లివర్ డ్యామేజ్ అవ్వడానికి కారణం : 8 డేంజరస్ హ్యాబిట్స్..!!

Posted By:
Subscribe to Boldsky

మీరు ఒకేసారి 10 పనులు లేదా అంతకంటే ఎక్కువ పనులు చేయగలరా? చెయ్యలేరు కదా, మీరు నమ్ముతారో లేదా కానీ, మన శరీరంలో ఉండే కాలేయం అంతకంటే ఎక్కువ పనులే చేస్తుంది!! మన శరీరంలో అత్యంత ముఖ్యమైన అవయం కాలేయం.

మన శరీరంలో అన్ని అవయవాల కంటే కాలేయం చాలా పనులు చేస్తుంది. సైకలాజికల్ ప్రొసెస్ లో జీర్ణవ్యవస్థ, మెటబాలిజం, బ్లడ్ డిటాక్సిఫికేషన్ వంటి అనేక పనులు చేసిపెడుతుంది. అలాంటి లివర్ గురించి మీరు సరైన జాగ్రత్తలు తీసుకుంటున్నారా?

లివర్ లిట్ నెస్, లివర్ హెల్త్ మనం తీసుకునే ఆహారం మరియు జీవనశైలి మీద ఆధారపడి ఉంటుంది.

కాలేయం మన శరీరంలోని వ్యర్థాలను తొలగించడానికి సహాయపడుతుంది. దాంతో లివర్ ఆరోగ్యంగా ఉంటుంది. సాధారణంగా లివర్ డ్యామేజ్ జరిగిందంటే అది అకస్మాత్ గా జరగదు..కొద్ది రోజుల నుండి సమస్య ఉండి పూర్తిగా పాడైనప్పుడు మాత్రమే లక్షణాలు బయటకు కనబడుతుంటాయి.

8 Dangerous Habits That Can Damage Your Liver

లివర్ ఏ కొద్దిపాటి ఆరోగ్యంగా ఉన్నా దాని పనితీరు మాత్రం కొనసాగుతుంటుంది. అయితే ఒక వైపు నుండి డ్యామేజ్ అవుతూ వస్తుంటుంది. చివర క్షణాల్లో మాత్రమే లక్షణాలను చూపెడుతుంది. లివర్ డిసీజ్ ను కనుగొన్న వెంటనే చికిత్స తీసుకోవడం చాలా మంచిది. ఆలస్యం చేసే కొద్ది లివర్ మరి కాస్త డ్యామేజ్ అవ్వడం ప్రారంభం అవుతుంది.కాలేయం ఆరోగ్యంగా ఉండాలంటే ఇక్కడ క్లిక్ చేయండి..

ఒక గొప్ప విషయమేంటంటే శరీరంలో ఏ అవయవం డ్యామేజ్ అయినా నయం చేసుకోవడం కుదరదు. అయితే లివర్ మాత్రం నయం చేసుకోవచ్చు. హెల్తీగా మార్చుకోవచ్చు. అందుకు ఎప్పుడూ హెల్తీ డైట్ ను ఫాలో అవ్వాలి. రెగ్యులర్ వ్యాయామం తప్పనిసరిగా చేయాలి. బాడీ వెయిట్ అండర్ కంట్రోల్లో ఉండాలి. ఆల్కహాల్ ఎక్కువగా తాగడం వల్ల లివర్ డ్యామేజ్ అవుతుంది. దీన్ని లివర్ సిర్రోసిస్ అని కూడా పిలుస్తారు.

కొన్ని రకాల మందులు మరియు టాక్సిన్స్ కూడా లివర్ హెల్త్ కు హాని కలిగిస్తాయి. సిగరెట్ తాగడం నిలిపేయాలి. ప్రతి రోజూ 8 గంటల నిద్ర తప్పనిసరిగా అవసరం అవుతుంది.

బ్యాడ్ హ్యాబిట్స్ కారణంగా లివర్ కోలుకోవడం కష్టం అవుతుంది. ఆకలి తగ్గిపోవడం, వికారం, వాంతులు ఇవి లివర్ డ్యామేజ్ కు సహజ లక్షణాలు. లివర్ డ్యామేజ్ కు కారణమయ్యే అటువంటి బ్యాడ్ హ్యాబిట్స్ గురించి మరింత వివరంగా తెలుసుకోండి..

ఆల్కలిజం

ఆల్కలిజం

ఆల్కహాల్ ఎక్కుగా తీసుకోవడం వల్ల శరీరంలో టాక్సిన్స్ ను తొలగించడం తగ్గిస్తుంది. దాంతో శరీరంలోపల ఇన్ఫ్లమేషన్ (పొట్ట వాపుకు)దారితీస్తుంది. ఫ్యాటీ లివర్ డిసీజ్ కు కారణమవుతుంది.

