For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

శరీరంలో రక్తాన్ని పెంచే ఆహారాలివే!

శరీరానికి అవసరమైన ఐరన్ ను అందించి తద్వారా హిమోగ్లోబిన్ ను పెంచుకుంటే ఆరోగ్యానికి చాలా మంచిది. ఒంట్లో ఐరన్ శాతం తక్కువగా ఉండటం వల్ల హిమోగ్లోబిన్ తగ్గుముఖం పడితే అలాంటివాళ్లు ఈ ఆహారాలను తీసుకుంటే చాలు.

By Bharath
|

రక్తంలో హిమోగ్లోబిన్ పెరగాలంటే ఐరన్ ఎక్కువగా ఉన్న ఆహారాలను తరచుగా తీసుకోవాలి. చాలామంది రక్తహీనత సమస్యను ఎదుర్కొంటూ ఉంటారు. ఎప్పుడైతే హిమోగ్లోబిన్ తగ్గుతుందో ఒంట్లో రక్తం ఉండాల్సిన స్థానాన్ని నీరు ఆక్రమిస్తుంది. దీంతో ఒళ్లు బరువెక్కడం, కాళ్లు తిమ్మిరిలు ఎక్కడం, కళ్లు తిరగడం వంటి పలు సమస్యలు తలెత్తుతాయి. హిమోగ్లోబిన్ శాతం పెరగడానికి కొన్నిరకాల ఆహారాలు తీసుకోవాలి.

మన శరీరంలో ఐరన్, ఫోలిక్ ఆసిడ్, విటమిన్ సి, విటమిన్ బి12 ఇలాంటివాటిలో దేని పరిమాణం తగ్గినా అది రక్తహీనతకు దారి తీస్తుంది. వీటి లెవెల్స్ తగ్గకుండా చూసుకుంటే చాలు, ఎలాంటి సమస్య ఉండదు. ఎక్కువగా ఐరన్ లోపం వల్ల రక్తహీనత ఏర్పడుతుంది. శరీరానికి అవసరమైన ఐరన్ ను అందించి తద్వారా హిమోగ్లోబిన్ ను పెంచుకుంటే ఆరోగ్యానికి చాలా మంచిది. ఒంట్లో ఐరన్ శాతం తక్కువగా ఉండటం వల్ల హిమోగ్లోబిన్ తగ్గుముఖం పడితే అలాంటివాళ్లు ఈ ఆహారాలను రెగ్యులర్ గా తీసుకుంటే చాలు.

మాంసం

మాంసం

రక్తంలోని హిమోగ్లోబిన్ వేగవంతంగా పెరగడానికి ప్రోటీన్స్ చాలా అవసరం. రెడ్ మీట్ (ఎరుపు రంగులో ఉండే మాంసం) ఇందుకు బాగా ఉపయోగడుతంది. బీఫ్, మటన్, మాంసంలోని కాలేయం వంటివి హీమోగ్లోబిన్ ఉత్పత్తికి అవసరమైన ఐరన్ పెరుగుదలకు తోడ్పడుతాయి. వీటిని ఎక్కువగా తీసుకుంటూ ఉండండి. చికెన్ ను కూడా రెగ్యులర్ గా తీసుకుంటే మనకు కావాల్సినంత ఐరన్ లభిస్తుంది.

రెడ్ మీట్ లో ఐరన్ ఎక్కువగా ఉంటుంది. దీన్ని బాడీ కూడా తర్వగా తీసుకుంటుంది. అయితే రెడ్ మీట్ కొవ్వు పదార్థాలుస్థాయిలు అధిక మొత్తంలో ఉంటాయి. అందువల్ల దీన్ని ఎక్కువగా కూడా తీసుకోకూడదు. మనకు అవసరమైన మేరకు మాత్రమే దీన్ని తీసుకోవాలి.

పండ్లు

పండ్లు

మామిడి, నిమ్మకాయలు, నారింజ వంటి అన్ని సిట్రస్ పండ్లలోనూ ఐరన్ ఎక్కువగా ఉంటుంది. వీటిలో శరీరానికి అవసరమైన విటమిన్- సి కూడా ఎక్కువగా ఉంటుంది. రక్తంలో హిమోగ్లోబిన్ స్థాయిని త్వరగా పెంచడానికి ఈ పండ్లు ఉపయోగపడతాయి. స్ట్రాబెర్రీస్, యాపిల్స్, పుచ్చకాయలు, జామకాయలు, దానిమ్మ వంటి పండ్లు రక్తంలో హిమోగ్లోబిన్ ను పెంచుతాయి. అందువల్ల ఈ పండ్లను రెగ్యులర్ గ్ తింటూ ఉండాలి.

సీఫుడ్

సీఫుడ్

సీఫుడ్ లోనూ హీమోగ్లోబిన్ స్థాయిని పెంచే గుణాలుంటాయి. వీటిలో ఐరన్, మినరల్స్ ఎక్కువగా ఉంటాయి. ఇవి రక్తంలో హిమోగ్లోబిన్ స్థాయిలను పెంచడానికి ఉపయోగపడతాయి. సముద్రపు చేపలు, ఓయిస్ర్టస్, క్లామ్స్ వంటివి ఎక్కువగా తింటూ ఉండాలి.

