అల్పాహారం (బ్రేక్ ఫాస్ట్) లో పళ్ళ రసాన్ని ఎందుకు తీసుకోకూడదో తెలుసా?

Subscribe to Boldsky

పండ్లు అనేవి మీ ఆరోగ్యానికి చాలా మంచివి మరియు అన్ని అవసరమైన పోషకాలను కలిగి ఉంటాయి. అయినప్పటికీ, మీరు ఈ పండ్లను తీసుకొని పిండి రసం చేసినప్పుడు, మీకు అవసరమైన పోషకాలను కోల్పోతారు.

అయితే, మీలో చాలామంది అల్పాహారం కోసం ఒక గ్లాసు పండ్ల రసాన్ని త్రాగుతుంటారు. కానీ ఇటీవల జరిపిన పరిశోధన మీ మనసును చెదరగొట్టే కొన్ని ఆశ్చర్యకరమైన వాస్తవాలతో మీ ముందుకు వచ్చింది.

ఉదయాన్నే పండ్ల రసాన్ని త్రాగటం వల్ల అది 2వ రకమైన మధుమేహాన్ని అభివృద్ధి చేసే ప్రమాదాన్ని పెంచుతుందని శాస్త్రవేత్తలు కనుగొన్నారు. పండ్ల రసంలో ఫైబర్ లేదు మరియు చక్కెరను అధికంగా కలిగి ఉంది.

డయాబెటీస్ రోగులు, శరీర పోషణ కోసం ఆహారాన్ని భర్తీ చేసే ప్రయత్నంలో అధిక చక్కెరను కలిగి ఉన్న పండ్ల రసాలతో భర్తీ చేయకూడదని పరిశోధకులు సూచిస్తున్నారు.

Know Why Drinking Fruit Juice For Breakfast Is Bad!

కాబట్టి, పండ్ల రసం ఎలా మధుమేహ ప్రమాదాన్ని పెంచుతుంది ?

శాస్త్రవేత్తలు తెలిపిన దాని ప్రకారం, పండ్ల రసాలను తీసుకోవడం అనేది 2వ రకం డయాబెటీస్ సంభవించటానికి సానుకూలమైన సంబంధమును కలిగి ఉంది. పండ్ల యొక్క నిర్మాణము మొత్తంలో - అధికమైన చక్కెర గుణాలతో పాటు అనేక ఇతర విశేషమైన అంశాలతో కూడి ఉన్నందున, శరీరంలో మధుమేహం యొక్క వేగవంతమైన అభివృద్ధికి దోహదపడే ముఖ్యమైన యంత్రాంగముగా పండ్ల రసాలు ఉండవచ్చు.

అయితే, మరోవైపు పండు మొత్తమును మరియు ఆకుపచ్చని కూరలను తినడం చాలా ఉత్తమమైన ప్రతిపాదన. ఇవి అలా అభివృద్ధి చెందే పరిస్థితుల ప్రమాదాన్ని తగ్గించడంలో సహాయపడుతుంది. ఎందుకంటే అవి తక్కువ శక్తి సాంద్రతను కలిగి, ఫైబర్ మరియు సూక్ష్మపోషకాలలో గొప్ప స్థాయిని కలిగి ఉన్నాయి.

ఉత్పత్తి ప్రక్రియలో భాగంగా, పండ్లు నుండి ఫైబర్ను పూర్తి స్థాయిలో తీసివేయబడుతుంది, అలా వీటిని ఒకేసారి పెద్ద మొత్తంలో త్రాగడాన్ని సులభతరం చేస్తుంది. పరిశోధకులు మాత్రం, రోజులో ఒక చిన్న గ్లాసుతో పండ్ల రసాన్ని త్రాగడాన్ని ఒక మంచి ఆలోచనగా చెప్పారు.

శాస్త్రవేత్తలు ఈ విధంగా పేర్కొన్నారు, "చక్కెర అనేది చాలా పండ్ల రసాల నుండి, మరియు స్మూతీస్ నుండి వస్తున్నాయని మనకు బాగా తెలుసు, అందువల్ల వాటిని తగ్గించాలని అర్థము. శుభవార్త ఏమిటంటే, మనము తగినంత పండ్లను తినడం లేదు, కాబట్టి మీరు దానికి బదులుగా వేరే వాటిని ఎక్కువగా తినవచ్చు"

Know Why Drinking Fruit Juice For Breakfast Is Bad!

2వ రకం డయాబెటిస్ యొక్క లక్షణాలు ఏమిటి?

ఎక్కువ మంది ప్రజలకు 2వ రకం డయాబెటిస్ యొక్క ప్రారంభ సంకేతాలను అర్థం చేసుకోలేకపోతున్నారు. మీరు దాహంతో, చాలా అలసటతో, వివరించలేని విధంగా బరువును కోల్పోతే, మరియు అస్పష్టమైన దృష్టితో చింతించాల్సి ఉన్నప్పుడు, వాటిని గూర్చి తెలుసుకోవలసిన అవసరం చాలానే ఉంది. ఎందుకంటే ఇవన్నీ కూడా 2వ రకం డయాబెటిస్ యొక్క లక్షణాలు.

డయాబెటిస్ గురించి చింతించవలసిన అవసరం మాత్రం ఒకటి వుంది, ఈ వ్యాధి కోసం పూర్తి స్థాయిలో నివారణ అనేది లేదు, డయాబెటిస్ యొక్క ఈ లక్షణాలను నివారించడం ద్వారా మాత్రమే, వ్యాధి నియంత్రణకు ఉన్న ఏకైక మార్గం.

వ్యక్తి జీవనశైలిలో ఒక మంచి మార్పును తీసుకురావడం, బరువు కోల్పోవడం, క్రమం తప్పకుండా వ్యాయామం చేయడం మరియు ఆరోగ్యకరమైన సమతుల్య ఆహారమును తీసుకోవడం వంటివి 2వ రకం డయాబెటిస్ను నియంత్రించడానికి ఉన్న ప్రధానమైన చర్యలు.

For Quick Alerts
ALLOW NOTIFICATIONS
For Daily Alerts

    English summary

    Know Why Drinking Fruit Juice For Breakfast Is Bad!

    Scientists have found that drinking fruit juice can increase the risk of developing type 2 diabetes. Fruit juice lacks fibre and contains high sugar.The researchers suggests that diabetes patients should not replace high-sugar beverages with fruit juice, in an attempt to cater toward their condition.
    Story first published: Saturday, December 9, 2017, 9:00 [IST]
    We use cookies to ensure that we give you the best experience on our website. This includes cookies from third party social media websites and ad networks. Such third party cookies may track your use on Boldsky sites for better rendering. Our partners use cookies to ensure we show you advertising that is relevant to you. If you continue without changing your settings, we'll assume that you are happy to receive all cookies on Boldsky website. However, you can change your cookie settings at any time. Learn more