For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

ఆరెంజ్, నిమ్మ వంటి సిట్రస్ ఫ్రూట్స్ తినడానికి కొన్ని ఖచ్చితమైన కారణాలు.!

మార్కెట్లో వివిధ రకాల ఫ్రూట్స్ అందుబాటులో ఉన్నా, కొంత మంది స్వీట్ గా టేస్ట్ గా ఉండే పండ్లు తినడానికి ఇష్టపడితే, మరికొందరు మాత్రం పుల్లపుల్లగా ఉండే సిట్రస్ పండ్లను ఇష్టపడుతారు. అందులో కారణం లేకపోలేదు.

|

మార్కెట్లో వివిధ రకాల ఫ్రూట్స్ అందుబాటులో ఉన్నా, కొంత మంది స్వీట్ గా టేస్ట్ గా ఉండే పండ్లు తినడానికి ఇష్టపడితే, మరికొందరు మాత్రం పుల్లపుల్లగా ఉండే సిట్రస్ పండ్లను ఇష్టపడుతారు. అందులో కారణం లేకపోలేదు. సిట్రస్ పండ్లు ఇమ్యూనిటిని పెంచడంలో గ్రేట్ గా సహాయపడుతాయన్ని విషయం చాల తక్కువ మందికి మాత్రమే తెలుసు. సిట్రస్ లో విటమిన్ సి అధికంగా ఉంటుంది. ఇది వ్యాధినిరోధకశక్తిని పెంచడంలో గ్రేట్ గా సహాయపడుతుంది. అందుకే వీటిని ఎక్కువగా ఎంపిక చేసుకుంటరు. మరి మీకు కూడా ఆరెంజ్ అంటే ఇష్టమా ఆరెంజ్ ఎక్కువగా తినడానికి ఇష్టపడుతున్నారా.అయితే ఆరెంజ్ తో పాటు, ఇతర సిట్రస్ పండ్లను కూడా తినడం అలవాటు చేసుకోవాలి. వీటిలో అమేజింగ్ హెల్త్ బెనిఫిట్స్ దాగున్నాయి !

సిట్రస్ ఫ్రూట్స్ కోవలోకి ఆరెంజెస్, నిమ్మరసం, గ్రేఫ్ ప్రూట్స్, సిట్రాన్స్, బెర్రీస్ మొదలగు పండ్లు అన్నీ కూడా ఈ కోవలోకి వచ్చేవే.

7 Unusual Reasons To Eat More Citrus Fruit

ఇండియాలో సిట్రస్ ఫ్రూట్స్ అత్యధికంగా లభ్యం అవుతున్నాయి. ఇండియాలో సిట్రస్ ఫ్రూట్స్ పండించడం, అందుబాటులో ఉండటం వల్ల ఇవి చాలా పాపులర్ అయ్యాయి. వీటి రెగ్యులర్ గా తినడం చాలా మందికి అలవాటు.

చాలా వరకూ ఈ సిట్రస్ ఫ్రూట్స్ అన్నింటినీ నేరుగా తినడం కంటే ఫ్రెష్ జ్యూస్, మిల్క్ షేక్స్, ఫ్రూట్ సలాడ్స్, జామ్స్ వంటి వివిధ రూపాల్లో తీసుకోవడానికి ఇష్టపడుతారు. ప్రతి ఒక్కరి రెగ్యులర్ డైట్ లో ఇవి తప్పనిసరిగా ఉంటాయి.

సిట్రస్ ఫ్రూట్స్ లో విటమిన్ సి తో పాటు ముఖ్యమైన న్యూట్రీషియన్స్ కూడా ఉంటాయి. ఇవి శరీర ఆరోగ్యానికి అద్భుతంగా సహాయపడుతాయి. విటమిన్ సి వ్యాధుల భారిన పడకుండా రోగనిరోధకతను పెంచడానికి, వ్యాధులతో పోరాడటానికి సహాయపడుతుంది. కాబట్టి, రెగ్యులర్ గా సిట్రస్ పండ్లను తినడానికి కొన్ని సర్ప్రైజింగ్ రీజన్స్ ఈ క్రింది విధంగా.

