హాట్ లెమన్ వాటర్ బెనిఫిట్స్ & రోజూ ఉదయమే ఎందుకు తాగాలి?

By: Mallikarjuna
Subscribe to Boldsky

నిమ్మకాయ ప్రతి ఇంట్లో ఉండే ఒక నిత్యవసరం వస్తువు. నిమ్మరసంలోని ఆరోగ్య ప్రయోజనాలు గురించి మనందరికి తెలిసిందే. అందుకే రోజులో ఏదో ఒక రూపంలో తీసుకుంటుంటారు. లెమన్ రైస్, లెమనేడ్, లెమన్ జ్యూస్, సలాడ్స్ మీదకు గార్నిషింగ్ గా నిమ్మరసం ఉపయోగిస్తుంటారు. అయితే నిమ్మరసంను వేడి నీటిలో కలిపి తీసుకోవడం వల్ల కూడా మంచి ఉపయోగాలున్నాయన్న విషయం మీకు తెలుసా?

నిమ్మరసంను ఒక గ్లాసు వేడి నీటిలో కలిపి, రోజూ పరగడుపున క్రమం తప్పకుండా తీసుకోవాలి. ఇలా తీసుకోవడం వల్ల ఇందులో ఉండే సిట్రిక్ యాసిడ్ , అపొట్టలోని అల్యూమినియం హైడ్రాక్సైడ్ ను గ్రహించడానికి అసిడిటిని తగ్గించడానికి సహాయపడుతుంది.

లెమన్ వాటర్ లో విటమిన్ సి ఎక్కువగా ఉంటుంది. ఇది శరీరం పోషకాలకు గ్రహించడానికి సహాయపడుతుంది.

నిమ్మరసంలో ఉండే యాంటీఆక్సిడెంట్, డిలెమనిన్ కంటెంట్ కాలేయంను శుభ్రం చేస్తుంది .

రోజూ ఉదయం హాట్ లెమన్ వాటర్ తాగండి, శరీరంలో జరిగే అద్భుత మార్పులు గమనించండి..

కాలేయంలో అనారోగ్యకరమైన వ్యర్థాలను తొలగించడంలో నిమ్మరసం సహాయపడుతుంది. అంతే కాదు లెమన్ వాటర్ ను రెగ్యులర్ గా రోజూ ఉదయం క్రమం తప్పకుండా తాగడం వల్ల ఇంకా ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలను పొందవచ్చు. లెమన్ వాటర్ రోజూ తాగడం వల్ల ఎలాంటి ప్రయోజనాలు పొందవచ్చో తెలుసుకుందాం...

1. శరీరంను డిటాక్సిఫై చేస్తుంది:

1. శరీరంను డిటాక్సిఫై చేస్తుంది:

లెమన్ వాటర్ అసిడిక్ గుణాలున్నా, ఇందులో ఉండే మరో ఆల్కలైన్ గుణం వల్ల శరీరంలో పిహెచ్ లెవల్స్ ను బ్యాలెన్స్ చేస్తుంది. దాంతో కాలేయంలోని వ్యర్థాలను బయటకు నెట్టడానికి సహాయపడుతుంది. కాబట్టి ప్రతి రోజూ ఉదయం హాట్ లెమన్ వాటర్ డిటాక్స్ అనుసరించడం మంచి పద్దతి .

2. జీర్ణ శక్తిని మెరుగుపరుస్తుంది :

2. జీర్ణ శక్తిని మెరుగుపరుస్తుంది :

ఈ పవర్ ఫుల్ రెమెడీ గ్యాస్ట్రో ఇన్ టెన్షినల్ ట్రాక్ట్ ను మెరుగుపరుస్తుంది. శరీరం పోషకాలను గ్రహించేలా చేస్తుంది. అలాగే ప్రేగుల నుండి వ్యర్థాలు, ముందుకు నెట్టడానికి సహాయపడుతుంది. కాబట్టి, జీర్ణశక్తిని పెంచడంలో హాట్ లెమన్ వాటర్ గ్రేట్ రెమెడీ.

