For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

సొరకాయ జ్యూస్ విత్ జింజర్, 6 వారాలు తీసుకోండి, శరీరంలో జరిగే అద్భుత మార్పులు గమనించడి

By Mallikarjuna
|

సొరకాయలో దాదాపు 96 శాతం నీళ్లు ఉంటాయి. కాబట్టి జ్యూస్ చేయడం తేలికవుతుంది. ఆరోగ్యానికి మంచిది. ఈ సొరకాయ ద్వారా విటమిన్ సి, విటమిన్ బి, సోడియం, ఐరన్, జింక్, పొటాషియం పొందవచ్చు. అలాగే తక్కువ ఫ్యాట్, తక్కువ కొలెస్ట్రాల్ ఉంటుంది. అందుకే.. ఈ సొరకాయ జ్యూస్ చాలా ఫేమస్ అయింది.

వెజిటబుల్స్ హెల్తీ కాబట్టి ప్రతి రోజూ ఏదో ఒక వెజిటబుల్ తింటూ ఉంటాం. అయితే సొరకాయలో ఎక్కువ నీటి శాతం ఉండటం వల్ల ఇది ఆరోగ్యానికి మరింత మంచిది. అయితే సొరకాయను ప్రతిసారీ కూర, సాంబార్ గా వండుకుని తినీ తినీ బోర్ కొట్టేస్తుంది. కాబట్టి ఈసారి సొరకాయను జ్యూస్ రూపంలో అదికూడా అల్లం కలిపి తీసుకుంటే.. టేస్ట్ తోపాటు, ఆరోగ్యం కూడా మీ సొంతమవుతుంది.

health benefits of lauki

ప్రతిరోజూ అరగ్లాసు దానిమ్మ జ్యూస్, 3కర్జూరాలు తింటే ఏమవుతుంది ?ప్రతిరోజూ అరగ్లాసు దానిమ్మ జ్యూస్, 3కర్జూరాలు తింటే ఏమవుతుంది ?

ఒక కప్పు సొరకాయ జ్యూస్ ద్వారా 26 ఎమ్ జీ విటమిన్ సి పొందవచ్చు. యాంటీ ఆక్సిడెంట్ ఉండటం వల్ల.. కణాలు డ్యామేజ్ అవకుండా అడ్డుకుంటాయి. మరి సొరకాయ, అల్లం జ్యూస్ తో పొందే బెన్ఫిట్స్ ఏంటో తెలుసుకునే ముందు జ్యూస్ తయారీ గురించి తెలుసుకుందాం..

క్యారెట్ జ్యూస్ రెగ్యులర్ గా తాగితే వీర్య వృద్ధి..సంతాన ప్రాప్తి..!క్యారెట్ జ్యూస్ రెగ్యులర్ గా తాగితే వీర్య వృద్ధి..సంతాన ప్రాప్తి..!

రెండు టేబుల్ స్పూన్ల అల్లం రసంను 1/2గ్లాసు సొరకాయ జ్యూస్ లో కలపాలి. ఈ రెండూ బాగా కలగలిసే వరకూ స్పూన్ తో కలపాలి. తర్వాత తాగాలి!

ఈ జ్యూస్ ను ప్రతి రోజూ ఉదయం అల్పాహారానికి ముందు తాగాలి. కనీసం 6 వారాల పాటు ఈ జ్యూస్ తీసుకుంటే అద్భుతమైన ప్రయోజనాలను పొందుతారు!

1. బరువు తగ్గిస్తుంది

1. బరువు తగ్గిస్తుంది

ఈ న్యాచురల్ జ్యూస్ ఆకలిని తగ్గిస్తుంది. మెటబాలిజంను న్యాచురల్ గా మెరుగుపరుస్తుంది. దీంతో.. బరువు తగ్గడం తేలికవుతుంది.సొరకాయలో ఫ్యాట్ తక్కువగా ఉంటుంది. క్యాలరీలు, కొలెస్ట్రాల్ తక్కువగా ఉంటుంది. కాబట్టి.. దీన్ని రెగ్యులర్ గా తీసుకుంటే.. తేలికగా బరువు తగ్గవచ్చు. వండినా, రసం రూపంలో తీసుకున్నా సరే సొరకాయ అన్ని రకాలుగా ఆరోగ్యానికి ఆలంబనగా ఉంటుంది. ఉన్న బరువు కాపాడుకోవాలన్నా, తగ్గాలనుకున్నవారికి సొరకాయ ఎంతగానో సహాయపడుతుంది. సొరకాయ, శరీరంలోని క్యాలరీలను అతి సులభంగా తగ్గిస్తుంది . ఈ గ్రీన్ వెజిటేబుల్ శరీరంలోని కొవ్వు కణాలను విచ్చిన్నం చేస్తుంది. కాబట్టి బాటిగార్డ్ ను జ్యూస్ లా తయారుచేసి, త్రాగి బరువు తగ్గించుకోండి.

