Latest Updates
-
నోట్లో వేస్తే కరిగిపోయేలా ఎగ్ సలాడ్ శాండ్విచ్.. ఇలా చేశారంటే ఒక్కటి కూడా వదలరు.! -
కడుపు నిండా తిన్నా లైట్‌గా అనిపించే హెల్తీ వంకాయ పెరుగు పచ్చడి.. సింపుల్‌గా ఇలా చేసేయండి.! -
డ్రగ్స్‌కి బానిస అవుతున్న యువత.. మాదకద్రవ్య రహిత దేశంగా మార్చాలని ప్రధాని మోదీ పిలుపు.! -
రాయల్ వీకెండ్.. ఈ స్పెషల్ మసాలాతో మొఘల్ కిచెన్ రెసిపీ మహారాణి చికెన్ కర్రీ.! -
పంద్రాగస్టు స్పెషల్ స్వీట్..చల్లారినా గట్టిపడని వెడ్డింగ్ స్టైల్ రవ్వ కేసరి మీ ఇంట్లోనే ఈజీగా చేసుకోండిలా.. -
Independence Day 2026: ఆగస్టు 15న ప్రధాని ప్రసంగానికి, జెండా వందనానికి ఎర్రకోటనే ఎందుకు ఎంచుకుంటారో తెలుసా? -
శ్రావణ మాసంలో ఈ ఐదు నక్షత్రాల వారికి తిరుగే ఉండదు.. గోల్డెన్ డేస్ ఆరంభం.! -
ఉదయం నిద్ర లేవగానే ఈ ఒక్క పని చేస్తే చాలు.. ఎన్నో సమస్యలకు చెక్ పెట్టొచ్చు.! -
ఆగస్టు 15న మనకే కాదు.. ప్రపంచవ్యాప్తంగా మరెన్నో దేశాలకు పండుగే..ఈ విషయాలు మీకు తెలుసా? -
పెళ్లయిన కొత్తలో కుర్రాళ్లు గూగుల్‌లో ఎక్కువగా వెతికే విషయాలు ఇవే!
శృంగారం చేస్తున్న మధ్యలో అంగస్తంభన కోల్పోవడానికి 5 కారణాలు
మీరు పడక గదిలో అద్భుతమైన ప్రదర్శనను ఇస్తూ ఉండవచ్చు. కానీ, కొన్నిసార్లు మీరు ఎంత ప్రయత్నించినా మీ అంగం స్తంభించదు. ఇదొక పెద్ద సమస్యగా మారుతుంది. దీనితో తర్వాతి సారి శృంగారంలో పాల్గొనేటప్పుడు అంగం స్తంభిస్తుందా లేదా అనే అనుమానం మొదలవుతుంది.
అంగస్తంభన కాకుండా మీకు సమస్యలను సృష్టించవచ్చు. మీ శృంగార జీవితాన్ని కష్టాల్లోకి నెట్టేసే అవకాశం ఉంది. మరి ఇలా జరగడానికి గల కారణాలు ఇప్పుడు తెలుసుకుందాం.

1. పడక గదిలో మరీ ఎక్కువగా సాహసోపేతంగా వ్యవహరించడం :
శృంగార సమయంలో కొత్త భంగిమలను మీ భాగస్వామితో కలిసి ప్రయత్నించాలనే ఆతురత ఉంటుంది. ఇలాంటి సమయాల్లో పరిదులు దాటి ప్రవర్తించకండి. ఎందుకంటే శృతి మించడం వల్ల అంగం సరిగ్గా స్తంభించకపోవడం మరియు మీ అంగం విరిగే ప్రమాదం ఉంది. కొన్ని వైద్య పత్రికల ప్రకారం పదహారు వందల అంగం విరిగిపోయిన కేసులు ప్రతి సంవత్సరం నమోదవుతున్నాయి. కాబట్టి అసాధారణ పద్దతులను పడగదిలో ప్రయోగించేటప్పుడు ఒకటికి రెండు సార్లు ఆలోచించండి.

