For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

మన ఆహారపు అలవాట్లే..మనకొచ్చే కలలపై ప్రభావం చూపుతాయా?

By Bharath Reddy
|

ఒక్కోసారి కలలు మనల్ని భయపెడుతుంటాయి. మన పళ్లు మొత్తం కోల్పొయినట్లు, అండర్ వేర్ పై ఆఫీస్ లో వర్క్ చేస్తున్నట్లు ఇలా ఏవేవో కలలు వస్తుంటాయి. దీంతో వెంటనే నిద్రలో నుంచి లేచి కూర్చుంటాం. శరీరం అంతా చల్లటి చెమటలుంటాయి. తర్వాత వాస్తవం ఏమిటో తెలుసుకుంటాం. ఓహ్.. ఇది కలనా అని అనుకుంటాం. అయితే కలలు చాలా రకాలుగా వస్తాయి. ఇలాంటి కలలు ఎందుకు వస్తాయి ? చెడ్డ కలలు రావడానికి మాత్రం కొన్ని కారణాలున్నాయి. మనం తీసుకునే ఫుడ్స్ ఇందుకు కారణం. ఆహారపదార్థాల ద్వారా చెడు కలలు ఎలా వస్తాయనే విషయాలు కొన్ని పరిశోధనల్లో వెల్లడైంది.

Foods That Causes Bad Dreams

<strong>నిద్రలో వచ్చే కలలు.. రియాలిటీకి దగ్గరగా ఉంటాయా ?</strong>నిద్రలో వచ్చే కలలు.. రియాలిటీకి దగ్గరగా ఉంటాయా ?

వైద్యశాస్త్ర పితామహుడిగా భావించే హిప్పోక్రేట్స్ వీటి గురించి తెలిపిన మొదటి వ్యక్తి. ఈ విషయాలు దాదాపు 2,000 సంవత్సరాల తరువాత ఒక అధ్యయనం (సైకాలజీలో జర్నల్ ఫ్రాంటియర్స్)లో ప్రచురించారు. ఒక కెనడియన్ విశ్వవిద్యాలయంలో 396 మంది విద్యార్ధుల ఆహారపు అలవాట్లు, వారికొచ్చిన కలలపై రెండు వారాలపాటు పరిశోధన చేపట్టారు. మొత్తానికి ఆహారపు అలవాట్లు అనేవి మనకొచ్చే కలలపై ప్రభావం చూపుతాయని తేలింది. ఇంతకు ఆ ఆహార పదార్థాలు ఏమిటో మనం ఒకసారి తెలుసుకుందామా.

ఐస్ క్రీం

ఐస్ క్రీం

మీరు నిద్రించడానికి ముందు ఐస్ క్రీం తింటే కచ్చితంగా ఆ రోజు మీరు ఏదో ఒక పీడ కల కంటారట. మీరు ఒక కప్పు ఐస్ క్రీం తిని బెడ్ ఎక్కారంటే ఇంక ఆ రాత్రి మీకు కాలరాత్రే. ఐస్ క్రీం మీ మెదడు పని తీరుపై కాస్త ప్రభావం చూపుతుంది. పరిశోధనలో పాల్గొన్న వారిలో చాలామంది ఇలా చేసి నిద్రకు ఉపక్రమించారు. అయితే వారు చెడు కలలతో ఇబ్బందిపడ్డారు. మీకు బ్యాడ్ డ్రీమ్స్ రాకుండా ఉండాలంటే కచ్చితంగా ఐస్ క్రీమ్స్ తినకుండా ఉండడమే మంచిది.

జున్ను

జున్ను

పాలలో ట్రిప్టోఫాన్ ఎక్కువగా ఉంటుంది. ఇది నిద్రలో ప్రేరేపించే హార్మోన్ సెరోటోనిన్కు పూర్వగామిగా పనిచేస్తుంది. అయితే పడుకునే ముందు జున్ను వంటివి తింటే ఆ రోజు రాత్రి మీరు తప్పకుండా ఏదో ఒక చెడ్డ కల కంటారంట. పరిశోధనలో పాల్గొన్న వారు ఈ విషయాన్ని స్పష్టం చేశారు.