3. బరువు తగ్గిస్తుంది :

3. బరువు తగ్గిస్తుంది :

నిమ్మరసంలో ఉండే పెక్టిన్ అనేది సోలబుల్ కంటెంట్ ఇది బరువు తగ్గించడానికి గొప్పగా సహాయపడుతుంది. కాబట్టి లెమన్ వాటర్ ను డైలీ డైట్ లో చేర్చుకోవడం ద్వారా ఎఫెక్టివ్ గా బరువు తగ్గించుకోవచ్చు.

మీ శరీరానికి ఖచ్చితంగా లెమన్ వాటర్ అవసరమని తెలిపే సంకేతాలు..!!

4. స్టొమక్ అప్ సెట్ ను నివారిస్తుంది:

4. స్టొమక్ అప్ సెట్ ను నివారిస్తుంది:

పొట్ట నొప్పి, హార్ట్ బర్న్, కడుపుబ్బరం వంటి సమస్యల నివారణకు హాట్ లెమన్ వాటర్ సహాయపడుతుంది. హాట్ వాటర్ శరీరంను శుభ్రపరుస్తుంది. ఇందులో ఉండే ఫ్లెవనాయిడ్స్ పొట్టలో ఎసిడిటిని తగ్గిస్తుంది.

5. వ్యాధినిరోధక శక్తిని పెంచుతుంది:

5. వ్యాధినిరోధక శక్తిని పెంచుతుంది:

నిమ్మరసంలో విటమిన్ సి ఎక్కువ. ఇది ఫ్లూ, జలుబుతో పోరాడుతుంది. ఇది మెదడు, మెదడులోని నరాలు పనిచేయడానికి సహాయపడే పొటాసియం కంటెంట్ ను ఉత్పత్తి చేస్తుంది. అలాగే నిమ్మరసంలో ఆబ్సార్బిక్ యాసిడ్ యాంటీ ఇన్ఫ్లమేటరీ లక్షణాలు కలిగి ఉంటుంది.

6. శరీరంలో పిహెచ్ లెవల్స్ ను బ్యాలెన్స్ చేస్తుంది :

6. శరీరంలో పిహెచ్ లెవల్స్ ను బ్యాలెన్స్ చేస్తుంది :

రోజూ హాట్ లెమన్ వాటర్ తాగడం వల్ల ఎసిడిటి లక్షణాల తగ్గిస్తుంది. జాయింట్స్ లో యూరిక్ యాసిడ్స్ ను చేర్చుతుంది.

నిమ్మరసం, తేనె మిశ్రమం తాగితే ఖచ్చితంగా బరువు తగ్గుతారా ?

7. మూడ్ మార్చుతుంది:

7. మూడ్ మార్చుతుంది:

నిమ్మరసంలో మూడ్ ను మార్చే గుణాలుండటం వల్ల నిమ్మరసం పొట్టకు చేరిన వెంటనే, జీర్ణవ్యవస్థ మీద పనిచేసి, మూడ్ మార్చి, మైండ్ ను క్లియర్ గా ఉంచుతుంది.

8. నయం చేసే గుణాలు ఎక్కువ :

8. నయం చేసే గుణాలు ఎక్కువ :

నిమ్మరసంలో దంతక్షయం, చిగుళ్ళ సమస్యలను నివారిస్తాయి. అయితే గుర్తుంచుకోవల్సిన విషయం ఏంటంటే, నిమ్మరసంలో ఉండే సిట్రిక్ యాసిడ్, పళ్ళ మీద ఉండే ఎనామిల్ ను తొలగిస్తుంది. కాబట్టి, లెమన్ వాటర్ తాగిన వెంటనే బ్రష్ చేయడం మంచిది కాదు. ముందుగానే బ్రష్ చేసి, తర్వాత లెమన్ వాటర్ తాగాలి.

English summary

Hot Lemon Water Benefits & Why You Need To Have It Every Morning

Benefits of hot lemon water include body detox, improving the digestive tract, aiding weight loss, etc. Read to know the health benefits of hot lemon water.
Story first published: Thursday, August 24, 2017, 10:00 [IST]
Subscribe Newsletter