For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

ఉదయాన్నే పరగడుపునే నెయ్యిని తీసుకోవడం వలన కలిగే అద్భుత ఫలితాలు!

అనేక పరిశోధన అధ్యయనాల ప్రకారం పరగడుపున నెయ్యిని తీసుకోవడం వలన అనేక ఆరోగ్య ప్రయోజనాలు లభిస్తాయి. ఆయుర్వేద వైద్య శాస్త్రం కూడా ఈ అంశానికి మద్దతునిస్తోంది.

|

ఉదయం లేవగానే ఫ్రెషప్ అయిన తరువాత ఏం చేయాలో నిదానంగా కూర్చుని ఒక నిమిషం పాటు ఆలోచించండి.

ప్రతి ఒక్కరి సమాధానం విభిన్నంగా ఉంటుంది. ఎందుకంటే, కొంతమందికి రోజును ఉత్సాహంగా ప్రారంభించడానికి ఉదయం నిద్రలేవగానే కాఫీ త్రాగడం అలవాటు, అలాగే మరికొంతమందికి ఎటువంటి పానీయాలు అవసరం లేకుండా నేరుగా బ్రేక్ ఫాస్ట్ ని చేసే అలవాటు ఉంటుంది.

ఆరోగ్యానికి ప్రధమ ప్రాధాన్యతనిచ్చే మరికొందరు ఉదయాన్నే పరగడుపున వేడినీటిలో తేనెని కలిపి తీసుకుంటారు. మరికొందరు పాలు తీసుకుంటారు ఇంకొందరు కొన్ని సహజసిద్ధమైన హెల్త్ డ్రింక్స్ తీసుకుంటారు.

eating ghee in empty stomach

ఇలా, పరగడుపున తీసుకునే ఆహారపానీయాలు మన ఆరోగ్యంపై వివిధ రకాల ప్రభావాలు కలిగిస్తాయి. ఒక్కొక్కరికీ ఒక్కొక్క అలవాటని మనం ముందే చెప్పుకున్నాం.

పరగడుపునే నెయ్యిని తీసుకోవడం

ఉదయాన్నే నిద్రలేవగానే కొన్ని పదార్థాలను తీసుకోవడాన్ని చాలా మంది ఆసక్తికనబరచరు. అందులోనూ నెయ్యి వంటి వాటిని పరగడుపునే తీసుకునేందుకు అస్సలు ఇష్టపడరు.

ఉదాహరణకు, ఉదయాన్నే పరగడుపున ఎవరైనా స్పైసీ ఫుడ్ ని తినడానికి ఇష్టపడతారా?

ఆ విధంగానే , మనలో చాలా మందికి పరగడుపునే నెయ్యిని తీసుకోవాలన్న ఆలోచన ఇప్పటి వరకు వచ్చి ఉండకపోవచ్చు.

అయితే, ఇక్కడ మీరు గమనించవలసిన విషయం ఏంటంటే అనేక పరిశోధన అధ్యయనాల ప్రకారం పరగడుపున నెయ్యిని తీసుకోవడం వలన అనేక ఆరోగ్య ప్రయోజనాలు లభిస్తాయి. ఆయుర్వేద వైద్య శాస్త్రం కూడా ఈ అంశానికి మద్దతునిస్తోంది. బ్రేక్ ఫాస్ట్ కంటే ముందు పరగడుపునే నెయ్యిని తీసుకోవడం వలన ఆరోగ్యాన్ని అనేక విధాలుగా కాపాడుకోవచ్చు.

మనలో చాలా మందికి, ప్రత్యేకించి భారతీయులకు నెయ్యి సుపరిచితమే కదా?

ఎన్నో రకాల తీపి పదార్థాలు తయారుచేసేందుకు అలాగే ఘుమఘుమలాడే రుచికరమైన పదార్థాలు తయారుచేసేందుకు నెయ్యిని విరివిగా వాడతారు.

కాచిన వెన్నే నెయ్యిగా మారుతుంది. అంటే, కాగుతున్న వెన్నంలోంచి పాలకు చెందిన ఘనపదార్థాలని అలాగే నీరు వంటి పదార్థాలను తొలగించి నెయ్యిని తయారుచేస్తారు.