శరీరానికి పోషణ అందిస్తుంది:

శరీరానికి పోషణ అందిస్తుంది:

ఆరెంజ్ వంటి సిట్రస్ ఫ్రూట్స్ లో విటమిన్ సితో పాటు ఇతర న్యూట్రీషియన్స్ అయిన విటమిన్ బి, పొటాషియం, ఫాస్పరస్, కాపర్ మొదలగునివి అధికంగా ఉన్నాయి. ఇవి పూర్తిగా శరీర ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తాయి

మలబద్దకం నివారిస్తాయి:

మలబద్దకం నివారిస్తాయి:

సిట్రస్ ఫ్రూట్స్ లో ఫైబర్ అధికంగా ఉంటాయి. వీటిని రెగ్యులర్ గా తినడం వల్ల స్టూల్ సాప్ట్ గా అవుతుంది. బౌల్ మూమెంట్ స్మూత్ గాజరగడం వల్ల మలబద్దక సమస్యను తగ్గిస్తుంది

స్కిన్ బ్రైట్ గా మార్చుతుంది

స్కిన్ బ్రైట్ గా మార్చుతుంది

సిట్రస్ ఫ్రూట్స్ స్కిన్ కంప్లెక్షన్ ను బ్రైట్ గా మార్చుతుంది, వీటిలో ఉండే యాంటీఆక్సిడెంట్స్, స్కిన్ సెల్స్ ను ఉత్తేజపరుస్తుంది, దాంతో స్కిన్ బ్రైట్ గా మారుతుంది.

. కొలెస్ట్రాల్ ను తగ్గిస్తుంది

. కొలెస్ట్రాల్ ను తగ్గిస్తుంది

అన్ని రకాల సిట్రస్ ఫ్రూట్స్ లో ఫైబర్ కంటెంట్ అధికంగా ఉంటుంది. ఇది శరీరంలో అనారోగ్యకరమైన కొలెస్ట్రాల్ ను తొలగిస్తుంది.

. బరువు తగ్గడానికి సహాయపడుతుంది

. బరువు తగ్గడానికి సహాయపడుతుంది

సిట్రస్ ఫ్రూట్స్ లో విటమిన్ సి అధికంగా ఉంటుంది, ఇవి అసిడిక్ నేచర్ కలిగి ఉండటంవ ల్ల బెల్లీ ఫ్యాట్ సెల్స్ ను కరిగించడంలో గ్రేట్ గా సహాయపడుతుంది. దాంతో బరువు తగ్గడం సులభమవుతుంది.

కిడ్నీ స్టోన్స్ ను నివారిస్తుంది

కిడ్నీ స్టోన్స్ ను నివారిస్తుంది

కిడ్నీ స్టోన్స్ రిస్క్ తగ్గిస్తుంది. సిట్రస్ ఫ్రూట్స్ లో ఉండే విటమిన్ సి, శరీరంలోని టాక్సిన్స్ ను ఫ్లష్ అవుట్ చేస్తుంది. వేస్ట్ ను తొలగిస్తుంది. డైలీ బేసిస్ తీసుకోవడం వల్ల కిడ్నీ స్టోన్స్ ను కరిగించుకోవచ్చు.

హార్ట్ హెల్త్ ను మెరుగుపరుస్తుంది

హార్ట్ హెల్త్ ను మెరుగుపరుస్తుంది

సిట్రస్ ఫ్రూట్స్ లో ఉండే ఫ్లెవనాయిడ్స్ మరియు ఫైబర్ బ్లడ్ ప్రెజర్ ను తగ్గించడంలో గ్రేట్ గా సహాయపడుతుంది. హార్ట్ ను దీర్ఘకాలం హెల్తీగా ఉంచుతుంది.

English summary

7 Unusual Reasons To Eat More Citrus Fruit

Are you someone who loves to eat fruit like oranges? If yes, then you must continue eating oranges and other citrus fruit too, because citrus fruit come with amazing health benefits that you never knew!
Story first published: Monday, February 6, 2017, 11:42 [IST]
Desktop Bottom Promotion