ఆరోగ్యానికి, అందానికి ఎలాంటి హాని చెయ్యని,ఇంట్లో తయారుచేసుకునే హోలీ కలర్స్

Posted By:
Subscribe to Boldsky

మరో రెండు రోజుల్లో హోలీ పండుగ రానుంది. సగటు మెట్రో నివాసి జీవితాన్ని ఉత్సాహంగా సప్తవర్ణాల శోభను అద్దేందుకు రంగుల కేళీ హోలీ వచ్చేసింది. సప్తవర్ణ శోభితమైన హోలీకి స్వాగతం చెప్పడానికి నగర వాసులు కూడా హుషారుగా సన్నద్ధమయ్యారు. అయితే హోలీ రోజున కొన్ని జాగ్రత్తలు తీసుకోక తప్పదని చర్మ నిపుణులు సూచిస్తున్నారు. రసాయన రంగులను కాకుండా సహజసిద్ధమైన రంగులతో హోలీ ఆడడం ద్వారా చర్మానికి హాని జరక్కుండా చూసుకోవాలని చెబుతున్నారు.

Allergic To Colours? Prepare These Organic & Natural Holi Colours At Home

సాధారణంగా హోలీ ఆడిన తర్వాత చాలా మందిని ఇబ్బంది పెట్టేది చర్మ సమస్యలు. ఇందుకు కారణం రంగుల్లో ఎక్కువ మోతాదులో రసాయన పదార్థాలు కలిసి ఉండడమే. ఈ తరహా రంగులు శరీరంపై ఎక్కువ సేపు ఉంటే చర్మ సంబంధ సమస్యలు తలెత్తుతాయని వైద్యులు చెబుతున్నారు. ఇక ఈ తరహా రంగులు పొరపాటున పడితే కళ్లకు చాలా ప్రమాదం కూడా. అందుకే హోలీ ఆడే సమయంలో మనం ఎంచుకునే రంగుల విషయంలో చాలా జాగ్రత్తగా వ్యవహరించాలి.

వీలైనంత వరకు రసాయనాలు కలిపిన రంగులకు దూరంగా ఉండాలని వైద్యులు సూచిస్తున్నారు. వీటికి బదులు సహజసిద్ధంగా తయారైన రంగులను హోలీ కోసం ఎంచుకోవాలని స్కిన్ స్పెషలిస్ట్ సుహానా తెలిపారు. 'రసాయన రంగులకు బదులు హెన్నా(గోరింటాకు పొడి), పసుపు, కుంకుమ, చందనం, టమాట గింజలతో తయారైన పొడి ఇలా సహజసిద్ధ రంగులను హోలీలో ఆడడం వల్ల చర్మానికి ఎటువంటి ఇబ్బంది ఉండదు. అంతేకాదు చర్మ సంబంధ వ్యాధుల నుంచి కూడా ఇవి రక్షణ కల్పిస్తాయి. వీటితో పాటు మరికొన్ని సహజ రంగులను నేచురల్ గా ఇంట్లోనే ఎలా తయారుచేసుకోవాలో తెలుసుకుందాం..

ఆమ్లా:

ఆమ్లా:

నేచురల్ కలర్ ను ఎంపిక చేసుకోవడం చాలా సింపుల్. ఎండిన ఆమ్లా ముక్కలను ఐరన్ వెజల్లో వేసి బాయిల్ నీళ్లు పోసి బాయిల్ చేయాలి. బాయిత్ చేసిన నీటిని రాత్రంతా అలాగే ఉంచాలి. మరుసటి రోజు ఉదయం ఈ ఆమ్లా వాటర్ ను ప్లెయిన్ వాటర్ తో మిక్స్ చేస్తే చాలు మీకు నచ్చిన గ్రీన్ కలర్ హోలీ రంగు రెడీ. ఇదే విధంగా బ్లాక్ లేదా రెడ్ లేదా గ్రీన్ గ్రేప్స్ తో కూడా తయారుచేసుకోవచ్చు.

