For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

  ఒక రోజులో 3 కప్పుల కాఫీని తాగటం, మీ ఆరోగ్యానికి మంచిదే !

  |

  కాఫీ గురించి చాలామందికి దురభిప్రాయాలు ఉన్నాయి. కాఫీ తాగితే మీ ఆరోగ్యానికి మంచిదని కొందరు చెప్తారు, అయితే ఇతరులు మాత్రం కాఫీ మీ ఆరోగ్యంపై చెడు ప్రభావం చూపుతాయని చెబుతారు.

  ఇంకా బాగా చెప్పాలంటే, మీరు కాఫీని తీసుకొనే మోతాదుని బట్టి అది ఆధారపడి ఉంటుంది. మోస్తరుగా కాఫీ తీసుకోవడం వల్ల అది మీ ఆరోగ్యానికి మంచిని చేయవచ్చు.

  యూనివర్శిటీ ఆఫ్ సౌతాంప్టన్ పరిశోధకులచే జరిపిన ఒక అధ్యయనం ప్రకారం, ఒక రోజులో 3-4 కప్పుల కాఫీ మీ ఆరోగ్యానికి గణనీయమైన ప్రయోజనాలను అందించగలదని కనుగొనబడింది.

  కాలేయ వ్యాధి, డయాబెటిస్, జ్ఞాపకశక్తి తగ్గిపోవటం మరియు కొన్ని రకాల క్యాన్సర్ ముప్పును తగ్గించడం వాటి ప్రయోజనాలను ఒక్కొ రోజుకు 3 కప్పుల కాఫీని తాగడం మనం పొందవచ్చు అని కొన్ని అధ్యయనాలు పేర్కొన్నాయి.

   Health Benefits Of Drinking 3 Cups Of Coffee Everyday

  కాఫీ ఆరోగ్య ప్రయోజనాలు :

  ఈ ప్రయోజనాలతో పాటు అదనంగా, 200 పైగా చేసిన సమీక్షలపై ఆధారపడిన అధ్యయనంలో, కాఫీని త్రాగటం వల్ల మరణమును మరియు గుండె జబ్బుల ప్రమాదాన్ని గణనీయంగా తగ్గిస్తుందని బయటపడింది. ఇంతలో, గుండె నొప్పి కారణంగా చనిపోయే ప్రమాద తీవ్రత - కాఫీ త్రాగటం వలన చాలా తక్కువ ఉందని మరొక అధ్యయనంలో తేలింది.

  మీరు మోస్తారుగా కాఫీని గాని తీసుకుంటే, అది మీ ఆరోగ్యానికి చాలా మంచిది, కానీ దాని వినియోగమును మరీ ఎక్కువైనప్పుడు మాత్రం కాస్త జాగ్రత్తగా ఉండండి. లేదంటే, ఇది కొన్ని దుష్ప్రభావాలకు దారితీస్తుంది మరియు మీ ఆరోగ్యానికి హానిని కూడా కలిగించవచ్చు.

  అయినప్పటికీ, కాఫీకి బాగా స్పందించే ప్రజలు తమను తాము కాఫీకి దూరంగా ఉంచుకోవాలి. ఇక గర్భిణీ స్త్రీలు కూడా అధిక కాఫీ వినియోగంపై జాగ్రత్తగా ఉండాలి, లేకుంటే ఇది వారి ఆరోగ్యానికి తీవ్రమైన హానిని కలిగించే విధంగా ఉంటుంది.

  ఇటీవలే ఈ కొత్త అధ్యయనాన్ని BMJ లో ప్రచురించబడింది.

  అదే సమయంలో, పరిమితమైన మోతాదులో ( అనగా ఒక రోజుకి 2-3 కప్పులు) కాఫీని త్రాగటం వల్ల కలిగే కొన్ని ఆరోగ్య ప్రయోజనాలను గూర్చి కూడా చాలామంది నేర్చుకుంటున్నారు. అలాంటి విషయాలను మనము కూడా గమనిద్దాం రండి.

  1. శక్తిని మెరుగుపరుస్తుంది :

  1. శక్తిని మెరుగుపరుస్తుంది :

  కాఫీ, మెదడులో ఉన్న ఒక నిషిద్ధ-న్యూరోట్రాన్స్మిటర్ను అడ్డుకునే కెఫిన్ అని పిలువబడే ఒక చైతన్యాన్ని కలిగి ఉంది. ఇది శక్తి స్థాయిలను, మానసిక స్థితిని మరియు మెదడు పనితీరు యొక్క వివిధ అంశాలను మెరుగుపరిచేందుకు అవసరమైన ఉత్తేజాన్ని ప్రభావవంతంగా అందిస్తుంది.

