For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

  మ్యాజికల్ ప్లాంట్ : కలబందలో దిమ్మదిరిగే ఆరోగ్య ప్రయోజనాలున్నాయన్న విషయం మీకు తెలుసా?

  By Mallikarjuna
  |

  మలబద్దకం నుండి చేతికి కాలిన గాయాల వరకూ వెంటనే ఉపశమనం కలిగించే ఒకే ఒక ఔషధం కలబంద. కలబందలో అద్భుతమైన ఔషధ గుణాలున్నాయి. అందుకే పురాతన కాలం నుండి దీని వాడకం ఎక్కువ. ప్రతి ఇంట్లోనే కనిపించే ఔషధ మొక్కల్లో కలబంద ఒకటి. కలబంద ఆకు నుండి తీసిన రసం తాగడం వల్ల ఎలాంటి రుచి అనిపించదు కానీ, సింపుల్ గా అలోవెర జ్యూస్ తాగడం వల్ల మలమద్దక సమస్య తగ్గుతుంది.

  అంతే కాదు, కలబందలో దిమ్మదిరిగే ఆరోగ్య ప్రయోజనాలున్నాయన్న విషయం గురించే ఈ రోజు మీతో షేర్ చేసుకోబోతున్నాము. అవేంటో మీరు కూడా తెలుసుకుండి మరి....

  #1 అలోవెర పవర్ ఫుల్ యాంటీఆక్సిడెంట్

  #1 అలోవెర పవర్ ఫుల్ యాంటీఆక్సిడెంట్

  అలోవెర (కలబంద)లో విటమిన్స్, మినిరల్స్, ఔషధగుణాలు పుష్కలంగా ఉన్నాయి. ముఖ్యంగా ఫాలీఫినాయల్ అనే కాంపౌండ్ మాత్రం చాలా స్ట్రాంగ్ యాంటీఇక్సిడెంట్ లక్షణాలను కలిగి ఉన్నాయి. ఇవి మనిషిలో అనేక వ్యాధులను నివారించడానికి సహాయపడుతాయి.

  #2 కాలిన గాయాలను మాన్పుతుంది

  #2 కాలిన గాయాలను మాన్పుతుంది

  కాలిన చిన్న గాయాల నుండి సెండ్ డిగ్రి బర్న్ వరకూ నయం చేయడంలో కలబంద గ్రేట్ రెమెడీ. కలబందను కాలిన గాయాల మీద అప్లై చేయడం వల్ల చాలా త్వరగా నయం అవుతుంది. చర్మం తిరిగి పునరిద్దరింపబడుతుంది. ఫాస్ట్ రిలీఫ్ దొరుకుతుంది.

  వాస్తవానికి , అలోవెర జెల్ ను రెగ్యులర్ గా కాలిన గాయాల మీద అప్లై చేస్తుంటే 9 రోజులలోపు తప్పకుండా మంచి ఫలితం కనబడుతుంది. బర్న్ ఆయిట్మెంట్స్, ట్రీట్మెంట్స్ తో పోల్చితే ఇది చాలా గ్రేట్ .

  #3 దంత సమస్యలను నివారిస్తుంది

  #3 దంత సమస్యలను నివారిస్తుంది

  పాచి, దంతాల మద్య బయోఫిల్మ్ బ్యాక్టీరియా , చిగుళ్ళ సమస్యలన్నింటిని నివారించడంలో కలబంద సహాయపడుతుంది. ముఖ్యంగా చిగుళ్ళ ఇన్ఫ్లమేషన్ మరియు దంతక్షయాన్ని ఎఫెక్టివ్ గా నయం చేస్తుంది. దంత సమస్యలున్న 300 మందిపైన జరిపిన పరిశోధనలో 100శాతం అలోవెరజెల్ తో ఎఫెక్టివ్ గా నయం అయినట్లు కనుగొన్నారు. అందుకు కారణం అలోవెర జెల్లో ఉండే క్లోరాక్సిడైన్ , ఇది మౌత్ వాష్ లా పనిచేస్తుంది. అలోవెర జెల్ లో ఉండే యాంటీ బ్యాక్టీరియల్ గుణాలు, నోట్లో బ్యాక్టీరియా పెరగకుండా నివారిస్తుంది. ముఖ్యంగా చాలా వరకూ నోటి వ్యాధులను నివారించడంలో ఇది ఎఫెక్టివ్ గా పనిచేస్తుంది.

  #4 మౌత్ అల్సర్ ను త్వరగా నయం చేస్తుంది.

  #4 మౌత్ అల్సర్ ను త్వరగా నయం చేస్తుంది.

  మౌత్ అల్సర్ ముఖ్యంగా స్ట్రెస్ వల్ల మరియు డైటరీ డిఫిషియన్సీ వల్ల వచ్చే మౌత్ అల్సర్ ను నివారించే గుణాలు కలబందలో చాలా ఉన్నాయి. మౌత్ అల్సర్ బ్యాక్టీరియా దాదాపు 7 నుండి 10 రోజుల వరకు బాధిస్తుంది.

