For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

మీరు ఖచ్చితంగా నిర్లక్ష్యం చేయకూడని బ్రెస్ట్ క్యాన్సర్ అపోహలు ...

By Ashwini Pappireddy
|

వ్యాధులకు సంబంధించి ఒక సామెత వుంది "నేను దానిని ఆపలేకపోయాను, నేను నయం చేయలేకపోయాను మరియు నేను దానికి కారణం కాదు!"
బ్రతికున్న ప్రాణులు మరియు వ్యాధుల మధ్య సంబంధం విషయానికి వస్తే పైన పేర్కొన్న సామెత చాలా స్థాయిల్లో ప్రభావితం చేస్తుందని చెప్పవచ్చు.

రొమ్ము క్యాన్సర్ కి గల కారణాలు మనుషుల కి, వ్యాధులు మరియు అనారోగ్యాలు రావడం కొత్త ఏమి కాదని, చాలా సహజమైన విషయమేనని మనలో చాలామందికి తెలుసు.

మన వయస్సు తో సంబంధం లేకుండా చిన్న వయస్సు నుండి ముసలి వయస్సు దాకా అందరిలో ఎదో ఒక అనారోగ్యం లేదా అనేక రోగాలకు భాదితులు అయి ఉండవచ్చు. మానవుని జీవితంలో ఎప్పుడైనా వయస్సు లేదా లింగంతో సంబంధం లేకుండా అతను / ఆమె వ్యాధులకు ప్రభావితమవుతారు.

అయినప్పటికీ, నిర్దిష్ట వయస్సు లేదా లింగం ని బట్టి ప్రజల మీద ప్రభావితం చేసే కొన్ని వ్యాధులు ఉండవచ్చు. ఒక వ్యాధి లేదా జబ్బు అనేది మన శరీరం లోని ఏ భాగం మీదైనా ప్రభావితం చేయవచ్చు, మెదడు నుండి పాదాలవరకు మధ్యలో ఎక్కడైనా ప్రారంభమవచ్చు.

ఒక వ్యక్తి కి సంభవించే వ్యాధిని లేదా అనారోగాన్ని అంచనా వేయడం మరియు అడ్డుకోవడం అనేది చేయలేమని మనకి బాగా తెలుసు, కాని మనం ఎక్కువ కాలం ఎలాంటి అనారోగ్యం పాలవకుండా ఉండటానికి ఒక ఆరోగ్యకరమైన జీవనశైలి మాత్రం ఖచ్చితంగా అవసరమవుతుంది.

7 Breast Cancer Myths That You Must Never Believe!,

మనం నయం చేయలేని మరియు ఒక వక్తి యొక్క జీవితాన్ని తిరిగి తీసుకురాలేని అనేక వ్యాధులున్నాయని మనకి తెలుసు, అందులో కాన్సర్ కూడా ఒకటి.
ఇప్పటివరకు మనకు తెలిసినది, క్యాన్సర్ అనేది మానవజాతి మీద ప్రభావితం చేయగల ప్రాణాంతక వ్యాధుల్లో ఒకటి, ఎయిడ్స్ రెండవదని తెలుసు.

క్యాన్సర్ అనేది ఒక వ్యాధి, ఇందులో శరీరంలోని అసాధారణ కణాల సంఖ్య కారణమవుతుంది. దీని వలన క్యాన్సర్ కణితులు ఏర్పడతాయి.
ఈ కణితులు చివరికి పరిమాణంలో పెరుగుతాయి మరియు కణజాలం మరియు ఇతర అవయవాలను నాశనం చేయడం ప్రారంభిస్తాయి, చివరికి అవయవ వైఫల్యానికి కారణమవుతాయి.