  2. బరువు కోల్పోవడానికి సహాయపడుతుంది :

  2. బరువు కోల్పోవడానికి సహాయపడుతుంది :

  కాఫీలో మెగ్నీషియం మరియు పొటాషియం వంటి ముఖ్యమైన ఖనిజాలను కలిగి ఉంటుంది, ఇది మానవ శరీరంలో ఉండే ఇన్సులిన్ను ఉపయోగించుకోవడంలో సహాయం చేస్తుంది, అందువలన రక్తంలో ఉండే చక్కెర స్థాయిలను నియంత్రించబడి మరియు చక్కెర పదార్థాలను మరియు స్నాక్స్ కోసం మీకు ఉన్న తీవ్రమైన కోరికను తగ్గిస్తుంది. కాఫీలో అదనంగా కెఫిన్ను కూడా కలిగి ఉంటుంది, ఇది శరీరంలో ఉండే కొవ్వు కణాలను విచ్ఛిన్నం చేస్తుంది, అందువల్ల శరీర బరువును తగ్గిస్తుంది.

  3. డయాబెటిస్ ప్రమాదాన్ని తగ్గిస్తుంది :

  3. డయాబెటిస్ ప్రమాదాన్ని తగ్గిస్తుంది :

  కాఫీలో ఉండే కెఫీన్, డయాబెటిస్లో 2 వ రకం యొక్క ప్రమాదాన్ని తగ్గించడంలో సహాయపడుతుంది. ఇన్సులిన్ సెన్సిటివిటీని తగ్గించడంతో పాటు, గ్లూకోస్ యొక్క స్థాయిలను తగ్గించడంలో కూడా కెఫిన్ సహాయపడుతుంది. ఇది డయాబెటిస్లో 2 వ రకము యొక్క ప్రమాదాన్ని తగ్గించడానికి సహాయపడుతుంది.

   4. డిప్రెషన్ను తగ్గించటంలో సహాయపడుతుంది :

  4. డిప్రెషన్ను తగ్గించటంలో సహాయపడుతుంది :

  కాఫీ అనేది, కేంద్ర నాడీ వ్యవస్థను ప్రేరేపిస్తుంది మరియు సెరోటోనిన్, డోపమైన్, మరియు నార్డ్రెనాలిన్ వంటి న్యూరోట్రాన్స్మిటర్ల ఉత్పాదనను ప్రోత్సహిస్తుంది, ఇది డిప్రెషన్ను తగ్గించే పోరాటంలో సహాయపడుతుంది.

  రోజుకు 2-3 కప్పుల త్రాగటం మంచిదే. ఏది ఏమయినప్పటికీ, కాఫీను అధికంగా వినియోగించడం మంచిది కాదు అనే విషయాన్ని అందరూ గుర్తుంచుకోవాలి.

  5. క్యాన్సర్ తో పోరాడేందుకు సహాయం చేస్తుంది :

  5. క్యాన్సర్ తో పోరాడేందుకు సహాయం చేస్తుంది :

  కాచిన కాఫీ గింజలలో అనామ్లజనకాలు అధికంగా ఉంటాయి. కాఫీని రోజులో 2-3 కప్పులుగా తీసుకోవడం వల్ల క్యాన్సర్ పై పోరాడే, ఒక రక్షణతో కూడిన ప్రభావాన్ని కలిగి ఉన్నాయని తెలుస్తోంది. ఇదే విషయం పై నిర్వహించిన అనేక అధ్యయనాలు క్యాన్సర్కు వ్యతిరేకంగా పోరాడటానికి కాఫీని పరిమితమైన స్థాయిలో వినియోగించడం సహాయపడగలదని కనుగొన్నారు.

  English summary

  Health Benefits Of Drinking 3 Cups Of Coffee Everyday

  According to a study conducted by the researchers from the University of Southampton it has been found that consuming 3-4 cups of coffee a day can have substantial health benefits. Reduction in the risk of liver disease, diabetes, dementia and some form of cancer are few of the major benefits.
  We use cookies to ensure that we give you the best experience on our website. This includes cookies from third party social media websites and ad networks. Such third party cookies may track your use on Boldsky sites for better rendering. Our partners use cookies to ensure we show you advertising that is relevant to you. If you continue without changing your settings, we'll assume that you are happy to receive all cookies on Boldsky website. However, you can change your cookie settings at any time. Learn more