అలర్ట్: మలబద్దకంతో కిడ్నీ వ్యాధుల ముప్పు!

Posted By:
Subscribe to Boldsky

మలబద్ధకం. తరచుగా కనబడే సమస్య. ముఖ్యంగా ఎంతోమంది వృద్ధులను వేధిస్తున్న సమస్య. చాలామంది దీన్నో జీర్ణ సమస్యగా భావిస్తూ పెద్దగా పట్టించుకోరు. కానీ విసర్జన సాఫీగా జరిగేలా చేసే మందులతో రోజులు నెట్టుకుంటూ వస్తుంటారు. అయితే మలబద్ధకం పెద్దపేగుకు మాత్రమే పరిమితయ్యేది కాదని, మలబద్దకం మూత్రపిండాలపైనా ప్రభావం చూపుతోందని పరిశోధకులు పేర్కొంటున్నారు. మలబద్ధకానికీ దీర్ఘకాల కిడ్నీ జబ్బు, కిడ్నీ వైఫల్యానికీ సంబంధం ఉంటున్నట్టు తేలటమే దీనికి కారణం.

మలబద్దకం

మలబద్ధకం తీవ్రం అవుతున్నకొద్దీ కిడ్నీ జబ్బుల ముప్పులూ పెరుగుతున్నట్టు పరిశోధకులు గుర్తించారు. చిత్రంగా అనిపించినా ఇందులో ఆశ్చర్యమేమీ లేదని పరిశోధకులు చెబుతున్నారు. ఎందుకంటే గుండె జబ్బులకూ మలబద్ధకానికీ సంబంధం ఉంటున్నట్టు ఇంతకుముందే బయటపడింది. దీనికి దోహదం చేస్తున్న సమస్యలే కిడ్నీలపైనా విపరీత ప్రభావం పడేలా చేస్తుండొచ్చని పరిశోధకులు అనుమానిస్తున్నారు. వీటన్నింటికీ మూలం పేగుల్లోని బ్యాక్టీరియాలో ఉండి ఉండొచ్చని అధ్యయనంలో పేర్కొన్నారు.

కిడ్నీలకు ముప్పు

మలబద్ధకం ఏర్పడటానికి మన పేగుల్లో నివసించే బ్యాక్టీరియా తీరుతెన్నుల్లో మార్పులు తలెత్తటమూ ఒక కారణమే. ఇది మనం తిన్న ఆహారం పేగుల ద్వారా ముందుకు కదిలే ప్రక్రియను సైతం నెమ్మదింపజేసే అవకాశముంది. మరి మలబద్ధకానికి చికిత్స తీసుకుంటే కిడ్నీ జబ్బుల ముప్పును తగ్గించుకోవచ్చా అంటే? దీన్ని తెలుసుకోవటానికి మరింత అధ్యయనం చేయాల్సి ఉందని పరిశోధకులు చెబుతున్నారు. అయితే మలబద్ధకంతో బాధపడేవారు విసర్జన సాఫీగా జరిగేలా చేసే మందులను వేసుకోవటం కన్నా ఫైబర్(పీచు) అధికంగా ఉండే ఆహారం, ప్రొబయోటిక్స్‌ ఫుడ్స్ తీసుకోవడం మంచిది. ఇన్ స్టాంట్ మందుల వల్ల ఒంట్లో నీటి శాతం తగ్గుతుంది. దాంతో కిడ్నీ జబ్బుకు బలమైన ముప్పు కారకమే!

కాబట్టి, కిడ్నీలకు ముప్పు కలిగించకుండా మలబద్దక సమస్యలను నివారించే ఆహారాల గురించి తెలుసుకుందాం...

1. ఆప్రికాట్ :

1. ఆప్రికాట్ :

ఆప్రికాట్ ను రెగ్యులర్ గా తీసుకోవడం వల్ల మలబద్దకంను నివారిస్తుంది.

2. స్ట్రాబెర్రీ:

2. స్ట్రాబెర్రీ:

మలబద్దకం నివారించడంలో స్ట్రాబెర్రీస్ గ్రేట్ గా సహాయపడుతాయి. స్ట్రాబెర్రీస్ లో పెక్టిన్ అనే కాంపౌండ్ ప్రేగుల్లో మ్యూకస్ ను పెంచుతుంది. దాంతో స్టూల్ సులభంగా పాస్ అవుతుంది.

