యాలకుల గురించి తెలియని మైండ్ బ్లోయింగ్ నిజాలు

By: Y. Bharath Kumar Reddy
Subscribe to Boldsky

యాలకులు అంటేనే వాటి రుచి, సువాసన మనకు గుర్తొకొచ్చేస్తాయి. శరీరంలోని వ్యర్థాలను తొలగించడంలో వీటికి మించినవి లేవు. నోటి దుర్వాసనను తగ్గించడంలోనూ ఇవి బెస్ట్. మన ఇంట్లో వంటే పలు రకాల్లో స్వీట్లలో వీటిని ఉపయోగిస్తుంటాం. అన్ని వంటకాలకు ఇవి మంచి సువాసనను, రుచిని అందిస్తాయి. వీటిలో చాలా ఆరోగ్య రహస్యాలున్నాయి. వీటికి చాలా చరిత్ర కూడా ఉంది.

cardamom benefits

మనదేశం సుగంధ ద్రవ్యాలకు ప్రసిద్ది.. ఇక్కడ అన్నిటికన్నా ఖరీదైని కుంకుమపువ్వు. తర్వాతి స్థానం యాలకులదే. వీటి జన్మస్థలం భారతదేశం. ఇక్కడ మసాలాద్రవ్యాల రారాణి అని యాలకులను అంటారు. యాలకులకు విశేష ఔషధగుణాలున్నాయి. ఇవి చాలా అనారోగ్యాలకు చెక్ పెడతాయి. యాలకుల విశిష్టత, వాటి వల్ల వచ్చే ప్రయోజనాలు ఏమిటో తెలుసుకుందామా మరి.

1: ధరల్లో ఇది మూడో స్థానం

1: ధరల్లో ఇది మూడో స్థానం

చూడడానికి యాలకులు చాలా చిన్నగా కనిపిస్తాయి. కానీ వీటి రేట్ మాత్రం అమోఘం. సుగంద ద్రవ్యాల్లో ఇవే రారాజులు. సఫ్రన్, వనిల్లాలా తర్వాతే రేట్ లో దీనిస్థానంమే ఉంటుంది. మ‌ల్టీ క‌మోడిటీ ఎక్స్ఛేంజీలో యాల‌కుల ఫ్యూచ‌ర్లు ఎప్పటికప్పుడు పెరుగుతుంటాయి. ఎమ్‌సీఎక్స్‌లో యాల‌కుల ఫ్యూచ‌ర్లు ఎక్కువగా లాభాల్లో ట్రేడ‌వుతుడం చూస్తే వీటికి ఉండే డిమాండ్ ఏమిటో తెలుస్తుంది.

 2: నలుపు, ఆకుపచ్చ రంగుల్లో..

2: నలుపు, ఆకుపచ్చ రంగుల్లో..

మనం సాధారణంగా ఆకుపచ్చ రంగులోని యాలకులను చూసి ఉంటాం. వీటిని బిర్యానీ లేదా ఏదైనా తీపిగా ఉండే వంటకాల్లో రుచికోసం ఎక్కువగా ఉపయోగిస్తూ ఉంటాం. అలాగే వీటి సువాసన కూడా అమోఘం. వీటితో వంటకాలు తయారు చేస్తే ఘుమఘుమలాడుతాయి.

ఇక నల్ల యాలకులను కూడా చాలా మంది చూసి ఉంటారు. అయితే వీటిని కాస్త తక్కువగా వినయోగిస్తూ ఉంటారు. వీటిని గరం మసాలా తయారు చేయడానికి ఉపయోగిస్తు ఉంటారు. ఈ రెండు రకాల యాలకులలో ఔషధ గుణాలు కూడా బాగానే ఉంటాయి.

3: ఇవి చాలా పురాతనమైనవి

3: ఇవి చాలా పురాతనమైనవి

యాలకులు ఈ నాటివికావు. ఇవి చాలా పురాతనమైనవి. సుమారు 4000 సంవత్సరాలకు క్రితం నుంచే వీటిని ఉపయోగిస్తున్నారు. యాలకులకు మనదేశమే కేరాఫ్ అడ్రస్. అయితే మొదట వీటిని పురాతన ఈజిప్ట్ లో కూడా సంప్రదాయకంగా ఉపయోగించేవారు. రోమన్లు, గ్రీకులు వీటిని ఎక్కువగా వినయోగించేవారు. తర్వాత స్కాండినేవియన్ దేశాల్లో వీటి వినియోగం పెరిగిపోయింది. ఇప్పుడు ప్రపంచమంతా వీటిని ఎక్కువగా వినియోగిస్తున్నారు.

