శరీరంలో కొవ్వు కరిగించి, బరువు తగ్గడానికి నిద్రపోయే ముందు తీసుకోవల్సిన 10 డ్రింక్స్

By Sujeeth Kumar
Subscribe to Boldsky

ప్రతిరోజు వ్యాయామశాలకు వెళ్లడం, కఠినమైన వ్యాయామాలను పాటించటమే కాకుండా ఇంకా చాలా రకాలుగా - ఖచ్చితమైన శరీరాకృతిని పొందడానికి మీరు చాలా కష్టపడుతున్నారు. కానీ మీరు నిద్రపోయే ముందు కేవలం ఇంట్లో తయారుచేసుకోగలిగే కొన్ని పానీయాల ద్వారా మీ శరీరంలో ఉన్న అదనపు కొవ్వును కరిగించుకోవచ్చని మీకు తెలుసా?

"పానీయాలు" అనే మాటను అనడం ద్వారా, మనలో చాలామంది మార్కెట్లో తక్షణమే లభించే శరీర బరువును తగ్గించే ఔషధాల గురించి ఆలోచిస్తారు.

ఔషధాల ఉత్పత్తి దారులు ఎటువంటి ప్రతికూల ప్రభావాన్ని కలిగి లేదన్న హామీతో, చాలా ఆకర్షణీయవంతమైన ప్యాకెట్లను కలిగివున్నప్పటికీ, ఇటువంటి పానీయాలు మీ శరీరంలోని ప్రధాన హార్మోన్ల మార్పులకు అవకాశంగా మారగలవు.

కాబట్టి సహజమైన నివారణ పద్ధతులనే ప ఎంచుకోవడం చాలా ఉత్తమమైనది. సహజమైన పానీయాలు మీ శరీరం నుండి కొవ్వును కోల్పోవటానికి సహాయ పడటమే కాకుండా, ఇవి కూడా కొన్ని ముఖ్యమైన విటమిన్లు మరియు పోషకాలను కలిగి ఉంటాయి, ఇవి శరీరంలో ప్రవేశించిన తర్వాత శరీరంలోని లోపాలను భర్తీ చేయడంలో ఇది ప్రయోజనకారిగా ఉంటుంది.

కాబట్టి ఈ పానీయాలు బహుళ ప్రయోజనాల విలువను కలిగి ఉండటమే కాకుండా, ఖచ్చితమైన శరీర ఆకృతిని మరియు ఆరోగ్యకరమైన జీవనశైలిని అందించడానికి చాలా ఉపయోగకరంగా ఉంటాయి.

మనం ఇప్పుడు, నిద్రపోయేవేళలో ఏ పానీయాలు ఆరోగ్యపరంగా మనకు ఉపయోగపడతాయో అనే వాటిని చూద్దాము.

1. పాలు:

1. పాలు:

పాలులో కాల్షియం, ప్రొటీన్, జింక్ మరియు విటమిన్-బి వంటి గొప్ప వనరులను కలిగి ఉంది. అయితే, ఇలాంటి పోషకాహార విలువలను కలిగి ఉన్న పాలను రుచి లేని కారణంగా మనలో చాలామంది పాలను త్రాగటం మానేస్తారు. మరి కొందరు వ్యక్తులు పాలు తాగటం వల్ల బరువు పెరుగుతున్న అభిప్రాయాన్ని కలిగి ఉన్నారు. అయితే, ఇటీవల చేపట్టిన అధ్యయనాలు మాత్రం వాటన్నింటిని వ్యతిరేకంగా చూపుతున్నాయి. పాలులో కలిగి ఉన్న పెప్టైడ్ YY (PYY) - ఒక ఆకలి-పోరాట హార్మోన్, ఇది మీ కడుపు నిండి ఉన్నట్లుగా దీర్ఘకాలం వరకూ ఉంచుతుంది. కాబట్టి పాలను ప్రతిరోజూ రాత్రి వేళల్లో తీసుకోవడం వల్ల, మీకు ఆకస్మికంగా రాత్రివేళల్లో ఎదురయ్యే ఆకలి బాధలను తగ్గిస్తుంది మరియు జీవక్రియ రేటును వేగవంతం చేయడం ద్వారా బరువును నియంత్రించడంలో సహాయపడుతుంది.