సెలిరి

సెలిరి

దీనికి సంబంధించిన ఆహారం తినడం కూడా నైట్మేర్స్ కారణమవుతుంది. ఇది మూత్ర విసర్జన రేటును పెంచుతుంది. కానీ దీన్ని తిని నిద్రకు ఉపక్రమిస్తే మాత్రం మీకు చెడ్డ కలలు తప్పవంటున్నారు పరిశోధకులు. అందువల్ల ఈ ఆహారానికి కాస్త దూరంగా ఉండడం మంచిది.

తృణధాన్యాలు

తృణధాన్యాలు

పలురకాల తృణధాన్యాలకు సంబంధించిన ఆహారాలు కూడా మీకు సరైన నిద్రనివ్వవంట. వీటితో తయారైన ఆహార పదార్థాలు తినడం వల్ల రాత్రి సమయంలో చెడ్డ కలలు వస్తాయంట. పరిశోధనలో పాల్గొన్న వారిలో కొందరు వీటిని తిని నిద్రకు ఉపక్రమించగా పలు రకాల పీడ కలలతో ఇబ్బందిపడ్డారు. అందువల్ల ఇవి కూడా నిద్రించే ముందు తినకపోవడమే బెస్ట్ అని వారు పేర్కొన్నారు.

ఆల్కహాల్

ఆల్కహాల్

ఆల్క హాల్ తీసుకుంటే మంచిగా మత్తు వస్తుంది... హ్యాపీగా పడుకోవొచ్చనే అభిప్రాయం ఉంటుంది. కానీ అది నిజం కాదు. నిద్రపోయే ముందు ఆల్కహాల్స్ తీసుకుంటే చాలా ఇబ్బందులుపడాల్సి వస్తోంది. అధ్యయనం పాల్గొన్న వారు మద్యం సేవించి నిద్రకు ఉపక్రమించారు. కానీ ఆ తర్వాత పీడకలలు, ఒత్తిడితో నిద్రే పోలేదంట.

కెఫెన్

కెఫెన్

కెఫెన్ వంటి వాటితో ఉన్న ఆహారపదార్థాలు నిద్రపోయే ముందు తీసుకుంటే మీరు ఆ రోజు తప్పకుండా చెడ్డ కలలు కనాల్సి వస్తోంది. అలాగే నిద్ర కూడా సరిగ్గా పట్టదు. అందువల్ల ఇలాంటి పదార్థాలకూ రాత్రి సమయంలో దూరంగా ఉండడమే చాలా మంచిది.

బ్రెడ్

బ్రెడ్

బ్రెడ్ వంటి ఆహార పదార్థాలు కూడా పీడకలలకు కారణం అవుతాయి. సాధారణంగా చాలామంది కాస్త బ్రెడ్ తినిపడుకుంటే చాలనుకుంటారు. అయితే కొందరు మాత్రం దీన్ని తిని నిద్రకు ఉపక్రమిస్తే కచ్చితంగా చెడ్డ కలలు కంటారంట. అందువల్ల దీని తినకపోవడమే బెస్ట్ అంటున్నారు పరిశోధకులు.

<strong>ఈ 15 చిట్కాలు పాటిస్తే రాత్రుల్లో స్వీట్ డ్రీమ్స్ ..!</strong>ఈ 15 చిట్కాలు పాటిస్తే రాత్రుల్లో స్వీట్ డ్రీమ్స్ ..!

వెల్లుల్లి

వెల్లుల్లి

వెల్లుల్లి సంబంధిత ఆహార పదార్థాలు తింటే కూడా మీకు చెడ్డ కలల తప్పవంట. పరిశోధనలో పాల్గొన్న కొందరు ఇలాంటి ఫుడ్స్ తిని పడుకున్నారంట. అయితే వారంతా భయానక కలలతో ఇబ్బందులుపడ్డారట. మరి వెల్లుల్లి సంబంధిత ఆహారాలు తిని నిద్రకు ఉపక్రమించాలంటే మాత్రం కొంచెం ఆలోచించండి.

