బొల్లి..(తెల్ల మచ్చలు) ఇలా చేస్తే వెళ్లిపోతుంది !

By: Y.Bharat Kumar Reddy
Subscribe to Boldsky

బొల్లి అనేది హానికరమైన సమస్య కాదు. ఇది అంటువ్యాధి కూడా కాదు. కానీ ఈ వ్యాధి వస్తే కాస్త కుంగిపోతారు. ద గ్రేట్ డ్యాన్సర్ మైఖేల్ జాక్సన్ లాంటి వారు కూడా బొల్లి బారిన పడ్డారు. దానివల్లే అతని చర్మం మొత్తం తెల్లగా మారిపోయింది. ఇక బొల్లి వచ్చిందటే చర్మం అంతా పూర్తిగా తెల్లగా మారిపోతుంది.

అసలు బొల్లి అంటే ఏమిటి ఒకసారి తెలుసుకుందామా. బొల్లి అనేది చర్మానికి సంబంధించిన వ్యాధి. మన శరీరంలోని పిగ్మెంట్ అనే రంగునిచ్చే పదార్థం వల్ల మేనిఛాయ వస్తుంది. పిగ్నెంట్ ను మెలనిన్ అని కూడా అంటారు. దీన్ని ఉత్పత్తి చేసే మెలనోసైట్స్‌ కణాలు పనిచేయకపోతే రంగు ఏర్పడదు. మన రోగనిరోధక శక్తి పొరపాటున మెలనోసైట్స్‌ కణాల మీద దాడి చేయటం వల్ల బొల్లి వచ్చే అవకాశం ఉంది.

10 Amazingly Effective Home Remedies To Treat Leucoderma

అలాగే మెలనోసైట్స్‌ వాటంతటవే దెబ్బతినటం వల్ల కూడా రావొచ్చు. దీంతో చర్మం రంగును కోల్పోయి తెల్లగా మారుతుంది. ఇంగ్లిష్‌లో దీన్ని విటిలిగో అంటారు. వైద్య పరిభాషలో ల్యూకోడెర్మా అంటారు. మచ్చలకు తోడుగా విటిలిగో ఉన్నవారికి ఆ తెల్లప్రదేశంలో ఉండే వెంట్రుకలు తెల్లగా మారిపోతాయి. ఇది శరీరంలో ఎక్కడైనా రావొచ్చు. ప్రారంభ దశలో కొద్ది మేర మొదలయ్యే ఈ తెల్లమచ్చలు క్రమంగా పెద్దవిగా మారి శరీరమంతా వ్యాపిస్తాయి.

1. పసుపు ఆవాల నూనె పేస్ట్

1. పసుపు ఆవాల నూనె పేస్ట్

బొల్లి నివారకు ఉపయోగించే వాటిలో ప్రముఖమైనది పసుపు. ఒక టీ స్పూన్ పసుపు పొడి, రెండు స్పూన్ల ఆవ నూనె తీసుకోండి. ఈ రెండింటిని బాగా కలపండి. తర్వాత ఎక్కడెక్కడైతే మచ్చలుంటాయో ఆ ప్రాంతంలో మీరు తయారు చేసుకున్న పేస్ట్ ను పూయండి. 15 నిమిషాల పాటు దాన్ని అలాగే ఉంచండి. తర్వాత దాన్ని కడిగేయండి. రోజుకు రెండుసార్లు ఈ పేస్ట్ ని మచ్చలున్నచోట పూయడం వల్ల కాస్త ఫలితం కనిపిస్తుంది.

2. వేప ఆకులు, తేనెతో కలిపిన జ్యూస్

2. వేప ఆకులు, తేనెతో కలిపిన జ్యూస్

ఇది ఈ వ్యాధి నివారణలో కాస్త బాగా పని చేస్తుంది. ఇందుకోసం వేప ఆకులు బాగా దంచి మెత్తగా చేయాలి. వాటి రసాన్ని తీసుకోవాలి. రెండు స్పూన్ల వేప రసంలో ఒక స్పూన్ తేనె కలపండి. వాటిని బాగా కలపండి. తర్వాత దాన్ని తాగండి. ఇది కాస్త చేదుగా ఉన్నప్పటికీ మంచి ఫలితాలను ఇస్తుంది.