4: ఉత్పత్తిలో గ్వాటెమాల నంబర్ వన్

4: ఉత్పత్తిలో గ్వాటెమాల నంబర్ వన్

సెంట్రల్ అమెరికాలోని గ్వాటెమాల ప్రపంచంలోనే యాలకులను ఉత్పత్తి చేయడంలో నంబర్ వన్ గా ఉంది. యాలకులకు కేరాఫ్ అయిన మనదేశం కూడా వీటిని బాగానే ఉత్పత్తి చేస్తోంది.

5: బాగా జీర్ణం చేసే లక్షణాలుంటాయి

5: బాగా జీర్ణం చేసే లక్షణాలుంటాయి

మనం తిన్న ఆహారాన్ని వెంటనే జీర్ణం చేసే గుణాలు యాలకుల్లో ఉంటాయి. ఇందులో ఉండే ఔషధ గుణాలు జీర్ణశక్తిని మెరుగుపరుస్తాయి. యాసిడ్ రిఫ్లక్స్, గ్యాస్ట్రిక్ రుగ్మతలను ఎదుర్కొనే లక్షణాలు యాలకుల్లో ఉంటాయి. జీవక్రియను వేగవంతం చేయగల సామర్థ్యం యాలకులకు ఎక్కువగా ఉంటుంది.

 6: గుండెకు చాలా మంచివి

6: గుండెకు చాలా మంచివి

యాలకుల్లో పొటాషియం, క్యాల్షియం, మెగ్నిషీయం పుష్కలంగా ఉంటాయి. ఇవన్నీ గుండె ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తాయి. అలాగే యాలకుల్లో కావాల్సినంత స్థాయిలో ఎలక్ట్రోలైట్లు కూడా ఉంటాయి. యాలకుల్లో ఉండే పొటాషియం గుండె పని తీరును, అధికరక్తపోటును అదుపులో ఉంచుతుంది. రక్తంలో కొలెస్ట్రాల్ స్థాయిని తగ్గిస్తుంది.

7: డిప్రెషన్ నుంచి ఉపశమనం

7: డిప్రెషన్ నుంచి ఉపశమనం

మీరు డిప్రెషన్ లో ఉన్నప్పుడు వెంటనే ఉపశమనం కలిగించేందుకు యాలకులు ఎంతోగానూ ఉపయోగపడుతాయి. ఆ సమయంలో వీటిని తింటే మీరు వెంటనే డిప్రెషన్ నుంచి బయటపడొచ్చు. యాలకులు డిప్రెషన్ విషయంలో తక్షణ ఉపశమనం కలిగిస్తాయి. యాలకులు వేసి మరిగించిన టీ తీసుకోవడం వల్ల వెంటనే ఒత్తిడి తగ్గుతుంది.

 8: ఆస్తమాను తగ్గించుకోవొచ్చు

8: ఆస్తమాను తగ్గించుకోవొచ్చు

ఆస్తమాను కాస్త అదుపులో ఉంచగలిగే గుణాలు యాలకుల్లో ఉంటాయి. ఆకుపచ్చని యాలకులు గురక తగ్గించేందుకు, దగ్గు నివారణకు, శ్వాస ఆడకపోవడాన్ని తగ్గించేందుకు బాగా పని చేస్తాయి.

9: డయాబెటిస్ రాకుండా చేస్తుంది

9: డయాబెటిస్ రాకుండా చేస్తుంది

డయాబెటిస్ ను యాలకులు కొంత మేరకు అదుపులో ఉంచగలవు. వీటిలో మాంగనీస్ ఎక్కువగా ఉంటుంది. ఇది మధుమేహం రాకుండా అడ్డుకునే గుణాన్ని కలిగి ఉంటుంది. అందువల్ల వీటిని ఎక్కువగా తీసుకుంటూ ఉండాలి.

10: నోటి ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తుంది

10: నోటి ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తుంది

యాలకుల్లోని వీటిలోని రసాయనాలు ఇవి నోటిలోని బాక్టీరియంపై చాలా ప్రభావవంతంగా పోరాడతాయి. రోజూ రెండు యాలకులను నోట్లో వేసుకుని నమిలితే మంచి ఫలితం ఉంటుంది. యాలకులను నమిలితే నోటి దుర్వాసన పోయి చిగుళ్ళు, దంతాలను ఆరోగ్యంగా ఉంటాయి. నోట్లోఇన్ఫెక్షన్స్ రావు.

మీ నోటి నుంచి వాసన కూడా బాగా ఉంటుంది.

11: ఆకలి బాగా వేస్తుంది

11: ఆకలి బాగా వేస్తుంది

కొందరికి ఆకలి సరిగ్గా వేయదు. దీంతో తినాలని ఉన్నా తినలేకపోతుంటారు. ఆకలిని కాకపోవడం అనేది చాలా వ్యాధులకు కారణం అవుతుంది. క్యాన్సర్, అనోరెక్సియా వంటి వాటి బారిన కూడా పడే అవకాశం ఉంటుంది. ఇలాంటి సందర్భంలో మీరు యాలకులను తింటూ ఉండడం మంచిది. దీంతో మీకు ఆకలి బాగా వేసే అవకాశం ఉంది.