క్యాన్సర్ కణితులు కొన్ని చికిత్స చేయలేని ప్రదేశాలలో ఉన్నట్లయితే, వాటిని చికిత్స చేయడం చాలా కష్టం అవుతుంది. అనేక రకాలైన క్యాన్సర్లు వున్నాయి, అందులో రొమ్ము క్యాన్సర్, పెద్దప్రేగు క్యాన్సర్, ఊపిరితిత్తుల క్యాన్సర్ మొదలైనవి సాధారణమైనవి గా ఉన్నాయి. రొమ్ము క్యాన్సర్ గురించి మీరు విస్మరించవలసిన కొన్ని అపోహలు ఇక్కడ వున్నాయి.
ప్రాణాంతకమైన బ్రెస్ట్ క్యాన్సర్ కు సంకేతాలు..తీసుకోవల్సిన జాగ్రత్తలు.!

అపోహ #1

అపోహ #1

రొమ్ము క్యాన్సర్ అనేది క్యాన్సర్ లో ఒక రకం, ఇది మహిళలను ఎక్కువగా భాదపెడతుంది అనేది ఒక అపోహ మాత్రమే.ఎందుకంటే గణాంకాల ప్రకారం, ఊపిరితిత్తుల క్యాన్సర్ మహిళలకు అత్యధిక మరణాల రేటును కలిగి ఉంది.

అపోహ #2

అపోహ #2

సొంతంగా పరీక్ష చేసుకోవడం వలన ఫలితముండదు. ఇది కూడా ఒక అపోహ అని చెప్పవచ్చు.ఎందుకంటే క్రమం తప్పకుండా, మీ సొంత రొమ్ములను మరియు స్పాట్స్ ని పరిశీలిస్తే, ప్రారంభ దశలోనే రొమ్ము క్యాన్సర్ ఉనికిని గుర్తించడానికి సహాయపడుతుంది.

అపోహ #3

అపోహ #3

మామోగ్రమ్స్ క్యాన్సర్ కి కారణం కావచ్చు. రేడియోషన్స్ ని ఉపయోగించి, రొమ్ములో వుండే కణితుల ఉనికిని గుర్తించడానికి మామోగ్రాం అనే టెక్నాలజీ ని ఉపయోగిస్తారు. ఎప్పుడో ఒకసారి మయోమోగ్రమ్స్ ని వాడటం వలన క్యాన్సర్ ప్రమాదాన్ని తగ్గించుకోవచ్చు.

బ్రెస్ట్ క్యాన్సర్ రాకుండా.. అడ్డుకునే అద్భుత ఆహారాలు..!! బ్రెస్ట్ క్యాన్సర్ రాకుండా.. అడ్డుకునే అద్భుత ఆహారాలు..!!

అపోహ #4

అపోహ #4

కణితిని తీసివేయడం వలన క్యాన్సర్ కణాలు వ్యాప్తి చెందుతాయి. రొమ్ములో కణితిని తొలగించడం వలన ఆ ప్రాంతంలో మరిన్ని క్యాన్సర్ కణాలు ఏర్పడగలవని చెప్పడానికి శాస్త్రీయ పరంగా ఎలాంటి ఆధారం లేదు.

అపోహ #5

అపోహ #5

రొమ్ము క్యాన్సర్ అనేది ఒక వారసత్వ లక్షణం. రొమ్ము క్యాన్సర్ అనేది వారసత్వం గా మహిళలో వచ్చే వ్యాధి కాదు ఇది కుటుంబం మీద ఎలాంటి ప్రభావాన్ని చూపదు. కాబట్టి ఇది కేవలం అపోహ మాత్రం!

అపోహ #6

అపోహ #6

మీకు రొమ్ము క్యాన్సర్ ఉన్నప్పుడు ఎల్లప్పుడూ గడ్డలను కలిగి వుండవచ్చు. సొంతంగా చెక్ చేసుకోవడం వలన మహిళలు గడ్డలను, మచ్చలు లేదా రొమ్ము క్యాన్సర్ యొక్క ఏ ఇతర సంకేతాలను తెలుసుకోలేని అనేక సందర్భాలు ఉన్నాయి.

English summary

7 Breast Cancer Myths That You Must Never Believe!

Here are a few myths about breast cancer that you must ignore.
Desktop Bottom Promotion