ఒక వారం యాలకలు నీళ్ళలో మరిగించి తాగి చూడండి, మార్పు మీకే తెలుస్తుంది..

By: Mallikarjuna
Subscribe to Boldsky

పాయసం ఘుమఘుమలాడాలంటే యాలకలు ఉండాలి, పులవావ్, బిర్యానీలు నోరించే వాసనలు రావాలంటే యాలకలు పడాల్సిందే. కేవలం వాసనలు మాత్రమే కాదు, యాలకల్లో అద్భుతమైన ప్రయోజనాలు ఎన్నో ఉన్నాయి. మసాలాలో రారాజుగా పిలుచుకునే యాలకల్లో ఔషధగుణాలు కూడా దాగున్నాయి. యాలకలను నీళ్ళలో వేసి మరిగించి తాగితే అనేక ఆరోగ్య ప్రయోజనాలను పొందవచ్చు. ముఖ్యంగా మౌత్ అల్సర్ , జీర్ణ సమస్యలు, డిప్రెషన్ వంటి సమస్యలెన్నింటికో విరుగుడుగా యాలకలను ఉపయోగిస్తున్నారు.

అంతే కాదు, యాలకలలో అనేక ఆరోగ్య ప్రయోజనాలున్నట్లు, చాలా పరిశోధనలు కూడా నిర్ధారించాయి. . అందుకే ఆహారాల్లో కూడా దీన్ని జోడించడం ఉపయోగకరమే. ఆహారాలకు మంచి ఫ్లేవర్ మాత్రమే కాదు, మీకు కావాల్సినన్ని ఆరోగ్య ప్రయోజనాలను కూడా అందిస్తుంది.

యాలకలు హార్ట్ బర్న్, ప్రేగు సమస్యలను, ఇర్రిస్టెబుల్ బౌల్ సిండ్రోమ్, గ్యాస్, మలబద్దకం, లివర్, మరియు గాల్ బ్లాడర సమస్యలను నివారించడంలో గ్రేట్ గా సహాయపడుతుంది. అందుకు రోజువారి వంటకాల్లో వీటిని వాడటం లాభదాయకమే...

యాలకల్లో మినిరల్స్, పొటాషియం, క్యాల్షియం, సల్ఫర్, మరియు మాంగనీస్ లు అధికంగా ఉన్నాయి. ఇంకా యాంటీ సెప్టిక్, యాంటీఆక్సిడెంట్, కార్మినేటివ్, డైజెస్టివ్, డ్యూరియాటిక్, ఎక్స్ పక్టోరెంట్, స్టిమ్యులేటివ్, మరియు టానిక్ లక్షణాలు కూడా అధికంగా ఉన్నాయి.

యాలకలు నాడీవ్యవస్థ యొక్క ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తుంది. ఇన్నిఉపయోగాలున్న యాలకలను నీళ్ళలో మరిగించి, ఆ నీటిని తాగడం వల్ల ఆరోగ్యపరంగా ఎలాంటి లాభాలున్నాయానో తెలుసుకుందాం....

1. జీర్ణశక్తిని పెంచుతుంది:

1. జీర్ణశక్తిని పెంచుతుంది:

యాలకలను వివిధ రకాలుగా ఉపయోగించుకోవచ్చు. రోజు కార్డమమ్ వాటర్ తాగడం వల్ల వికారం, వాంతులు, ఎసిడిటి, కడుపుబ్బరం, గ్యాస్, ఆకలి, మలబద్దకం వంటి సమస్యలకు విరుగుడుగా పనిచేస్తుంది.

2. డిటాక్సిఫై:

2. డిటాక్సిఫై:

ఈ మసాలా దినుసును రెగ్యులర్ డైట్ లో చేర్చుకోవడం వల్ల కిడ్నీలు, శరీరంలోని వ్యర్థాలను తొలగిస్తుంది. అందుకే రోజూ కార్డమమ్ వాటర్ తాగమని నిపుణులు సూచిస్తున్నారు.