ప్రాచీన భారతదేశంలోనే నెయ్యి ఉద్భవించిందని అంటారు. పవిత్రమైన హోమాలు వంటి వాటిలో నెయ్యిని వాడతారు. నెయ్యిలో కలిగిన వివిధరకాల పోషకవిలువలను గుర్తించడం వలన నెయ్యిని శుభకరమైన పదార్థంగా భావిస్తారు.

ప్రతి రోజూ ఉదయాన్నే ఒక స్పూన్ నెయ్యిని ఒక గ్లాసుడు వేడి నీటితో కలిపి తీసుకోవాలి. ఆ తరువాత మిగతావేమైనా తినే ముందు కనీసం 30 నిమిషాల వరకు వేచి ఉండాలి.

ఉదయాన్నే పరగడుపునే నెయ్యిని తినడం వలన కలిగే ఆరోగ్యప్రయోజనాల గురించి ఇప్పుడు మనం తెలుసుకుందాం.

బెనిఫిట్#1: శరీరంలోని ప్రతి సెల్ పనితీరును మెరుగుపరుస్తుంది

బెనిఫిట్#1: శరీరంలోని ప్రతి సెల్ పనితీరును మెరుగుపరుస్తుంది

ఆయుర్వేదం ప్రకారం నెయ్యి అనేది రస ఔషధంగా పనిచేస్తుంది. ఈ రస ఔషదాన్ని ఉదయాన్నే పరగడుపునే తీసుకుంటే శరీరంలోని అన్ని సెల్స్ యొక్క పనితీరు మెరుగుపడుతుంది. కాబట్టి సెల్స్ యొక్క పనితీరుని పెంపొందించడం కోసం అలాగే ఆరోగ్యంగా ఉండటం కోసం నెయ్యిని పరగడుపునే తీసుకోండి.

బెనిఫిట్#2: చర్మానికి సహజమైన నిగారింపుని కలిగిస్తుంది

బెనిఫిట్#2: చర్మానికి సహజమైన నిగారింపుని కలిగిస్తుంది

శరీరంలోని సెల్స్ అన్నిటినీ చైతన్యపరచి పోషణనందించే సామర్థ్యం నెయ్యికి కలదు. తద్వారా మీ చర్మం కోల్పోయిన సహజ నిగారింపుని మళ్ళీ దక్కించుకుంటుంది. అలా మీ చర్మం ఆరోగ్యవంతంగా అలాగే కాంతివంతంగా ఉంటుంది. మీ చర్మానికి అవసరమైనంత తేమని అందించి పొడిచర్మం సమస్య నుంచి మీకు తక్షణ ఉపశమనం కలిగించడంలో నెయ్యి ప్రధాన పాత్ర పోషిస్తుంది. సోరియాసిస్ వంటి చర్మ సమస్యలను నివారించడంలో తోడ్పడుతుంది.

బెనిఫిట్#3: అర్త్రైటిస్ ను అలాగే కీళ్ల నొప్పులను అరికడుతుంది

బెనిఫిట్#3: అర్త్రైటిస్ ను అలాగే కీళ్ల నొప్పులను అరికడుతుంది

నెయ్యి సహజసిద్ధమైన లూబ్రికంట్ గా పనిచేస్తుంది. అందువలన, మీ కీళ్లను అలాగే శరీరంలోని టిష్యూలను లూబ్రికేట్ చేసి తద్వారా బాధాకరమైన ఆర్తరైటిస్ ను కీళ్లనొప్పులను అరికడుతుంది. ఒమేగా 3 ఫ్యాటీ యాసిడ్స్ నెయ్యిలో పుష్కలంగా ఉంటాయి. ఇవి ఎముకల దృఢత్వానికి ఉపయోగపడతాయి. తద్వారా ఓస్టియోపోరోసిస్ సమస్య బారిన పడే ప్రమాదాన్ని అరికట్టవచ్చు.

