ఋతుస్రావం జరిగేటప్పుడు, రక్తం గోధుమ రంగులోఉండటానికి గల 7 సాధారణ కారణాలు

By: SSN Sravanth Guthi
Subscribe to Boldsky

మనకు 'నెలసరి - ఋతుచక్రం' అనేది చాలా రకాల భావోద్వేగ పూరితమైనది మరియు హార్మోనుల కారకాలపై ఆధారపడి ఉంటుంది. అంతేకాక, పునరుత్పాదన కోసం అండోత్సర్గముతో సిద్ధంగా ఉన్న మహిళల యొక్క అండాశయంలోని నిరంతర గుడ్లను సరఫరాను కలిగి ఉండటానికి ఈ అంశాలన్నీ కలిసి పనిచేస్తాయి, అంతేకాకుండా అంతర్గత శ్లేష్మపొర (లేదా) గర్భాశయం నుండి ఎండోమెట్రియమును తొలగించబడుతుంది.

కొన్నిసార్లు ఋతుస్రావం వల్ల వచ్చే రక్తం, ఒకటి / రెండు రోజులుగా గర్భాశయంలో ఉండి ఆ తర్వాత బయటపడతుంది. అందువల్ల, ఈ పాత రక్తం చివరి పీరియడ్స్ లో భాగంగా పూర్తిగా ఖాళీగా కాకపోయి ఉండవచ్చు మరియు ఆ రక్తం ప్రస్తుతం ముదురు గోధుమ రంగులో కనిపించేదిగా ఉండి శరీరం నుండి బయటకు వెళ్లిపోతుంది (లేదా) బహిష్కరించబడుతోంది. ఇది పూర్తిగా సహజంగా జరిగే విషయం, మరియు దానికి ఏవైనా అనుబంధమైన లక్షణాలు (లేదా) సమస్యలు లేనప్పుడు ఆందోళన చెందవలసిన సమస్య మాత్రం కాదు. "ముదురు గోధుమ రంగులో రుతుస్రావం ఒక సాధారణ దృగ్విషయం?"

పీరియడ్స్ టైంలో శృంగారం వల్ల పొందే మిరాకిలస్ బెన్ఫిట్స్..!!

దాదాపు 5% మంది స్త్రీలు, ముదురు గోధుమ రంగులో రుతుస్రావమును అనుభూతి చెందుతున్నారు, ఇది చాలా సాధారణమైనదని వారు భావిస్తారని అధ్యయనాలు వెల్లడించాయి.

ముదురు గోధుమ రంగులో, రుతుస్రావ-రక్తము కలిగివున్నందున ప్రతిబింబించే ఫలితాలు

1. అండోత్సర్గము :

1. అండోత్సర్గము :

ఋతుచక్రం యొక్క 28 రోజుల సగటు వ్యవధిలో 14 - 16 వ రోజుల మధ్య కాలంలో, అండోత్సర్గ ప్రక్రియలో ఉత్సర్గ అనుభవము వలన యోని నుండి బయటకు వచ్చే రక్తం ముదురు గోధుమ రంగులో ఉండేందుకు అవకాశం ఎక్కువగా ఉంటుంది. అండాశయం నుండి పరిపక్వమైన గుడ్డు విడుదలతో, కొంచెం ముదురు గోధుమ రంగులో రక్తస్రావాన్ని కొంతమంది స్త్రీల అనుభవంలోకి వస్తాయి, సాధారణంగా వీటిని చుక్కలు అని పిలుస్తారు.

2. గర్భం :

2. గర్భం :

ముదురు గోధుమ రంగులో జరిగే రక్తస్రావం అనేది గర్భం దాల్చిన మహిళలకు ఇది సర్వసాధారణం మరియు అది ఒక రకమైన సూచక. సాధారణంగా ఈ భావన గర్భధారణ జరిగిన కొన్ని రోజుల తర్వాత ఏర్పడుతుంది మరియు 3 - 4 రోజుల వరకు ఉంటుంది. గర్భాశయం లోపలి భాగంలో గర్భాశయ ప్రతిస్థాపనకు అండము పాకుతున్న సమయంలోనూ, మరియు అండం ఫలదీకరణం చెందుతున్నట్లు సూచించే విధంగా యోని నుండి జరిగే రక్తస్రావమని సూచిస్తారు.

3. పెద్ద గర్భాశయం :

3. పెద్ద గర్భాశయం :

కొన్నిసార్లు పెద్ద గర్భాశయం వల్ల, ముదురు గోధుమ రంగులో జరిగే ఋతుస్రావానికి కారణం అవుతుంది. గర్భధారణ కారణంగా, గర్భాశయం సాగతీత తరువాత, శిశువు జన్మించాక - గర్భాశయం యొక్క పరిమాణం మళ్ళీ యధా స్థానానికి తిరిగి రాకపోతే, అది విపరీతమైన ముదురు గోధుమ రంగులో జరిగే ఋతుస్రావానికి కారణం అవుతుంది.

