నిద్ర పట్టట్లేదా? గాఢంగా నిద్రపోవాలా? అయితే మీరు తినాల్సిన సూపర్ ఫుడ్స్ ఇవే..

Posted By: Mallikarjuna
Subscribe to Boldsky

ఒక్కొక్కరికి ఒక్కో రకమైన నిద్ర అవసరం అవుతుంది. కొంత మంది శరీరం రిలాక్స్ అవ్వడానికి , మరియు విశ్రాంతి తీసుకోవడానికి 9 నుండి 10 గంటల నిద్ర అవసరం అయితే, మరికొందరికి 6 గంటల నిద్ర సరిపోతుంది. నిద్ర విషయంలో తలగడలు, పరుపులు మార్పు చేసినంత మాత్రానా నిద్ర పట్టదు, ఆహారాల విషయంలో తగిన జాగ్రత్తలు తీసుకోవాలి.

మన అందరి జీవితాలకు నిద్ర ఒక క్రమబద్దమైనది, అవసరమైనది, అయితే మనలో చాలా మంది సరిగా నిద్రపొందలేకపోతున్నారు. సరిగా నిద్రపోకపోవడం వల్ల శరీరంలో అన్ని రకాలుగా శక్తి కోల్పోయినట్లుంది. ముఖ్యంగా ఏజింగ్ సమస్యల, బరువు తగ్గడం, క్యాన్సర్ వంటి వాటితో పోరాడే శక్తిని కోల్పోతారు.

అందువల్ల రోజూ సరిపడా నిద్ర పోవడం వల్ల మానసికంగాను, శారీరకంగాను ఆరోగ్యంగా ఉంటారు. రోజూ సరిగా నిద్రపోకపోతే, అది మొత్తం శరీరం యొక్క జీవక్రియల మీద ప్రభావం చూపుతుంది. మార్నింగ్ ఎనర్జీ, బరువు అన్ని రకాలుగా ప్రభావం చూపుతుంది.

ఇలా క్రమం తప్పకుండా రోజూ సరిగా నిద్రపోకపోతే, లేదా నిద్రలేమి సమస్యలు, మద్యరాత్రిలో నిద్రమేల్కోవడం వంటివి జరిగితే , పనిలో ఉన్నప్పుడు నిద్రవస్తుంది.

నిద్రలేమి సమస్యతో బాధపడే వారు, కళ్ళ క్రింద నల్లటి వలయాలు ఏర్పడటం కాకుండా, ముఖంలో కళను పోగొడుతుంది. ఇంకా నిద్రలేమి వల్ల శరీరంలో కార్టిసోల్ మరియు స్ట్రెస్ హార్మోన్లుల ఉత్పత్తి మీద ప్రభావం చూపి, ఆహారపు అలవాట్ల మీద ప్రభావం చూపుతుంది. అది కాస్త క్రమంగా బెల్లీ ఫ్యాట్ కు కారణమవుతుంది

నిద్రలేమి సమస్య వల్ల ఒకటికి మూడు శాతం క్యాన్సర్ రిస్క్ పెరుగుతుంది. బ్రెయిన్ మరియు హార్ట్ హెల్త్ మీద ప్రభావం చూపుతుంది. ఇంకా డయాబెటిస్, మెటబాలిక్ సిండ్రోమ్ వంటి రిస్క్ ను పెంచుతుంది...

 8 Superfoods That Help You Sleep Better

సరిగా నిద్ర పట్టకపోతే , అందుకు కొన్ని ఆహారాలు సహాయపడుతాయి. మీరు తినే ఈ ఆహారాలు నిద్ర మీద ప్రభావం చూపుతాయి. మరి నిద్రకు సహకరించే ఆ సూపర్ ఫుడ్స్ గురించి ఆలస్యం చేయకుండా తెలుసుకుందాం...

1. పాలు

1. పాలు

రాత్రిల్లో గాఢంగా నిద్రపోవాలంటే పాలు తాగాల్సిందే, గోరువెచ్చని పాలు తాగడం వల్ల త్వరగా నిద్రరావడమే కాదు, గాఢంగా కూడా నిద్రపోతారు. ఎందుకంటే పాలలో ట్రెప్టోఫో నిద్రకు సహాయపడుతుంది. దాంతో కళ్ళకు పూర్తి విశ్రాంతి దొరుకుతుంది. పాలలో ఉండే క్యాల్షియం, స్ట్రెస్ ను తగ్గిస్తుంది. మరియు బ్రెయిన్ లో నరాలను ఫ్రీ చేస్తుంది.

