మగవారిలో శుక్రకణాల (వీర్యం)యొక్క నాణ్యతను గాలి కాలుష్యం దెబ్బతీస్తుందా !

Subscribe to Boldsky

భారతదేశంలో గల ప్రధాన నగరాలలో వాయు కాలుష్యం అనేది చాలా తీవ్రమైన ఆందోళనకు కారణమైంది. ఇటీవల మనదేశ రాజధాని అయిన ఢిల్లీలో అతిపెద్ద పరిణామాలు చోటుచేసుకున్నాయి. అక్కడ ఉన్న పాఠశాలలు మూసివేయబడ్డాయి, మరియు బస్సులు, రైలు, విమానాల వంటి ప్రధాన సమాచార వ్యవస్థలు తీవ్రంగా ప్రభావితం అయ్యాయి.

ఈ పరిణామం అక్కడతోనే ఆగదు. తీవ్రస్థాయిలో పెరుగుతున్న వాయు కాలుష్యము, అనేకమైన ఆరోగ్యసమస్యలకు దారితీస్తుంది. శ్వాసకోశ సంబంధిత సమస్యలు, ఊపిరితిత్తుల రుగ్మతలు మరియు ఉబ్బసం వంటి కొన్ని దుష్ప్రభావాలు కేవలం వాయు కాలుష్యము వలన ప్రభావితం కాబడుతున్నవి. అంతేకాకుండా, ఈ గాలి కాలుష్యం మగవారిలో శుక్రకణాల యొక్క నాణ్యతపై తీవ్ర ప్రభావాన్ని చూపుతుంది.

ఒక కొత్త అధ్యయనంలో, గాలి కాలుష్యానికి మరియు శుక్రకణాల నాణ్యత దెబ్బతినడానికి మధ్య గల బలమైన సంబంధం గురించి కనుగొన్నారు.

Can Air Pollution Affect The Sperm Quality?

ప్రధాన రచయిత, డాక్టర్. లావో జియాంగ్ క్వియాన్, (హాంగ్ కాంగ్, చైనీస్ విశ్వవిద్యాలయం), వాయు కాలుష్యం అనేది ప్రపంచంలోనే ఉన్న ఒక అతి పెద్ద పర్యావరణ ఆరోగ్య ప్రమాదమని పేర్కొన్నారు.

మనము అధిక స్థాయిలో ఉన్న గాలి కాలుష్యమును ఊపిరిగా పీల్చుకున్నప్పుడు, భారీ లోహాల వంటి విష-రసాయనాలను కలిగిన సున్నితమైన రేణువులు మన ఊపిరితిత్తులలోకి ప్రవేశిస్తాయి, అలా అవి రక్తప్రవాహంలోకి ప్రవేశించి, మన వీర్యంను నాశనం చేస్తాయి.

ఈ అధ్యయనం కోసం పరిశోధకులు, తైవాన్లో 15-49 సంవత్సరాల వయస్సులో ఉన్న 6,500 మంది పురుషులు నుండి నాణ్యతను కలిగి ఉన్న శుక్రకణాల నమూనాలను తీసుకున్నారు, మరియు వారి ఇంటి చిరునామాలను వద్ద ఉన్న నలుసు స్థాయిలతో వ్యతిరేకంగా సరిపోలడం చేశారు.

Can Air Pollution Affect The Sperm Quality?

గాలి కాలుష్యం యొక్క అధిక స్థాయిలు మరియు అసాధారణ ఆకారముగానున్న శుక్రకణాల మధ్య ఒక బలమైన సంబంధాన్ని కనుగొన్నారు. దాని వల్ల వచ్చిన ప్రభావాలు ప్రస్తుతానికి చాలా చిన్నవిగా ఉన్నాయి, కాని వాయు కాలుష్యం యొక్క ప్రాబల్యం కారణంగా, దాని నుండి వచ్చే ఏ చిన్న మార్పుల అయిన ఒక పెద్ద ప్రజారోగ్యానికి సవాలును విసరవచ్చని పరిశోధకులు గమనించారు.

హెల్తీ అండ్ స్ట్రాంగర్ స్పెర్మ్ కౌంట్ పెంచే హెల్తీ ఫుడ్స్

కాబట్టి, ఇక్కడ శుక్రకణాల నాణ్యతను మెరుగుపరచడానికి సహాయం చేసే కొన్ని ఆహారాల జాబితా ఉన్నాయి. అవేంటో ఒకసారి మీరు కూడా చూడండి.

