అలోవెర జ్యూస్ తాగడం వల్ల పొందే అద్భుత ప్రయోజనాలు

By Lekhaka
Subscribe to Boldsky

అలోవెర (కలబంద) సాధారణంగా దీనిని గార్డెన్లో అందం కోసమే పెంచుతుంటారు. క్రొత్తగా కట్టిన ఇళ్లకూ, భవంతులకూ కూడ దీన్ని దృష్టి దోషనివారణకోసం కడుతుంటారు. ఒక చిన్నమొక్కను తెచ్చి పెరట్లో నాటి అప్పుడప్పుడు కొంచెం నీళ్లు పోస్తుంటే చాలు. ఈ మొక్క ఎన్నో సంవత్సరాలు పెరుగుతూనే ఉంటుంది. వేర్ల నుంచే మళ్లీ దీనికి మొక్కలు వస్తాయి. దీనిని ఇంగ్లీషులో అలోవేరా అంటారు.

కలబంద రసం వాడకం వలన కలిగే ప్రయోజానాలు అందరికి తెలిసినవే. కలబంద రసం వలన కలిగే ప్రయోజనాలపై ఇప్పటికే చాలా మంది అవగాహన కలిగి ఉన్నారు. కలబందలో ఉండే పోషకాలు, శరీరంలో ప్రమాదాలను మరమ్మత్తులను చేస్తాయి. మన శరీరం స్వస్తతకు గురైనపుడు నయం చెయటానికి కావాల్సిన పోషకాలు అన్ని కలబంద రసంలో ఉంటాయి. అంతేకాకుండా చాలా రకాలుగా ఆరోగ్యానికి మేలు చేస్తుంది. అలోవెరా జ్యూస్ ను ఆరోగ్యకరమైనదిగా పరిగణిస్తూ, దీన్ని రోజుకు ఒక సారైనా తీసుకోవాలని సూచిస్తున్నారు నిపుణులు.

కలబంద ఆరోగ్యానికి ఏవిధంగా త్రాగితే ఏవిధంగా పనిచేస్తుంది అలోవెరాలో ఉండే అనేక యాంటీఆక్సిడెంట్స్ మన శరీరంలోని టాక్సిన్స్ ను బయటకు నెట్టివేస్తుంది . ఇంకా ఈ జ్యూస్ లో మంచి అమినో యాసిడ్స్ మరియు ఫ్యాటీ యాసిడ్స్ కలిగి ఉండి శరీర ఆరోగ్యానికి చాలా మేలు చేస్తుంది. సాధారణంగా మన శరీరంలో ప్రోటీన్'ల నిర్మాణానికి భిన్న రకాల 20 అమైనో ఆసిడ్'లు అవసరం మరియు ఇందులో కావలసిన 8 రకాలు మన శరీరంలో ఉత్పత్తి చెందవు. కావలసిన 8 రకాలలోని 7 రకాల అమైనో ఆసిడ్'లు కలబంద రసం నుండి పొందవచ్చు.

Here's Why You Should Be Drinking Aloe Vera Juice

మన శరీరానికి కావాల్సిన అన్ని రకాల పోషకాలను కలబంద రసం నుండి పొందవచ్చు. అలోవెరా జ్యూస్ లో ఉన్న అనేక విటమిన్స్ మన శరీరంలోని డ్యామేజ్ అయిన బాడీ సెల్స్ లేదా టిష్యూలను రిపేర్ చేయడానికి సహాయపడుతుంది. విటమిన్ ఎ, సి, డి మరియు ఇ, ఫోలిక్ యాసిడ్, నియాసిన్ కు మంచి సోర్స్ ఇది. ఇందులో కాపర్, మెగ్నీషియం, పొటాషియం, జింక్, సోడియం, ఐరన్ వంటివి పుష్కలంగా ఉన్నాయి.

ఈ అలోవెరా జెల్ శరీర బాహ్య పరిస్థితులకు స్వీకృతి పెంచడం ద్వారా శరీరం యొక్క రోగనిరోధక శక్తిని పెంచుతుంది. ఈ అలోవెరా జెల్ శరీరానికి పోషకాలను మరియు శరీరానికి అవసరం అయ్యే వాటిని జతచేస్తుంది. ఆ అలోవెర జ్యూస్ ను బహుముఖ ప్రయోజనకారి అంటారు. అందుకే ఇది అనేక ఆరోగ్యాప్రయోజనాలు కలిగి ఉన్నప్పటికీ, కొన్ని ప్రత్యే ఆరోగ్యప్రయోజనాలు మీరు తెలుసుకోవడానికి ఈ క్రింది స్లైడ్ ద్వారా అందిస్తున్నాము.