2. ద్రాక్ష రసం :

2. ద్రాక్ష రసం :

మనలో చాలామంది ఎక్కువగా ఇష్టపడే పండ్లలో - ద్రాక్ష ఒకటి. దానితో చేసిన పానీయము కూడా సమానమైన ఉత్తేజాన్ని కలగజేసే లక్షణాలను కలిగి ఉంటుంది మరియు మీ దినచర్యలో ద్రాక్ష రసాన్ని కలిగి ఉండటం వల్ల, ఇది మీ శరీరంలో ఉన్న అదనపు కొవ్వును కరిగించటంలో సహాయం చేస్తుంది. స్వచ్ఛమైన ద్రాక్ష రసంలో ఒక గ్లాసు అనామ్లజనకాలను కలిగివుంటాయి, ఇది శరీరంలో నిల్వ చేయబడిన తెల్ల కొవ్వును - గోధుమ రంగులోకి మారుస్తుంది, అలానే బరువు తగ్గించే ప్రక్రియను ప్రేరేపిస్తుంది. నిద్రపోతున్న సమయంలో ఆకస్మికంగా వచ్చే ధ్వనిని కూడా తగ్గిస్తుంది.

3. చమోమిలే టీ:

3. చమోమిలే టీ:

ఈ టీ బరువును తగ్గించడానికి, రోగాల చికిత్సకు మరియు మొత్తం ఆరోగ్యాన్ని మెరుగుపరిచేందుకు ఉపయోగపడుతుంది. ఇది సహజమైన నిర్విషీకరణ లక్షణాలను కలిగి ఉన్నందున శరీరంలో ఉన్న విషాన్ని బయటకు నెట్టడానికి సహాయపడుతుంది మరియు శరీరం బరువును తగ్గించడంతోపాటు, ఉబ్బరము నుండి ఉపశమనాన్నిస్తుంది. చమోమిలే టీ - ఆకలిని తగ్గించడం ద్వారా రాత్రిపూట తీసుకునే రొట్టెలు మరియు ఐస్-క్రీం ను తినాలనే కోరికలను తగ్గిస్తుంది! పిండిన నిమ్మ రసంతో గాని (లేదా) చల్లబరిచిన రోజ్మేరీతో, వెచ్చగా (లేదా) చల్లగా ఉన్న నీటితో తీసుకోండి. బరువును ప్రేరేపించే తీపి పదార్థాలను తినటం మానుకోండి.

4. గ్రేప్ఫ్రూట్ (దబ్బపండు) జ్యూస్:

4. గ్రేప్ఫ్రూట్ (దబ్బపండు) జ్యూస్:

నిద్రపోతున్నప్పుడు ఈ రసాన్ని గ్లాసు మోతాదులో తీసుకోవడం వల్ల ఆకలిని తగ్గించడంతోపాటు, క్యాలరీలను కూడా తగ్గిస్తుంది. ఈ ప్రక్రియలో, మీరు తరచుగా మీరు బరువు పెరుగుట వంటి ప్రధాన కారణముగా చెప్పే మీ ఆహార నియమాలపై ప్రత్యేక దృష్టిని ఉంచడంలో ఇది సహాయపడుతుంది. ఒక గ్రేప్ఫ్రూట్ లోనే 53 కేలరీలు మరియు 2 గ్రాముల ఫైబర్ను కలిగి ఉంటుంది, అందువల్ల మరుసటిరోజు ఉదయం వరకు మీ ఆకలిని నియంత్రించే సామర్ధ్యమును కలిగి ఉంది.