ఋతుస్రావం వల్ల వచ్చే రక్తమును, శరీరం నుండి బయటకు విడుదల చెయ్యడానికి ముందుగా, ఆ రక్తాన్ని సేకరించి, గడ్డకట్టిన లేదా ఋతుస్రావ రక్తమును సేకరించుటకు లేదా గడ్డకట్టెలా చేయడానికి, ఉనికిలో పెద్దగా ఉన్న గర్భాశయమునకు తగినంత సమయం పడుతుంది. ఈ కారణం కూడా ముదురు గోధుమ రంగు (లేదా) రుతుస్రావం ప్రవాహం గట్టిపడటం దారితీస్తుంది. కొన్ని సందర్భాల్లో, గర్భాశయంలోని కొన్ని తిత్తులు ఉండవచ్చు. ఈ తిత్తులు చీలిపోయిన కారణంగా ఋతుస్రావంలో విడుదలైన రక్తంలోని రంగును ప్రభావితం చేసేదిగా అవుతుంది.

4. ఋతుస్రావ రక్త-ప్రవాహానికి అవరోధం :

4. ఋతుస్రావ రక్త-ప్రవాహానికి అవరోధం :

గర్భాశయం నుండి యోని ద్వారా ఋతుస్రావ రక్తం బయటకు రావడానికి, దాని ప్రవాహ మార్గంలో అవరోధాలు ఏర్పడి (లేదా) అడ్డు తగలడం వల్ల, ఆ రక్తం గడ్డలుగా మారడానికి, రంగులో (లేదా) రక్తం యొక్క చిక్కదనంలో మార్పులు ఏర్పడటానికి దారితీయవచ్చు.

గర్భాశయంలోని కోమలమైన పాలిప్స్ యొక్క ఉనికిలో మార్పుల కారణంగా పీరియడ్స్ లో రక్తం యొక్క ప్రవాహంలో మార్పులు ఏర్పడవచ్చు. ఋతుస్రావం సమయంలో, రుతుస్రావ-రక్త ప్రవాహం తగ్గుటకు సౌకర్యవంతంగా ఉంటుంది, ఇది వాస్తవానికి, సాధారణంగా ఈస్ట్రోజెన్ స్థాయిలను తగ్గడంతో - గర్భాశయ గొట్టం (కాలువ) సన్నగా మారుతుంది.

ఒకే నెలలో పీరియడ్స్ రెండుసార్లు రావడానికి కారణం ఏమై ఉండవచ్చు?

5. అడెనోమైసిస్ (లేదా) ఎండోమెట్రియోసిస్ :

5. అడెనోమైసిస్ (లేదా) ఎండోమెట్రియోసిస్ :

ఇవి గర్భాశయం కొన్ని అసాధారణ పరిస్థితులు. ఈ "ఎండోమెట్రియోసిస్" లో, గర్భాశయ లోపలి పొరలో ఏర్పడిన కణజాలం గర్భాశయం వెలుపల వరకూ అభివృద్ధి చెందుతుంది. "అడెనోమయోసిస్" లో, గర్భాశయ లోపలి పొరలో ఏర్పడిన కణజాలం కండరాలలో పెరుగుతుంది, ఇది గర్భాశయ గోడలుగా ఏర్పడుతుంది. ఈ రెండు పరిస్థితులలో, ఋతుస్రావం సమయంలో, రుతుస్రావ-రక్తం గడ్డకట్టడం, గట్టిపడటం మరియు రంగులో మార్పు జరగటం అనేవి చాలా సాధారణం.

6. భావోద్వేగపూరిత ఆటంకాలు :

6. భావోద్వేగపూరిత ఆటంకాలు :

భావోద్వేగపూరిత ఆటంకాలు, అనగా ఒక స్త్రీలో ఒత్తిడి మరియు నిరాశ వంటి, గర్భాశయం యొక్క అంతర్గత పొరలో సన్నగా అవ్వడం అనేది కారణం కావచ్చు. ఎండోమెట్రియల్ కణాల తొలగిపోవడంలో మరింత ఆలస్యం కారణంగా ఇలా అవుతుంది. ఈ ఆలస్యం వల్ల రక్తంతో ఆక్సీకరణ చెందటం ఫలితంగా, ఇది రక్తము యొక్క రంగు, ముదురు గోధుమ రంగులోనికి మారేదిగా అవుతుంది.

అందువల్ల, ముదురు గోధుమ రంగులో జరిగే రుతుస్రావానికి, సాధారణంగా పాత గర్భాశయ కణజాలం యొక్క ఉనికిని కలిగి ఉంటుంది, ఉదాహరణకు:- ఆలస్యంగా పీరియడ్స్ అయినప్పుడు, మీరు గతంలో చివరిసారిగా పీరియడ్స్ ఉన్నప్పుడు గర్భాశయం యొక్క మొత్తం లోపలి పొర పూర్తిగా బయటకు వెళ్ళలేదు (నిష్క్రమించలేదు) అని సూచిస్తుంది.

7. రక్తం గడ్డకట్టడం :

7. రక్తం గడ్డకట్టడం :

గడ్డకట్టిన రక్తం బయటకు వెళ్తే, అది యోని యొక్క ముదురు గోధుమ రంగులో ఉత్సర్గ లక్షణాలను కలిగి ఉన్నట్లుగా ఉంటాయి. అయితే, అలా గడ్డకట్టిన తర్వాత, సాధారణ రంగును కొన్ని రోజుల్లో తిరిగి పొందబడటం జరుగుతుంది.

English summary

7 Common Causes Of Brown Blood Menstruation

Common Causes Of Brown Blood Menstruation, Read to know more about...
Story first published: Tuesday, November 7, 2017, 18:00 [IST]
Subscribe Newsletter