3. బేరి పండ్లు:

3. బేరి పండ్లు:

బేరిపండ్లు మలబద్దకాన్ని నివారించడానికి గ్రేట్ గా సహాయపడుతాయి. తొక్కతో సహాయ తీసుకుంటే ఆరోగ్యానికి చాలా మంచిది. చిన్న పిల్లల్లో కూడా మలబద్దక సమస్యను నివారించుకోవచ్చు.

4. ప్రూనె:

4. ప్రూనె:

ప్రూనె లో నేచురల్ లాక్సేటివ్స్ ఉన్నాయి . వీటిలో కూడా ఫైబర్ కంటెంట్ అధికంగా ఉంటుంది. అందుకే ఇది జీర్ణవ్యవస్థకు చాలా మేలు చేస్తుంది.

5. ఎండు ద్రాక్ష:

5. ఎండు ద్రాక్ష:

ఈ మల బద్దక సమస్యకు ఎండు ద్రాక్ష ఎంతో ఉపయోగపడుతుంది, దీనిలో ఉన్న లక్షణాలు మన కండరాలను ఉత్తేజపరచి, పెద్ద ప్రేగు ద్వారా వ్యర్ద పదార్దాలని పంపించేస్తుంది.5 ఎండు ద్రాక్షలో 3 గ్రా.ము పీచు పదార్దం ఉంటుంది.

6. బీన్స్:

6. బీన్స్:

లెగ్యుమ్ జాతి విత్తనాల్లో ఫైబర్ అధికంగా ఉంటుంది కాబట్టి ఇది బౌల్ మూమెంట్ క్రమబద్దం చేస్తుంది . దాంతో మలబద్దక సమస్య నివారించబడుతుంది.

బ్రొకోలీ:

బ్రొకోలీ:

గ్రీన్ లీఫీ వెజిటేబుల్స్ ఆరోగ్యానికి ఎంత మేలు చేస్తాయో మనందరికీ తెలిసిన విషయమే . బ్రొకోలీని రెగ్యులర్ గా తీసుకోవడం వల్ల జీర్ణక్రియను ఆరోగ్యంగా ఉంచుతుంది.

8 . గోధుమలు:

8 . గోధుమలు:

త్రుణధాన్యాలు రెగ్యులర్ డైట్ లో చేర్చుకోవడం వల్ల మలబద్దకాన్ని నివారిస్తుంది . కాబట్టి రెగ్యులర్ డైట్ లో బ్రౌన్ రైస్ మరియు బ్రౌన్ బ్రెడ్ ను జోడించుకోండి.

9. ఓట్ మీల్:

9. ఓట్ మీల్:

ప్రతి రోజూ ఉదయం బ్రేక్ ఫాస్ట్ లో ఓట్ మీల్ తీసుకోవడం వల్ల మలబద్దక సమస్యలు నివారించబడుతాయి. ఓట్ మీల్లో ఫైబర్ అత్యధికంగా ఉండటం వల్ల ఇది మలబద్దక సమస్య నుండి ఉపశమనం కలిగిస్తుంది.

10. నీరు:

10. నీరు:

మనం పీచు పదార్దం ఎంత తీసుకున్నప్పటికీ, దానికి తోడు నీరు కూడా తీసుకోవాలి,లేదంటే కడుపులో ఉన్న వ్యర్ద పదార్దాలు శుబ్ర పడకుండా అధిక నొప్పితో మలబద్దకముకు దారి తీస్తుంది.పండ్ల ముక్కల్ని నీటితో కలిపి తీసుకుంటే మంచి ప్రభావం చుపిస్తాయి.

11. పాలు

11. పాలు

రాత్రి పూట పడుకునే ముందు 1 గ్లాసు వేడి పాలు తాగి పడుకుంటే మీ జీర్ణాశయం శుబ్రపడి, మంచి ప్రబావం చుపిస్తుంది.

12. పెరుగు :

12. పెరుగు :

పెరుగులో నేచురల్ ల్యాక్సేటివ్స్ ఎక్కువగా ఉన్నాయి. ఇవి హెల్తీ గౌట్ బ్యాక్టీరియాను పెంచుతుంది. మలబద్దక సమస్యను నివారిస్తుంది.

English summary

Can Constipation Cause Kidney disease? and Foods for Constipation! In Telugu

Can Constipation Cause Kidney disease?Food for Constipation!In what may not make for the sexiest headline, a new study shows there's a link between constipation and kidney disease
Story first published: Thursday, June 15, 2017, 19:00 [IST]
Subscribe Newsletter