 ఓవర్ గా మెడిసిన్స్ వాడటం

ఓవర్ గా మెడిసిన్స్ వాడటం

మెడిసిన్స్ ను ఎక్కువగా ఉపయోగించడం వల్ల లివర్ కు హాని జరగుతుంది. దాంతో లివర్ ఫెయిల్యూర్ అవుతుంది. అసిటమినోఫెన్ ను ఎక్కువ డోస్ తీసుకోవడం వల్ల కాలేయం మీద దుష్ప్రభావం చూపుతుంది. ఇది డ్రగ్ స్టోర్ లో ప్రిస్క్రిప్షన్ లేకుండా అందుబాటులో ఉంటుంది. ఇలాంటి డ్రగ్స్ ను కంటిన్యువగ్ ఎక్కువ రోజులు తీసుకోవడం వల్ల లివర్ డ్యామేజ్ అవుతుంది.

స్మోకింగ్

స్మోకింగ్

సిగరెట్స్ లో ఉండే కెమికల్స్ లివర్ కు చేరడంతో పాటు ఆక్సిడేటివ్ స్ట్రెస్ కు కారణమవుతుంది. దాంతో ఫ్రీరాడికల్స్ ఉత్పత్తి పెరిగి లివర్ డ్యామేజ్ చేసే కణాలు పెరుగుతాయి. ఇది ఫైబరోసిస్ కు కారణం అవుతుంది.

అనారోగ్యకరమైన ఆహారం

అనారోగ్యకరమైన ఆహారం

రెగ్యులర్ డైట్ లో ఫ్యాట్ ఫుడ్స్ ను నివారించాలి. ఫ్రూట్స్ మరియు వెజిటేబుల్స్ ను ఎక్కువగా తీసుకోవాలి. బీటా కెరోటిన్, విటమిన్ సి, విటమిన్ ఇ, జింక్, సెలీనియం మినిరల్స్ అధికంగా ఉన్న ఆహారాలను ఎక్కువగా తీసుకోవడం వల్ల లివర్ హెల్త్ ఆరోగ్యంగా ఉంటుంది. ప్రొసెస్ చేసిన ఆహారాల్లో ఆడిటివ్, ఆర్టిఫిషియల్ స్వీట్నర్స్ అధికంగా ఉండటం వల్ల లివర్ హెల్త్ మీద దుష్ప్రభావం చూపుతుంది.

నిద్రలేమి

నిద్రలేమి

నిద్రించే సమయంలో శరీరంలో కాలేయం రిపేర్ అవ్వడానికి శరీరంలోని వ్యర్థాలను నెట్టివేయడానికి నిద్ర సహకరిస్తుంది. నిద్రలేమి వల్ల లివర్ మీద ఆక్సిడేటివ్ స్ట్రెస్ పెరుగుతుంది. కాబట్టి ఒక రోజుకు 8 గంటల నిద్ర తప్పనిసరిగా అవసరం అవుతుంది.

ఓబేసిటి మరియు న్యూట్రీషియన్

ఓబేసిటి మరియు న్యూట్రీషియన్

ఆహారపు అలవాట్లు కాలేయ ఆరోగ్యం మీద నేరుగా ప్రభావం చూపుతుంది. ఎక్కువగా కలుషిత ఆహారాలు, జంక్ ఫుడ్స్, ఫ్యాట్ ఫుడ్స్ తినడం వల్ల లివర్ పనితీరు మందగిస్తుంది. లివర్ లో ఫ్యాట్ చేరడం వల్ల ఇన్ఫ్లమేషన్, లివర్ డ్యామేజ్ జరుగుతుంది.

న్యూట్రీషియన్ సప్లిమెంట్ ఎక్కువగా తీసుకోవడం

న్యూట్రీషియన్ సప్లిమెంట్ ఎక్కువగా తీసుకోవడం

కొన్ని రకాల హెర్బ్స్, న్యూట్రీషియన్ సప్లిమెంట్ కాలేయానికి ఎక్కువగా హానికలిగిస్తుంది. విటమిన్ ఎ ఎక్కువగా తీసుకోవడం వల్ల లివర్ డ్యామేజ్ జరుగుతుంది.

వ్యాక్సినేషన్ తీసుకోకపోవడం వల్ల

వ్యాక్సినేషన్ తీసుకోకపోవడం వల్ల

లివర్ పాడవడానికి హెపటైటిస్ ఒక ముఖ్య కారణం. హెపటైటిస్ కు మీరు కనుక వ్యాక్సినేషన్ తీసుకోకపోతే , లివర్ హెల్త్ ప్రమాదంలో పడ్డట్లే..లివర్ హెల్త్ నార్మల్ బాడీ ఫంక్షన్స్ కు చాలా ముఖ్యం. కాబట్టి, లివర్ ఆరోగ్యంగా ఉండాలంటే, లివర్ హెల్త్ కు ఎక్కువ ప్రియారిటీ ఇవ్వాలి. హెల్తీ లైఫ్ స్టైల్ ను అనుసరించాలి. హెల్తీ హ్యాబిట్స్ కలిగి ఉండాలి.

English summary

8 Dangerous Habits That Can Damage Your Liver

Listed in this article are a few of the habits that can affect your liver and hence should be avoided. Check it out.
Story first published: Wednesday, May 24, 2017, 19:00 [IST]