మీ శరీర ముఖచిత్రం పై వ్యతిరేక భావనను కలిగి ఉండటం :
కొత్త మంది పురుషులు తమ శరీర ముఖ చిత్రాన్ని చూసి తమను తామే తక్కువ అంచనా వేసుకుంటుంటారు మరియు తాము ఇప్పుడు సరిగ్గా లేమని ఇంకా బాగుండాలని చాలా ఎక్కువ తాపత్రయపడుతుంటారు, అందుకు కష్టపడుతుంటారు.దాంతో పాటు ఆందోళన చెందుతుంటారు. ఇలాంటి వారిలో కూడా అంగస్తంభన సమస్యలు తలెత్తుతుంటాయి లేదా అంగస్తంభన ఎక్కువసేపు నిలవదు. కొంతమంది పరిశోధకులు ఒక ఆసక్తికరమైన విషయాన్ని వెలుగులోకి తీసుకొచ్చారు. నలభై సంవత్సరాల పై బడిన వారు ఎవరైతే తమ శరీర ముఖ చిత్రాన్ని తక్కువ అంచనా వేసుకుంటారో, అటువంటి వ్యక్తులు శృంగార ఆతురత వల్ల పడక గదిలో ఉన్నప్పుడు అనుకున్న మేర పడక గది ప్రదర్శన ఇవ్వలేక ఇబ్బందులు పడుతుంటారు అనే విషయాన్ని కనుగొన్నారు.

స్పందించని భాగస్వామి ఉండటం :
పడక గదిలో మీరు అత్యుత్తమ ప్రదర్శన ఇస్తున్నా, మీ భాగస్వామి గనుక అంత ఉత్సాహం చూపకపోయినా మరియు స్పందించకపోయినా మీకు అంగం స్తంభించదు. స్పందించని వ్యక్తులతో శృంగారంలో పాల్గొనటం మరియు అత్యుత్తమ ప్రదర్శన ఇవ్వాలనుకోవడం సవాళ్లతో కూడుకున్న వ్యవహారం. సంభోగ ప్రేరణ ద్వారా మీ భాగస్వామి యొక్క ఆలోచనలను శృంగారం వైపు మరలించవచ్చు.

మీ సంబంధ బాంధవ్యాల్లో సమస్యలు గనుక ఉంటే :
మీకు మీ భాగస్వామికి మధ్య సంబంధ బాంధవ్యాల్లో సమస్యలు గనుక ఎదుర్కొంటుంటే, ఎట్టి పరిస్థితుల్లోనూ బాహ్య సౌందర్యం గురించి అస్సలు విమర్శలు చేయకండి. ముందు మీ సమస్యలను పరిష్కరించుకోండి. మీ భాగస్వామితో విభేదాలు వచ్చిన తర్వాత శారీరకంగా దగ్గరవ్వాలంటే కొద్దిగా కష్టమైనా విషయం.ఇలా జరగడానికి కారణం దుఃఖంతో కూడిన ఒత్తిడి మరియు తరచూ గొడవపడటం వల్ల అంగస్తంభన లో సమస్యలు ఏర్పడతాయి లేదా అంగస్తంభన జరగడమే కష్టమైనా విషయంగా మారుతుంది.
ప్రపంచంలోనే వింతైన..విడ్డూరమైన సెక్స్ రూల్స్ ..!!

ఒత్తిడి కలిగించే విషయాల గురించి ఆలోచించడం :
శృంగారం చేసే సమయంలో ఆఫీస్ కు సంబంధించిన వ్యవహారాల గురించి ఆలోచించడం లేదా ఆర్థికపరమైన వ్యవహారాల గురించి మదనపడటం ఇలా ఆందోళన కలిగించే అంశాల గురించి ఎక్కువగా మీ పడక గదిలో ఆలోచించడం వల్ల అది మీ అంగస్తంభన పై ప్రభావం చూపుతుంది. కాబట్టి పడకగదిలో సుఖాన్ని అనుభవించి తృప్తి చెంది అంగస్తంభన సరిగ్గా జరగాలంటే, ఒత్తిడిని దూరం పెట్టడం ఉత్తమమైన మార్గం.



Click it and Unblock the Notifications