ఆహా..! లవంగం టీ నరనరానికి ఆరోగ్య శక్తిని అందిస్తుంది..!

Posted By:
Subscribe to Boldsky

కాఫీ , టీలు లేకపోతే కొందరికి రోజు గడవదు. తలనొప్పిగా ఉన్నా, ఒత్తిడి నుండి రిలాక్స్ అవ్వాలన్నా మొదట ఆశ్రయించేది వీటినే. ప్రత్యేకించి తేనీరు విషయానికొస్తే దీని వల్ల ఆరోగ్యానికి కొన్ని ప్రయోజనాలు చేకూరతాయని వివిధ అధ్యయనాల్లో వెల్లడైంది.

వెల్లుల్లిని పరగడుపుతోనే ఎందుకు తినాలి? ఆరోగ్య రహస్యాలేంటి...

అందులోనూ కొన్ని మూలికలతో తయారుచేసిన తేనీరు ఎన్నో రకాల సమస్యలకు పరిష్కారం చూపిస్తుంది. అందుకే చాలా మంది సాధారణ టీతో పాటు అల్లం టీ, గ్రీన్ టీ, బ్లాక్ టీ..అంటూ వివిధ రకాల టీలు తాగుతుంటారు. అయితే లవంగంతో తయారుచేసిన తేనీరు మీరెప్పుడైనా తాగారా? ఇది కూడా ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తుందని ఆరోగ్య నిపుణులు సూచిస్తున్నారు..

తులసి సర్వరోగ నివారిణి

లవంగం టీ తాగడం వల్ల పొందే ప్రయోజనాలేంటో తెలుసుకుందాం..

దంత ఆరోగ్యానికి :

దంత ఆరోగ్యానికి :

దంతాల్లో నొప్పి, చిగుళ్లలో వాపు..వంటి సమస్యలకు లవంగం నూనె, లవంగాలు..వంటివి బాగా ఉపయోగపతాయన్న విషయం మనకు తెలిసిందే. అయితే వీటితో పాటు లవంగంతో తయారుచేసిన టీ కూడా ఈ సమస్యల నుంచి తక్షణ ఉపశమనం కలిగిస్తుంది. లవంగం టీని కొద్దిగా నోట్లో పోసుకుని, పుక్కలించి ఉమ్మేయాలి. ఇలా చేయడం వల్ల తర్వగా ఉపశమనం పొందుతారు. యాంటీ ఇన్ఫ్లమేటీర గుణాలు బ్యాక్టీరియాను తొలగించి, చిగుళ్ల వాపును తగ్గిస్తాయి .

జ్వరం:

జ్వరం:

జ్వరం వచ్చినప్పుడు మందులషాపు నుండి ఏదో ఒక పిల్స్ తెచ్చి మింగ్రే వారు చాల మందే ఉంటారు. వాటి వల్ల సైడ్ ఎఫెక్ట్స్ ఉంటాయి. అందుకు నేచురల్ గా మనమే ఇంట్లో తయారుచేసుకునే లవంగం టీని రోజులో రెండు మూడు సార్లు తక్కువ మోతాదులో తీసుకుంటే జ్వరం నుండి త్వరగా ఉపశమనం పొందవచ్చు. లవంగం టీలో విటిమన్ ఇ, కెలతో పాటు యాంటీ ఇన్ఫ్లమేటరీ గుణాల వల్ల శరీర ఉష్ణోగ్రతను వేగంగా తగ్గిస్తుంది.

వ్యాధినిరోధక శక్తిని పెంచుతుంది:

వ్యాధినిరోధక శక్తిని పెంచుతుంది:

జలుబు, ఫ్లూ ఉన్నవారు లవంగం టీని రెగ్యులర్ గా తాగడం వల్ల ఫ్లూ, జలుబు నుండి తక్షణ ఉపశమనం పొందుతారు. లవంగం టీలో వ్యాధినిరోక శక్తిని అందించే గుణాలు పుష్కలంగా ఉండటం వల్ల సైనస్ తో బాధపడే వారికి త్వరిత ఉపశమనం కలిగిస్తుంది.

