బెండకాయని నానబెట్టిన నీళ్లను తీసుకోవడం వలన కలిగే 10 ఆరోగ్యప్రయోజనాలు

Posted By: Lalitha Lasya Peddada
Subscribe to Boldsky

బెండకాయని ఆంగ్లంలో లేడీస్ ఫింగర్ లేదా ఓక్రా అనంటారు. ఈ ఓక్రా గింజలు ఎంతో ఆరోగ్యకరం. అందువలన, ఈ గ్రీన్ వెజిటబుల్ ని ఆహారంలో భాగంగా చేసుకోవడం వలన ఎన్నో ఆరోగ్యప్రయోజనాలు పొందవచ్చు.

amazing benefits of drinking ladies finger-soaked water

ప్రపంచవ్యాప్తంగా వివిధ ప్రాంతాలలో బెండకాయని తమ ఆహారంలో భాగంగా చేసుకుని ఎంతో మంది అనేకమైన ఆరోగ్యప్రయోజనాలు పొందుతున్నారు. వివిధ రకాలుగా బెండకాయని ఆహారంలో భాగంగా చేసుకోవచ్చు. శరీరానికి అవసరమైన పోషకాలకి, విటమిన్లకి అలాగే మినరల్స్ కి ఈ బెండకాయ అద్భుతమైన నిలయంగా ఉంది.

బెండకాయని నానబెట్టిన నీళ్లను తీసుకోవడం వలన ఈ 10 ఆరోగ్యప్రయోజనాలను పొందవచ్చు.

#1 అనీమియాను అరికడుతుంది

#1 అనీమియాను అరికడుతుంది

అనీమియా అనే వ్యాధి వలన రక్తంలోని హిమోగ్లోబిన్ కౌంట్ ని కోల్పోతారు. ఓక్రా వాటర్ ను తీసుకుంటే రెడ్ బ్లడ్ సెల్స్ అనేవి పుష్కలంగా వృద్ధి చెందుతాయి. తద్వారా, శరీరంలోని తగినంత హిమోగ్లోబిన్ ఉత్పత్తి అవుతుంది. అలాగే, శరీరంలోని రక్త స్థాయిల క్రమబద్దీకరణకు కూడా ఓక్రా వాటర్ ఉపయోగపడుతుంది.

#2 గొంతునొప్పి, దగ్గులకు సహజసిద్ధమైన రెమెడీ

#2 గొంతునొప్పి, దగ్గులకు సహజసిద్ధమైన రెమెడీ

ఓక్రా వాటర్ అనేది దగ్గు, గొంతునొప్పులను తగ్గించేందుకు సమర్థవంతంగా ఉపయోగపడుతుంది. తరచూ, గొంతునొప్పి, గొంతులో దురదతో ఇబ్బంది పడే వారు ఓక్రా వాటర్ ని తీసుకోవడం ద్వారా ఉపశమనం పొందవచ్చు. ఓక్రాలో యాంటీ బాక్టీరియల్ ప్రాపర్టీలు అధికంగా ఉంటాయి. అందువలన, గొంతునొప్పిని తగ్గించేందుకు ఓక్రా వాటర్ తగిన ఔషధంగా పనిచేస్తుంది. అలాగే, ఇందులోనున్న యాంటీ సెప్టిక్ ప్రాపర్టీలు దగ్గు, గొంతునొప్పులను అరికట్టడంలో ప్రధాన పాత్ర పోషిస్తాయి.

#3 డయాబెటీస్ ను అరికడుతుంది

#3 డయాబెటీస్ ను అరికడుతుంది

ఈ మధ్యకాలంలో డయాబెటీస్ బారిన పడే వారి సంఖ్య గణనీయంగా పెరిగింది. వివిధ వయసుల వారిలో ఈ సమస్య విపరీతంగా పెరుగుతోంది. ఈ సమస్యకు సరైన సమయంలో పరిష్కారం వెతకకపోతే ప్రాణాంతకంగా మారుతుంది. ఓక్రాలో ఇన్సులిన్ వంటి ప్రాపర్టీలు కలవు. ఇవి డయాబెటీస్ ను నియంత్రించడానికి తోడ్పడతాయి. బెండకాయని నానబెట్టిన నీళ్లను తాగడం ద్వారా బ్లడ్ షుగర్ లెవల్స్ ని తగ్గించుకోవచ్చు. తద్వారా, డయాబెటిస్ అనేది నియంత్రణలో ఉంటుంది.