5. సోయా ప్రోటీన్ షేక్:

5. సోయా ప్రోటీన్ షేక్:

ఇది మొక్క ఆధారితమైన ప్రోటీన్ షేక్, మరియు ఇది గొప్ప పోషక పదార్ధాలను కలిగి ఉన్న వనరుగా ఉంది. అంతేకాకుండా, నిద్రపోతున్నప్పుడు దీనిని వినియోగం వల్ల మీ ఆకలిని బాగా తగ్గిస్తుంది మరియు శరీరం యొక్క జీవక్రియ రేటును ప్రేరేపిస్తుంది. ఈ ప్రక్రియలో, శరీరంలో నిల్వ కాబడిన అదనపు కొవ్వును - బూడిద రంగులోని మారుస్తుంది, మరియు ఆ వ్యక్తి కోరుకునే శరీరాకృతిని పొందవచ్చు.

6. దోసకాయ నిమ్మకాయ అల్లంతో చేసిన రసం :

6. దోసకాయ నిమ్మకాయ అల్లంతో చేసిన రసం :

బరువును తగ్గించే ప్రక్రియలో సహాయపడే అత్యంత ప్రభావవంతమైన పానీయాలలో ఒకటి, నిమ్మ + అల్లం + దోసకాయలతో చేసిన మిశ్రమం. ఈ మూడు పదార్థాలు మీ శరీర బరువును తగ్గించేదిగా మరియు మీ ఆకలిని అణచివేసే ఔషధంలా పనిచేస్తుంది.

మీకు కావలసిందల్లా నిమ్మ రసం - 2 టేబుల్ స్పూన్లు

మరియు 1-2 అల్లం ముక్కలు (లేదా) 1 టేబుల్ స్పూన్ అల్లం పొడి

దోసకాయ - 6 ముక్కలు.

వీటన్నింటిని ఒక పాత్రలో బాగా కలపండి మరియు ఈ మిశ్రమాన్ని ప్రతిరోజూ నిద్రపోయే ముందు తీసుకోవడం వల్ల, సమాంతరంగా ఉండే పొట్టను పొందగలరు.

7. కలబంద (అలో-వెరా) రసం :

7. కలబంద (అలో-వెరా) రసం :

పరిశోధన ప్రకారం, కలబంద రసము మనము తినే ఆహారాన్ని జీర్ణం చేయటంలో సహాయపడుతుంది మరియు జీవక్రియను పెంచుతుంది, ఇది శరీరంలో నిల్వ చేసిన అదనపు కొవ్వును విచ్ఛిన్నం చేయడంలో సహాయపడుతుంది. కలబంద (అలో-వెరా) లో అనామ్లజనకాలు, ఫైబర్, అమైనో ఆమ్లాలు, విటమిన్ A, C మరియు E వంటి వాటికి గొప్ప వనరుగా ఉన్నది, మరియు శరీర బరువును తగ్గించడంలో సహాయపడేందుకు, తాపజనకమైన మరియు నిర్విషీకరణ లక్షణాలకు వ్యతిరేకిగా పనిచేస్తుంది.

8. గోరు వెచ్చని నీరు + తేనె :

8. గోరు వెచ్చని నీరు + తేనె :

నిద్రపోతున్న సమయంలో తేనెతో కూడిన గోరువెచ్చని నీటిని త్రాగటం వల్ల కలిగి ప్రయోజనాలు ఏమిటంటే, మలవిసర్జనను తగ్గిస్తుంది, దోషరహిత చర్మమును, అలాగే మీ శరీర బరువును తగ్గించే ప్రక్రియలో సహాయపడతాయి. నీరు అనేది మనకు తెలిసి, శరీరంలో నుండి అదనపు విషాన్ని / వ్యర్ధాలను బయటకు పంపించుట ద్వారా జీర్ణక్రియను మెరుగుపరచడంలో నిర్విషీకరణ ప్రభావమును కలిగి ఉన్నది. జీవక్రియను ప్రేరేపించటంలో, ఈ పానీయాన్ని వినియోగిస్తున్న వ్యక్తి యొక్క శరీరంలో నిల్వ చేయబడిన కొవ్వును స్వయంచాలకంగానే కరిగిస్తుంది. ఈ మిశ్రమ తయారీలో 300 మి.లీ గోరు వెచ్చగా ఉన్న నీటిలో ఒక స్పూన్ తేనెను బాగా కలపాలి. ఈ పానీయం యొక్క పూర్తి ప్రయోజనాలను పొందటం కోసం ప్రతిరోజు రాత్రి ఈ మిశ్రమాన్ని తాగాలి.

