ఈ సమయాల్లో నీళ్లు తాగితే ఏం జరుగుతుందో మీరే తెలుసుకోండి...

Posted By: Lekhaka
Subscribe to Boldsky

నీరు బాగా త్రాగడం ఆరోగ్యానికి మంచిదని చాలా మంది చెప్పడం వినే ఉంటారు. అందులోనూ ఇంట్లో తల్లిదండ్రులు, పెద్దలు నీరు ఎక్కువగా త్రాగమని తరచూ చెప్తూంటారు. కానీ నీరు త్రాగడం వలన గరిష్ట ప్రయోజనాలు ఏ సమయాల్లో ఎంత నీరు త్రాగితే పొందుతారో తెలుసా?

మనలో చాలా మందికి నీరు త్రాగడం ఆరోగ్యకరం అని తెలుసు. కానీ ఎప్పుడు ఎంత నీళ్ళు త్రాగలి అన్న విషయంలో ఇంకా గందరగోళం పరిస్థితే ఉన్నది. కొంత మంది 8 గ్లాసులు త్రాగలి అంటారు. మరి కొంత మంది ప్రతి రోజూ ౩-4 లీటర్లు ఖచ్చితంగా త్రాగాలి అంటారు. ఇంకా, మరి కొద్ది మంది మధ్యాహ్నం ముంది ఎక్కువ, మధ్యాహ్నం తరువాత తక్కువ త్రాగాలి అంటారు.

Drink Water At These Times And See What Happens To Your Health

అన్ని వైపుల నుండి వచ్చే అనేక అభిప్రాయాలు మరియు సలహాలు సరైన మార్గాన్నిఎంచుకోవడం చేస్తూంది. సరే, మీరు ఈ రెండు వర్గ సమూహంలో ఒక దానిలో ఉంటే, ఈ వ్యాసాన్ని తప్పకుండా చదవాలి. ఈ ప్రపంచ నీటి దినమున మేము సరైన సమయంలో త్రాగునీటి ప్రయోజనాలు మరియు దాని వెనుక కారణాల గురించి వివరిస్తాము.

ఈ క్రింద ఇయ్యబడిన జాబితా, సరైన సమయం లో నీటిని త్రాగడం వలన కలుగు ప్రయోజనాలను ఒక సారి చూడండి.

ఉదయాన్నేలేచిన వెంటనే:

ఉదయాన్నేలేచిన వెంటనే:

మీరు ఉదయాన్నే మేల్కోన్న తక్షణమే 1-2 గ్లాసుల నీరు త్రాగాలని ఒక నియమం పెట్టుకోండి. ఇది శరీరం లోని అవయవాలను ఉత్తేజ పరిచి, శరీరం నుంచి విష పదార్థాలను తొలగించడం లో సహాయపడుతుంది.

నిద్రకు ఉపక్రమించే ముందు:

నిద్రకు ఉపక్రమించే ముందు:

ఒక గ్లాసు నీరు త్రాగడం వలన, శరీరం లో ద్రవ నష్టాన్ని నివారించడం లో సహాయ పడి, గుండెపోటు ప్రమాదాన్ని నివారిస్తుంది.

స్నానం చేయడానికి ముందు:

స్నానం చేయడానికి ముందు:

స్నానం చేయడానికి కొంచెం ముందు ఒక గ్లాసు నీరు త్రాగాలని నియమం అనుసరించండి. ఇది శరీరం లోని రక్తపోటుని నియంత్రించుతుంది.

ఆహారం తీసుకోవడానికి ముందు, తరువాత:

ఆహారం తీసుకోవడానికి ముందు, తరువాత:

ఆహారం తీసుకోవడానికి అరగంట ముందు ఒక గ్లాసు నీరు త్రాగడం ఆరోగ్యానికి మంచిది. ఇది కేవలం జీర్ణక్రియ లో సహాయ పడటమే కాకుండా, ఆకలిని అణిచివేస్తుంది. కాబట్టి, ఎవరైతే బరువు తగ్గాలని అనుకొంటారో వారికి ఆహారం తీసుకునే ముందర నీరు త్రాగడం సహాయ పడుతుంది.

మరోవైపు ఆహారం తీసుకున్న అరగంట తరువాత నీరు త్రాగడం వలన, తీసుకున్న ఆహారం లోని పోషకాలు శరీరం లోనికి శోషించ బడతాయి.

వ్యాయామానికి ముందు, తరువాత:

వ్యాయామానికి ముందు, తరువాత:

వ్యాయామానికి ముంది ఒకటి లేదా రెండు గ్లాసుల నీరు త్రాగండి. ఇది శరీరం లోని తేమని(..) ఉంచుతుంది. అలాగే వ్యాయామం తరువాత ఒక గ్లాసు నీరు త్రాగడం చాలా ముఖ్యం. ఇది నిర్జలీకరనాన్ని నిరోధించి తిరిగి శరీరానికి కావలసిన తేమ ని సమకూరుస్తుంది.

 మీరు జబ్బుపడినప్పుడు:

మీరు జబ్బుపడినప్పుడు:

సాధారణ రోజుల్లో కన్నా, జబ్బుపడినప్పుడు నీటి ని పళ్ళరసాల రూపంలో తీసుకోవడం చాలా అవసరం. ఇది శరీరాన్ని తేమగా(..) ఉంచడంలో సహాయపడి ఎటువంటి నిర్జలీకరణానైన నివారిస్తుంది. ఇది బాక్టీరియా మరియు వైరస్ లను దరిచేయనీయదు.

మీరు అలసిపోయినప్పుడు:

మీరు అలసిపోయినప్పుడు:

మీకు తరచూ అలసిపోయినట్టు అనిపిస్తే, మీ శరీరం తగినంత నీరు పొందటం లేదనడానికి ఒక సంకేతం కావచ్చు. ఒక గ్లాసు నీరు శరీరాన్ని శక్తివంతం చేయడానికి సహాయపడుతుంది.

స్నాక్స్ కు ముందు లేదా స్నాక్స్ తో:

స్నాక్స్ కు ముందు లేదా స్నాక్స్ తో:

మీరు ఉపాహారం తినడానికి ముందు లేదా ఉపాహారంతో ఒక గ్లాసు నీరు త్రాగడం వలన తినాలనే కోరికను అణచివేయడానికి మరియు అధిక కేలరీలను తీసుకోవడాన్ని నిరోధించటములో సహాయపడుతుంది.

English summary

Drink Water At These Times And See What Happens To Your Health

Too much of opinion and suggestions pouring in from all sides makes it difficult to choose the correct way. Well, if you are one among this group then you need to check this article.