మీ గుండెకు వందేళ్ళు బరోసా ఇచ్చే 15 రకాల ఆహారాలు

Posted By: Mallikarjuna
Subscribe to Boldsky

ప్రస్తుత రోజుల్లో వృద్ధాప్యంలో రావాల్సిన వ్యాధులు చిన్నవయస్సులోనే ఆవహిస్తున్నాయి. జీవనశైలి, ఆహార నియమాలు, మానసిక ఒత్తిళ్లే ఈ సమస్యలకు ప్రధాన కారణాలు. రుగ్మత ఏదైనప్పటికి దాని ప్రభావం గుండెపై పడుతుంది. రక్తపోటు పెంచి, గుండెపోటుకు దారితీస్తుంది. ఈ నేపథ్యంలో గుండెను పదిలపర్చుకోడానికి కొన్ని చిట్కాలు పాటిస్తే సరిపోతుందంటున్నారు డాక్టర్లు, సైకాలజిస్టులు, న్యూట్రిషనిష్టులు.

సాధారణంగా మనం తీసుకునే ఆహారం శరీరం సక్రమంగా పని చేయడానికి అవసరమైన శక్తిని అందిస్తూ ఇంధనంలా పని చేస్తుంది. ఆహారం మన శరీరానికి మూడు విధాలుగా ఉపయోగపడుతుంది. అవి శరీర నిర్మాణానికి, శక్తిని చేకూర్చడానికి, శరీర కార్యక్రమాలను క్రమబద్ధీకరించడానికి. మన శరీరం పని చేయడానికి ఆహారం, నీరు అతి ముఖ్య మైన పోషకావసరాలు. మన శరీరంలోకి ప్రవేశించే ప్రమా దకరమైన బాక్టీరియాతో పోరాటం సల్పటానికి, శరీరానికి అవసరమైన నీటి సమతుల్యతను కాపాడటానికి, ఇతర శరీర ధర్మాల నిర్వహణకు ఆహారం ద్వారా లభించే రసాయనాల అవసరం ఎంతో ఉంది.

indian food for heart patients

కొన్ని ఆహారాల్లో ఎక్కువగానూ, మరికొన్నింటిలో తక్కువగానూ పోషక విలువలు ఉంటాయి. అలాగని ఏ ఆహారాన్ని నిర్లక్ష్యం చేయడానికి వీలులేదు. మనం ఎంత తింటున్నామనేది మాత్రమే కాదు, ఏం తింటు న్నామనేది కూడా ముఖ్యమే. అన్ని రుచులు, పదార్థాలు కలిస్తేనే సంపూర్ణ ఆహారం అవుతుంది. కొన్ని పదార్థాలు కళ్లను కాపాడుకుంటే మరికొన్ని బలాన్నిస్తాయి. ఇంకొన్ని శరీరంలోని ఇతర భాగాలకు మంచి చేస్తాయి. అలాంటి వాటిలో గుండెకు మంచి చేసే పదిహేను రకాల ఆహార పదార్థాల గురించి ఇప్పుడు చూద్దాం...

1. సాల్మన్ చేపలు:

1. సాల్మన్ చేపలు:

సాల్మన్ చేపల్లో వుండే ఒమెగా-3 ఫ్యాటీ యాసిడ్స్‌ నరాల్లో రక్త సరఫరాను క్రమబద్ధం చేస్తాయి.గుండె ఆరోగ్యంగా వుండేలా చేస్తాయి. ఇవి శరీరంలో ఇమ్యునిటీ శక్తిని కూడా పెంపొందిస్తాయి. గుండెకు మంచి చేసే కొవ్వును పెంపొందిస్తాయి. అంతేకాదు శరీరంలో రక్తం గడ్డకట్టకుండా వుండేందుకు ఇది ఎంతో అవసరం.

2. ఓట్స్:

2. ఓట్స్:

ఈ మద్య కాలంలో గుండెజబ్బుల నివారణకు, కొలెస్ట్రాల్ ని అదుపులో ఉంచడానికి ఓట్స్ ని వాడుతున్న వారి సంఖ్య క్రమంగా పెరుగుతోంది. నిజంగా ఓట్స్ కి కొలెస్ట్రాల్ నియంత్రించే శక్తి ఉందా అంటే ఉందనే చెప్పాలి. వీటిల్లో ఉండే ప్రత్యేక పీచు పదార్థం బెటాగ్లూకాన్. ఇది పైత్య రస ఆమ్లాలతో కలిసి శరీరంలోని కొలెస్ట్రాల్ ని నియంత్రణలో ఉంచుతుంది. ఇదే రకం పీచు పదార్థం బార్లీలో కూడా ఉంటుంది.

