చేతి పై ఉల్లిపాయను రుద్దడం వల్ల పొందే అద్భుతమైన ప్రయోజనాలు..!

By: Mallikarjuna
Subscribe to Boldsky

అనారోగ్యాలను నివారించుకోవడానికి ఎంతో డబ్బు ఖర్చుచేస్తుంటాము. చిన్న చిన్న ఆరోగ్య సమస్యలను ఎటువంటి ఖర్చులేకుండా వంటింట్లో ఉండే వస్తువులతో నయం చేసుకోవచ్చు.

అలాంటి వంటింటి ఔషధ పదార్థాల్లో ఉల్లిపాయ ఒకటి. ప్రతి ఇంట్లో ఉల్లిపాయలుంటాయనడంలో ఎలాంటి సందేహం లేదు . వంటలకు అద్భుతమైన రుచిని ఇస్తాయి. చూడటానికి చిన్నదే అయినా వీటిలో ఉండే ఔషధగుణాలు తెలిస్తే ఆశ్చర్యం కలుగక మానదు.

చేతి పై ఉల్లిపాయను రుద్దడం వల్ల పొందే అద్భుతమైన ప్రయోజనాలు..!

ఉల్లిపాయలను తినడంతో ఆరోగ్య సమస్యలు తగ్గడం మాత్రమే కాదు, ఉల్లిపాయను చర్మం మీద రుద్దినా కూడా అద్భుత ఉపయోగాలున్నాయి. చేతి వెనుకవైపున ఉల్లిపాయను రుద్దడం వల్ల జలుబు, చెవినొప్పి, దురద వంటి సమస్యలు తగ్గుతాయి.

శరీర ఆరోగ్య శుద్ధీకరణలో ఉల్లిపాయ చేసే మేలు..!

ఉల్లిపాయలో క్యుర్సిటిన్ అనే కంటెంట్ పవర్ ఫుల్ యాంటీఆక్సిడెంట్, ఇది అనేక దీర్ఘకాలిక వ్యాధులను కూడా నివారిస్తుంది. అందువల్ల ఉల్లిపాలను వంటకు ఉపయోగించే ముందు ఒక చిన్న ముక్క పక్కన తీసి పెట్టుకుని, చేతి వెనుకవైపు మరియు ప్రభావిత ప్రాతంలో రుద్దడం మర్చిపోకండి. చేతి వెనుక భాగంలో ఉల్లిపాయను రుద్దడం వల్ల ఎలాంటి ఉపయోగాలున్నాయో తెలుసుకుందాం..

1. కాలినగాయాలను మాన్పుతుంది, మచ్చలను తొలగిస్తుంది:

1. కాలినగాయాలను మాన్పుతుంది, మచ్చలను తొలగిస్తుంది:

ఉల్లిపాయలో ఉండే యాంటీ సెప్టిక్ గుణాలు కాలిన గాయాలను నయం చేస్తుంది. మచ్చలను, ఇతర ఇన్ఫెక్షన్ ను నివారిస్తుంది.

2. నొప్పి తగ్గిస్తుంది:

2. నొప్పి తగ్గిస్తుంది:

కీటకాలు, దోమలు కుట్టినప్పుడు ఆ ప్రదేశంలో ఉల్లిపాయ రుద్దితే నొప్పి తగ్గుతుంది. ఉల్లిలో ఉండి సల్ఫర్ దురద నుండి ఉపశమనం కలిగిస్తుంది.

ఉల్లి, కాకరకాయ రసంలో దాగున్న అద్భుత ప్రయోజనాలు..!

3. చెవి నొప్పి తగ్గిస్తుంది:

3. చెవి నొప్పి తగ్గిస్తుంది:

ఉల్లిపాయను 15నిముషాలు వేడి చేసి, పేస్ట్ చేసి, అందులో రసాన్ని పిండి గోరువెచ్చగా రెండు మూడు చుక్కలు చెవిలో వేసుకుంటే చెవి నొప్పి నుండి ఉపశమనం కలుగుతుంది.

4. ముక్కుదిబ్బడ నుండి ఉపశమనం కలిగిస్తుంది:

4. ముక్కుదిబ్బడ నుండి ఉపశమనం కలిగిస్తుంది:

ఉల్లిపాయను ముక్కలుగా కట్ చేసి ఒక గిన్నెలో వేసి వాసన చూడాలి లేదా ఆవిరి పట్టినట్లు గాలి పీల్చాలి. ఇలా చేస్తే ముక్కుదిబ్బడ నుండి ఉపశమనం కలుగుతుంది.

5. జలుబు, ఫ్లూ తగ్గిస్తుంది:

5. జలుబు, ఫ్లూ తగ్గిస్తుంది:

జలుబు, దగ్గు నుండి త్వరిత ఉపశమనం పొందడానికి ఇది మంచి మార్గం. ఉల్లిపాయను రెండు ముక్కలుగా కట్ చేసి నిద్రించేముందు తలగడకు దగ్గరగా పెట్టుకుని నిద్రపోతే జలుబు, దగ్గు నుండి ఉపశమనం పొందుతారు.

6. జ్వరం:

6. జ్వరం:

నిద్రించే ముందు కాళ్ళకు సాక్సులు వేసుకుని అందులో రెండు ఉల్లిపాయ ముక్కలు కట్ చేసి పెట్టుకోవాలి. ఇవి ఆరోగ్యానికి అద్భుతంగా ఉపయోగపడుతుంది. ఇది రాత్రికి రాత్రి శరీర ఉష్ణోగ్రతను తగ్గిస్తుంది.

స్ప్రింగ్ ఆనియన్స్ లోని అమేజింగ్ హెల్త్ బెనిఫిట్స్

7. గొంతునొప్పి:

7. గొంతునొప్పి:

ఉల్లిపొట్టును నీటిలో వేసి వేడిచేసి, టీ లాగా తయారుచేసి ఈ నీటిని తాగడం వల్ల గొంతు నొప్పి నుండి ఉపశమనం కలుగుతుంది.

 8.స్పింటర్స్ :

8.స్పింటర్స్ :

చర్మంలో స్పింటర్స్ ఉన్పప్పుడు ఉల్లిపాయముక్కను ఉంచి, టేప్ చుట్టాలి. ఒక గంట తర్వాత టేప్ తొలగించాలి. స్పింటర్ ఉల్లిపాయతో పాటు ఊడి వచ్చేస్తుంది.

9. స్కిన్ పిగ్మెంటేషన్ :

9. స్కిన్ పిగ్మెంటేషన్ :

ఉల్లిపాయ రసంలో పసుపు వేసి డార్క్ స్పాట్స్ ఉన్న ప్రదేశంలో దీన్ని అప్లై చేయాలి. ఇది స్కిన్ పిగ్మెంటేషన్ నివారిస్తుంది.

10. మెనుష్ట్రువల్ క్రాంప్స్ :

10. మెనుష్ట్రువల్ క్రాంప్స్ :

ఉల్లిపాయ పెయిన్ కిల్లర్ లా పనిచేస్తుంది. రుతుసమస్యలు, నొప్పి, చీకాకు, తిమ్మెర్లు తొలగిస్తుంది.

English summary

Benefits Of Rubbing Onion On The Back Of The Hand

Benefits of rubbing onion on the back of hand are soothing of burns, treating itching sensation, easing ear pain, etc. Read to known the top benefits..
Subscribe Newsletter