2.వ్యాధినిరోధకశక్తిని పెంచుతుంది

2.వ్యాధినిరోధకశక్తిని పెంచుతుంది

ఈ హోం మేడ్ హెల్త్ డ్రింక్ లో యాంటీఆక్సిడెంట్స్ అధికంగా ఉంటాయి. యాంటీ ఆక్సిడెంట్స్ తో పాటు విటమిన్ సి కూడా ఎక్కువ. ఇది రక్త ప్రసరణను మెరుగుపరుస్తుంది,వ్యాధినిరోధకశక్తిని పెంచుతుంది.

3. జీర్ణక్రియ మెరుగుపడటానికి

3. జీర్ణక్రియ మెరుగుపడటానికి

ఈ న్యాచురల్ జ్యూస్ లో యాసిడ్ లెవెల్స్ మెరుగుపరిచి.. జీర్ణక్రియ మెరుగుపరిచే గుణాలుంటాయి. దీనివల్ల ఎసిడిటీ, కాన్ట్పిపేషన్ వంటి సమస్యలకు చెక్ పెట్టవచ్చు. ఈ సొరకాయలో 92శాతం నీరు ఉండటం వల్ల, తిన్న ఆహానం మరింత శక్తివంతంగా తేలికగా జీర్ణం అవ్వడానికి బాగా సహాయపడుతుంది. ఈ వెజిటేబుల్ ను మీ భోజనంతో పాటు తీసుకోవడం వల్ల, జీర్ణ క్రియ మరింత వేగవంతం అవుతుంది.

4.హార్ట్ హెల్త్ మెరుగుపరుస్తుంది

4.హార్ట్ హెల్త్ మెరుగుపరుస్తుంది

సొరకాయ, అల్లం జ్యూస్ రక్త ప్రసరణ సజావుగా జరగడానికి సహాయపడుతుంది. గుండె ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తుంది.సొరకాయలో జింక్ ఉంటుంది. ఇది.. బ్లడ్ ప్రెజర్ ని కంట్రోల్ చేసి.. గుండె ఆరోగ్యంగా ఉండటానికి సహాయపడుతుంది.

5. స్ట్రెస్ తగ్గిస్తుంది

5. స్ట్రెస్ తగ్గిస్తుంది

ఈ న్యాచురల్ హెల్త్ జ్యూస్ లో ఆందోళన తగ్గించడంలో సహాయపడుతుంది. ఇది నరాలను రిలాక్స్ చేసి.. ప్రశాంతతను కలిగిస్తుంది.

6. శక్తికి మరో పేరు

6. శక్తికి మరో పేరు

తీవ్రమైన అతిసార, మధుమేహం, కొవ్వు అధికంగా ఉన్న, వేయించిన పదార్థాలు తినడం వల్ల సంభవించే విపరీతమైన దాహానికి మంచి విరుగుడుగా సొరకాయ పనిచేస్తుంది. శరీరం అధిక మోతాదులో సోడియం నష్టపోకుండా చూస్తుంది. అలసటపాలు కాకుండా కాపాడుతుంది.

7. యూరినరీ ట్రాక్ట్ ఇన్ఫెక్షన్ తగ్గిస్తుంది

7. యూరినరీ ట్రాక్ట్ ఇన్ఫెక్షన్ తగ్గిస్తుంది

ఈ న్యాచురల్ డ్రింక్ డ్యూరెటిక్ గా పనిచేస్తుంది. దీంతో యూరినరీ ఇన్ఫెక్షన్స్ ని చాలా ఎఫెక్టివ్ గా తగ్గిస్తుంది. యూరిన్ లో ఉండే యాసిడ్ కంటెంట్ ని న్యూట్రలైజ్ చేయడం ద్వారా ఇన్ఫెక్షన్ తగ్గుతుంది.సొరకాయలో డ్యురెటిక్ నేచర్ ఉంటుంది. ఇది.. మలినాలను బయటకు పంపడానికి సహాయపడుతుంది. అలాగే.. అమ్మాయిల్లో యూరినరీ సమస్యలకు చెక్ పెడుతుంది. ప్రతిరోజు తినే ఆహారంతో పాటు ఒక గ్లాసు సొరకాయ రసంలో ఒక చెంచా నిమ్మరసం కలిపి

English summary

Health Benefits Of Drinking Bottle Gourd And Ginger Juice

Here is a health drink which can provide you with 7 health benefits, right at home!
Desktop Bottom Promotion