డార్క్ చాక్లెట్

డార్క్ చాక్లెట్

డార్క్ చాక్లెట్స్ కూడా మీకు రాత్రి దడ పుట్టిస్తాయంట. పడుకునే ముందు వీటిని తింటే మాత్రం మీరు అస్సలు నిద్రపోలేరంట. పరిశోధనలో పాల్గొన్న చాలామంది కూడా వీటిని తిని నిద్రకు ఉపక్రమించారంట. అయితే వారందరికీ పీడకలలు వచ్చాయంట. మరి ఆలోచించండి. మీరూ పడుకునే ముందు వీటిని తీసుకోవాలా వద్దా అని.

హాట్ సాస్

హాట్ సాస్

ఒక అధ్యయనం ప్రకారం నిద్ర పోయే ముందు మసాలా ఫుడ్స్ తిన్న వారు నిద్రలోకి జారుకోవడం కష్టమంట. దీంతో వారు ఒత్తిడితో కూడిన కలలు కంటారట. స్పైసి ఆహారాలు శరీర ఉష్ణోగ్రతను మార్చడమే ఇందుకు కారణం. నిద్ర పోయే సమయంలో ర్యాపిడ్ ఐ మోషన్ కలుగుతుంది. నిద్రపోతున్న దశల్లో మార్పులను మారుస్తుంది. మీరు నిద్రపోయే ముందు వీటిని తింటే కచ్చితంగా ఏదైనా ఒక చెడ్డ కల కనక తప్పదు.

జ్యూస్

జ్యూస్

పడుకునే ముందు జ్యూస్ తాగితే మంచిదని చాలామంది అనుకుంటాను. అయితే మీరు పడుకునే ముందు వీటిని తీసుకోకపోవడమే మంచిది. అలాకాకుండా మంచి నీటిని తాగండి. దీంతో మీరు హ్యాపీగా నిద్రపోవొచ్చు.

కుకీలు

కుకీలు

అధ్యయనంలో పాల్గొన్నవారు కుకీలు మరియు కేక్ వంటి చక్కెర పదార్ధాలను తిన్నారు. తర్వాత 31 శాతం మందికి పీడ కలలు వచ్చాయి. పడుకునే ముందు వీటిని తిందామని మీరు టెంప్ట్ కావొచ్చు. కానీ వాటి ద్వారా ఆ తర్వాత మీరు పడే పర్యావసనాలు మాత్రం చాలా దారుణంగా ఉంటాయట. మరి మీ ఛాయిస్.. కుకీలు తినకుండా లేమంటే చెడ్డ కలలకు రెడీగా ఉండండి.

చిప్స్

చిప్స్

చిప్స్ షుగర్ లేదా కెఫీన్ కలిగి ఉండవు. అందువల్ల ఇవి కాస్త మంచివి. అయితే అధ్యయనంలో పాల్గొన్న వారికి వచ్చిన వారిలో 12.5 శాతం మంది చిప్స్ వంటి జంక్ ఫుడ్స్ తినడం వల్ల చెడ్డ కలలు కనాల్సి వచ్చింది. వీటికి దూరంగా ఉండడం వల్ల మీరు మంచి జీర్ణవ్యవస్థకు దగ్గరవుతారు. చెడ్డ కలలకు దూరం అవుతారు. మీరు మంచిగా నిద్రపోవడానికి అవకాశం ఉంటుంది.

పాస్తా లేదా పిజ్జా

పాస్తా లేదా పిజ్జా

ఇక పాస్తా లేదా పిజ్జా తిన్నవారు బ్యాడ్ డ్రీమ్స్ తో బాగా ఇబ్బందిపడ్డారట. ఇవి గ్లూకోజ్ ను కూడా శరీరానికి అందించవు. కాబట్టి మీరు నిద్రకు ఉపక్రమించే ముందు వీటిని వీలైనంత వరకు తినకుండా ఉంటేనే మంచిది.

