కడుపు ఉబ్బరమా? ఈ ఆహారాలకు దూరంగా ఉండండి !

By: Y. Bharath Kumar Reddy
Subscribe to Boldsky

కడుపు ఉబ్బరం వల్ల చాలా ఇబ్బందులుపడాల్సి వస్తుంది. అలాగే ఏమీ తినకున్నా కూడా కడుపు నిండిన భావన కలుగుతుంది. కడుపు ఉబ్బరం వల్ల కొన్ని వ్యాధుల కూడా వస్తుంటాయి. ఇది జీర్ణ వ్యవస్థ ఎక్కువ ప్రభావం చూపుతుంది. కడపులో ఏర్పడే గ్యాస్ వల్ల కడుపు ఉబ్బరం వస్తుంది. కడుపులో నంంచి గ్యాస్ పైకి ఎగజిమ్ముతూ ఇబ్బంది పెడుతుంది.

bloating remedies

గ్యాస్ పైకి తన్నే సమయంలో గుండె వద్ద ఇబ్బంది కలిగిస్తూ గుండెపోటేమో అనుకునేంత ఆందోళనకు గురిచేస్తుంది. కడుపులో గ్యాస్ ఏర్పడడానికి చాలా కారణాలున్నాయి. కొన్ని ఆహారపదార్థాలు కూడా గ్యాస్ ఏర్పడడానికి కారణం అవుతాయి. మరి ఆ ఆహార పదార్థాలు ఏమిటి తెలుసుకుందామా.

1) ఉప్పు

1) ఉప్పు

ఇందులో సోడియం అధికంగా ఉంటుది. సోడియం కణాల్లో నీటి స్థాయిని తగ్గిస్తుంది. అలాగే సోడియం మూత్రపిండాలపై కూడా ప్రభావం చూపుతుంది. ఇక దీన్ని శరీరం నుంచి తొలగించేందుకు బాడీకి చాలా నీరు అవసరం. అందువల్ల ఉప్పును తక్కువగా తీసుకోవడం చాలా మంచిది.

2) ఆల్కహాల్

2) ఆల్కహాల్

ఆల్కహాల్స్ మన ఉదరంపై బాగా ప్రభావం చూపుతాయి. అంతేకాకుండా ఆల్కహాల్స్ మన శరీరాన్ని డీ హైడ్రేట్ గా మార్చేస్తాయి. దీంతో మీ శరీరానికి చాలా నీరు అవసరం అవుతుంది. దీంతో మీ కడుపు ఉబ్బినట్లు అవుతుంది. అందువల్ల ఆల్కహాల్స్ కు దూరంగా ఉండండి.

3) క్యాబేజీ

3) క్యాబేజీ

క్యాబేజ్, కాలీఫ్లవర్ వంటివి వాటిలో ఎక్కువగా గ్యాస్ ఉంటుంది. దీంతో ఇవి కడుపు ఉబ్బరానికి కారణమవుతాయి. వీటిలో ఫ్రక్టోజ్ ఎక్కువగా ఉంటుంది. అయితే ఇది మన శరీరానికి అంత మంచిది కాదు. ఇది కడుపులో గ్యాస్ ఏర్పడేందుకు కారణం అవుతుంది. అలాగే మీథేన్ వాయువును ఇవి ఉత్పన్నం చేస్తాయి. అందువల్ల వీటిని దూరంగా ఉండడం మంచిది.

4) పాలతో తయారైన పదార్థాలు

4) పాలతో తయారైన పదార్థాలు

డైరీ ప్రొడక్ట్స్ లో ఎక్కువగా లాక్టోజ్ ఎక్కువగా ఉంటుంది. అది కడుపు ఉబ్బరానికి కారణం అవుతుంది. వీటిలోని చక్కెరలు పూర్తిగా జీర్ణంకావు. దీంతో గ్యాస్ ఫార్మ్ అవుతుంది. అందువల్ల లాక్టోస్ ఎక్కువగా ఉండే పాల ఉత్పత్తులను తీసుకోకపోవడమే మంచిది.