3. బకూచి పేస్ట్

3. బకూచి పేస్ట్

బొల్లి వైద్యానికి బకూచి బాగా పని చేస్తుంది. బకూచికి వెనిగర్ ని కలిపి దాన్ని తెల్ల మచ్చలపై పూయండి. దీనివల్ల కూడా మంచి ప్రయోజనాలంటాయి.

4. అల్లం జ్యూస్

4. అల్లం జ్యూస్

ముందుగా అల్లం, నీటిని తీసుకోండి. అల్లాన్ని మెత్తగా చేసుకుని దాని నుంచి రసం తీసుకోండి. దాన్ని నీళ్లలో కలుపుకోని తాగండి. ఇలా రోజుకు రెండు సార్లు చేయండి. మంచి ఫలితం ఉంటుంది.

5. పెప్పర్, నెయ్యి

5. పెప్పర్, నెయ్యి

ఇది కూడా మంచి గృహ చికిత్స. 10 గ్రాముల నెయ్యి తీసుకోండి. అందులో 10 మిరియాలు వేసి వేడి చేయండి. నెయ్యిలో మిరియాలను పక్కకు తీసివేయండి. ఇక ఈ నెయ్యిని మీ రోజువారీ ఆహారంలో కూడా ఉపయోగించవచ్చు. ఈ నెయ్యిని రెగ్యులర్ గా తీసుకోవడం వల్ల రక్తం శుద్ధి అవుతుంది. రోగనిరోధక శక్తి పెరుగుతుంది.

6. వేప ఆకుల మిశ్రమం

6. వేప ఆకుల మిశ్రమం

కొన్ని వేప ఆకులు తీసుకోండి. దాన్ని మెత్తగా పేస్ట్ మాదిరిగా చేసుకోండి. దానికి మజ్జిగను కలపండి. ఈ మిశ్రమాన్ని రాత్రిపూట మచ్చలున్న ప్రాంతంలో పూయండి. ఉదయాన్నే శుభ్రం చేయండి. ఇలా చేయడం వల్ల మంచి ఫలితాలు పొందుతారు.

7. చింతపండు విత్తనాల పేస్ట్

7. చింతపండు విత్తనాల పేస్ట్

బొల్లి వ్యాధిగ్రస్తులకు ఈ చిట్కా భలే పని చేస్తుంది. మూడు నుంచి నాలుగు రోజుల పాటు చింతపండు విత్తనాలను బకూచి విత్తనాలను నానబెట్టండి. తర్వాత వాటిని మెత్తగా పేస్ట్ మాదిరిగా చేసుకోండి. రోజూ మచ్చలున్న ప్రాంతంలో పూస్తూ ఉండండి.

8. గూస్ ఫూట్ జ్యూస్

8. గూస్ ఫూట్ జ్యూస్

మచ్చలున్న ప్రాంతంలో ఈ కూరగాయల రసాన్ని పూస్తే మంచి ఫలితం ఉంటుంది. ఇలా రెండు నెలల పాటు చేయండి. దీంతో మీ చర్మంరంగులో కాస్త మార్పు వస్తుంది.

9. దానిమ్మ పొడి

9. దానిమ్మ పొడి

ఎండిన దానిమ్మ ఆకులను మెత్తగా నూరి పొడిగా తయారు చేసుకోండి. ప్రతి రోజూ ఉదయం 8 గ్రాముల పొడిని బొల్లి ఉన్న ప్రాంతంలో పూసుకుంటూ ఉండండి. దీనివల్ల మంచి ఫలితాలను పొందగలుగుతారు.

10. మినుముల పేస్ట్

10. మినుముల పేస్ట్

మినుములు బొల్లి నుంచి తక్షణ ఉపశమనం అందించేందుకు ఉపయోగపడతాయి. ఇది కూడా మంచి గృహ చికిత్స. నల్ల మినుములను గ్రైండ్ చేసుకోవాలి. ఆ మిశ్రమానికి కాస్త నీరు కలపాలి. దాన్ని బొల్లి ఉన్న ప్రాంతాల్లో పూయాలి. ఇలా నాలుగు నుంచి ఐదు నెలల పాటు చేస్తే మంచి ఫలితం ఉంటుంది.