సోడా

సోడా

పరిశోధనలో పాల్గొన్న వారు ఆ రోజు ఉదయం సోడా తాగారు. అయితే అందులో ఉండే కెఫెన్, చక్కెర పదార్థాల వల్ల రాత్రిపూట పీడకలలు కన్నారని పరిశోధనలో తేలింది. అనేక సోడాలు క్యాన్సర్ కారక రంగులు (పంచదార పాకం కలరింగ్ వంటివి)తో ఉంటాయి. అలాగే ఇతర పదార్ధాలు కూడా ఇందులో ఉంటాయి. గ్లిసొరాల్ ఎస్టర్ రోసిన్ AKA కలప వంటివి సోడాల్లో ఉంటాయి. ఇలాంటవన్నీ చెడ్డ కలలు రావడానికి కారణమవుతాయి.

సలాడ్ డ్రెస్సింగ్స్

సలాడ్ డ్రెస్సింగ్స్

తీపి ఆహార పదార్థాలు తీసుకుంటే కూడా భయంకరమైన కలలు వస్తాయని అధ్యయనంలో తేలింది. అందువల్ల వీలైనంత వరకు మీరు బెడ్ పైకి వెళ్లే ముందు వీటికి దూరంగా ఉండడమే మంచిది. ఒకవేళ తప్పకుండా వీటిని తీసుకోవాలనుకుంటే మాత్రం బ్యాడ్స్ డ్రీమ్స్ కు రెడీ కావాల్సి ఉంటుంది.

రెడ్ మీట్

రెడ్ మీట్

రెడ్ మీట్ తింటే కూడా చెడ్డ కలలు వస్తాయంట. పరిశోధనలో పాల్గొన్న వారిలో కొందరు రెడ్ మీట్ తిని నిద్రకు ఉపక్రమించారట. అయితే వారిలో చాలామందికి పీడకలలు వచ్చాయంట. అందువల్ల పడుకునే ముందు రెడ్ మీట్ తినాలా వద్దా అనేది మీరూ ఆలోచించండి.

యోగర్ట్

యోగర్ట్

యోగార్ట్‌ లేదా వాటి ఆధారిత ఐస్‌క్రీమ్‌లు తిని నిద్రపోతే కచ్చితంగా ఆ రోజు మీకు చెడ్డకలలు తప్పవు. వీటిని తింటే మీరు పీడకలలు కనాల్సిందే. అయితే వీటిని మితంగా తీసుకుంటే కాస్త కలలు తక్కువగానే వస్తాయంట.

ఫ్రై ఫుడ్స్

ఫ్రై ఫుడ్స్

నిద్రపోయే ముందు ఫ్రై లతో కూడిన ఫుడ్స్ తింటే కచ్చితంగా పీడకలలు వస్తాయంట. వీటిలో మసాలాలు ఎక్కువగా ఉంటాయట. పరిశోధనల్లో పాల్గొన్న వారిలో చాలామంది ఫ్రై ఫుడ్స్ తిన్నారంట. అయితే వారందరికీ చెడ్డ కలలు వచ్చాయంట. అందువల్ల మీరూ కూడా ఆలోచించండి. ఇలాంటి ఫుడ్స్ తినాలా వద్దా అని.

క్యాండీ బార్స్

క్యాండీ బార్స్

క్యాండీ బార్స్ తిని నిద్ర పోతే మీరూ కచ్చితంగా ఏదో ఒక చెడ్డ కల కంటారంట. పరిశోధనలో పాల్గొన్న చాలామంది వారు నిద్రపోయే ముందు క్యాండీ బార్స్ తిని నిద్రకు ఉపక్రమించారట. అయితే వారంతా పీడకలలతో ఇబ్బందిపడ్డారంట. పడుకోబోయే ముందు క్యాండీ బార్స్ తినాలా వద్దా అనేది ఇక మీరు ఆలోచించుకోండి. మాకు చెడ్డ కలలు వచ్చినా ఫరావలేదనుకుంటే మాత్రం క్యాండీ బార్స్ తినండి.

English summary

20 Foods That Causes Bad Dreams

If you have nightmares, it does not mean that you are thinking about something which causes you to have nightmares. It is seen many times that people dream and fear. These dreams we call scary or nightmares. When such dreams come, people sleep their nights. After all, why do these dreams come?
Desktop Bottom Promotion