డేంజర్ : రాత్రుల్లో ఈ అలవాట్లను ఖచ్ఛితంగా మానుకోవాలి..ఎందుకంటే?

Posted By: Super Admin
Subscribe to Boldsky

సహజంగా నిద్రలేచినప్పటి నుండి తిరిగి రాత్రి పడుకునే వరకూ ఎన్నోపనులు, టెన్షన్, ఒత్తిడితో కూడిన జీవన శైలి. ఇలాంటి పరిస్థితిలో ఆరోగ్యం , అందం గురించి అస్సలు పట్టించుకోరు. ముఖ్యంగా మహిళలు. ఒకసారి నిద్రలేచిన వెంటనే ఆరోజు మీరు ఏం చేయదల్చుకున్నారు. మీ శరీరానికి ఎంత ప్రాధాన్యత ఇస్తున్నారో తెలుసుకోవాలి.

ఎన్ని జాగ్రత్తలు తీసుకున్నా హెల్తీగా ఉండలేకపోతున్నామన్న అలోచన మీకు కలగవచ్చు. అయితే మీరు ఖచ్చితంగా మీ బెడ్ టైమ్ హ్యాబిట్స్ గురించి తెలుసుకోవాల్సిందే..

నిద్రించే సమయంలో మెటబాలిక్ రేటు నిధానంగా ఉంటుంది. ఆరోగ్యాన్ని మెరుగుపరుచుకోవాలంటే మీ బెడ్ టైమ్ హ్యాబిట్స్ మీద ఓన్నేసి ఉంచాల్సిందే..

అత్యంత ముఖ్యమైన విషయం మీరు ఎంత క్వాలిటి నిద్ర, ఎంత సేపు నిద్రపోతున్నరాన్న విషయంతో తెలుసుకోవాలి. నిద్రించేటప్పుడు మీ శరీరానికి పూర్తి విశ్రాంతి అవసరం అవుతుంది. అంతే కాదు ఈ సమయంలో శరీరంలో డిటాక్సిఫికేషన్ (నిర్శిషీకరణం)జరగడం వల్ల శరీరం సంతోషం చెందుతుంది.

బెడ్ హ్యాబిట్స్ లో చిన్న విషయమైన ..లేటుగా భోజనం చేయడం దగ్గర నుండి..పెద్ద విషయం ఆల్కహాల్ తీసుకోవడం వరకూ అన్నిఆరోగ్యం మీద ప్రభావితం అవుతాయి.

కాబట్టి, నిద్రించడానికి ముందు కొన్ని ముఖ్యమైన జాగ్రత్తలు తీసుకోవడం వల్ల అనేక అనారోగ్య సమస్యల నుండి దూరం చేసుకోవచ్చు. అందువల్ల నిద్రించే ముందు తప్పనిసరిగా డేంజరస్ బెడ్ హ్యాబిట్స్ గురించి తెలుసుకుని వాటిని అవాయిడ్ చేద్దాం..

1.లేటుగా నిద్రించడం:

1.లేటుగా నిద్రించడం:

మొట్ట మదటి అలవాటు త్వరగా నిద్రలేవడం, రాత్రి త్వరగా నిద్రపోవడం అలవాటు చేసుకోవాలి. లేటుగా నిద్రపోవడం ఆరోగ్యానికి మంచిది కాదు. శరీరం ఆరోగ్యంగా ఉండాలంటే రోజంత అలసిన శరీరానికి తగిన విశ్రాంతి అవసరం. అంతే కాదు శరీరంలో అనేక రిపేరింగ్ ప్రొసేస్ కూడా ఉండటం వల్ల అందుకు నిద్ర సహాయపడుతుంది.

2. డిన్నర్ చేసిన వెంటనే బెడ్ ఎక్కేయడం..

2. డిన్నర్ చేసిన వెంటనే బెడ్ ఎక్కేయడం..

డిన్నర్ చేసిన వెంటనే పడక మీదకు వెళ్లకూడదు. మీరు కనీసం 10 నిముషాలైనా నడవాలి. ఇది తిన్న ఆహారం జీర్ణం అవ్వడానికి మరియు గ్యాస్ నివారించడానికి సహాయపడుతుంది. మంచి జీర్ణ వ్యవస్థ వల్ల మంచి నిద్రపడుతుంది. అనేక అనారోగ్య సమస్యలను దూరం చేస్తుంది.

3. నిద్రించడానికి వెళ్లి, బెడ్ మీద గ్యాడ్జెట్స్ ఉపయోగించడం:

3. నిద్రించడానికి వెళ్లి, బెడ్ మీద గ్యాడ్జెట్స్ ఉపయోగించడం:

ఈ రోజుల్లో గ్యాడ్జెట్స్ అంటే మన శరీరంలో ఒక అవయవంలా భావిస్తున్నారు. అయితే గ్యాడ్జెట్స్ కు ఎక్కువ అడిటక్ట్ అయితే మాత్రం మీరు రాంగ్ రూట్ లో వెళుతున్నట్లే. ఇది ఖచ్చితంగా మీ నిద్ర మీద ప్రభావం చూపుతుంది.

