For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

రోజుకు ఎన్ని గుడ్లు తింటే మంచిదో తెలుసా..?

కోడిగుడ్ల ద్వారా మనకు అనేక రకాల పోషకాలు లభిస్తాయి. వీటిల్లో మనకు శరీరానికి కావల్సిన శాచురేటెడ్ ఫ్యాట్లు, పాలీ అన్‌శాచురేటెడ్ ఫ్యాట్లు, మోనో అన్‌శాచురేటెడ్ ఫ్యాట్లు, పొటాషియం, విటమిన్ ఎ, కాల్షియం, ఐరన్

|

కోడిగుడ్ల ద్వారా మనకు అనేక రకాల పోషకాలు లభిస్తాయి. వీటిల్లో మనకు శరీరానికి కావల్సిన శాచురేటెడ్ ఫ్యాట్లు, పాలీ అన్‌శాచురేటెడ్ ఫ్యాట్లు, మోనో అన్‌శాచురేటెడ్ ఫ్యాట్లు, పొటాషియం, విటమిన్ ఎ, కాల్షియం, ఐరన్, విటమిన్ డి, విటమిన్ బి6, విటమిన్ బి 12, మెగ్నిషియం వంటి కీలక పోషకాలు ఉంటాయి. వీటితో మనకు పలు రకాల అనారోగ్య సమస్యలు తలెత్తకుండా ఉంటాయి. అయితే నిత్యం ఒక కోడిగుడ్డును తినమని వైద్యులు చెబుతారు. మరి ఒక కోడిగుడ్డు చాలా, ఇంకా ఎక్కువ తినలేమా..? అనే వివరాలను ఇప్పుడు తెలుసుకుందాం.

How many eggs should I eat each day?

ఒక కోడిగుడ్డును ఉకడబెట్టుకుని పచ్చ సొనతోపాటుగా తింటే రోజుకు ఒక గుడ్డు చాలు. ఎందుకంటే పచ్చ సొనను కలిపితే మనకు నిత్యం అందే డైటరీ కొలెస్ట్రాల్‌లో 55 శాతం వరకు అందుతుంది. కనుక అది మన శరీరానికి మంచి చేస్తుంది. కాబట్టి రోజుకు ఒక ఉడకబెట్టిన గుడ్డు తినవచ్చు. అయితే ఎక్కువ తినాలనుకుంటే మరో రెండు ఉడకబెట్టిన గుడ్లను తినవచ్చు.

కానీ వాటిల్లో పచ్చ సొన తినరాదు. కేవలం తెల్లనిసొన మాత్రమే తినాలి. దీంతో శరీరంలో కొలెస్ట్రాల్ పెరగకుండా ఉంటుంది. ఇక మధుమేహం ఉన్నవారు వారానికి రెండు గుడ్లను తినవచ్చు. అది కూడా పచ్చ సొనతో కలిపి తినకుండా ఉంటే బెటర్. అయితే ఆరోగ్యవంతులెవరైనా రోజుకు ఒక కోడిగుడ్డును (పచ్చనిసొనతో కలిపి) నిర్భయంగా తీసుకోవచ్చు. దీంతో ఆరోగ్యకర ప్రయోజనాలే కలుగుతాయి. మరి ఎలాంటి ఆరోగ్య ప్రయోజనాలు కలుగుతాయో తెలుసుకుందాం..

రోజుకు 3 గుడ్లు, 1 వారం పాటు తింటే శరీరంలో జరిగే అద్భుత మార్పు..!!రోజుకు 3 గుడ్లు, 1 వారం పాటు తింటే శరీరంలో జరిగే అద్భుత మార్పు..!!

కోడి గుడ్డు తింటే దృష్టికి ఎంతో మేలు కలుగుతుంది.

కోడి గుడ్డు తింటే దృష్టికి ఎంతో మేలు కలుగుతుంది.

రోజు గుడ్డు తినేవారికి ఐ సైట్ మరియు శుక్లాలు వచ్చే అవకాశం బాగా తగ్గుతుంది. గుడ్డులో విటమిన్‌-ఎ ప్రధానమైన జీవపోషకం. ఇది గుడ్డులోని పచ్చసోనలోనే అధికం. కంటి దోషాలు లేకుండా ఉండాలంటే జింక్‌, సెలీనియం, విటమిన్‌-ఇ ఇందులో అధికంగా ఉన్నాయి.

గోళ్ళ ఆరోగ్యానికి చాలా మంచిది:

గోళ్ళ ఆరోగ్యానికి చాలా మంచిది:

ఉడికించిన గుడ్డులో సల్ఫర్ ఎక్కువగా ఉంటుంది మరియు విటమిన్ డి కి ఇది ఒక మంచి మూలం. ఉడికించిన గుడ్డులో విటమిన్ డితో పాటు మినిరల్స్, యాంటీ ఆక్సిడెంట్స్, పుష్కలంగా ఉండి, గోళ్ళు పెరుగుదలకు బాగా సహాయపడుతుంది.

మొదడుకు :

మొదడుకు :

గుడ్డుసొనలో 300 మైక్రోగ్రాములు కోలిన్‌ అనే పోషక పదార్థం ఉంది. ఇది మెదడు కణాల ఆరోగ్యాన్ని కాపాడుతుంది. మెదడులో సమాచార రవాణాన్ని మెరుగుపరుస్తుంది, మెదడు నుండి సంకేతాలు వేగంగా చేరవేయడంలో కూడా కోలిన్‌ ప్రాత్ర వహిస్తుసంది.

