For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

అలర్ట్ ! మీరు త్రాగే గ్లాసులు విషపూరితం కావచ్చు..!

By Lakshmi Perumalla
|

మార్కెట్ లో కనిపించే రంగురంగుల ఎమిలేటెడ్ గ్లాసులు మిమ్మల్ని ఆకర్షించవచ్చు. దాంతో మీరు రెండో ఆలోచన లేకుండా వాటిని కొనుగోలు చేయవచ్చు. కానీ ఆ గ్లాసులు మీ ఆరోగ్యానికి హానికరం అని మీకు తెలుసా?

అవును, ఒక అధ్యయనంలో బీరు, వైన్ మరియు స్పిరిట్,ఎనామిల్ గ్లాస్ లలో లెడ్ మరియు కాడ్మియం హానికరమైన స్థాయిలలో ఉందని కనుగొన్నారు.

ఈ అధ్యయనం కోసం UK లో ప్లైమౌత్ విశ్వవిద్యాలయంలోని పరిశోధకులు 72 కొత్తవి, 197 సెకండ్ హ్యాండ్ డ్రింకింగ్ గాజు ఉత్పత్తులకు పరీక్షలు నిర్వహించారు. వీటిలోటంబ్లర్, బీరు మరియు వైన్ గ్లాస్ లు మరియు జాడిలు ఉన్నాయి.

గ్లాస్ ల యొక్క ఉపరితలంలో లెడ్ 139, కాడ్మియం 134 ఉన్నట్టు కనుగొన్నారు. కొన్ని సందర్భాలలో లీడ్ యొక్క సాంద్రతలు పరిమితి స్థాయి కంటే 1000 రెట్లు ఎక్కువగా ఉన్నట్లు పరిశోధకులు కనుగొన్నారు.

Beware! Your Drinking Glasses Can Be Toxic

పరీక్షా సమయంలో, ఎక్కువగా ఉపయోగిస్తున్నప్పుడు పెయింట్ యొక్క రేకులు తరచూ గ్లాస్ నుండి దూరంగా ఉండటాన్ని గమనించారు. ఈ పదార్ధాలు సుదీర్ఘ కాలం శరీరంలో ఉండిపోతాయని తెలిసింది.

పెయింట్ మరియు అలంకరించబడిన గాజు సామగ్రిలో ఉండే హానికర అంశాలు ఆరోగ్యం మరియు పర్యావరణం రెండింటి మీద ప్రమాదం చూపుతాయని ప్లైమౌత్ విశ్వవిద్యాలయం నుండి ఆండ్రూ టర్నర్ అంటున్నారు.

కాబట్టి అధిక స్థాయిలో లెడ్ మరియు కాడ్మియం గ్లాస్ లోపల, వెలుపల మరియు గాజు అంచు చుట్టూ ఉంటుందని టర్నర్ అంటున్నారు. సుదీర్ఘ కాలం పాటు ఈ పదార్థాల యొక్క అటువంటి స్థాయిలను చేర్చడం ద్వారా ఎక్కువ ఆరోగ్య సమస్యలు ఎదురవుతాయి. కాబట్టి ఇది అంతర్జాతీయ గాజుసామాగ్రి పరిశ్రమ అత్యవసర విషయంలో చర్య తీసుకోవాలని స్పష్టంగా చెప్పారు.

స్టడీలో కనుగొన్న విషయాలు

జర్నల్ సైన్స్ ఆఫ్ ది టోటల్ ఎన్విరాన్మెంట్ లో ప్రచురించిన అధ్యయనం ప్రకారం 72 ఉత్పత్తులలో 52 ఉత్పత్తులు 70 శాతం కంటే ఎక్కువ లెడ్ ఉన్నట్టు తెలిసింది. అలాగే అన్ని రంగులు కలిపిన మెటల్ మరియు డెకరేటివ్ గోల్డ్ లో కూడా ఉన్నట్టు కనుగొన్నారు.

ఇదే పరిశోధన కాడ్మియంకు కూడా జరిగితే, 72 ఉత్పత్తులలో 51 ఉత్పత్తులలో ఎరుపు ఎనామెల్లో అత్యధిక సాంద్రతలు ఏర్పడ్డాయి. ప్రధాన సాంద్రతలు 40 నుండి 400,000 భాగాలకు (పిపిఎమ్),

కాడ్మియం యొక్క పరిమాణాలు 300 నుండి 70,000 భాగాలకు (పిపిఎమ్) ఉన్నాయని పరిశోధకులు గుర్తించారు.

Beware! Your Drinking Glasses Can Be Toxic

లెడ్ గ్లాస్ జార్స్
పర్యావరణ ఆరోగ్య విపత్తులను అంచనా వేసిన US కార్యాలయం ప్రకారం, గ్లాస్ బాహ్యంగా అలంకరించిన లిప్ ప్రాంతానికి పరిమితి స్థాయిలు 200 ppm మరియు 800 ppm ఉన్నట్టుగా గుర్తించారు. టర్నర్ మాట్లాడుతూ, అదనపు విశ్లేషణ అపాయకరమైన అంశాలు కూడా ఆహారంతో సంబంధం కలిగి ఉన్నాయని, ఆ సామర్థ్యాన్ని కలిగి ఉన్న విస్తృత శ్రేణి గాజుసామానులను అలంకరించడానికి ఉపయోగిస్తున్నారని చెప్పారు.

వీటిలో బీర్, వైన్ లేదా స్పిరిట్స్ యొక్క నిల్వ కోసం ఉపయోగించే సీసాలు, జగ్స్, కొలిచే కప్పులు ఉన్నాయి. సురక్షితమైన ప్రత్యామ్నాయాలు పరిశ్రమకు అందుబాటులో ఉన్న కారణంగా, ఈ అధ్యయనం యొక్క మొత్తం ఫలితాలు ఆశ్చర్యకరమైనవిగా ఉన్నాయి.

కాబట్టి మీరు మీ స్నేహితులు లేదా కుటుంబంతో కలిసి గ్లాస్ లతో త్రాగేటప్పుడు జాగ్రత్తగా ఉండండి. అలాగే ఎనామిల్ లేని గ్లాస్ లను ఉపయోగించాలని నిర్ధారించుకోండి.

English summary

Beware! Your Drinking Glasses Can Be Toxic

A new study has found that enamelled drinking glasses, including beer, wine and spirit bottles, may contain potentially harmful levels of lead and cadmium.
Story first published:Thursday, November 9, 2017, 18:34 [IST]
Desktop Bottom Promotion