#4 అతిసారానికి అద్భుత ఔషధం

#4 అతిసారానికి అద్భుత ఔషధం

సరైన సమయంలో తగిన చికిత్స అందించకపోతే అతిసారం ప్రాణాంతకంగా మారుతుంది. అతిసారం వలన శరీరంలోంచి అధిక మొత్తంలో నీరు బయటికి పోతుంది. ఆ విధంగా శరీరం డీహైడ్రేటెడ్ గా మారుతుంది. ఓక్రాని నానబెట్టిన నీళ్లను త్రాగడం ద్వారా ఈ సమస్య నుంచి గట్టెక్కవచ్చు. కాబట్టి, మీరు అతిసారం నుంచి కోలుకునే వరకు గ్లాసుడు ఓక్రా నీళ్లను ప్రతి రోజూ తీసుకోండి.

#5 కొలెస్ట్రాల్ స్థాయిలను తగ్గిస్తుంది

#5 కొలెస్ట్రాల్ స్థాయిలను తగ్గిస్తుంది

బెండకాయ మొక్కలో కరగబడే ఫైబర్ అధికంగా ఉంటుంది. అందుకే, ఇది శరీరంలోని కొలెస్టరాల్ లెవల్ ని తగ్గించడానికి ఉపయోగపడుతుంది. శరీరంలోని కొలెస్టరాల్ స్థాయిలు అధికమయితే అనేకరకాల గుండె జబ్బులు కలుగుతాయి. తరచూ ఓక్రాని నానబెట్టిన నీటిని తీసుకుంటే శరీరంలోని కొలెస్ట్రాల్ స్థాయిలు నియంత్రణలో ఉంటాయి. ఆ విధంగా గుండె ఆరోగ్యాన్ని సంరక్షించుకోవచ్చు.

#6 మలబద్దకం నుంచి ఉపశమనం

#6 మలబద్దకం నుంచి ఉపశమనం

మలబద్దకం అనే సమస్య సాధారణంగా కనిపించినా సరైన పరిష్కారం కనుగొనకపొతే ఆరోగ్యాన్ని దెబ్బతీసే ప్రాణాంతకమైన సమస్యగా మారుతుంది. ఈ సమస్యకు సరైన సమయంలో పరిష్కారాలను చూసుకోవాలి. కరగబడే ఫైబర్ అనేది ఈ సమస్యకు అద్భుత పరిష్కారం. ఇది, బెండకాయలో పుష్కలంగా లభిస్తుంది. ఓక్రా వాటర్ అనేది సహజసిద్ధమైన లాక్సేటివ్ గా పనిచేసి బవుల్ మూవ్మెంట్స్ ని మెరుగుపరచి మలబద్దకం సమస్యకు పరిష్కారం చూపుతుంది.

#7 రోగనిరోధక శక్తిని మెరుగుపరుస్తుంది

#7 రోగనిరోధక శక్తిని మెరుగుపరుస్తుంది

రోగనిరోధక వ్యవస్థ పనితీరు బేషుగ్గా ఉంటే ఆరోగ్యసమస్యలనేవి దరిచేరవు. ఆరోగ్యంగా ఉండటానికి రోగనిరోధక వ్యవస్థ పనితీరు సవ్యంగా ఉండాలి. ఓక్రాలో ఈ వ్యవస్థను పటిష్టం చేసే అద్భుతమైన లక్షణాలు కలవు. అందుచేత, తరచూ జలుబూ దగ్గులు దరిచేరవు. ఓక్రాలో, అధికమొత్తంలో విటమిన్ సి కలదు. ఈ విటమిన్ వలన ఆరోగ్యసమస్యలు ఉత్పన్నం అవ్వవు.

