బెల్లాన్ని ఎంత మొత్తంలో ప్రతిరోజూ తినాలి? అందులో ప్రయోజనాలేంటి?

Subscribe to Boldsky

చలికాలంలో మన పూర్వీకులు (పెద్దలు) తమ ఆహారం చివరిలో ఎందుకు బెల్లం యొక్క పటికను ఉంచుతారో అనేది ఇప్పటికీ కూడా చాలా ఆశ్చర్యకరంగా ఉంటుంది ! ఇది వారి నోటిని శాంతపరచడానికి కావచ్చు.

బెల్లం అనేది సాంప్రదాయబద్ధమైన ఒక ఆహార పదార్ధం, చెరకు నుండి తయారైన ఈ పదార్థం ఆసియా, ఆఫ్రికా మరియు అమెరికాలోని కొన్ని ప్రాంతాలలో విస్తారంగా ఉపయోగించబడుతోంది.

How much jaggery to eat every day

చెరుకు రసం నుండి మొలాసిస్ మరియు స్పటికాలను వేరు చెయ్యకుండానే ఈ బెల్లం అనేది తయారవుతుంది.

ఇతర రకాల స్వీట్లను తయారుచేసేటప్పుడు, బెల్లం తో పాటు పాలు, కొబ్బరి వంటి ఇతర పదార్ధాల కలయికతో వాటిని తయారు చెయ్యడం జరుగుతుంది, అలాంటి స్వీట్లు ఆరోగ్యంగా, రుచికరంగా, ఆరోగ్యానికి హాని కలిగించని విధంగా ఉంటాయి. ఈ క్రింద చెప్పబడిన ప్రయోజనాలను పొందటం కోసం ప్రతిరోజూ మనం ఎంత మోతాదులో ఈ బెల్లాన్ని తినాలనేది ఒక ప్రశ్నార్థకంగా ఉంది !

ప్రతిరోజు బెల్లం తినడం వల్ల కలిగే కొన్ని ప్రయోజనాల గూర్చి ఇక్కడ వివరించబడ్డాయి :

1. జీర్ణక్రియను మెరుగుపరచడంలో సహాయపడుతుంది :

1. జీర్ణక్రియను మెరుగుపరచడంలో సహాయపడుతుంది :

ఎక్కువ మోతాదులో తీసుకున్న ఆహారాన్ని జీర్ణం చేసేందుకు బెల్లం అనేది అత్యంత సహాయకారిగా ఉంటూ - అద్భుతమైన ప్రభావవంతమైన లక్షణాలను కూడా కలిగి ఉంది. బెల్లంలో ఉండే ఇతర సుగుణాలు జీర్ణక్రియకు సహకరించే ఎంజైముల పనితీరును మెరుగుపరిచేదిగా, మరియు ఎసిటిక్ యాసిడ్ ను నియంత్రించడంలో సమర్థవంతమైన పాత్రను పోషిస్తూ, త్వరితంగా జీర్ణక్రియను సులభతరం చేసేదిగా సహాయపడుతుంది. ఇది విన్న తర్వాత మీరుకూడా ఒక పెద్ద స్పూన్తో బెల్లాన్ని తినడానికి ప్రయత్నిస్తూ ఉంటారు అది ఎందుకోసమో ఇప్పుడైనా అర్థమైందా మీకు ?

2. శుభ్రపరిచే ఏజెంట్గా పనిచేస్తుంది :

2. శుభ్రపరిచే ఏజెంట్గా పనిచేస్తుంది :

అవును, మీరు చదివింది నిజమే !

చక్కెర ను కలిగి ఉన్న ఆహార పదార్ధం కూడా శుభ్రపరిచే ఏజెంట్గా పనిచేయవచ్చు. బెల్లం అనేది శ్వాసకోశ నాళము, ఊపిరితిత్తులు, కడుపు మరియు ప్రేగులలో వచ్చే అవాంతరాలను సమర్థవంతంగా నయం చెయ్యగలదని అంటారు. ఈ కారణాల చేతనే శ్వాస పరంగా వచ్చే రుగ్మతలను అనగా ఆస్తమాను కలిగిన వ్యక్తులకు కాస్త ఉపశమనం ఇవ్వటంలో సహాయపడుతుంది.

3. ఖనిజాలు అధిక స్థాయిలో ఉంటాయి :

3. ఖనిజాలు అధిక స్థాయిలో ఉంటాయి :

తెల్లని చక్కెరలా కాకుండా, బెల్లంలో ఖనిజాలు మరియు ఐరన్ అనేవి ప్రత్యేకంగా ఉంటాయి. బెల్లం యొక్క తయారీ సమయంలోనే ఐరన్ అనేది చాలావరకు సహజంగానే ఏర్పడుతుంది అలానే ఇతర ఖనిజాలు కూడా బెల్లం నుండి నేరుగానే లభిస్తున్నాయి. వాటి కోసం ఎలాంటి కిణ్వప్రక్రియలకు తావులేకుండా అవన్నీ సహజంగానే లభిస్తున్నాయి. శరీరానికి అవసరమైన అతి ముఖ్య ఖనిజాలను అందించి శరీర పనితీరును మెరుగుపరుస్తుంది మరియు అవయవాలు వృద్ధికి సహాయపడుతుంది.