2. అరటి పండ్లు

2. అరటి పండ్లు

నిద్రపట్టాలంటే అరటిపండ్లు తినాల్సిందే, అరటిపండ్లలో ట్రెప్టోఫోన్, విటమిన్ బి మరియు మజిల్ రిలాక్సెంట్స్ అయిన మెగ్నీషియం, పొటాషియంలు అందుకు సహాయపడుతాయి. అరటిపండ్లలో కనుగొన్న పొటాషియం, మెగ్నీషియంలు ఓవర్ స్ట్రెస్ కు గురైన కండరాలను రిలాక్స్ చేస్తుంది. అరటిపండ్లలో ఉండే ట్రెప్టోఫోన్ ఫీల్ గుడ్ కెమికల్స్ అయిన సెరోటినిన్ మరియు మెలటోనిన్స్ గా మారి, బ్రెయిన్ హార్మోన్స్ ను విశ్రాంతి పరుస్తుంది. ఈ పండు నిద్రపట్టడానికి బాగా సహాయపడుతుంది

3. వాల్ నట్స్

3. వాల్ నట్స్

వాల్ నట్స్ లో మెలటోనిన్ అధికంగా ఉన్నాయి. ఇవి నిద్ర క్వాలిటిని పెంచుతాయి. రాత్రి నిద్రించడానికి ముందు ఈ సూపర్ స్నాక్ తినడం వల్ల మంచిగా నిద్రపడుతుంది. వాల్ నట్స్ తినడం వల్ల మెలటోనిన్ బ్లడ్ లెవల్స్ పెరుగుతాయి. మంచి నిద్రపడుతుంది. ఇంకా బాదంలలో ట్రెప్టోఫోన్ మరియు మెగ్నీషియంలు ఎక్కువగా ఉన్నాయి. ఇవి మజిల్స్ ను రిలాక్స్ చేస్తాయి.

4. గుమ్మడి విత్తనాలు

4. గుమ్మడి విత్తనాలు

గుమ్మడి విత్తనాల్లో న్యూట్రీషియన్స్, అమినోయాసిడ్ ట్రెప్టోఫోన్స్ అధికం, ఇవి నిద్రపట్టడానికి సహాయపడుతాయి. గుమ్మడి విత్తనాలను రాత్రి నిద్రించడానికి ముందు తినడం వల్ల శరీరంలో ట్రెప్టోఫోన్ లెవల్స్ పెరుగుతాయి. ట్రెప్టోఫోన్ అమినోయాసిడ్స్ శరీరంలో సెరిటెనిన్స్ గా మారడానికి సహాయపడుతాయి. దాంతో మెదడులో మెలటోనిన్స్ (నిద్రకు కారణమయ్యే)హార్మోన్ల ఉత్పత్తికి సహాయపడుతుంది

5. సాల్మన్

5. సాల్మన్

సాల్మన్ మరియు తున వంటి చేపల్లో విటమిన్ బి6 అధికంగా ఉంటుంది. ఇవి నిద్రకు కారణమయ్యే హార్మోన్స్ ను ప్రోత్సహిస్తాయి.వీటిలో ఎక్కువ ఎక్కువ ప్రోటీన్స్ ఉండటం వల్ల నిద్రపట్టడానికి సహాయపడుతుంది.

6. కివి

6. కివి

రోజూ కివి పండ్లు తినడం వల్ల నిద్ర క్వాలిటి మెరుగుపడుతుంది. కివి పండ్లలో స్ట్రాంగ్ యాంటీ ఆక్సిడెంట్స్ ఉండటం వల్ల ఇవి సెరోటిన్ లెవల్స్ ను పెంచుతుంది. ఇవి నిద్రను పెంచే సామర్థ్యం కలిగి ఉండి

7. చమోమెలీ టీ

7. చమోమెలీ టీ

నిద్రించడానికి ముందు చమోమెలీ టీ తాగడం వల్ల వెంటనే నిద్రపడుతుంది. ఇందులో ఉండే గ్లిసిన్, అనే కెమికల్ నిద్రకు సహాయపడే హార్మోనుప్రోత్సహిస్తుంది. కండరాలను రిలాక్స్ చేస్తుంది. ఇది నిద్రక్వాలిటి పెంచుతుంది.

8. లెట్యూస్ :

8. లెట్యూస్ :

లెట్యూస్ ను డిన్నర్ లో సలాడ్స్ రూపంలో తీసుకోవచ్చు. ముఖ్యంగా రాత్రి సమయంలో ఇది నిద్రపోవడానికి సమాయపడుతుంది. సలాడ్స్ రూపంలో దీన్ని తినడం వల్ల త్వరగా నిద్రపడుతుంది, గాఢంగా నిద్రపోవచ్చు

English summary

8 Superfoods That Help You Sleep Better

8 Superfoods That Help You Sleep Better,There are a few foods that help you to induce sleep. Know about these foods, here on Boldsky.