ఎగ్ వైట్(గుడ్డు తెల్లసొన)లోని గొప్ప ప్రయోజనాలు ఎగ్ వైట్(గుడ్డు తెల్లసొన)లోని గొప్ప ప్రయోజనాలు

బరువు తగ్గడానికి :

బరువు తగ్గడానికి :

బరువు తగ్గేందుకు గుడ్డు పనికొస్తుంది. అందులో ఉన్న నాణ్యమైన ప్రోటీన్ల వల్ల గుడ్డు తీసుకోగానే కడుపు నిండినట్టుగా అవుతుంది. ఎక్కువ ఆహారం తీసుకోనివ్వదు... అందువల్ల పరిమిత ఆహారం తీసుకొని బరువును నియంత్రించుకోగలుగుతారు. గుడ్డు తక్కువ క్యాలరీలు శక్తిని ఇస్తుంది సాధారణ సైజు గుడ్డు 80 క్యాలరీలు శక్తిని అందిస్తుంది కాబట్టి డైటింగ్‌లో ఉన్నవారు కూడా గుడ్డును తీసుకోవచ్చు.

ఎముకల బలానికి:

ఎముకల బలానికి:

శరీరంలోని అస్థిపంజరం నిర్మాణానికి ముఖ్యమైన పోషకాలు గుడ్డులోని పచ్చసోనలో అధికంగా ఉంటాయి. ఎముకలకు కాల్షియం ముఖ్యం. దీన్ని గ్రహించడానికి విటమిన్‌-డి, ఎముకల్లో జరిగే జీవ రసాయనిక ప్రతి క్రియలన్నింటిలో మెగ్నీషియం చాలా అవసరం. విటమిన్‌-కె, ఫోలిక్‌ యాసిడ్‌, బి6, బి12 గుడ్డులో అధికంగా ఉంటాయి.

రక్తంకు మంచిది:

రక్తంకు మంచిది:

చాలా రోజుల నుండి మీరు గుడ్డు అధిక కొలెస్ట్రాల్ కలిగినినదని, ఇది గుండె ఆరోగ్యానికి మంచిది కాదని మీరు వింటూనే ఉంటారు. అయితే, గుడ్డు పచ్చసొనలోని, ప్రోటీన్స్ రక్తం గడ్డకట్టడాన్ని నివారిస్తుంది.

బ్రెస్ట్ కు చాలా మేలు చేస్తుంది:

బ్రెస్ట్ కు చాలా మేలు చేస్తుంది:

ముఖ్యంగా మహిళలకు ఇది చాలా మేలు చేస్తుంది. గుడ్డులోని పచ్చసోనలో అనేక యాంటి యాక్సిడెంట్లు ఉన్నాయి. విటమిన్‌-ఎ, కెరోటిన్‌ ద్వారా లూమీప్లేమిన్‌, లూమీక్రోమిన్‌ అనే యాంటి యాక్సిడెంట్లు ద్వారా రొమ్ము క్యాన్సర్‌ను నివారించొచ్చు. లూటిన్‌, జియాక్సాంథిన్‌ ద్వారా చర్మ క్యాన్సర్‌ను నిరోధించొచ్చు. గుడ్డు పచ్చ సోనలోని విటమిన్‌-ఇ క్యాన్సర్‌ కణాలను క్షీణించేలా చేస్తుంది.

కొలెస్ట్రాల్:

కొలెస్ట్రాల్:

గుడ్డులోని పచ్చసోనలో శరీర సౌష్టవాన్ని కాపాడే విటమిన్‌-డి, అనవసరమైన కొవ్వును కరిగించే కోలిన్‌ అనే ధాతువు, సెలీనియం, బి12 పుష్కలంగా ఉంటాయి. వారానికి మూడు సార్లు రెండు గుడ్ల చొప్పున ఉదయం బ్రేక్‌ఫాస్ట్‌గా తీసుకుంటే ఊబకాయం తగ్గుతుందని అనేక పరిశోధనలు తెలియజేస్తున్నాయి.

కేశ సంరక్షణకు:

కేశ సంరక్షణకు:

గుడ్డు పచ్చసొన వలన శిరోజాల ఆరోగ్యం మెరు గవుతుంది. గుడ్డులో ఉన్న సల్ఫర్‌, పలురకాల విటమిన్లు, లవణాల వల్ల శిరోజాలకు మంచి పోషణ లభిస్తుంది. మనుషుల గోళ్ళకు మంచి ఆరోగ్యాన్ని గుడ్డు అందిస్తుంది.

టెస్టోస్టిరాల్ లెవల్స్ పెంచుతుంది:

టెస్టోస్టిరాల్ లెవల్స్ పెంచుతుంది:

గుడ్డు పచ్చసొనలో జింక్ పుష్కలంగా ఉంటుంది. గుడ్డులో పుష్కలమైన మినిరల్స్ ఉంటాయి. ఈ మినిరల్స్ ఇతర ఆహార పదార్థాల్లో లభ్యం కావు. కాబట్టి, గుడ్డు పచ్చ సొన తినడం వల్ల పురుషుల్లో మేల్ హార్మోన్స్ పెరుగుతాయి.

English summary

How many eggs should I eat each day?

A boiled egg might be small, but it is a super food packed with essential vitamins and minerals. A boiled egg has potassium, iron, zinc, vitamin E and folate present in it. According to research, a boiled egg has around 6.29 grams of protein and 78 calories.
Desktop Bottom Promotion