అజీర్తిని తగ్గిస్తుంది:

అజీర్తిని తగ్గిస్తుంది:

కొంత మంది ఏం తిన్నా..తిన్నది అరగక ఇబ్బంది పడుతుంటారు. వయస్సుతో పాటు కొన్ని అనారోగ్య సమస్యల కారణంగా అజీర్తి సమస్యలను ఎదుర్కుంటుంటారు. ఇలాంటి వారు భోజనం చేయడానికి ముందు లవంగం టీ తాగడం వల్ల మంచి ఫలితం కనబడుతుంది. లవంగం టీ తాగడం వల్ల శరీరంలో బ్లడ్ సర్క్యులేషన్ మెరుగుపడి, సాల్వియాను ఉత్పత్తి చేస్తుంది. దాంతో తిన్న ఆహారం త్వరగా జీర్ణం అవుతుంది. అలాగే ఎసిడిటి, కడుపు నొప్పి కూడా తగ్గిస్తుంది.

నొప్పులు మాయం చేస్తుంది:

నొప్పులు మాయం చేస్తుంది:

లవంగంతో బాడీ పెయిన్స్ కూడా తగ్గించుకోవచ్చు. అదెలాగంటే లవంగం టీని ఐస్ ట్రేలో నింపి కొద్ది సేపటి తర్వాత లవంగం టీ ఐస్ క్యూబ్స్ లా తయారవుతాయి. వీటిని తీ నొప్పి ఉన్న చోట మర్దన చేయడం వల్ల కండరాల నొప్పులు, వాపులు, కీళ్ల నొప్పులు తగ్గుతాయి.

చర్మ ఆరోగ్యానికి :

చర్మ ఆరోగ్యానికి :

వాతావరణంలోని దుమ్ము, ధూళి వల్ల రోజురోజుకీ చర్మ ఆరోగ్యం దెబ్బతింటోంది. ఫలితంగా చర్మంపై దద్దుర్లు, మచ్చలు, కురుపులు, గాయాలు, వంటివి ఏర్పడతాయి. మరి వీటన్నింటి నుంచి బయటపడేసే శక్తి లవంగం టీలోని యాంటీసెప్టిక్ గుణాలకు ఉంది. కాబట్టి సమస్య ఉన్న చోట వీటిని అప్లై చేసి కాసేపు సాప్ట్ గా మర్దన చేస్తే సరి. చర్మంపై ఉండే బ్యాక్టీరియా, ఇతర విషపదార్థాలు వంటివన్నీ బయటకి వెళ్లిపోయి, చర్మం ఆరోగ్యంగా ఉంటుంది.

లవంగం టీ తయారీ:

లవంగం టీ తయారీ:

కావల్సిన పదార్థాలు:

లవంగాలు: 1స్పూన్

నీళ్ళు: ఒక గ్లాసు,

తేనె

తయారుచేయు విధానం:

తయారుచేయు విధానం:

ముందుగా ఒక పాత్ర తీసుకుని అందులో నీళ్ళు పోసి మరిగించాలి. తర్వాత లవంగాల పొడి వేసి 10 నిముషాలు బాగా మరిగించాలి. స్ట్రాంగ్ గా ఉండాలని కోరుకునే వారు 20 నిముషాలు ఉడికించుకోవాలి. తర్వాత స్టౌ ఆఫ్ చేసి, వడగట్టి , అందులో రుచికి సరిపడా పంచదార లేదా తేనె మిక్స్ చేసి తాగితే సరిపోతుంది. ఇంకా ఇతర ఫ్లేవర్ కోరుకునే వారు, పుదీనా, తులసి వంటి ఆకులను లవంగం పొడి ఉడికించేటప్పుడు వేసుకోవచ్చు. చక్కటి రుచితో పాటు కాస్త ఘాటుగా కూడా ఉండే లవంగం టీ ఆరోగ్యానికి ఎంతో మంచిది.

సూచన :

సూచన :

లవంగం టీ ఆరోగ్యానికి మంచిది కదా అని పదే పదే ఈ టీని తాగడం వల్ల లవంగాలు ఎక్కువగా తినడం వల్ల అలర్జీ ఇతర దుష్ప్రభావాలు తప్పవని అధ్యనాలు హెచ్చరిస్తున్నాయి కొన్ని అధ్యనాలు. అలాగే కిడ్నీ, లివర్ సమస్యలున్నవారి వీటి జోలికి పోకపపోవడమే ఉత్తమం. ముందుగా ఈ టీ మీ శరీరానికి సరిపడుతుందా లేదా ఇది తాగితే ఏదైనా అలర్జీ వస్తుందా గమనించడం ఉత్తమం.

English summary

9 interesting reasons to try clove tea!

7 interesting reasons to try clove tea! ,Right from rejuvenating your senses to acting as a natural sanitizer, clove tea has many hidden health benefits. Tea is an indispensable part of our lives and sipping on a hot cup of tea is enough to kick-start the day. However, if you are bored with the usual green te