కడుపు నొప్పిగా ఉన్నప్పుడు ఎట్టి పరిస్థితిలో చేయకూడని 8 పొరపాట్లు

Posted By:
Subscribe to Boldsky

అనారోగ్య సమస్యల్లో కడుపు నొప్పి ఒకటి. పుట్టిన బిడ్డ నుండి పండు ముసలి వారి వరకూ ఏ వయస్సు వారికైన వస్తుంది. కొంత మందిలో అకస్మాత్ గా కడుపు నొప్పి బాధిస్తుంటుంది. అసలు పొట్టలో ఏం జరుగుతుందో ఎవరికి తెలియదు. పొట్ట ఉదరంలో లేదా పొట్ట క్రింద బాగంలో ఇలా వివిధ రకాలగా కడుపు నొప్పి బాధిస్తుంది. ప్రతి ఒక్కరి జీవితంలో ఇటువంటి పరిస్థితిని ఎదుర్కొని ఉంటారు. అందులోనూ ఈ సమస్య అత్యంత సాధారణ సమస్య.

అసిడిక్ రిఫ్లెక్షన్ వల్ల వచ్చే కడుపునొప్పికి ఉపశమనం కలిగించే నేచురల్ రెమెడీస్

అజీర్తి, ఎసిడిటి, మనం తీసుకునే ఆహారాలు. స్పైసీ ఫుడ్స్,జంక్ ఫుడ్స్, ఆయిల్ ఫుడ్స్, ఫ్రెష్ గా ఉన్న ఆహారాలు కాకుండా చెడిపోయిన ఆహారాలు తినడం మొదలగునవి కడుపు నొప్పికి కారణమవుతాయి. సరైన సమయానికి భోజం చేయకపోవడం, పానీయాలు, కాలుష్యం ఇలా వివిధ రకాలుగా పొట్టనొప్పికి కారణమవుతాయి, పొట్టనొప్పికి కారణమేదైనా వెంటనే తగ్గించుకోవడం ఉత్తమం.

కడుపు నొప్పిగా ఉన్నప్పుడు ఎట్టి పరిస్థితిలో చేయకూడని 8 పొరపాట్లు

అయితే పొట్ట నొప్పి తగ్గించుకోవడానికి , ప్రారంభ దశలో హోం రెమెడీస్ ను ఉపయోగించుకోవడం, నేచురల్ ట్రీట్మెంట్ తీసుకోవడం మంచిది. అయితే కొన్ని సందర్భాల్లో హోం రెమెడీస్ మరియు సెల్ఫ్ ట్రీట్మెంట్స్ కూడా బెడిసికొడతాయి. దాంతో పరిస్థితి మరింత తీవ్రం అవుతుంది. అంతే కాదు, కడుపునొప్పే కదా అని నిర్లక్ష్యం చేస్తే పరిస్థితి మరింత ఎక్కువ అవుతుంది. కాబట్టి, కడుపు నొప్పిగా ఉన్నప్పుడు సహజంగా కొన్ని తప్పిదాలను చేస్తుంటారు. అలాంటి మిస్టేక్స్ చేయకుండా ముందు జాగ్రత్తలు తీసుకోవడం చాలా ముఖ్యం.

కడుపు నొప్పికి ఉపశనం కలిగించే ఉత్తమ హోం రెమెడీలు

కడుపు నొప్పికి అజీర్తి, ఎసిడిటి కారణమని నిర్లక్ష్యం చేస్తుంటారు. అయితే ఇలా సెడెన్ గా వచ్చే కడుపు నొప్పి కొన్ని సీరియస్ హెల్త్ కండీషన్స్ వల్ల కూడా వస్తుంది. కడుపు నొప్పి తక్కువగా ఉన్నా లేదా సివియర్ గా ఉన్నా అందుకు బలమైన కారణం ఏదో ఉంటుంది, కాబట్టి, మొదటి పొట్ట నొప్పికి కారణం కనుక్కోవడం చాలా అవసరం. కొన్ని హోం రెమెడీస్ నొప్పిని మరింత ఎక్కువ చేస్తాయి. అందువల్ల వాటి మీద అవగాహన కలిగి ఉండటం మంచిది. ఇవే కాకుండా పొట్ట నొప్పిగా ఉన్నప్పుడు కొన్ని డేంజరెస్ మిస్టేక్స్ చేస్తుంటారు. అలాంటి మిస్టేక్స్ ఏంటో ఒక్కసారి తెలుసుకుందాం..

 సెల్ఫ్ మెడికేషన్

సెల్ఫ్ మెడికేషన్

పొట్ట నొప్పికి ఎట్టి పరిస్థితిలో సెల్ఫ్ మెడికేషన్ తీసుకోకూడదు. అందుకు హోం రెమెడీస్ ఉత్తమం. అయితే , పొట్టనొప్పికి అసలు కారణం తెలుసుకోకుండా హోం రెమెడీస్ తో ట్రీట్ చేయడం వల్ల పరిస్థితి మరింత తీవ్రం అవుతుంది. . కాబట్టి పొట్టనొప్పికి అసలైన కారణాన్ని డాక్టర్ ద్వార తెలుసుకున్న తర్వాత హోం రెమెడీస్ ను ట్రై చేయండి.