3. బ్లూబెర్రీస్ విటమిన్ సీ, ఫైబర్ ఎక్కువ మోతాదులో ఉండే..

3. బ్లూబెర్రీస్ విటమిన్ సీ, ఫైబర్ ఎక్కువ మోతాదులో ఉండే..

బ్లూ బెర్లీలను తీసుకోవడం వల్ల గుండె పనితీరు సజావుగా ఉంటుంది. అల్పాహారంగా గానీ, మధ్యాహ్న భోజనంలో గానీ.. ఫ్రూట్ సలాడ్ రూపంలోగానీ.. బ్లూబెర్రీస్ ని తరచుగా తీసుకోవడం వల్ల గుండె జబ్బులు దరిచేరవు.

4. డార్క్ చాక్లెట్ :

4. డార్క్ చాక్లెట్ :

చాక్లెట్ బార్ లో ఉన్న కొన్ని రసాయనాలు హృదయనాళ వ్యవస్థను సాఫీగా ఉంచుతాయి. అలాగే గుండె జబ్బులు రాకుండా సహాయపడతాయి. డార్క్ చాక్లెట్ ముఖ్యముగా దాదాపు 50% గుండెపోటు,10% హృదయ వ్యాధుల యొక్క ముప్పు తగ్గిస్తుంది. కాబట్టి ప్రతి రోజు ఒక చాక్లెట్ బార్ ను తినవచ్చు. చాక్లెట్లులో ముఖ్యమైన పదార్ధంగా ఉన్న కోకో పౌడర్ లో తక్కువ కొవ్వు ఉంటుంది. చాక్లెట్లు అంటే ఇష్టపడే వారు బరువు పెరగకుండా ఉండటానికి తక్కువ కొవ్వు ఉన్న చాక్లెట్లు ఎంపిక చేసుకోవాలి. కానీ ఎక్కువ కాకుండా ఒక పరిమితిలో తినాలి. అలాగే, మీరు తినే చాక్లెట్లులలో కోకో పౌడర్ 60% కంటే ఎక్కువ ఉండేలా చూసుకోవాలి.

5. సిట్రస్ పండ్లు:

5. సిట్రస్ పండ్లు:

నిమ్మజాతికి చెందిన పండ్లన్నీ గుండెకు మేలు చేసేవే. బాగా పండిన నారింజలో విటమిన్ -ఏ, బి6, సి పుష్కలంగా ఉంటాయి. దాంతోపాటు ఫోలేట్ పొటాషియమ్, ఫైబర్ ఎక్కువ. పొటాషియమ్ వల్ల రక్తపోటు తగ్గుతుంది. గుండెకు రక్షణ కలుగుతుంది.

6. సోయా బీన్స్:

6. సోయా బీన్స్:

గింజ దాన్యాలలో సోయా చాల ప్రత్యేకమైనది. మిగిలిన ఆహారపదర్దాల తో పోలిస్తే సోయా సమాహారమైన పోషకాలు కలిగి ఉంటుంది. కొన్ని రకాల జబ్బులను దరిచరనివ్వదు. త్వరగా జీర్ణము అవుతుంది. అందుకే దీన్ని అన్ని వయసుల వారు తీసుకోవచ్చ్ను. శరీరానికి అవసరమైన అమినోయసిడ్లు, లైసీన్ ల తోపాటు పరొక్షముగా ఇసోఫ్లేవిన్స్(Isoflavins) ని కలిగిఉంటుంది. సోయద్వారా లబించే మాంసకృత్తులు-పాలు, మాంసము, కోడిగుడ్లతో సరిసమానము. గుండె ఆరోగ్యాన్ని కాపాడే మెగ్నీషియం, ఫైబర్ యాంటీఆక్సిడెంట్స్, ఫొల్లెట్ పుష్కలం.