 12: సెక్స్ సామర్థ్యాన్ని పెంచుతాయి

12: సెక్స్ సామర్థ్యాన్ని పెంచుతాయి

సెక్స్ సామర్థ్యం పెరగాలంటే రోజూ యాలకులను తినాలి. ఇవి పురుషులకు ఉండే శీఘ్ర స్కలన సమస్యను నివారిస్తాయి. వీటిలో సినేయిల్ ఉంటుంది. ఇది లిబిడోను పెంపొందించడానికి ఉపయోగపడుతుంది. శృంగారంలో యాక్టివ్‌గా ఉండేలా చేయడానికి యాలకులు బాగా పని చేస్తాయి.

13: ఎక్కిళ్లను ఆపగలదు

13: ఎక్కిళ్లను ఆపగలదు

ఎక్కిళ్లను అడ్డుకునే గుణం యాలకులకు ఎక్కువగా ఉంటుంది. మీకు ఎక్కువగా ఎక్కిళ్లు వస్తూ ఉంటే వీటిని అలా నోట్లో వేసుకుని చూడండి దాదాపుగా ఎక్కిళ్లు ఆగిపోయతాయి. ఒక కప్పు వేడి టీ యాలకులను వేసుకుని తాగితే వెంటనే ఎక్కిళ్లు ఆగిపోతాయి. మీకు ఈసారి ఎప్పుడైనా ఆగకుండా ఎక్కిళ్లు వస్తే ఈ చిట్కా పాటించండి.

14: గొంతులో కిచ్ కిచ్ ను అడ్డుకుంటుంది

14: గొంతులో కిచ్ కిచ్ ను అడ్డుకుంటుంది

యాలకులు గొంతులో గరగర నుంచి ఉపశమనం కలిగిస్తాయి. 1 గ్రాము ఏలకులు + 1గ్రా దాల్చినచెక్క + 125 ఎంజీల నల్ల మిరియాలు + 1 స్పూన్ తేనె కలుపుకుని తాగితే మీకు గొంతుకు సంబంధించి ఎలాంటి సమస్యలు తలెత్తవు. జస్ట్.. ఈ మిశ్రమాన్ని రోజులో మూడు సార్లు తాగితే మీ గొంతు సమస్యలు, దగ్గువంటివి మటుమాయం అవుతాయి.

15: చర్మ సౌందర్యం

15: చర్మ సౌందర్యం

యాలకుల్లో విటమిన్ సి ఉంటుంది. ఇది మీ చర్మానికి రక్త ప్రసరణను మెరుగుపరచడానికి బాగా ఉపయోగపడుతుంది. చర్మాన్ని చాలా సున్నితంగా మార్చేందుకు యాలకులు బాగా ఉపయోగపడుతాయి. చర్మంపై ముడుతలు లేకుండా యాలకులు చేస్తాయి.

 16 : మీ చర్మం మంచి రంగులోకి వస్తుంది

16 : మీ చర్మం మంచి రంగులోకి వస్తుంది

మీ చర్మం నిగనిగలాడాలని మీరు కోరుకుంటే యాలకులను ఎక్కువగా వినియోగిస్తూ ఉండాలి. ఒక టీ స్పూన్ తేనెలో యాలకుల పొడిని కలపాలి. దాన్ని మీ ముఖంపై పూసుకోవాలి. దీంతో మీ చర్మం టోన్ మారిపోతుంది. మంచి మేని ఛాయలో మీరు మెరిసిపోతారు.

17: క్యాన్సర్ ను నిరోధిస్తుంది

17: క్యాన్సర్ ను నిరోధిస్తుంది

క్యాన్సర్ కారక కణాలపై పోరాడడంలో యాలకులు బాగా పని చేస్తాయి. వీటిలో యాంటీఆక్సిడెంట్ లక్షణాలు ఎక్కువగా ఉంటాయి. ఇవి క్యాన్సర్ కు వ్యతిరేకంగా పోరాడగలవు. అందువల్ల యాలకులను ఎక్కువగా తీసుకున్నా నష్టం లేదు. మనకు పలు విధాలుగా ఇవి ఉపయోగపడతాయి.

English summary

benefits of cardamom elaichi

That's exactly what we are going to discuss in today's episode of Fact vs. Fiction - mind-blowing facts and health benefits of cardamom!
Story first published: Tuesday, November 21, 2017, 14:47 [IST]
Subscribe Newsletter