 1. డార్క్ చాక్లెట్లు:

1. డార్క్ చాక్లెట్లు:

డార్క్ చాక్లెట్ల్లో ముఖ్యమైన అమైనో-ఆమ్లాలు మరియు అనామ్లజనకాలు ఎక్కువగా ఉంటాయి. ఈ పదార్థాలు శుక్రకణాల గణనను మెరుగుపరచడంలో మరియు వీర్యం యొక్క పరిమాణమును పెంచటంలో సహాయపడతాయి. పరిమిత పరిమాణంలో డార్క్ చాక్లెట్లను తీసుకోవడం వలన మనకు బాగా ఉపయోగపడగలదు. అయినప్పటికీ, ఇది టెస్టోస్టెరోన్ల అసమతుల్యతకు దారితీస్తుండటం వలన వీటిని ఎక్కువగా తినకూడదు.

2. బ్రోకలీ:

2. బ్రోకలీ:

శరీరంలో విటమిన్-ఎ లోపం వల్ల, పురుషులలో శుక్రకణాల గణన మీద తీవ్రమైన ప్రభావాన్ని చూపుతుంది. విటమిన్-ఎ ను అధికంగా కలిగి ఉన్న ఆహార పదార్థాలు, బీజకణాల యొక్క సంఖ్యను మెరుగుపరుస్తాయి. బ్రోకలీ అనేది విటమిన్-ఎ తో అధికంగా నింపబడి ఉంటుంది. బ్రోకలీని తినడానికి ఉత్తమమైన మార్గం ఏమిటంటే, సలాడ్ లో దాని ముడి పదార్థమును కలపాలి (లేదా) సగం వండిన దానిగా తీసుకోవడం చాలా మంచిది.

3. వెల్లుల్లి:

3. వెల్లుల్లి:

శుక్రకణాల యొక్క స్థాయిని మరింత ఎక్కువగా మెరుగుపరచడంలో సహాయపడే ఉత్తమమైన పదార్థాలలో వెల్లుల్లి ఒకటి. వెల్లుల్లిలో అలిసిన్ అనే పదార్థాన్ని కలిగి ఉంది, ఇది రక్త ప్రవాహాన్ని మెరుగుపరచడంలో సహాయపడుతుంది మరియు దెబ్బతినడం నుండి శుక్రకణాలను రక్షిస్తుంది. ఈ వెల్లుల్లిలో అదనంగా సెలీనియం అనే ముఖ్యమైన ప్రతిక్షకారిని కలిగి ఉన్నది, ఇది శుక్రకణాల యొక్క చలనము మెరుగుపరుస్తుంది. రోజువారీ 1-2 వెల్లుల్లిని తినడం వల్ల మీకు మరింతగా సహాయపడుతుంది.

4. వాల్నట్స్:

4. వాల్నట్స్:

అన్ని రకాల గింజలు కన్నా, అక్రోట్లను అనేవి చాలా ఉత్తమమైనవి. వాల్నట్లలో ఒమేగా -3 అనే కొవ్వు ఆమ్లాలను కలిగి వుంటాయి, ఇవి శరీర అంగమునకు రక్త ప్రవాహాన్ని పెంచుతాయి, అందువలన శుక్రకణాల గణనను పెంచుటకు దోహదపడతాయి. ప్రతిరోజూ గుప్పెడు వాల్నట్లను తీసుకోవడం వల్ల మనకు చాలా సహాయపడుతుంది.

5. అరటి:

5. అరటి:

విటమిన్ C, A మరియు B1 వాటిని అధికముగా కలిగి ఉండటమే కాకుండా, అరటిలో కూడా బ్రోమెలైన్ అని పిలువబడే ఒక ముఖ్యమైన ఎంజైమును కలిగి ఉంటుంది. ఇది శరీరంలో శుక్రకణాల ఉత్పత్తి యొక్క సామర్థ్యమును పెంచడంలో సహాయం చేస్తుంది. అందువల్ల, ప్రతిరోజూ అరటి పండ్లను తినడం వల్ల శుక్రకణాల యొక్క నాణ్యతను పెంచుతుంది.

For Quick Alerts
ALLOW NOTIFICATIONS
For Daily Alerts

    English summary

    Can Air Pollution Affect The Sperm Quality?

    A new study has found a strong link between air pollution and a drop in sperm quality. When we breathe in an area with high levels of air pollution, fine particulates containing toxic chemicals such as heavy metals pass into our lungs, allowing them to enter the bloodstream and thus damage the semen.
    Story first published: Friday, November 24, 2017, 13:00 [IST]
    We use cookies to ensure that we give you the best experience on our website. This includes cookies from third party social media websites and ad networks. Such third party cookies may track your use on Boldsky sites for better rendering. Our partners use cookies to ensure we show you advertising that is relevant to you. If you continue without changing your settings, we'll assume that you are happy to receive all cookies on Boldsky website. However, you can change your cookie settings at any time. Learn more