For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

లూజ్ మోషన్ తగ్గాలంటే వెంటనే ఈ ఫుడ్స్ తినడం మానేయాలి..

By Mallikarjuna
|

ఈ కాలంలో మ‌న‌కు క‌లిగే అనారోగ్యాల్లో నీళ్ల విరేచ‌నాలు కూడా ఒక‌టి. ఫుడ్ పాయిజ‌నింగ్‌, అప‌రిశుభ్ర‌త, క‌డుపులో పురుగులు ప‌డ‌డం... ఇలా కార‌ణాలు ఏమున్నా నీళ్ల విరేచ‌నాలు క‌లిగితే ఇక ఆ బాధ వ‌ర్ణ‌నాతీతం. ఈ క్ర‌మంలో శ‌రీరం డీహైడ్రేష‌న్‌కు గురై మ‌నం ఇంకా నీర‌స‌ప‌డిపోతాం.

Foods To Avoid If You Have Loose Motion

ఈ సమస్య నుండి బయటపడటం ఎలా, ఇలాంటి పరిస్థితిని కంట్రోల్ చేసుకోవడం కొంచెం కష్టమే. డయోరియాతో బాధపడే వారకి డైట్ సహాయపడుతుంది. ఇలాంటి సమయంలో ఎలాంటి ఆహారాలు తీసుకోవాలి. ఎలాంటి ఆహారాలకు దూరంగా ఉండాలి? అని ఆహారాల మీద ఒక అవగాహన కలిగి ఉండాలి.

లూజ్ మోషన్ కు చెక్ పెట్టే పవర్ ఫుల్ హోం రెమెడీస్ ...లూజ్ మోషన్ కు చెక్ పెట్టే పవర్ ఫుల్ హోం రెమెడీస్ ...

లూజ్ మోషన్స్ అవుతున్న సమయంలో తప్పనిసరిగా కొన్ని ఆహారాలకు దూరంగా ఉండాలి..అవేంటంటే..

కెఫిన్ :

కెఫిన్ :

నిద్రలేచిన వెంటనే కాఫీ , టీలు తాగే అలవాటు చాలా మందికి ఉంటుంది. అయితే లూజ్ మోషన్స్ సమయంలో వీటిని తీసుకోకపోవడమే మంచిది. రెండు మూడు రోజులు కెఫిన్ కు దూరంగా ఉండటం వల్ల డయోరియా కంట్రోల్ అవుతుంది.

ఎలా ప్రభావితం చేస్తుందంటే? కాఫీ, టీలలో ఉండే కెఫిన్ జీర్ణవ్యవస్థ మీద ప్రభావం చూపుతుంది. తిన్నం ఆహారం సరిగా జీర్ణం అవ్వకపోతే, కేఫినేటెడ్ డ్రింక్స్ లోని ఎసిడిటి డయోరియాను మరింత వరెస్ట్ గా మార్చుతుంది.

ఆల్కహాల్ :

ఆల్కహాల్ :

ఆల్కహాల్ నేరుగా జీర్ణవ్యవస్థ మీద ప్రభావం చూపుతుంది. స్టొమక్ అప్ సెట్ కు కారణమవుతుంది. బేసిక్ గా ఆల్కహాల్ ప్రేగుల్లో అవకతవకలకు కారణమవుతుంది. శరీరంలోని నీటిశాతాన్ని తగ్గిస్తుంది. శరీరంలోని నీరు మోషన్ రూపంలో వెళ్లిపోవడం వల్ల శరీరం డీహైడ్రేషన్ కు కారణమవుతుంది. కాబట్టిడయోరియా సమయంలో ఆల్కహాల్ కు పూర్తిగా దూరంగా ఉండటం మంచిది.

కారం :

కారం :

లూజ్ మోషన్ సమయంలో కారం తినకపోవడమే మంచిది. స్సైసీ ఫుడ్స్ తినడం వల్ల నేరుగా పొట్ట మీద ప్రభావం చూపి లూజ్ మోషన్ కు కారణమవుతుంది. కారంగా ఉండే ఆహారాలను తినడం వల్ల పొట్టలో మంట, గ్యాస్ ఎక్కువై, లూజ్ మోషన్ ఎక్కువ అవుతుంది.

క్యాబేజ్ అండ్ కాలీఫ్లవర్ :

క్యాబేజ్ అండ్ కాలీఫ్లవర్ :

లూజ్ మోషన్స్ అయ్యే సమయంలో కొన్ని ఆహారాలకు దూరంగా ఉండటమే మంచిది. వీటిలో క్యాబేజ్ అండ్ కాలీఫ్లవర్ ఒకటి. ఎందుకంటే, ఈ వెజిటేబుల్స్ పొట్టలో అవకతవలున్నప్పుడు, గ్యాస్ ఏర్పడుతుంది. స్టొమక్ అప్ సెట్ అయినప్పుడు ఈ ఆహారాలు జీర్ణం అవ్వడానికి ఎక్కువ సమయం తీసుకోవడం వల్ల లూజ్ మోషన్ మరింత ఎక్కువ అవుతుంది. అందువల్ల ఇలాంటి పరిస్థితిలో క్యాబేజ్, కాలీఫ్లవర్ ను తీసుకోకపోవడమే మంచిది.

స్వీట్స్ :

స్వీట్స్ :

స్వీట్స్, ఆర్టిఫిషియల్ స్వీట్నర్స్ ను తీసుకోకపోవడమే మంచిది. మోషన్స్ సయంలో వీటిని స్వీట్స్ లో పంచదార వాడటం వల్ల వాటిలో ఉండే స్వీటనింగ్ ఏజెంట్ లికాసిన్, ఇది లాక్సేటివ్ స్వభావాన్ని కలిగి ఉండటం వల్ల జీర్ణవ్యవస్థ మీద ప్రభావం చూపుతుంది. దాంతో కడుపులో గ్యాస్, కడుపుబ్బరం వల్ల జీర్ణం అవ్వడం కష్టం అవుతుంది. కాబట్టి, ఖచ్చితంగా ఆర్టిఫిషియల్ స్వీట్నర్స్ కు దూరంగా ఉండటం మంచిది.

లూజ్ మోషన్స్ ను త్వరగా తగ్గించే 15 అద్భుతమైన హోం రెమెడీస్..!లూజ్ మోషన్స్ ను త్వరగా తగ్గించే 15 అద్భుతమైన హోం రెమెడీస్..!

డైరీ ప్రొడక్ట్స్ :

డైరీ ప్రొడక్ట్స్ :

పాలు, బట్టర్, సాఫ్ట్ చీస్, ఐస్ క్రీములు వంటి డయోరియాకు కారణం అవుతుంది. జీర్ణవ్యవస్థకు పాల ఉత్పత్తులలోని ల్యాక్టేషన్స్ అవసరం అవుతాయి. అయితే ఇవి తక్కువగా ఉత్పత్తి అవ్వడం వల్ల పొట్టలో చాలా అసౌకర్యం కలిగి డయోరియా ఎక్కువ అవుతుంది. అలాగే వీటిలో ఉండే షుగర్ కంటెంట్ కడుపుబ్బరం, గ్యాస్, వికారం వంటి వాటికి దారితీస్తుంది. దాంతో లూజ్ మోషన్ పెరుగుతుంది.

English summary

Foods To Avoid If You Have Loose Motion

Diet plays an important role when we have diarrhoea. The knowledge of the food stuffs to be avoided during this condition can ease our discomfort to a large extent.
Story first published:Thursday, August 31, 2017, 12:18 [IST]
Desktop Bottom Promotion