అపరాలు

అపరాలు

అపరాల్లో ఐరన్ అధికంగా ఉంటుంది. చిక్కుడు, సోయాబీన్స్, చిక్పీస్, బీన్స్ వంటి వాటిని రెగ్యులర్ గా తీసుకుంటూ ఉండాలి. సోయా గింజల్ని అందుకు సంబంధించిన ఆహారపదార్థాలను ఎక్కువగా తీసుకుంటే మంచిది. ఇవన్నీ కూడా హిమోగ్లోబిన్ ను పెంచడానికి బాగా ఉపయోగపడతాయి.

తృణధాన్యాలు

తృణధాన్యాలు

తృణధాన్యాల్లోనూ ఐరన్ అధికంగా ఉంటుంది. రైస్, గోధుమ, బార్లీ, మరియు వోట్స్ వంటి వాటిలో హిమోగ్లోబిన్ పెంచే గుణాలు ఎక్కువగా ఉంటాయి. రెగ్యులర్ గా వీటితో తయారు చేసిన ఆహారాన్ని తింటూ ఉండాలి. దీంతో శరీరానికి అవసరమైన కార్బోహైడ్రేట్లు అందుతాయి. ముఖ్యంగా బ్రౌన్ రైస్ వల్ల ఐరన్ ఎక్కువగా బాడీకి అందుతుంది. దీంతో బ్లడ్ లో హిమోగ్లోబిన్ పెరుగుతుంది.

తాజా కూరగాయలు

తాజా కూరగాయలు

తాజా కూరగాయలతో తయారు చేసిన ఆహారపదార్థాలను ఎక్కువగా తీసుకుంటూ ఉండాలి. ఇందులో ఐరన్ ఎక్కువగా ఉంటుంది. అలాగే మినరల్స్ కూడా ఉంటాయి. బంగాళాదుంపలు, బ్రోకలీ, టమోటాలు, గుమ్మడికాయలు, బీట్రూట్ వంటి వాటిని ఎక్కువగా తింటూ ఉండాలి. అలాగే పాలకూరను రెగ్యులర్ గా తింటూ ఉండాలి. దీంతో రక్తంలో హిమోగ్లోబిన్ శాతం పెరుగుతుంది.

7. గుడ్లు

7. గుడ్లు

గుడ్లలోనూ ఐరన్ అధికంగా ఉంటుంది. ఇందులో పోషకాలు కూడా దండిగా ఉంటాయి. గుడ్డు పచ్చసొనలో ఎక్కువగా మినరల్స్, విటమిన్లు ఉంటాయి. రోజూ ఉడికించిన గుడ్లను తింటే చాలా మంచిది. బాడీకీ అవసరమైన ఐరన్ అందించడమేకాకుండా రక్తంలో హిమోగ్లోబిన్ స్థాయిని కూడా ఇది పెంచుతుంది.

డ్రై ఫ్రూట్స్

డ్రై ఫ్రూట్స్

డ్రై ఫ్రూట్స్ కూడా హిమోగ్లోబిన్ పెంచేందుకు బాగా ఉపయోగపడతాయి. ఆప్రికాట్లు, ఖర్జూరాలు వంటి వాటిలో ఐరన్, విటమిన్లు, ఫైబర్ ఎక్కువగా ఉంటుంది. రక్తంలో హిమోగ్లోబిన్ స్థాయిని పెంచేందుకు ఇవి బాగా ఉపయోగపడతాయి. అందువల్ల ఎక్కువగా డ్రై ఫ్రూట్స్ తీసుకుంటూ ఉండండి.

9. నట్స్

9. నట్స్

నట్స్ లో అధికంగ ఐరన్ ఉంటుంది. బాదం పప్పులో అధిక శాతం ఐరన్ ఉంటుంది. రోజు ఒక పిడికెడు బాదం పప్పులను తింటే 6 శాతం ఐరన్ శరీరానికి అందుతుంది. ఒకవేళ మీరు ఆస్తమా కలిగి ఉంటె మాత్రం, వేరుశనగను తినకండి. జీడిపప్పులోనూ ఐరన్ ఎక్కువగా ఉంటుంది.

డార్క్ చాక్లెట్

డార్క్ చాక్లెట్

డార్క్ చాక్లెట్లను పిల్లలు ఎక్కువగా ఇష్టపడతూ తింటూ ఉంటారు. ఇందులో ఐరన్ ఎక్కువగా ఉంటుంది. దీన్ని ఎక్కువగా తీసుకుంటే చాలా మంచిది. ఈ ఆహారాలన్నీ శరీరంలో ఐరన్ పెంచుతాయి. రక్తంలో హిమోగ్లోబిన్ ఎక్కువగా పెరగడానికి ఉపయోగపడతాయి. రోగనిరోధక శక్తిని కూడా పెంచుతాయి.

English summary

Foods That Increase Blood in Body Super Fast!

Here Foods That Increase Blood in Body Super Fast!
Desktop Bottom Promotion