జాయింట్ పెయిన్

జాయింట్ పెయిన్

అలోవెర జ్యూస్ లో యాంటీ ఇన్ఫ్లమేటరీ లక్షణాలు పుష్కలంగా ఉన్నాయి . ఇవి జాయింట్ పెయిన్ మరియు వాపులను తగ్గించడంలో గ్రేట్ గా సహాయపడుతున్నాయి . అలోవెరా జ్యూస్ ను ఓరల్ గా తీసుకొన్నప్పుడు ఇన్ఫ్లమేషన్ మరియు మరియు జాయింట్ పెయిన్ ను నేచురల్ గా తగ్గిస్తుంది. వయసు పైబడినవారికి సైతం, శరీరంలోని మలినాలను పోగొట్టి ఒత్తిడి తగ్గిస్తుంది. కీళ్ళ అరుగుదల, కీళ్ళనొప్పులవంటివి తగ్గించి కీళ్ళు బాగా పనిచేసేలా శరీర కణాలను ఉత్పత్తిచేస్తుంది.

దంత సమస్యలను నివారిస్తుంది

దంత సమస్యలను నివారిస్తుంది

అలోవెరా జ్యూస్ అనేక రకాల దంత సమస్యలను నివారిస్తుంది . ముఖ్యంగా దంత క్షయం, చిగుళ్ళ సమస్యలు, డిజార్డర్స్ ను నివారిస్తుంది . అలోవెరా జ్యూస్ ను మౌత్ వాష్ గా కూడా తీసుకోవచ్చు . మరియు ఇది దంతాలు, చిగుళ్ళు ఇన్ఫెక్షన్స్ భారీన పడకుండా సహాయపడుతుంది. దంతక్షయాన్నిదూరం చేస్తుంది. అలోవెరా జ్యూస్ లో రిజవేటింగ్ లక్షణాలు పుష్కలంగా ఉన్నాయి. బాడీ యాక్టివ్ గా మరియు హెల్తీగా మార్చుతుంది . ఇది శరీరాన్ని డిటాక్సిఫై చేస్తుంది . జీవక్రియలు డ్యామేజ్ కాకుండా తగ్గిస్తుంది. మినిరల్స్ , యాంటీఆక్సిడెంట్స్ , విటమిన్స్ శరీరంలోని టాక్సిన్స్ ను ఫ్లష్ అవుట్ చేయడానికి సహాయపడుతాయి.

అలోవెరా జ్యూస్ ఇమ్యూన్ సిస్టమ్ ను మెరుగుపరుస్తుంది

అలోవెరా జ్యూస్ ఇమ్యూన్ సిస్టమ్ ను మెరుగుపరుస్తుంది

అలోవెరా జ్యూస్ ఇమ్యూన్ సిస్టమ్ ను మెరుగుపరుస్తుంది. డైజెస్టివ్ డిసీజ్ ను మెరుగుపరుస్తుంది. సర్క్యులేటింగ్ సిస్టమ్ ను మెరుగుపరచడానికి బెటర్ గా పనిచేస్తుంది. సర్క్యులేటింగ్ సిస్టమ్ బెటర్ గా పనిచేసినప్పుడు మొత్తం శరీరం యొక్క ఆరోగ్యం మెరుగుపడుతుంది.

మలబద్ధకం పోగొడుతుంది.

మలబద్ధకం పోగొడుతుంది.

అలోవెరజ్యూస్ జీర్ణక్రియను మెరుగుపరుస్తుంది . శరీరం, చిన్న ప్రేగులు న్యూట్రీషియన్స్ గ్రహించేలా చేస్తుంది. మలబద్దకం నివారిస్తుంది . బౌల్ సమస్యలను నివారిస్తుంది.ఈ రసం తాగితే, జీర్ణక్రియ బాగా జరుగుతుంది. వ్యవస్ధను శుభ్రపరుస్తుంది. మలబద్ధకం పోగొడుతుంది. డయోరియా వంటివి తగ్గుముఖం పడతాయి.

 కొలెస్ట్రాల్ తగ్గిస్తుంది

కొలెస్ట్రాల్ తగ్గిస్తుంది

అలోవెరా జ్యూస్ ను త్రాగడానికి ఉత్తమ ప్రయోజనం కొలెస్ట్రాల్ తగ్గిస్తుంది. దాంతో హార్ట్ మరియు స్ట్రోక్ సమస్యలను తగ్గించుకోవచ్చు. ప్రతి రోజూ అలోవెరా జ్యూస్ ను త్రాగడం వల్ల హార్ట్ సమస్యలుండవు మరియు బ్యాడ్ కొలెస్ట్రాల్ ను తొలగించి, మంచి కొలెస్ట్రాల్ పెంచుతుంది. దాంతో హార్ట్ బీట్ మెరుగుపడుతుంది. చెస్ట్ పెయిన్, ఇన్ఫ్లమేషన్ తగ్గిస్తుంది. కొన్ని పరిశోధనలలో, వైద్యులు కలబంద రసాన్ని రక్తనాళాల ద్వారా రక్తంలోకి ప్రవేశపెట్టడం వలన గణనీయంగా ఎర్ర రక్త కాణాల విస్తరణ సామర్థ్యం అధికం అవుతుంది. ఫలితంగా, ఎర్రరక్త కాణాలు ఆక్సిజన్ రవాణా చేసే సామర్థ్యం పెరుగుతుంది.