  ఈ పది రోజులలోపి చాలా బాధాకరంగా ఎలాంటి ఆహారాలు తీసుకోలేకుండా, నొప్పి, నోట్లో మంటను కలిగిస్తుంది. ఇటువంటి పరిస్థితిలో అలోవెర సహాయపడుతుంది. మౌత్ అల్సర్ వచ్చినప్పుడు అలోవెర జెల్ ను నోరు మొత్తం అప్లై చేయడం వల్ల త్వరగా నయం అవుతుంది. కలబందలో ఉండే కార్టికోస్టెరాయిడ్ అల్సర్ నివారించడంలో కన్వెషనల్ థెరఫీలాగా పనిచేస్తుంది. ఇది ఓవరాల్ హెల్త్ కు సహాయపడుతుంది. ఇది శరీరంలో వ్యాధినిరోధకత తగ్గిపోకుండా కాపాడుతుంది.

  #5 అలోవెర వ్యాక్స్ లో ల్యాక్సేటివ్స్ ఉన్నాయి

  #5 అలోవెర వ్యాక్స్ లో ల్యాక్సేటివ్స్ ఉన్నాయి

  అలోవెర జెల్లో ఉన్న ల్యాక్సేటివ్స్ మలబద్దకం నివారించడంలో చాలా సామర్థ్యం కలవి. అందులో ఎల్లో వ్యాక్సి వంటి చిట్కటి పదర్ధాన్ని తీసుకోవడం వల్ల మలబద్దకం నుండి త్వరగా ఉపశమనం కలుగుతుంది. ఎందుకంటే అలోవ్యాక్స్ లో అలోయిన్ అ లేదా బార్బలోయిన్ అనే పవర్ ఫుల్ ల్యాక్సేటివ్ ఏజెంట్ ఉంటుంది. డైజెస్టివ్ బెనిఫిట్స్ కలది అలోవెర కంటే మరొకటి ఉండదు.

  #6 ఇది ఫైన్ లైన్స్ మరియు ముడుతలను తగ్గిస్తుంది

  #6 ఇది ఫైన్ లైన్స్ మరియు ముడుతలను తగ్గిస్తుంది

  కలబందలో యాంటీ ఏజింగ్ లక్షణాలు అధికంగా ఉండటం వల్ల దీన్ని చర్మానికి అప్లై చేయడం వల్ల ఏజింగ్ లక్షణాలు కనబడకుండా పోతాయి. 90 రోజులు క్రమం తప్పకుండా రాస్తుంటే చర్మం స్మూత్ గా సపెల్ గా మారుతుంది. చర్మంలో కొల్లాజెన్ ఉత్పత్తిని పెంచుతుంది.

  అంతే కాకుండా ఇది చర్మానికి కావల్సిన తేమను అందిస్తుంది. దాంతో చర్మం పగలకుండా, పొడి బారకుండా ఉంటుంది.

  #7 టైప్ 2 డయాబెటిస్ కు ఇది ఒక సంప్రదాయ రెమెడీ.

  #7 టైప్ 2 డయాబెటిస్ కు ఇది ఒక సంప్రదాయ రెమెడీ.

  టైప్ 2 డయాబెటిస్ పేషంట్స్ రెగ్యులర్ గా అలోవెర జ్యూస్ తాగడం వల్ల, వారి శరీరంలో ఇన్సులిన్ సెన్సిటివిటి మెరుగుపడుతుంది. ఇంకా శరీరంలో రక్తంలో షుగర్ లెవల్స్ క్రమబద్దం అవుతాయి. అందుకే డయాబెటిక్ పేషంట్స్ కు అలోవెర న్యాచురల్ హోం రెమెడీ అని చెబుతారు. అయితే దీన్ని పరిమితికి మంచి తినకూడదు, అలా తీసుకున్నట్లైతే లివర్ డ్యామేజ్ అయ్యే అవకాశం ఉంటుంది

  #8 ఇది చుండ్రు మరియు ఇన్ఫ్లమేషన్ తగ్గిస్తుంది

  #8 ఇది చుండ్రు మరియు ఇన్ఫ్లమేషన్ తగ్గిస్తుంది

  అలోవెర జెల్లో విటమిన్స్ మరియు మినిరల్స్ అధికంగా ఉన్నాయి. ఇది తలలో చర్మానికి తగిన తేమను అందిస్తుంది, ఇన్ఫ్లమేసన్ మరియు చుండ్రు తగ్గిస్తుంది. ఇంకా మంచి కండీషనర్ గా కూడా పనిచేస్తుంది. జుట్టును స్మూత్ గా సిల్కీగా మార్చుతుంది

  English summary

  A Magical Plant: 8 Aloe Vera Benefits for Health

  Aloe vera is an easy-to-grow plant with large, fleshy green leaves that is known for the gel found within it. From constipation to burns, aloe gel is known to treat various human ailments because it is packed with medicinal compounds that have antioxidant, anti-diabetic, and regenerative properties.
  Story first published: Tuesday, December 12, 2017, 8:00 [IST]
  We use cookies to ensure that we give you the best experience on our website. This includes cookies from third party social media websites and ad networks. Such third party cookies may track your use on Boldsky sites for better rendering. Our partners use cookies to ensure we show you advertising that is relevant to you. If you continue without changing your settings, we'll assume that you are happy to receive all cookies on Boldsky website. However, you can change your cookie settings at any time. Learn more