4. రాత్రి నిద్రించడానికి ముందు కాఫీ తాగడం :

4. రాత్రి నిద్రించడానికి ముందు కాఫీ తాగడం :

రాత్రి నిద్రించడానికి ముందు కాఫీ తాగడం. కాఫీ బ్రెయిన్ మీద ప్రభావం చూపుతుంది. బ్రెయిన్ యాక్టివ్ గా ఉంచుతుంది. దాంతో నిద్ర సరిగా పట్టదు. ఇంకా కెఫిన్ డ్యూరియాటిక్ గా పనిచేస్తుంది. దాంతో యూరిన్ వెళ్ళాల్సి వస్తుంది. ఇది కూడా నిద్రమీద ప్రభావం చూపుతుంది. ఎక్కువ సమయం నిద్ర మేల్కొనేలా చేస్తుంది.

5. రాత్రి నిద్రించడానికి ముందు ఎక్కువ ఆహారం తీసుకోవడం:

5. రాత్రి నిద్రించడానికి ముందు ఎక్కువ ఆహారం తీసుకోవడం:

రాత్రి నిద్రించడానికి ముందు తక్కువ ఆహారం తీసుకోవాలని సూచిస్తున్నారు. అయితే ప్రస్తుత ఉరుకుల పరుగుల జీవితంలో చాలా మంది మెయిన్ మీల్స్ ను స్కిప్ చేసి డిన్నర్ ఎక్కువగా తీసుకుంటుంటారు. ఇది ఆరోగ్యం మీద ఎక్కువ ప్రభావం చూపుతుంది. ఇది శరీరం మీద పని ఒత్తిడిని పెంచుతుంది.

6. ఆల్కహాల్ :

6. ఆల్కహాల్ :

ఆల్కహాల్ తీసుకోవడం మోస్ట్ డేంజరస్ బెడ్ టైమ్ హ్యాబిట్. ఇది మీ ఆరోగ్యం మీద ప్రభావం చూపుతుంది. ఇది మెటబాలిజం మీద ప్రభావం చూపుతుంది. నిద్రను చెడగొడుతుంది. ఇంకా మరికొన్ని ఆరోగ్య సమస్యలకు దారితీస్తుంది.

7.స్నాక్స్ అండ్ టివీ:

7.స్నాక్స్ అండ్ టివీ:

ప్రస్తుత రోజుల్లో టీవిని లింగ్ రూమ్ నుండి బెడ్ రూమ్స్ కు మార్చుకోవడం జరుగుతుంటుంది. ఈ అలవాటుతో పాటు రాత్రుల్లో స్నాక్స్ ఎక్కువ తినడం వల్ల అతి బరువుకు దారితీస్తుంది.

8. రాత్రి నిద్రించడానికి ముందు వ్యాయామం:

8. రాత్రి నిద్రించడానికి ముందు వ్యాయామం:

రాత్రి నిద్రించడానికి ముందు వ్యాయామం చేయడం వల్ల హార్మోన్స్ శరీరాన్ని యాక్టివ్ గా ఉంచుతుంది. దాంతో సరిగా నిద్రపట్టదు. కాబట్టి, రాత్రి నిద్రించడానికి ముందు వ్యాయామం మంచి అలవాటు కాదు. వ్యాయామం డేలో ఎప్పుడైనా మంచిదే.

9.రాత్రి నిద్రించడానికి ముందు ఫ్రైడ్ ఫుడ్స్ తినడం:

9.రాత్రి నిద్రించడానికి ముందు ఫ్రైడ్ ఫుడ్స్ తినడం:

మీరు యాక్టివ్ గా ఉన్నప్పుడు మీ శరీరానికి ఎనర్జీ అవసరం లేదు. అటువంటి సమయంలో ఫ్రైడ్ ఫుడ్స్ ఎక్కవగా తినడం వల్ల శరీరం వాటిని స్టోర్ చేసుకుని ఫ్యాట్ గా మారుతుంది. కాబట్టి, రాత్రుల్లో ఫ్రైడ్ ఫుడ్స్ ను పూర్తిగా మానేయడం మంచిది. వీటిలో క్యాలరీ అధికంగా ఉంటాయి.

10. నిద్రించే భంగిమ:

10. నిద్రించే భంగిమ:

బాడీ పెయిన్ ఉన్నప్పుడు , అలాగే మెడికల్ కండీషన్ ఉన్నప్పుడు మీరు నిద్రించే భంగిమ సరిగా లేకపోతే నిద్ర పట్టదు. ఎప్పుడూ లెఫ్ట్ సైడ్ తిరిగి పడుకోవాలి.

English summary

Dangerous Bedtime Habits That You Should Avoid

Listed here are a few of the bad bedtime habits that you need to avoid, as these can lead to weight gain and several other health-related problems.
Story first published: Saturday, May 6, 2017, 16:00 [IST]