7. బంగాళ దుంపలు

7. బంగాళ దుంపలు

శరీరానికి అవసరమయ్యే న్యూటియంట్స్, కార్బోహైడ్రేట్స్ ఇందులో పుష్కలంగా ఉన్నాయి. ఇవి మజిల్ గ్రోత్ కు బాగా సహాయపడుతాయి. కాబట్టి ఈ రుచికరమైన, శక్తినందించే స్వీట్ పొటాటోను మీ డైలీ డయట్ లో చేర్చుకోండి. అంతే కాదు ఇందులో ఉండే విటమిన్స్, మినిరల్స్ రక్తంలో షుగర్ లెవల్స్ కంట్రోల్ చేస్తాయి. దాంతో పాటు ఎక్కువ సేపు ఆకలి కలగకుండా కడుపు నిండుగా అనిపిస్తుంది. ఇందులో గ్లిసిమిక్ ఇండెక్స్ ఉండటం వల్ల మధుమేహగ్రస్తులకు, గుండె సమస్యలకు నివారణకు సహాయపడుతుంది.

8. టమోటో:

8. టమోటో:

ఎర్రగా చూస్తానే ఆకర్షించే టమోటోలలో ఒక సీక్రెట్ దాగిఉంది. ఇందులో చాలా శక్తివంతమైనటువంటి యాంటి ఆక్సిడెంట్ కాంపౌడ్ లైకోపెనే కలిగి ఉండి. దీని ద్వారానే ఆ టమోటోలకు అంతటి ఆకర్షనీయమైన కలర్ ను కలిగి ఉంటుంది. చాలా తక్కువ ఖరీదులో అరుదుగా దొరికేటటువంటి టమోటోలు లోఫాట్ ఆహారం. కాబట్టి అతి త్వరగా బరువును తగ్గించే ఆహార పదార్థాలల్లో తప్పనిసరిగా టమోటోలను చేర్చండి. శరీరానికి కావలసిన శక్తిని పొందండి. హర్ట్ రేట్ తగ్గించడంతో పాటు, గుండెలో మంటను తగ్గిస్తుంది. టమోటోలను రెగ్యులర్ గా తినడం వల్ల గుండె సంబంధిత సమస్యలను నివారించవచ్చు.

9. నట్స్:

9. నట్స్:

వాల్ నట్స్ వీటిలో పోషక పదార్ధాలు పుష్కలంగా వుంటాయి. విటమిన్ బి 1,2,3,6 మరియు ఇ, మినరల్స్ అయిన కాపర్, జింక్, కాల్షియం, మేంగనీస్, ఐరన్ వంటివి కూడా వుండి బ్లడ్ షుగర్ స్ధాయిలను నియంత్రిస్తాయి. ఒమేగా 3 ఫ్యాటీ యాసిడ్లు అధిక కొల్లెస్టరాల్ ను నియంత్రించి ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తాయి. వాల్ నట్ ను ఉదయం వేళ ఖాళీ కడుపుతో తీసుకుంటే మంచి ఫలితం వుంటుంది.

10. గ్రీన్ లీఫీ వెజిటేబుల్స్ శరీరానికి కావాల్సిన అనేక రకాల ఖనిజ లవణాలను ,విటమిన్లను ప్రోటీన్లను, అందిస్తూ...

10. గ్రీన్ లీఫీ వెజిటేబుల్స్ శరీరానికి కావాల్సిన అనేక రకాల ఖనిజ లవణాలను ,విటమిన్లను ప్రోటీన్లను, అందిస్తూ...

నిత్యం తమని ఏదో ఓరకంగా తీసుకునే వ్యక్తుల జీవనశైలినే మార్చేసే సత్తా ఆకుకూరలకు ఉంది. ఆకు కూరల్లో కొవ్వు తక్కువగా ఉండటమే కాకుండాతినే ఆహారాన్ని రుచి కరంగా చేసేదిగా ప్రత్యేక లక్షణాన్ని ఆకుకూరలు కలిగి ఉంటాయి.ఆకుపచ్చని రంగులో వుండే ఆకు కూరలు, కూరగాయలు పాలకూర, మెంతి కూర, వంటి వాటిలో విటమిన్‌ - బి కాంప్లెక్ష్‌, నియాసిన్‌ అధిక మోతా దులో వుంటాయ. ఇవి రక్తనాళాలు మూసుకుపోకుం డా వుండేందుకు సహాయపడతాయి. ఇంకా ఇవి బెర్రీస్‌, పుల్లటి రుచిగల పండ్లు వంటివాటిలోనూ ఎక్కువగా లభిస్తాయి.