#8 చర్మాన్ని ఆరోగ్యంగా ఉంచుతుంది

#8 చర్మాన్ని ఆరోగ్యంగా ఉంచుతుంది

మెరిసే చర్మం పొందాలంటే చర్మం ఆరోగ్యాన్ని కాపాడుకోవడం తప్పనిసరి. అలాగే, చర్మం ఆరోగ్యాన్ని సంరక్షించుకోవడం ద్వారా అనేక రకాలైన చర్మ సంబంధిత వ్యాధుల నుంచి రక్షణ పొందవచ్చు. ఓక్రాని తరచూ తీసుకోవడం ద్వారా చర్మం యొక్క ఆరోగ్యాన్ని కాపాడుకోవచ్చు. ఓక్రాలో పుష్కలంగా లభించే యాంటీ ఆక్సిడెంట్స్ రక్తాన్ని శుద్ధి చేయడానికి అలాగే రక్త ప్రసరణను మెరుగుపరచడానికి ఉపయోగపడతాయి. అలాగే, మొటిమల వంటి చర్మ సమస్యల నివారణకు కూడా ఓక్రా చక్కని ఔషధంగా పనిచేస్తుంది.

#9 ఆస్తమా దాడిని తగ్గిస్తుంది

#9 ఆస్తమా దాడిని తగ్గిస్తుంది

ఓక్రాలో ఆస్తమా దాడిని తగ్గించే అద్భుతమైన ఔషధ గుణాలు కలవు. ఆస్తమా అనేది ఎదో రకంగా అకస్మాత్తుగా దాడి చేయవచ్చు. కనీసం హెచ్చరిక కూడా లేకుండా ఆస్తమా దాడి జరగవచ్చు. అందువలన, చికిత్స కంటే నివారణ ముఖ్యమనే పెద్దలు చెప్పిన విషయాన్ని గుర్తుంచుకుని ఓక్రా జ్యూస్ ని తీసుకోవడం ద్వారా ఆరోగ్యాన్ని సంరక్షించుకోవచ్చు. ప్రతి రోజూ, ఓక్రా జ్యూస్ ని తీసుకోవడం ద్వారా ఆస్తమా ఎటాక్స్ ని అరికట్టవచ్చు.

#10 ఎముకలను దృఢపరుస్తుంది

#10 ఎముకలను దృఢపరుస్తుంది

ఎముకలను దృఢపరిచే శక్తి ఓక్రా వాటర్ కి కలదు. ఓక్రాలో లభించే ఫోలేట్ అనే పదార్ధం వలన గర్భిణీలు అనేకరకమైన ఆరోగ్యప్రయోజనాలు పొందవచ్చు. గర్భిణీలు ఓక్రాను తీసుకోవడం ద్వారా పుట్టబోయే బిడ్డ కూడా ఆరోగ్యంగా ఉంటుంది. ఎముకల సాంద్రతను పెంపొందిస్తూ ఎముకలకు సంబంధించిన ఓస్టియోపోరోసిస్ మరియు అర్త్రైటిస్ వంటి వ్యాధులను అరికట్టేందుకు ఓక్రా వాటర్ అత్యద్భుతంగా ఉపయోగపడుతుంది.

ఇవన్నీ బెండకాయను నానబెట్టిన నీళ్లను రోజుకి ఒక్కసారి తీసుకోవడం వలన కలిగే కొన్ని ఆరోగ్యప్రయోజనాలు. నిజానికి, బెండకాయ నీళ్లను తీసుకోవడం వలన కలిగే ప్రయోజనాలు అనేకం.

ఈ ఆర్టికల్ షేర్ చేయండి!

ఈ ఆర్టికల్ ని చదివి మీరు ఎంజాయ్ చేశారా అయితే ఈ ఆర్టికల్ ని మీ ప్రియమైన వారితో పంచుకోండి.

English summary

10 mind blowing and amazing benefits of drinking lady's finger-soaked water.

Okra is also known as lady's finger in English-speaking countries. The green pod found inside this vegetable is highly beneficial for the overall health of our body. Here are 10 amazing benefits of drinking lady's finger-soaked water.
Story first published: Sunday, December 31, 2017, 12:00 [IST]