TRENDING ON ONEINDIA
-
మంత్రి ఆదికి షాక్: జమ్మలమడుగు అభ్యర్ధిని తేల్చేసారు
-
మీ పాత కారుని కొత్తగా మార్చటం ఎలా.?
-
రూ.4999కే led hd smart tv, ఎలా సొంతం చేసుకోవాలో తెలుసుకోండి
-
వాళ్లంతా మహానుభావులు.. అమ్మాయిల క్లీవేజ్, తొడలు చూసేస్తారు.. నాగబాబు ఘాటు వ్యాఖ్యలు!
-
కోబ్రా దెబ్బకు షారుఖ్ కంపెనీ గింగిరాలు?
-
చీర కట్టుకోవడాన్ని అమితంగా ఇష్టపడుతారా ? ప్రయాణాలకు ఈ చీరలు
బీర్ తాగే వ్యక్తులను దోమలు ఎక్కువగా కుడుతాయట..!
దోమలు మిమ్మల్ని టార్గెట్ చేస్తున్నాయా ?
మిగతా వారికన్నా ఇతరులను దోమలు ఎందుకు ఎక్కువగా కరుస్తున్నాయి ?
కొన్నిరకాల రక్తవర్గం గలవారిని దోమల టార్గెట్ చేస్తున్నాయా ? దోమలు చాలా ప్రమాదకరమైనవి.
డెంగ్యూ, మలేరియా, జింకా లాంటి వ్యాధులను వ్యాపింపజేస్తాయి. దోమలు కొన్ని రకాల వ్యాధులను వ్యాపింప చేసేవిగా వుంటాయి.
మీ ఇంట్లో దోమల బెడదా?అయితే ఈ ట్రిక్స్ ప్రయత్నించి చూడండి..!
దోమలు మీ నిద్రను పాడుచేస్తాయి. మీ చర్మంపై దురదలను సృష్టించి, చేవులలోని అవి తిరుగుతున్నప్పుడు వచ్చే శబ్దంతో మిమ్మల్ని చికాకు పెడతాయి.
ఒక గదిలో 2-3 వ్యక్తులు ఉన్నప్పుడు దోమలన్ని మిమ్మల్ని టార్గెట్ చేసుకుని కరుస్తున్నట్లు ఉన్నప్పుడు మీరు ఆశ్చర్యపోవచ్చు. దోమలు ఎందుకు కూడతాయో మీకు తెలుసా? రక్తం కోసమే కదా, అవును..
కాని మనుషులందరికీ రక్తం ఉంటుంది కదా. అప్పుడు దోమలు దేనికి ప్రాధాన్యతనిస్తాయి ?
అవి కొంత మందిని ఇష్టపడి, మరికొంతమందిని ద్వేషిస్తాయా ? అటువంటి ప్రశ్నలకు సమాధానాలు ఇక్కడ ఉన్నాయి.
రక్తంలో రకాలు :
దోమలు కొన్ని రక్తవర్గం కలవారిని టార్గెట్ చేసుకుంటాయా ? అవును, రక్తపోటు ఉన్న వారిని దోమలు ప్రధాన లక్ష్యాలుగా చేసుకుంటాయని ప్రస్తుత అధ్యయనం ప్రకారం తేలింది. ఆ తర్వాత స్థానంలో "ఎ", "బి" రక్త వర్గం కలవారు ఉన్నారు.
బీరు త్రాగేవారు :
బీరు త్రాగేవారి చెమటలో ఎథనాల్ విడుదల కావడంవల్ల అవి దోమలను ఆకర్షించేవి గా ఉంటాయి. కాబట్టి బీరు తాగడం అనేది దోమకాటుకు మరొక కారణమైన అంశము.
బట్టలు :
మధ్యాహ్న సమయంలో డార్క్ షేడ్స్ ఉన్న దుస్తులను ధరించడం వల్ల దోమలను మరింతగా ఆకర్షించేదిగా ఉంటుందని మరొక అధ్యయనంలో తేలింది. ఎరుపు, నలుపు, నీలం దుస్తులను ధరించినప్పుడు దోమలు మనుషులను సులువుగా గుర్తించగలవు. అవును, అవి మనుషులను గుర్తించడానికి తమ కళ్లను ఉపయోగిస్తాయి.
కార్బన్ డై ఆక్సైడ్ :
దోమలో చెవులను ఎందుకు లక్ష్యంగా చేసుకుంటాయి ? సుమారు 150 అడుగుల దూరంలో గల మానవుల ఉనికిని గాలిలో కార్బన్ డయాక్సైడ్ స్థాయిలను పరిశీలించడం ద్వారా గ్రహిస్తాయి.
మీరు ఊపిరి తీసుకుని, కార్బన్ డై ఆక్సైడ్ ను వదిలినప్పుడు దోమలు వాటిని గ్రహించగలవు.
ఊబకాయం ఉన్నవారు ఎవరైతే గాలిని బయటకు వదులుతారో వారే వీటికి మొదటి లక్ష్యం గా మారతారు. నిజానికి, దోమలు మీ చెవులు దగ్గర శబ్దంతో ఆకర్షించబడటానికి మీ ముక్కునుండి వదిలే కార్బన్ డయాక్సైడే ప్రధాన కారణం.
దోమలను నివారించడానికి ఎఫెక్టివ్ హోం మేడ్ టిప్స్
గర్భిణీలు :
గర్భిణీ స్త్రీలను కూడా దోమలు లక్ష్యంగా చేసుకుంటాయి. గర్భిణీలో చివరిదశలో ఉన్నప్పుడు తీసుకునే శ్వాసలో పెరుగుదల కూడా కారణం కావచ్చు. వీరు ఎక్కువగా శ్వాస తీసుకోవడం వల్ల గాలిలో పెరిగే కార్బన్ డయాక్సైడు కూడా కారణం కావచ్చు. అలాగే శరీర ఉష్ణోగ్రత కూడా దోమలను ఆకర్షించడానికి అధికంగా ఉంటుంది.
బ్యాక్టీరియా :
మీ చర్మంపై బ్యాక్టీరియా కూడా దోమలను ఆకర్షిస్తుంది. కొన్ని బాక్టీరియాలు చర్మంపైన వాసనను విడుదల చేసేదిగా ఉంటూ దోమలను ఆకర్షిస్తుంది. కొన్ని బాక్టీరియాలు సమృద్ధిగా ఉండటంవల్ల, మరికొన్ని వైవిధ్యంగా ఉండటం వల్ల
దోమలను ఆకర్షించడం లేదా వికర్షించడంలో తమ పాత్రను పోషిస్తాయి.
చెమటలు :
చెమటలు కూడా దోమలను ఆకర్షిస్తాయి. మానవ శరీరం ద్వారా చెమట వంటి ద్రవాలలో వెదజల్లబడే అమోనియా, యూరిక్ ఆమ్లం, లాక్టిక్ యాసిడ్ మరి కొన్ని ఇతర మిశ్రమాల వాసనను దోమలు గ్రహించగలవు.
ఇంకా, మీరు వ్యాయామం చేయడం వల్ల చెమట పట్టవచ్చు. ఆ చుట్టుపక్కల దోమలు ఉన్నట్లయితే అది మీ చుట్టూ తిరగడం ప్రారంభిస్తాయి.