For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

  చూడటానికి ఆవగింజే, కానీ దీని వల్ల కలిగే లాభాలు మాత్రం కొండంత..!

  By Sindhu
  |

  మన ఇంట్లో వినియోగించే పోపుల డబ్బాలోని వస్తువులన్నీ ఆయుర్వేద విలువలు కలిగినవే. సాధారణంగా మనకు ఎదురయ్యే రోగాల నుంచి మనల్ని రక్షించి ఎటువంటి మందులు వాడకుండానే ఉపశమనం అందించే శక్తి వీటికి ఉన్నట్టు ఎన్నో సందర్భాల్లో రుజువైంది. నిత్యం మన వంటకాల్లో ఉపయోగించే పోపుల పెట్టెలో ఉండే ఆవాల గురించి తెలుసుకుందాం..

  పరిమాణంలో చాలా చిన్నగా కనిపించే వాటిని ఆవాలతో పోలుస్తూ ఆవగింజంత అంటారు. కానీ వాటి వల్ల కలిగే లాభాలు మాత్రం కొండంత. వేల సంవత్సరాలుగా ఆవాలను వంటల్లో వాడుతున్నారు. ఆవాలు లేని పోపు ఊహించలేము. ఊరగాయలు, పచ్చళ్లు, కొన్ని ప్రత్యేక వంటకాలకు ఆవాలు ప్రత్యేక రుచిని కూడా ఇస్తాయి.

  చూడటానికి ఆవగింజే, కానీ దీని వల్ల కలిగే లాభాలు మాత్రం కొండంత..!

  ఆవాల్లోనూ పోషక విలువలతో పాటు ఔషధ గుణాలు కూడా ఉన్నాయి. ఆవాల్లో ఐరిన్‌, జింక్‌, మాం గనీస్‌, కాల్షియం, మెగ్నీషియం, ఒమెగా 3 ఫ్యాటియాసిడ్స్ , ప్రోటీన్లు , పీచుపదార్దము ఉంటాయి . ఘాటైన వాసనను కలిగి ఉండే ఆవాలు ఆయుర్వేదంలో ఎంతో బాగా ఉపయోగపడతాయి. పైథోన్యూట్రియంట్లు, ఖనిజ లవణాలు, యాంటీ ఆక్సిడెంట్లు, డైటరీ ఫైబర్‌ ఎక్కువగా లభిస్తాయి.

  ప్రతి వందగ్రాముల ఆవాలలో 9-82గ్రా టోకోఫెనాల్‌ అనే పదార్థం (విటమిన్‌ 'ఇ'కి సమానం) శరీరంలో కొవ్వు నిల్వలు పేరుకోకుండా సహాయపడుతుంటాయి. అందుకనే కొంచెంగా ఆవనూనెను కూరల్లో వాడుకోమని వైద్యులు సూచిస్తారు. మరి ఆవాలను వంటల్లో వాడటం వల్ల మన శరీరానికి ఎలాంటి ప్రయోజనాలను అందిస్తాయో తెలుసుకుందాం..

  1. కొలెస్ట్రాల్ తగ్గిస్తుంది -

  1. కొలెస్ట్రాల్ తగ్గిస్తుంది -

  ఆవాల్లో ఫైటో న్యూట్రియేట్స్, విటమిన్లు, ఖనిజలవణాలు, యాంటీ ఆక్సిడెంట్లు పుష్కలంగా ఉంటాయి. ఆవాల్లో విటమిన్ బి3 చాలా ఎక్కువ మొత్తంలో లభిస్తుంది. ప్రతి రోజు ఆవాలను ఆహారంలో భాగం చేసుకోవడం ద్వారా రక్తంలో కొలెస్ట్రాల్ స్థాయిలను అదుపులో ఉంచుకోవచ్చు. రక్తనాళాలు గట్టి పడకుండా నివారించడమే కాదు బీపీ కూడా ఆవాలు అదుపులో ఉంచుతాయి.

  2. పంటినొప్పి :

  2. పంటినొప్పి :

  పంటి నొప్పి కలిగినపుడు గోరువెచ్చటి నీటిలో ఆవాలు వేసి కొంత సేపు తర్వాత ఆ నీటిని పుక్కలేస్తే నొప్పి తగ్గుతుంది .

  3. జుట్టు సమస్యలను తగ్గిస్తుంది :

  3. జుట్టు సమస్యలను తగ్గిస్తుంది :

  ఆవాలపోడితో జుట్టు కడుక్కూంటే .. జుట్టు రాలడం తగ్గుతుంది .. పేలు తగ్గదాని కు తగ్గదనికు ఆవాల పొడి నునే రాసుకోవాలి. మాడు మీద కురుపులు ,దురదలను అవ్వలు తగ్గిస్తయాయి.

  4. ఉబ్బసం వ్యాధి

  4. ఉబ్బసం వ్యాధి

  ఉబ్బసం వ్యాధి ఉపశమనానికి ఆవాలను కొద్దిగా చెక్కెరతో కలిపి తీసుకోవాలి.

  5. శ్వాసకోశ సమస్యలను నివారిస్తుంది:

  5. శ్వాసకోశ సమస్యలను నివారిస్తుంది:

  ఆవాల పొడిని తేనే తో కలిపి తీసుకుంటే శ్వాసకోశ సమస్యలను పరిస్కరించవచ్చును.

  6. పులిపిర్లు తగ్గిస్తుంది:

  6. పులిపిర్లు తగ్గిస్తుంది:

  మందంగా ఉన్న పులిపిరి కాయలమీద ఆవాలు నూరిన ముద్దా రాస్తే పులిపిరులు ఎండి రాలిపోతాయి .