బెనిఫిట్#4: బ్రెయిన్ సెల్స్ ని యాక్టివ్ గా ఉంచుతుంది

బెనిఫిట్#4: బ్రెయిన్ సెల్స్ ని యాక్టివ్ గా ఉంచుతుంది

పరగడుపునే నెయ్యిని తీసుకుంటే బ్రెయిన్ సెల్స్ ని మరింత యాక్టీవ్ గా ఉంచుకోవచ్చు. తద్వారా జ్ఞాపకశక్తిని, నేర్చుకునే సామర్థ్యాన్ని, కాగ్నిటివ్ ఫంక్షనింగ్ ను మెరుగుపరచుకోవచ్చు. ఆ విధంగా డిమెన్షియా, అల్జీమర్ వంటి వ్యాధుల బారిన పడే ప్రమాదాన్ని అరికట్టవచ్చు.

బెనిఫిట్#5: బరువును తగ్గిస్తుంది

బెనిఫిట్#5: బరువును తగ్గిస్తుంది

నెయ్యిని ఆహారంలో తీసుకుంటే అధిక బరువు పెరుగుతారని ఒక నమ్మకం చాలామందిలో ఎక్కువగా నాటుకుపోయింది. అయితే, ప్రతిరోజూ పరగడుపునే క్రమంతప్పకుండా 5 నుంచి 10 మిల్లీ లీటర్ల నెయ్యిని తీసుకుంటే బరువును తగ్గించుకోవడం సాధ్యపడుతుంది. మెటబాలిక్ రేట్ ను సరిచేయడం ద్వారా నెయ్యి అదనపు బరువు సమస్యకు చక్కటి పరిష్కారం కలిగిస్తుంది.

 బెనిఫిట్#6: హెయిర్ ఫాల్ సమస్యను అరికడుతుంది

బెనిఫిట్#6: హెయిర్ ఫాల్ సమస్యను అరికడుతుంది

పరగడుపునే నెయ్యిని తీసుకోవడం వలన శిరోజాలను కాపాడుకోవచ్చు. వెంట్రుకలకు బలాన్ని చేకూర్చి మీకు ఒత్తైన శిరోజాలను అందించడంలో నెయ్యి తనదైన పాత్ర పోషిస్తుంది. మీ శిరోజాలు మరింత మృదువుగా, ఒత్తుగా తయారై మెరుపుని సొంతం చేసుకుంటాయి.

బెనిఫిట్#7: లాక్టోస్ ఇన్టాలరెంట్ సమస్య కలిగిన వారికి ఉపయోగపడుతుంది

బెనిఫిట్#7: లాక్టోస్ ఇన్టాలరెంట్ సమస్య కలిగిన వారికి ఉపయోగపడుతుంది

లాక్టోస్ ఇన్టాలరెంట్ సమస్య కలిగిన వారు పాలతో పాటు పాల సంబంధిత పదార్థాలను తీసుకోవడం వలన వివిధ జీర్ణ సమస్యలతో సతమతమవుతారు. అయితే, వీరు కూడా నేతిని ఎటువంటి సందేహం లేకుండా తీసుకోవచ్చు. నెయ్యిలో లాక్టోస్ కంటెంట్ జాడలు మాత్రమే ఉండడం వలన వీరు కూడా పరగడుపునే నేతిని తీసుకోవచ్చు.

బెనిఫిట్#8: యాంటీ కాన్సరస్ గుణాలు కలవు

బెనిఫిట్#8: యాంటీ కాన్సరస్ గుణాలు కలవు

నెయ్యిలో యాంటీ క్యాన్సరస్ గుణాలు సమృద్ధిగా కలవు. అందువలన, శరీరంలోని కాన్సర్ కారక సెల్స్ ఎదుగుదలను అడ్డుకునే సామర్థ్యం నెయ్యికి కలదు. ఆ విధంగా ప్రాణాంతక వ్యాధుల నుంచి రక్షణ లభిస్తుంది.

English summary

Health Benefits Of Consuming Ghee On Empty Stomach

Ghee is a popular milk product used to prepare a number of dishes. Consuming ghee on an empty stomach every morning, can have a number of health benefits on your body. Learn how consuming ghee on an empty stomach can improve your health.
Story first published:Thursday, December 7, 2017, 13:19 [IST]
Desktop Bottom Promotion