ఆహారపరంగా ఈ సూచనలు అవసరం

ఆహారపరంగా ఈ సూచనలు అవసరం

బొల్లి వచ్చిన వారిలో ఒకవేళ జీర్ణ వ్యవస్థకు సంబంధించిన సమస్యలుంటే గోధుమ, పాలు, పాల పదార్థాలు, ప్రాసెస్ చేసిన చక్కెరకు సంబంధించిన ఆహారాలు తినకపోవడం మంచిది. ప్రోబయోటిక్స్ తీసుకోండి. ఒకవేళ మీరు శాఖాహారులైతే బీ-13 సప్లిమెంట్ తీసుకోండి. నిమ్మ, నారింజ వంటి సిట్రస్ పండ్లు తినడం మానుకోండి. వాల్నట్, అత్తి పండ్లను తినండి. వాల్నట్ రక్తం శుద్ధి చేయడానికి బాగా ఉపయోగపడతుంది. చేప లేదా మాసం, పాలు తీసుకోకండి. మీకు ఏవైనా చర్మ సమస్యలుంటే రాత్రి పెరుగు తినకండి. వంకాయను అస్సలు వాడకూడదు. అలాగే కొన్ని యోగాసానాల వల్ల కూడా మంచి ఫలితం పొందవచ్చు. విపరీతకరిణి ఆసనం, గోముఖ ఆసనం ఇందుకు బాగా ఉపయోగపడతాయి.

బొల్లికి ప్రధాన కారణమేమిటి?

బొల్లికి ప్రధాన కారణమేమిటి?

శరీరంలో మెలనోసైట్స్ తక్కువకావడం కాల్షియం లోపం ఏర్పడడం దీర్ఘకాలిక కాలేయ వ్యాధి జీర్ణ వ్యవస్థ సరిగ్గా పనిచేయకపోవడం. చర్మంపై ఉండే పచ్చబొట్లు తదితరాలు బొల్లి రావడానికి ప్రధాన కారణాలు

లక్షణాలివే

లక్షణాలివే

- చర్మంపై మొదట చిన్న చిన్న తెల్లటి మచ్చలు ఏర్పడుతాయి. అయితే అక్కడ ఎలాంటి దురద ఉండదు.

- తెల్లని మచ్చలుంటే ప్రాంతంలో వెంట్రుకలు కూడా తెల్లగా మారుతాయి.

- జుట్టు బాగా ఊడిపోతుంది.

- జుట్టు బూడిద రంగులోకి మారుతుంది.

బెల్లి బారిన పడడానికి ఇవి కూడా కారణాలు కావొచ్చు

బెల్లి బారిన పడడానికి ఇవి కూడా కారణాలు కావొచ్చు

- కుటుంబంలో ఎవరికైన గతంలో బెల్లి ఉండడం

- ఆటో ఇమ్యూన్ వ్యాధులు.

- ఇతర చర్మ సమస్యలు, సన్ బర్న్, దద్దుర్లు.

- భౌతిక అనారోగ్యం, ఒత్తిడి.

- సున్నితమైన చర్మం

- రక్త పరీక్ష

మన శరీరంలో అత్తి పెద్ద అవయం చర్మమే. దాన్ని వీలైనంత వరకు కాపాడుకుంటూ ఉండాలి. ఎలాంటి రోగాల బారిన పడకుండా ముందుస్తుగా ఈ జాగ్రత్తలు తీసుకుంటూ ఉండాలి. మీ చర్మ సంరక్షనకు నీరు ఎక్కువగా తాగుతూ ఉండాలి. ఉదయం 10 సాయంత్రం 4 దాకా సూర్యకిరణాలు చర్మం మీద పడకుండా చూసుకోడి. ఒత్తిడికి గురికాకుండా ఉండండి. ఇలా చేయడం వల్ల చర్మం ఆరోగ్యంగా ఉంటుంది.

English summary

Amazingly Effective Home Remedies To Treat Leucoderma

Many medical treatments are available in the market to treat this skin disorder starting from oral medicines, creams, ultraviolet treatment to skin grafting. But sometimes these treatments do not suit your skin type or body. And not to mention the money you will need to shell out for these treatments.
Story first published: Saturday, November 4, 2017, 13:49 [IST]
Subscribe Newsletter