కుంకుమపువ్వు :

కుంకుమపువ్వు :

ఒక చిన్న బౌల్లో కుంకుమ పువ్వు తీసుకుని , అందులో వాటర్ మిక్స్ చేసి, కొన్ని గంటల పాటు అలాగే వదిలేయాలి. తర్వాత కుంకుమవ్వును వడగట్టుకుని, మెత్తగా పేస్ట్ చేసుకోవాలి. ఈ పేస్ట్ ను వాటర్ తో మిక్స్ చేసి ఆరెంజ్ రెడ్ మిక్స్ అమేజింగ్ హోలీ కలర్ రెడీ. హోలీ సెలబ్రేషన్ కు ఇది ఒక బెస్ట్ నేచురల్ కలర్ .

బీట్ రూట్ :

బీట్ రూట్ :

బీట్ రూట్ ను తొక్క తీసి, చిన్న ముక్కలుగా కట్ చేసి, వాటర్ లో మిక్స్ చేయాలి. నీళ్లలో వేసి బాయిల్ చేసినా కూడా మంచిదే. మంచి రంగు వస్తుంది. ఈ వాటర్ ను ప్లెయిన్ వాటర్ తో మిక్స్ చేస్తే నేచురల్ హోలీ రంగు నీళ్లు సిద్దం.

మందారం పువ్వుతో :

మందారం పువ్వుతో :

నేచురల్ గా రెడ్ కలర్ వాటర్ ను పొందడానికి రెండు అద్భుత మార్గాలున్నాయి, రెండు ఎర్రని మందారం పువ్వులను తీసుకుని ,నీళ్లలో వేసి రాత్రంతా అలాగే ఉంచాలి. తర్వాత రెండు టీస్పూన్ల రెడ్ సాండిల్ ఉడ్ పౌడర్ తీసుకుని, మందారం పూలతో పాటు చేర్చి బాయిల్ చేయాలి. తర్వాత ఈ మిశ్రమాన్ని ప్లెయిన్ వాటర్ తో మిక్స్ చేసి ఉపయోగించుకోవచ్చు.

 పసుపు:

పసుపు:

నేచురల్ ఎల్లో కలర్ వాటర్ ను పసుపుతో తయారుచేసుకోవచ్చు. రెండు టీస్పూన్ల పసుపును,5 టీస్పూన్ల వెనగపిండితో మిక్స్ చేసి, నీళ్లలో కలిపితే అద్భుతమైన డార్క్ ఎల్లో కలర్ వాటర్ రెడీ. ఈ సింపుల్ రెమెడీతో హోలీ సెలబ్రేషన్ కు సిద్దం అవ్వడమే.

మెహిందీ పౌడర్ :

మెహిందీ పౌడర్ :

రెండు మూడు చెంచాలా మెహిందీ పౌడర్ తీసుకుని, వాటర్ తో మిక్స్ చేయాలి. బాగా మిక్స్ చేసిన తరవ్ాత రెండు మూడు గంటలు అలాగే ఉంచాలి. ఇలా ఉంచడం వల్ల వాటర్ మరింత డార్క్ గ్రీన్ కలర్ లో మారుతుంది. లేదా ఫ్రెష్ గా ఉండే గొంటాకు ఆకులను మెత్తగా పేస్ట్ చేసి వాటర్ తో మిక్స్ చేసినా మంచి ఫలితం ఉంటుంది.

బెర్రీస్ :

బెర్రీస్ :

బెర్రీస్ తో ఆర్గానిక్ బ్లూ కలర్ ను పొందవచ్చు. బెర్రీస్ ను పొడి మెత్తగా పేస్ట్ చేయాలి.తర్వాత ఈ పేస్ట్ ను వాటర్ తో మిక్స్ చేస్తే చాలా నేచురల్ బ్లూ హోలీ కలర్ రెడీ..

English summary

Allergic To Colours? Prepare These Organic & Natural Holi Colours At Home

The festival of colours is here, the most awaited one. Holi is one festival that is celebrated all across India by people of all castes and creed. But if you are one among the lot who wants to play but is scared of the chemicals present in the colours as you are allergic to them, then we have a solution for you.
Story first published: Saturday, March 11, 2017, 15:51 [IST]
Please Wait while comments are loading...
Subscribe Newsletter