9. గోరు వెచ్చని నీరు + దాల్చిన చెక్క తేనె :

9. గోరు వెచ్చని నీరు + దాల్చిన చెక్క తేనె :

గోరు వెచ్చని నీటితో - తేనెను కలిపి తీసుకోవడం వల్ల కలిగే ప్రయోజనాల గురించి ప్రతి ఒక్కరికీ తెలుసు. దానితో పాటుగా చిటికెడు దాల్చిన చెక్కను కలిపి తీసుకోవడం వల్ల కలిగే అద్భుతమైన ప్రయోజనాలను చూడవచ్చు. తేనె, మనకు తెలిసినంతవరకు, మచ్చలేని చర్మంను మరియు శరీరం యొక్క జీవక్రియ-రేటు వేగాన్ని పెంచుతుంది. నీరు అనేది, శరీరంలో ఉన్న వ్యాసాలను బయటకు పంపించే ఏజెంట్గాను మరియు దాల్చినచెక్క అనేది, రక్తంలో గల చక్కెర స్థాయిని స్థిరంగా ఉంచడంలో సహాయపడుతుంది. రక్తంలో పెరిగిన చక్కెర స్థాయిలు - తరచుగా కొవ్వును నిల్వ చేసేదిగా ఉంటుంది. తేనెతో పాటు దాల్చినచెక్క జీర్ణవ్యవస్థలో సూక్ష్మ జీవులను చంపడంలో ప్రయోజనకారిగా ఉంటుంది, మరియు ఆకలని పుట్టించడంలో ఈ పానీయం అద్భుతంగా పనిచేస్తుంది. ఈ మిశ్రమం కోసం1 టేబుల్ స్పూన్ తేనెను, 1 టేబుల్ స్పూన్ దాల్చిన చెక్క పొడిని, గోరువెచ్చని నీళ్లతో కలిపి పడుకొనే ముందు తీసుకోవడం వల్ల చాలా ఉపయోగకారిగా పనిచేస్తుంది.

10. అల్లం + నిమ్మతో చేసిన టీ:

10. అల్లం + నిమ్మతో చేసిన టీ:

నిమ్మకాయ మరియు అల్లం అనేవి మీ బరువును ఖచ్చితంగా తగ్గించే ప్రక్రియను ప్రారంభించడానికి ఉన్న ఒక అద్భుతమైన కలయిక. ఈ రెండు పదార్ధాలు శరీరంలో ఉన్న అదనపు కొవ్వును మరియు వ్యర్థాలను తొలగిస్తుంది. కాబట్టి ఈ రెండింటినీ కలిపి ఉపయోగించడం వల్ల, తయారైన అల్లం-నిమ్మ-టీ ని మీరు పడుకునేముందు తీసుకోండి. ఈ టీ కోసం, మీరు ఒక కప్పు నీటిని మరగకాచి, అందులో తురిమిన అల్లమును వేయాలి. మంటను ఆపివేసిన తర్వాత, 5 నిముషాల పాటు దానిని చల్లార్చాలి. ఇప్పుడు అందులో ఒక టేబుల్ స్పూన్ నిమ్మరసాన్ని కలపాలి, బరువును తగ్గించుకోవడానికి ఈ టీ ను ప్రతిరోజు తాగుతూ ఉండాలి.

For Quick Alerts
ALLOW NOTIFICATIONS
For Daily Alerts

    English summary

    Bedtime Drinks That Help Burn Fat And Lose Weight

    Weight loss is a tedious task. Along with the regular exercise, taking care of the food that you eat is equally important. There are certain bedtime drinks that you can drink to burn fat and lose weight..
    Story first published: Monday, December 4, 2017, 18:00 [IST]
    We use cookies to ensure that we give you the best experience on our website. This includes cookies from third party social media websites and ad networks. Such third party cookies may track your use on Boldsky sites for better rendering. Our partners use cookies to ensure we show you advertising that is relevant to you. If you continue without changing your settings, we'll assume that you are happy to receive all cookies on Boldsky website. However, you can change your cookie settings at any time. Learn more