3. డ్యూరియాటిక్:

3. డ్యూరియాటిక్:

గోరువెచ్చని కార్డమమ్ వాటర్ ను రోజూ తాగడం వల్ల, శరీరంను డిటాక్సిఫై చేయడం మాత్రమే కాదు, ఇందులో డ్యూరియాటిక్ లక్షణాలు కూడా అధికంగా ఉన్నాయి. ఇది యూరినరీ ట్రాక్ట్ ను క్లీన్ చేస్తుంది, బ్లాడర్, కిడ్నీలను శుభ్రం చేస్తుంది. వీటిలో ఉండే వ్యర్థాలను, సాల్ట్ ను, ఎక్సెస్ వాటర్, టాక్సిన్స్ తొలగించి ఇన్ఫెక్షన్స్ ను నివారిస్తుంది.

4. డిప్రెషన్ :

4. డిప్రెషన్ :

రోజూ యాలకలు మరిగించిన వాటర్ తాగడం వల్ల డిప్రెషన్ కు వ్యతిరేఖంగా పోరాడుతుంది. కొన్ని దీర్ఘకాలిక వ్యాధులకు ఆయుర్వేదంగా పనిచేస్తుంది.

5. ఓరల్ హెల్త్:

5. ఓరల్ హెల్త్:

కార్డమమ్ వాటర్ రోజూ తాగడం వల్ల మౌత్ అల్సర్, ఇన్ఫెక్షన్స్, నివారించడంతో పాటు . గొంతు నొప్పి తగ్గుతుంది.

6. కోల్డ్ మరియు ఫ్లూ:

6. కోల్డ్ మరియు ఫ్లూ:

కోల్డ్, ఫ్లూ వంటి లక్షణాల నుండి ఉపశమనం కలిగించడం కార్డమం వాటర్ బెస్ట్ డ్రింక్. ఇంకా బ్రొంకైటిస్, దగ్గుకు కూడా విరుగుడుగా దీన్ని ఉపయోగిస్తారు.

 7. క్యాన్సర్:

7. క్యాన్సర్:

క్యాన్సర్ సెల్స్ పెరగకుండా, క్యాన్సర్ కు వ్యతిరేఖంగా పోరాడటంలో యాలకలు విరుగుడుగా పనిచేస్తాయని చాలా పరిశోధనల్లో కనుగొన్నారు .

8. బ్లడ్ ప్రెజర్ తగ్గిస్తుంది:

8. బ్లడ్ ప్రెజర్ తగ్గిస్తుంది:

యాలకల్లో ఫైబర్, డ్యూరియాటిక్ గుణాలు ఉండటం వల్ల వల్ల బ్లడ్ ప్రెజర్ లెవల్స్ ను తగ్గించడంలో బాగా సహాయపడుతుంది.

9. యాంటీఆక్సిడెంట్ :

9. యాంటీఆక్సిడెంట్ :

యాలకల్లో ఉండే విటమిన్స్, ఫైటో న్యూట్రీయంట్స్, ఎసెన్షియల్ ఆయిల్స్ యాంటీఆక్సిడెంట్స్ గా పనిచేసి శరీరంలో వ్యాధులకు కారణమయ్యే ఫ్రీరాడికల్స్ ను నాశనం చేస్తుంది.

10. ప్యాథోజన్స్ :

10. ప్యాథోజన్స్ :

యాలకల్లో ఉండే విలువైన ఆయిల్ గుణాల వల్ల వైరస్, బ్యాక్టీరియా, ఫంగస్ వంటివి శరీరాన్ని తాకకుండా చేస్తాయి.

English summary

Drink Cardamom (Elaichi) Water For A Week & See What Happens

Drink Cardamom (Elaichi) Water For A Week & See What Happens ,
Subscribe Newsletter