5) కార్బొనేటెడ్ డ్రింక్స్

5) కార్బొనేటెడ్ డ్రింక్స్

కార్బొనేటెడ్ డ్రింక్స్ లో ఎక్కువగా కార్బన్ ఉంటుంది. వీటివల్ల కడపులో ఈజీగా గ్యాస్ ఏర్పడుతుంది. కార్బన్ కడుపులోని యాసిడ్స్ వ్యతిరేకంగా పని చేయడం వల్ల గ్యాస్ ప్రాబ్ల ఏర్పడుతుంది. అందువల్ల వీలైనంత వరకు కార్పొనేటెడ్ డ్రింక్స్ కు దూరంగా ఉండడం మంచిది.

6) ఫ్రైడ్ ఫుడ్

6) ఫ్రైడ్ ఫుడ్

ఇందులో అధిక కొవ్వు పదార్థాలుంటాయి. అందువల్ల ఇవి జీర్ణం కావడానికి చాలా సమయం పడుతుంది. అలాగే ఈ ఫుడ్స్ కడుపులో గ్యాస్ ఏర్పడడానికి కారణం అవుతాయి. వీటిలో సోడియం కూడా అధికంగా ఉంటుంది. దీంతో శరీరంలోని నీటిస్థాయి తగ్గిపోతుంది. ఫలితంగా కడుపు ఉబ్బరం ఏర్పడుతుంది.

7) ఐస్ క్రీమ్

7) ఐస్ క్రీమ్

ఐస్క్రీమ్ లో లాక్టోస్ ఎక్కువగా ఉంటుంది. ఇవి కూడా పాలకు సంబంధించిన పదార్థాలే. వీటిలో కొవ్వు పదార్థాలు కూడా ఎక్కువగా ఉంటాయి. ఇవన్నీ కడుపులో గ్యాస్ ఫాం కావడానికి కారణం అవుతాయి. అందువల్ల ఐస్ క్రీమ్స్ వీలైనంత వరకు తీసుకోకుండా ఉండడం మంచిది.

8) పాప్ కార్న్

8) పాప్ కార్న్

పాప్ కార్న్ తింటే వెంటనే కడుపు ఉబ్బరం సమస్య ఏర్పడే అవకాశం ఉంది. దీనిలో అధిక సోడియం ఉంటుంది. దీంతో శరీరంలో నీటిస్థాయి తగ్గిపోతుంది. దీన్ని మొక్కజొన్న ద్వారా తయారు చేయడం వల్ల గ్యాస్ సులభంగా ఏర్పడుతుంది. ఇందులో కార్బోహైడ్రేట్లు కూడా ఎక్కువగా ఉంటాయి. ఇవన్నీ కడుపు ఉబ్బరానికి ఎక్కువగా కారణం అవుతాయి.

9) కృత్రిమ తీపిపదార్ధాలు

9) కృత్రిమ తీపిపదార్ధాలు

కృత్రిమ తీపిపదార్ధాలు కూడా కడుపు ఉబ్బరానికి ఎక్కువగా కారణం అవుతాయి. వీటిలో ఆల్కహాల్స్ కూడా ఉంటాయి. వీటిలో ఉండే రసాయనాలు కడుపులోని యాసిడ్స్ కు వ్యతిరేకంగా పని చేస్తాయి. దీంతో గ్యాస్ ప్రాబ్లం వస్తుంది. అందువల్ల నేచరల్ షుగర్ వాడడం చాలా మంచిది.

10) లెగ్యూములు

10) లెగ్యూములు

వీటిని ఎక్కువగా తింటే గ్యాస్ సమస్య తలెత్తుతుంది. వీటిలో ఒలిగోసకరైడ్స్ ఎక్కువగా ఉంటాయి. ఇవి తిన్న ఆహారం జీర్ణం కాకుండా ఉండడానికి కారణం అవుతాయి. అందువల్ల వీటిని తీసుకోకుండా ఉండడం మంచిది.

English summary

foods that cause stomach bloating

If you are experiencing bloating often, here is a list of things that are secretly making you feel bloated, which you must avoid at any cost.
Story first published: Friday, November 17, 2017, 15:40 [IST]
Subscribe Newsletter