మీ కాలేయమును శుభ్రం చేయడానికి, ఈ అల్లం-పసుపు మిశ్రమాన్ని ప్రయత్నించండి

By: SSN Sravanth Guthi
Subscribe to Boldsky

"బంగారు పాలు" అనేది సుగంధ ద్రవ్యాలు మరియు మూలికలతో పాటు కొబ్బరినూనె మరియు కొబ్బరిపాలతో కలిసిన ఒక గొప్ప మిశ్రమము మరియు ఇది పోషకాలను కలిగి ఉన్న ఒక గొప్ప వనరు కూడా. ఈ ప్రసిద్ధమైన వంటకం

ఆయుర్వేదం నుండి వచ్చిన ఒక పురాతన వైద్య వ్యవస్థలో ఒక భాగంగా ఉంది. ఈ పానీయం శరీరంలో దాగిఉన్న హానికరమైన పదార్థాలను నిర్వీర్యం చేసేందుకు, బ్లడ్ షుగర్ను నియంత్రించేందుకు, శరీరంపై ఉన్న మంటను మరియు మరికొన్నింటిని నియంత్రించడానికి ఒక సహజమైన పరిహారముగా ఇది పనిచేస్తుంది.

ఈ పానీయం కాలేయమును పరిశుభ్రంగా ఉంచే ఒక సహజమైన పదార్ధంగా ఉంటుంది. కొబ్బరి పాలు, కొబ్బరి నూనె, అల్లం, పసుపు, నల్ల మిరియాల వంటి మిశ్రమాలతో ఈ పానీయం తయారవుతుంది.

Ginger-Turmeric Mixture For Body

మీరు తేనెతో కూడా ఈ పానీయమును తీసుకోవచ్చు. ఈ పానీయంలో అనేక ఔషధ గుణాలతో కలిగి ఉన్న ఒక శక్తివంతమైన పదార్ధమైన "పసుపును" కలిగి ఉంది.

ఈ పానీయమును సాంప్రదాయకమైన పాలు రూపంలో కూడా తయారవుతుంది. కానీ అందులో భోజనం, పేస్ట్, టీ మరియు సూప్స్లను కూడా చేర్చబడి, వేడి చెయ్యబడతాయి.

కండరాల నొప్పులు మరియు కీళ్ల నొప్పులు, కాలేయ వ్యాధి, చర్మ సమస్యలు, శ్వాసకోశ సమస్యలు, జీర్ణశయ సమస్యలు మరియు ఆర్థరైటిస్ వంటి చికిత్సలో ప్రధానమైన పదార్ధమైన పసుపు - ఒక సహజమైన నివారిణిగా పనిచేస్తుంది.

శరీరానికి ఎదురయ్యే నొప్పులు, వివిధ రోగాలకు కారణమయ్యే సూక్ష్మజీవుల వంటి వాటిని సమర్థవంతంగా నిరోధించే లక్షణాలను ఇది కలిగి ఉన్నందున మొత్తం ఆరోగ్యాన్ని కూడా సంరక్షిస్తుంది.

Ginger-Turmeric Mixture For Body

అలెర్జీలు, శరీరంలో వచ్చే అసమానతలు, అల్జీమర్స్ మరియు జ్ఞాపకశక్తి లోపించడం, వంటి ప్రమాదకరమైన అభిజ్ఞా సంక్రమణలు, మొదలగు వాటిని నిరోధిస్తుందని కొన్ని అధ్యయనాలు ధృవీకరించాయి.

ఇది రక్తంలో చక్కెరను మెరుగుపరుస్తుంది మరియు స్థిరీకరించడంతో పాటు, నిరాశ - ఆందోళన వంటి సమస్యలకు సరైన చికిత్సను అందిస్తోంది మరియు కాలేయాన్ని పరిశుభ్రంగా ఉంచుతుంది.

Ginger-Turmeric Mixture For Body

ఈ పానీయాన్ని తయారు చేయవలసిన పద్ధతి:

1 స్పూన్ : పసుపు

తాజా అల్లం (తగినంత)

1 స్పూన్ : కొబ్బరి నూనె

నల్ల మిరియాలు చిటికెడు

2 కప్స్ : కొబ్బరి నూనె

1 స్పూన్ : తేనె

అర స్పూన్ : దాల్చిన చెక్క

ఒక పాన్ లో, పైన చెప్పిన అన్ని పదార్థాలను బాగా కలిపి, 5 నిమిషాలు పాటు ఆ మిశ్రమమును వేడి చెయ్యాలి.

Ginger-Turmeric Mixture For Body

అల్లంకు శోథ నిరోధక లక్షణాలను కలిగి ఉన్నాయి, ఋతునొప్పి - సాఫీగా సాగేందుకు కారణమవుతుంది, రక్తపోటును నియంత్రిస్తుంది, కీళ్ళ నొప్పులను మరియు జలుబు లక్షణాలను తగ్గించటంలో మద్దతునిస్తుంది.

కొబ్బరి పాలలో అధికంగా విటమిన్ B, మెగ్నీషియం, ఎలెక్ట్రోలైట్స్ మరియు కొవ్వు ఆమ్లాలను కలిగి ఉండటంవల్ల, అవి రక్తంలో ఉన్న చక్కెరను నియంత్రిస్తాయి.

కొబ్బరి నూనె - గాయాలను సమర్థవంతంగా మాన్పించి, రోగనిరోధక శక్తిని మెరుగుపరుస్తుంది మరియు జీర్ణక్రియకు సహాయపడుతుంది. అలాగే ఇది బరువు తగ్గడానికి కూడా సహాయపడుతుంది.

నల్ల మిరియాలు - పసుపు యొక్క శోషణకు (లక్షణాలను గ్రహించటంలో) సహాయపడతాయి, మరియు శరీరంలో స్వేచ్ఛగా తిరిగే ఇతర కారకాలపై పోరాడుతుంది మరియు జలుబును నయం చేస్తుంది.

తేనెకి శక్తివంతమైన యాంటీ బాక్టీరియల వంటి లక్షణాలను కలిగి ఉన్నాయి, ఇవి సాధారణంగా జలుబు మరియు అలెర్జీల నుండి ఉపశమనమును కలిగించగలవు.

English summary

Ginger-Turmeric Mixture For Body

This popular recipe from Ayurveda is a part of the ancient healing system. This drink is a natural remedy to detoxify the body, regulate blood sugar, treat inflammation and many more.
Story first published: Friday, November 24, 2017, 7:00 [IST]
Subscribe Newsletter