For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

వేసవిలో వడదెబ్బ నుండి శరీరాన్ని రక్షించుకోవడం ఎలా..?

|

వేసవిలో ఎండ ఎక్కువగా ఉన్నప్పుడు వడ దెబ్బకు గురి అవుతుంటారు. శరీరంలో నీరు తగ్గిపోవడం వల్ల, డీహైడ్రేషన్ కారణంగా వడదెబ్బకు గురి అవుతుంటారు. కాబట్టి, వేసవిలో శరీరం గురించి స్పెషల్ కేర్ తీసుకోవడం చాలా అవసరం.

వేసవిలో వచ్చే జబ్బుల్లో వడదెబ్బ అత్యంత ప్రమాధకరమైనది. ఈ వడదెబ్బ వల్ల ప్రతి సంవత్సరం చాలా మంది చనిపోతుంటారు. శరీరంలో ఎప్పుడైతే నీటి శాతం తగ్గిపోతుందో అప్పుడు, ప్రాణాపాయ స్థితికి చేరుకుంటారు.

అటువంటి పరిస్థితి ఎదుర్కోకుండా ముందు జాగ్రత్తలు తీసుకోవడం చాలా అవసరం. ఎక్కువ సమయం ఎండలో ఉండటం వల శరీరంలో కొన్ని అవయవాలు డ్యామేజ్ అవుతాయి. ముఖ్యంగా వడదెబ్బకు గురైన వ్యక్తిలో శ్వాస సమస్యలు, తలనొప్పి, అబ్ నార్మల్ హార్ట్ రేట్, వికారం, చర్మం ఎర్రగా మారడం, ఎక్కువ చెమట, కల్లు తిరగడం, అలసట వంటి లక్షణాలు ఎక్కువగా కనబడుతాయి. వేసవిలో వడదెబ్బకు గురికాకుండా కొన్ని హోం రెమెడీస్ ఈ క్రింది విధంగా ఉన్నాయి..

1. ఆనియన్ జ్యూస్ :

1. ఆనియన్ జ్యూస్ :

ఇది వినడానికి వింతగా ఉన్నా, వడదెబ్బ నుండి ఉపశమనం కలిగిస్తుందన్న విషయంలో ఏమాత్రం సందేహం లేదు. ఉల్లిపాయ రసాన్ని ఛాతీకి , వీపు బాగంలో అప్లై చేయడం వల్ల ఇది శరీరంలో వేడి తగ్గిస్తుంది. అంతే కాదు రెగ్యులర్ గా పచ్చి ఉల్లిపాయలను సలాడ్స్ తో కలిపి తినడం వల్ల ఎండ వేడిమి నుండి ఉపశమనం పొందవచ్చు.

2. చింత నీళ్లు:

2. చింత నీళ్లు:

చింత పండును నీళ్ళలో వేసి కలిపి, ఆ గుజ్జును 10 నిముషాల పాటు వేడి చేయాలి. గోరువెచ్చగా ఉన్నప్పుడు ఈ నీటిని తాగాలి. చింత గుజ్జులో వివిధ రకాల మినిరల్స్, ఎలక్ట్రోలైట్స్ మరియు విటమిన్స్ అధికంగా ఉన్నాయి. ఇది శరీరంలో ఉష్ణోగ్రతను తగ్గిస్తుంది.

3. ప్లమ్స్:

3. ప్లమ్స్:

వేసవిలో ప్లమ్ ఫ్రూట్స్ ను తినడం వల్ల , ఇది శరీరంను హైడ్రేట్ చేస్తుంది. ఇది యాంటీఆక్సిడెంట్ ను అందిస్తుంది. ఇన్ఫ్లమేషన్ మరియు హీట్ స్ట్రోక్ ను తగ్గిస్తుంది. మొదట ప్లమ్ ఫ్రూట్స్ ను నీళ్లలో నానబెబట్టి తర్వాత అవి సాప్ట్ గా మారిన తర్వాత వీటి మెత్తగా చేసి, ఫ్లమ్ ఫ్రూట్స్ తో సహా ఆ నీటిని తాగాలి. ఇలా చేయడం వల్ల వడదెబ్బ నుండి ఉపశమనం కలిగిస్తుంది.

4. కోకనట్ వాటర్ :

4. కోకనట్ వాటర్ :

ఎండ కాలంలో వాతావరణంలో వేడి వల్ల శరీరంలో వాటర్ తగ్గుతుంది. కాబట్టి, వేసవిలో సాధ్యమైనంత కోకనట్ వాటర్, బట్టర్ మిల్క్ ను తాగాలి. ఇది శరీరంను హైడ్రేట్ చేయడంతో పాటు, శరీరానికి కావల్సిన మినిరల్స్ మరియు ఎలక్ట్రోలైట్స్ ను అందిస్తుంది.

5. పుదీనా జ్యూస్ :

5. పుదీనా జ్యూస్ :

పుదీనా జ్యూస్ శరీరంను కూల్ గా మార్చుతుంది. అలాగే కొత్తి మీర కూడా జ్యూస్ చేసుకోవచ్చు. ఈ రెండింటి కాంబినేషన్ లో ఒక గ్లాసు జ్యూస్ ను రెగ్యులర్ గా తాగవచ్చు.

6. ఆపిల్ సైడర్ వెనిగర్:

6. ఆపిల్ సైడర్ వెనిగర్:

ఒక గ్లాసు నీళ్లలో ఒక టీస్పూన్ ఆపిల్ సైడర్ వెనిగర్ మిక్స్ చేసి, తాగాలి. ఇలా తాగడం వల్ల ఎండ వేడికి శరీరంలో కోల్పోయిన్ ఎలక్ట్రోలైట్స్ మరియు మినిరల్స్ తిరిగి పొందుతారు.

7. అలోవెర జ్యూస్ :

7. అలోవెర జ్యూస్ :

అలోవెర జ్యూస్ లో ఉండే గుణాలు శరీరంలో అనేక మార్పులను తీసుకొస్తుంది. కాబట్టి, ఉదయం పరగడుపున ఒక స్పూన్ అలోవెర జెల్ ను గ్లాసు నీళ్ళలో మిక్స్ చేసి తాగాలి.

8. గందం పేస్ట్ :

8. గందం పేస్ట్ :

వేసవిలో బాడీ హీట్ తగ్గించడంలో గందం గొప్పగా సహాయపడుతుంది. ఎండలో తిరిగి వచ్చాక నుదుటను మరియు చెస్ట్ వద్ద కొద్దిగా గందం పేస్ట్ అప్లై చేస్తే వడదెబ్బ నుండి ఉపశమనం పొందవచ్చు.

English summary

Do This To Prevent Heat Stroke In Summer!

Heat can kill! As the summer season is approaching, here are some simple home remedies that help in preventing heat stroke.
Desktop Bottom Promotion