగా ఈసోఫాగల్ క్యాన్సర్, స్కిన్ క్యాన్సర్, స్టొమక్ క్యాన్సర్, ప్యాంక్రియాటిక్ క్యాన్సర్, ప్రొస్టేట్ , లంగ్ , ఓవేరియన్, బ్రెస్ట్, గాల్ బ్లాడర్ క్యాన్సర్ ను నివారించడంలో జాస్మిన్ టీ గ్రేట్ గా సహాయపడుతుంది. జాస్మిన్ టీ లో ఉండే ఎంజైమ్స్ క్యాన్సర్ కు కారణమయ్యే సెల్స్, ట్యూమర్స్ ను నివారిస్తుంది.

డయాబెటిస్ ను నివారిస్తుంది:

డయాబెటిస్ ను నివారిస్తుంది:

రెగ్యులర్ గా జాస్మిన్ టీ తాగడం వల్ల , డయాబెటిస్ కంట్రోల్లో ఉంటుంది. శరీరంలో బ్లడ్ షుగర్ లెవల్స్ ను క్రమబద్దం చేసే ఇన్సులిన్ ను ఉత్పత్తి చేస్తుంది. ముఖ్యంగా టైప్ 2 డయాబెటిస్ ను నివారిస్తుంది.

జీర్ణ శక్తిని మెరుగుపరుస్తుంది:

జీర్ణ శక్తిని మెరుగుపరుస్తుంది:

జాస్మిన్ టీలో ఉండే స్మూతింగ్ గుణాలు, పొట్టసమస్యలను నివారిస్తుంది. జీర్ణ శక్తిని పెంచుతుంది. గౌట్ బ్యాక్టీరియాను బ్యాలెన్స్ చేస్తుంది. శరీరంలో టాక్సిన్స్ ను నివారిస్తుంది. అందువల్ల ఇర్రెస్టిబుల్ బౌల్ సిండ్రోమ్ నివారిస్తుంది.

మెంటల్ హెల్త్ మెరుగుపరుస్తుంది:

మెంటల్ హెల్త్ మెరుగుపరుస్తుంది:

జాస్మిన్ టీలో అమినో యాసిడ్ , ఎల్ థయమిన్ అధికంగా ఉంటుంది. ఇది మెంటల్ అలర్ట్ నెస్ పెంచుతుంది, రెగ్యులర్ గా తీసుకుంటే మానసిక స్థితి మెరుగ్గా ఉంటుంది.

వ్యాధినిరోధకత పెంచుతుంది:

వ్యాధినిరోధకత పెంచుతుంది:

జాస్మిన్ టీ రెగ్యులర్ గా తాగడం వల్ల వ్యాధినిరోధకశక్తి పెరుగుతుంది. ఇందుంలో ఉండే యాంటీ బ్యాక్టీరియల్ , యాంటీ వైరల్ లక్షణాలు కామన్ కోల్డ్, ఫ్లూను తగ్గించి , శ్వాస సమస్యలను నివారించడానికి వ్యాధినిరోధకశక్తిని పెంచుతుంది.

ఆర్థ్రైటిస్, జాయింట్ పెయిన్ ను నివారిస్తుంది:

ఆర్థ్రైటిస్, జాయింట్ పెయిన్ ను నివారిస్తుంది:

ఎపిగాలాక్టచిన్ 3 గల్లెట్ ఇది పవర్ ఫుల్ హీలింగ్ లక్షణాలు కలది, కాబట్టి, దీన్ని రెగ్యులర్ డైట్ లో చేర్చుకుంటే, రుమటాయిడ్ ఆర్థ్రైటిస్, మజిల్ పెయిన్, జాయింట్ పెయిన్ ను నేచురల్ గా , ఎఫెక్టివ్ గా తగ్గించుకోవచ్చు.

English summary

15 Amazing Health Benefits of Jasmine Tea

The therapeutic use of jasmine tea makes it vital for your mind and body . Tea made with the flowers of jasmine is best recognize for its amazing fragrance, taste and health benefits.
Story first published: Monday, January 2, 2017, 12:25 [IST]
We use cookies to ensure that we give you the best experience on our website. This includes cookies from third party social media websites and ad networks. Such third party cookies may track your use on Boldsky sites for better rendering. Our partners use cookies to ensure we show you advertising that is relevant to you. If you continue without changing your settings, we'll assume that you are happy to receive all cookies on Boldsky website. However, you can change your cookie settings at any time. Learn more