 డాక్టర్ ను కలవాడాన్ని వాయిదా వేస్తుండటం

డాక్టర్ ను కలవాడాన్ని వాయిదా వేస్తుండటం

చాలా వరకూ పొట్ట నొప్పి, తలనొప్పికి చాలా సహజ లక్షణాలు కనబడుతాయి. లక్షణాలు ఎప్పుడూ ఒకే రకంగా ఉండటం వల్ల నిర్లక్ష్యం చేస్తుంది. అయితే కడుపు నొప్పి వచ్చే తీవ్రతను బట్టి వెంటనే డాక్టర్ ను సంప్రదించడం వల్ల సమస్యను త్వరగా పరిష్కరించుకోవచ్చు

ట్రీట్మెంట్ కే పరిమితి కాకూడదు:

ట్రీట్మెంట్ కే పరిమితి కాకూడదు:

కడుపు నొప్పిగా ఉన్నప్పుడు ఉపయోగించే యాంటీబయోటిక్స్, నొప్పి తగ్గగానే ఆపేస్తుంటారు. ఈ పొరపాటును ఎట్టి పరిస్థితిలో చేయకూడదు. పొట్ట నొప్పికి సూచించే యాంటీ బయోటిక్స్ ట్రీట్మెంట్ కోర్స్ పూర్తి అయ్యే వరకూ యాంటీబయోటిక్స్ కు తీసుకోవాలి

సరిగా భోజనం చేయకపోవడం

సరిగా భోజనం చేయకపోవడం

కడుపు నొప్పిగా ఉన్నప్పుడు ఆహారం తీసుకోకుండా ఉండకూడదు. సరిగా ఆహారం తీసుకోకపోవడం వల్ల ఎసిడిటి అనే మరో సమస్య వచ్చిపడుతుంది. దాంతో హార్ట్ బర్న్, కడుపుబ్బరం వంటి సమస్యలు తోడవుతాయి. కాబట్టి , పొట్ట నొప్పిగా ఉన్నా సరిగే తేలికగా జీర్ణమయ్యే ఆహారాలను తీసుకోవడం ఉత్తమం.

ఎక్కువ మోతాదులో తీసుకోకపోవడం మంచిది

ఎక్కువ మోతాదులో తీసుకోకపోవడం మంచిది

ఏదైనా ఇన్ఫెక్షన్ కారణంగా పొట్ట నొప్పిగా ఉన్నప్పుడు, కొద్ది సమయం ఆ ఇన్ఫెక్షన్ తో పోరాడే సమయాన్ని పొట్టకు కల్పించాలి. అంటే జీర్ణమవ్వడానికి కష్టంగా ఉండే ఆహారాలను తీసుకోకూడదు. తీసుకున్న ఆహారం తేలిక జీర్ణమవ్వాలి. తక్కువగా తీసుకోవాలి. కడుపు నొప్పిగా ఉన్నప్పుడు ఆయిల్ ఫుడస్, స్పైసీ ఫుడ్స్ తినకూడదు. వీటిని తినడం వల్ల అవి జీర్ణమవ్వడానికి ఎక్స్ ట్రా ఎనర్జీ అవసరం అవుతుంది.

ఎక్కువ విశ్రాంతి తీసుకోవాలి

ఎక్కువ విశ్రాంతి తీసుకోవాలి

పొట్ట నొప్పికి ఇన్ఫెక్షన్స్ కారణమైతే, అందుకు మీ శరీరానికి ఎక్స్ ట్రా ఎనర్జీ అవసరం అవుతుంది. . కాబట్టి, ఇన్ఫెక్షన్స్ కారణంగా పొట్ట నొప్పి వస్తున్నట్లైతే కొద్దిగా ఎక్కువ సమయం రెస్ట్ తీసుకోవడం ఉత్తమం.

పొట్ట గురించి మాత్రమే జాగ్రత్తలు తీసుకోవడం:

పొట్ట గురించి మాత్రమే జాగ్రత్తలు తీసుకోవడం:

పొట్ట ఉదరంలో నొప్పి వస్తే అది పొట్ట నొప్పిగా భావించకూడదు. పొట్ట ఉదరంలో లేదా పొట్ట సైడ్స్ లో నొప్పిగా ఉన్నట్లైతే అది ఇతర అవయవాలకు సంబంధించి కూడా నొప్పి కలిగించవచ్చు. కిడ్నీ స్టోన్స్, ఎండో మెట్రీయాసిస్, హెపటోమెగాలి, అపెండిసైటిస్ మరియు ప్రేగుల్లో యాంటీబ్యాక్టీరియల్ డిఫార్మటీస్ వంటి కారణాల వల్ల కూడా పొట్టనొప్పికి కారణమవుతుంది. కాబట్టి, పొట్టనొప్పి అని మీరంతట మీరే ఊహించుకోకూడుదు .

పాలు తాగడం మంచిది కాదు

పాలు తాగడం మంచిది కాదు

పొట్ట నొప్పిగా ఉన్నప్పుడు పాలు తాగితే సరిపోతుంది అనుకుంటారు. ఇది మరో పెద్ద తప్పు. కడుపు నొప్పిగా ఉన్నప్పుడు పాలు తాగడం వల్ల పొట్ట నొప్పి మరింత తీవ్రమౌతుంది. ముఖ్యంగా ఎసిడిటి మరింత పెరుగుతుంది. కాబట్టి, పొట్ట నొప్పిగా ఉన్నప్పుడు ఎట్టి పరిస్థితిలో పాలు తాగకూడదు.

English summary

8 Mistakes You Need To Avoid When You Have Stomach Pain

8 Mistakes You Need To Avoid When You Have Stomach Pain,Whether you experience a stomach pain which is mild or a hurting one, there will be a reason behind it. Finding out the cause and treating it at the earliest is very important. The interesting thing is that some of your remedy measures can actually incr
Story first published: Monday, June 5, 2017, 14:09 [IST]
Subscribe Newsletter