11. ఆలివ్ ఆయిల్:

11. ఆలివ్ ఆయిల్:

ఆలివ్‌ ఆయిల్‌లో వుండే మోనో-శాటురేటెడ్స్‌ వల్ల శరీరంలో చెడు కొవ్వు తగ్గేందుకు వుపయోగపడతాయి.ఇందులో యాంటీ యాక్సిడెంట్లు కూడా అధిక మోతాదులో వున్నాయి. ఇవి గుండె కవాటాలు సక్రమంగా పనిచేసేందుకు వుపయోగపడతాయి. గుండె సంబంధిత సమస్యలను కూడా ఇవి నివారిస్తాయి.

12. రెడ్ వైన్:

12. రెడ్ వైన్:

రెడ్ వైన్ గుండెకు మేలు చేస్తాయని అనేక పరిశోధనలు నిరూపించాయి. రెడ్ వైన్ లో 70శాతం పైగా కోకో కేట్ ఛిన్స్ అనే పదార్థం శరీరానికి అవసరమైన మంచి కొలెస్ట్రాల్ ను పెంచుతుంది. కనుక రెడ్ వైన్ గుండెకు చాలా మంచి పానీయం. మితంగా తీసుకోవచ్చు.

13. తృణధాన్యాలు హైపర్‌టెన్షన్ ఉన్నవాళ్లకు పళ్లు, కూరగాయులు, ఆకుకూరలు పుష్కలంగా ఇవ్వాలి.

13. తృణధాన్యాలు హైపర్‌టెన్షన్ ఉన్నవాళ్లకు పళ్లు, కూరగాయులు, ఆకుకూరలు పుష్కలంగా ఇవ్వాలి.

వాటిలో పొటాషియుమ్ పాళ్లు ఎక్కువ కాబట్టి ఆ ఆహారం తీసుకోవడం ప్రధానం. తాజాపళ్లు, పొట్టు ఉన్న తృణధాన్యాలు ఆహారంలో ఎక్కువగా ఉండేలా చూసుకోవాలి.

14.ఆపిల్స్‌ :

14.ఆపిల్స్‌ :

విటమిన్స్‌, మినరల్స్‌, ఐరన్‌ ఆపిల్‌లో పుష్కలం గా వున్నాయి. ఇంకా ఇందులో పాస్పరస్‌, పొటాషియం, కాల్షియం, విటమి న్‌ ఏ, బి, సి కూడా ఇందులో అధిక మోతాదులో వుంటాయి. ëఇవి గుండెకు రక్తాన్ని తీసుకువెళ్ళే నరాలకు ఎంతో మంచి చేస్తాయిí అని న్యూట్రీషనిస్ట్‌ స్నేహా త్రివేది చెబుతున్నారు. ఇందులో గ్లైసెమిక్‌ చాలా తక్కువ మోతాదులో వుంటుంది. కాబట్టి మధుమేహ వ్యాధిగ్రస్తులకు కూడా ఎంతో మంచిది అని చెబుతున్నారు.

15. దానిమ్మ:

15. దానిమ్మ:

గుండెపోటును నివారించడానికి సహాయపడే ఆహారపదార్ధాలలో దానిమ్మ కూడా ఒకటి. ఇందులో ఫైటో-న్యూట్రిఎంట్స్ ఎక్కువగా ఉండడం వల్ల శరీరంలో ఉత్పత్తి అయ్యే నైట్రిక్ ఆక్సైడ్ లను ఉత్తేజపరచడానికి సహాయపడతాయి.

English summary

15 Indian Foods For Heart Patients For A Healthy Heart

Eating a healthy diet rich in fruits, vegetables and fish will lower the risk of dying from a heart attack or stroke by almost 35 percent. Only exercising isn't sufficient to maintain a healthy heart. A few changes in your lifestyle and diet will do the trick.
Story first published: Monday, January 1, 2018, 10:45 [IST]