  7. కీళ్ళ నొప్పుల నుండి ఉపశమనం కలిగిస్తుంది:

  7. కీళ్ళ నొప్పుల నుండి ఉపశమనం కలిగిస్తుంది:

  కీళ్ళ నొప్పులతో బాధపడేవారు .. ఆవాల ముద్దా , కర్పూరము కలిపి బాధించే ప్రాంతమము మీద రాయటం వల్ల భాధ తగ్గుతుంది .

  8. రక్తపోటు తగ్గిస్తుంది:

  8. రక్తపోటు తగ్గిస్తుంది:

  ఆవాలులో సెలీనియం అనే రసాయనం వలన మనకు యాంటీ ఇంఫ్లమేటరీ ప్రయోజనాలు కలవు. ఆవాలలోని మెగ్నీషియం అస్థమా మరియు కీళ్ళ వాతం మరియు రక్త పోటును తగ్గించును.

   9. టాక్సిన్స్ తొలగిస్తుంది:

  9. టాక్సిన్స్ తొలగిస్తుంది:

  శరీరంలో వ్యర్థాలను బయటకు నెట్టి కొవ్వును తగ్గించే గుణం ఆవాలుకి ఉంది.

  10. ఒళ్ళు నొప్పులు తగ్గిస్తుంది:

  10. ఒళ్ళు నొప్పులు తగ్గిస్తుంది:

  ఆవాలు ముద్దలా నూరుకొని వేడి నీళ్లు ఉన్న బకెట్‌లో వేసి స్నానం చేస్తే ఒంటి నొప్పులు మాయమవుతుంది.

  11. జ్వరం తగ్గిస్తుంది:

  11. జ్వరం తగ్గిస్తుంది:

  గొంతునొప్పి, దగ్గు జ్వరం ఉన్నప్పుడు మరుగుతున్న నీళ్లలో చిటికెడు ఆవపోడి, తగినంత తేనె వేసి ఇస్తే సమస్యలు నియంత్రణలో ఉంటాయి.

  12. క్యాన్సర్ వ్యతిరికి :

  12. క్యాన్సర్ వ్యతిరికి :

  ఘాటైన నూనెలు క్యాన్సర్‌కు వ్యతిరేకంగా పోరాడతాయి.

  13. స్కిన్ టోన్ మారుతుంది

  13. స్కిన్ టోన్ మారుతుంది

  తెల్ల ఆవనూనె చర్మ రంగును మెరుగు పరుస్తుంది. దీన్ని శరీరానికి రాసుకొని, నలుగుపెట్టి స్నానం చేస్తే చర్మ సమస్యలు తగ్గి రంగు తేలుతుంది.

  14. జీర్ణశక్తి పెంచి, మలబద్దకం నివారిస్తుంది:

  14. జీర్ణశక్తి పెంచి, మలబద్దకం నివారిస్తుంది:

  ఆవాలలో మ్యూసిలేజ్ అనే ఒక చిక్కటి పదార్థం ఉంటుంది. ఇది మలబద్దకాన్ని నివారిస్తుంది, కొలెస్ట్రాల్‌ను నియంత్రిస్తుంది, జీర్ణక్రియను పెంపొందిస్తుంది. నిరోధక శక్తిని కూడా పెంచుతుంది. రోజుకు ఒక టీ స్పూన్ ఆవపిండిని తీసుకోవడం ద్వారా మలబద్దకానికి దూరంగా ఉండొచ్చు.

  15. చర్మ సంరక్షణకు :

  15. చర్మ సంరక్షణకు :

  వీటిలో ఉండే యాంటీ ఫంగల్, యాంటీ బ్యాక్టీరియల్ గుణాల వల్ల ఇది చర్మం మీద ఏర్పడే ఈ రకమైన ఇన్‌ఫెక్షన్లకు మంచి మందు. మొటిమలు తగ్గించడానికి కొబ్బరి నూనెలో ఆవాలు వేయించి చల్లారిన తర్వాత ఆ నూనె వడగట్టి రాత్రి నిద్ర పోవడానికి ముందు ఈ నూనెను నీటితో కలిపి ముఖానికి పట్టించి ఉదయాన్నే కడిగేస్తే మంచి ఫలితం కనిపిస్తుంది.

  హెచ్చరిక:

  హెచ్చరిక:

  జీర్ణ కోశ అల్సర్లు , కిడ్నీ జబ్బులు ఉన్నా వారు

  దీని వేపర్స్ (పొగలు)కంటికి తగిలితే కన్ను ఇర్రిటేట్ అగును .

  ఆరు సం. లోపు పిల్లలకు ఇవ్వకూడదు .

  English summary

  Health Benefits of Mustard Seeds in Telugu

  Health Benefits of Mustard Seeds,Mustard seeds are a very popular ingredient in the American cuisine. Benefits of mustard seeds are many and popularly used for taste generally in hot dogs, where mustard sauce is very much preferred. It also has medicinal applications dating back to the time of Hippocrates.
  Story first published: Wednesday, August 23, 2017, 16:51 [IST]
  We use cookies to ensure that we give you the best experience on our website. This includes cookies from third party social media websites and ad networks. Such third party cookies may track your use on Boldsky sites for better rendering. Our partners use cookies to ensure we show you advertising that is relevant to you. If you continue without changing your settings, we'll assume that you are happy to receive all cookies on Boldsky website. However, you can change your cookie settings at any time. Learn more