బ్లడ్ ప్రెజర్ తగ్గిస్తుంది:

బ్లడ్ ప్రెజర్ తగ్గిస్తుంది:

కలబంద రసంలో రక్త పీడనాన్ని నియంత్రించే కారకాలు ఉండటం వలన, రక్త ప్రసరణ మరియు ఆక్సిజన్ సరఫరా చేసే సామర్థ్యం పెరుగుతుంది మరియు శరీరంలో కొవ్వు పదార్థాల స్థాయిలను కూడా తగ్గిస్తుంది. ప్రతి రోజూ అలోవెరా జ్యూస్ ను ఒక ఎనర్జీ డ్రింక్ గా త్రాగవచ్చు. ఇందులో పుష్కలమైన న్యూట్రీషియన్స్, విటమిన్స్, మరియు మినిరల్స్ శరీరానికి శక్తిని అందిస్తుంది. అలోవెరా జ్యూస్ ను రెగ్యులర్ తీసుకోవడం వల్ల శరీరంలోని అవయవాలు పనిచేసేట్లు ఉద్దీపన కలిగిస్తుంది. అందుకే అలోవెర జ్యూస్ ఆరోగ్యకరం.

బరువు తగ్గించడంలో అద్భుతంగా సహాయపడుతుంది.

బరువు తగ్గించడంలో అద్భుతంగా సహాయపడుతుంది.

ఈ జ్యూస్ లో బహుముఖ ప్రయోజనాలు కలిగి ఉండటం వల్ల ఆరోగ్యానికి మరియు వ్యాధినిరోధక శక్తి పెంచడానికి సహాయపడుతుంది. ప్రతి రోజూ ఒక గ్లాస్ అలోవెరా జ్యూస్ త్రాగడం వల్ల అది బరువు తగ్గించడంలో అద్భుతంగా సహాయపడుతుంది. మరియు ఒక క్రమమైన బరువును నిర్వహించడానికి సహాయపడుతుంది. ఇంకా ఈ కలబంద రసం కడుపు మరియు జీర్ణశ్రయ ట్రాక్ ను శుభ్రపరుస్తుంది. దాంతో శరీరంలో బరువు పెరగడానికి కారణం అయ్యే అవాంఛిత పదార్థాలను తొలగించడంలో అద్భుతంగా సహాయపడుతుంది. దాంతో బరువు తగ్గవచ్చు. ఇంకా ఇది హ్యాంగోవర్ సమస్యలను నివారిస్తుంది.

చర్మ సంరక్షణకు

చర్మ సంరక్షణకు

చర్మ సంరక్షణకు అవసరమైన అమెనో ఆసిడ్స్ మెండుగా కలిగి, విటమిన్ బి12, విటమిన్ సి, ఇ కాల్షియం, ఐరన్(ఇనుము) లెసిథిన్, మెగ్నీషియం, మాంగనీస్, పొటాషియం, సోడియం, జింక్ వంటి ఖనిజాలను కలిగి ఉంటుంది. చర్మం ఎరుపెక్కడం, రేడియేషన్ మూలంగా దెబ్బతిన్న చర్మానికి అలొవెరా జెల్ బాగా పనిచేస్తుంది. స్కిన్ రాషెస్, హెర్పిస్ సింప్లెక్స్, మొటిమలు, రింగ్ వార్మ్ తదితర చర్మవ్యాధులకు కలబంద మంచి ఔషధం. చర్మంపై వచ్చే నల్లమచ్చలను ఇది పోగొడుతుంది. సోరియాసిస్ గజ్జిలాంటి చర్మవ్యాధులను తగ్గిస్తుంది. చర్మానికి నిగారింపు తీసుకొస్తుంది

For Quick Alerts
ALLOW NOTIFICATIONS
For Daily Alerts

    English summary

    Here's Why You Should Be Drinking Aloe Vera Juice

    Aloe vera is one among the versatile ingredient that in found in every Indian Kitchen. Due to its anti-inflammatory and antibacterial properties, aloe vera gel is used for several purposes.
    Story first published: Tuesday, March 21, 2017, 20:00 [IST]
    We use cookies to ensure that we give you the best experience on our website. This includes cookies from third party social media websites and ad networks. Such third party cookies may track your use on Boldsky sites for better rendering. Our partners use cookies to ensure we show you advertising that is relevant to you. If you continue without changing your settings, we'll assume that you are happy to receive all cookies on Boldsky website. However, you can change your cookie settings at any time. Learn more