4. సహజసిద్ధమైన తీపిని కలిగి ఉంటుంది :

4. సహజసిద్ధమైన తీపిని కలిగి ఉంటుంది :

మార్కెట్లలో పుష్కలంగా లభ్యమయ్యే కృత్రిమ తీపి పదార్ధాలలో - తెలుపు చక్కెర అనేది మొదటి స్థానంలో ఉంది. ఈ రకమైన చక్కెరను ఉపయోగించడం వల్ల దీర్ఘకాలంలో కలిగే అనారోగ్య సమస్యల దుష్ప్రభావమును నివారించటం కోసం ప్రజలు ఎప్పుడూ ప్రయత్నిస్తూనే ఉంటారు. మరొకవైపు, బెల్లం అనేది సహజంగా లభించే షుగర్ కు ప్రతిరూపమని చెప్పవచ్చు. అలాగే ఇది అన్ని కృత్రిమ తీపి పదార్థాల కంటే పరిపూర్ణమైనదిగాను మరియు ఆరోగ్యకరమైనదిగాను ఉంటుంది. అలాగే, మన ఛాయిస్ కి తగ్గట్లుగానే బెల్లంలో చాలా రకాలు ఉన్నాయి. దీర్ఘకాలంగా ఎవరైతే బరువు తగ్గాలన్న లక్ష్యాలను కలిగి ఉంటారో అలాంటి వారికి బెల్లం అనేది చాలా సమర్థవంతమైన కారకంగా పనిచేస్తుంది.

5. మలబద్దకం నుండి ఉపశమనాన్ని కలిగిస్తుంది :

5. మలబద్దకం నుండి ఉపశమనాన్ని కలిగిస్తుంది :

బెల్లం అనేది ఒక శుద్ది చేసే ఏజెంట్గా ఉంటూ, శరీరం నుండి వ్యర్ధాన్ని, అవాంఛిత కణాలను బయటకు పంపించే సామర్థ్యాన్ని కలిగి ఉంటుంది. ముఖ్యంగా ఇందులో ఫైబర్ను కలిగి ఉండటం వలన మలబద్ధకం నుండి ఉపశమనాన్ని కలిగించడానికి సహాయపడుతుంది ఎందుకంటే, ఇది ప్రేగుల కదలికలను ఉత్తేజపరిచేలా సహాయపడుతుంది.

6. వ్యాధినిరోధక శక్తిని మెరుగుపరుస్తుంది :

6. వ్యాధినిరోధక శక్తిని మెరుగుపరుస్తుంది :

వృద్ధాప్య ప్రక్రియను తగ్గించడంలో సహాయపడే అనేక అనామ్లజనకాలు, ఖనిజాలు మరియు పోషకాలతో బెల్లం పూర్తిగా నిండి ఉన్నాయి. ఇది మన శరీరంలో ఉన్న రోగనిరోధక వ్యవస్థను మెరుగుపరచి, వ్యాధులకు వ్యతిరేకంగా మన శరీరము ప్రతిఘటించేలా దాని పనితీరును మరింత పెంచుతుంది.

7. శ్వాస సంబంధమైన రుగ్మతలకు చికిత్స :

7. శ్వాస సంబంధమైన రుగ్మతలకు చికిత్స :

ముందు చెప్పినట్లుగా, బెల్లంలో శుభ్రపరిచేందుకు మరియు శోథ నిరోధక లక్షణాలతో సంయుక్తంగా కలిసి వివిధ రకాల శ్వాస సంబంధమైన రుగ్మతలను తగ్గించడంలో సహాయపడతాయి. బెల్లం అనేది చాలా సంవత్సరాల నుండి అలెర్జీలకు వ్యతిరేక కారకంగా ఉపయోగించబడుతున్నది.

8. రక్తం కోసం కలుగజేసే ప్రయోజనాలు :

8. రక్తం కోసం కలుగజేసే ప్రయోజనాలు :

బెల్లాన్ని ప్రతినిత్యం సాధారణంగా వినియోగించటం వల్ల, రక్తాన్ని శుద్ధి చేయడంలో సహాయపడుతుంది.

ఇది రక్తానికి సంబంధించిన వివిధ రకాల రుగ్మతలను నివారించేందుకు మరియు హిమోగ్లోబిన్ యొక్క స్థాయిని పెంచడంలోనూ సహాయపడుతుంది, అందువలన బెల్లము ఒక వ్యక్తి యొక్క రోగనిరోధక శక్తిని మెరుగుపరుస్తుంది.

9. బెల్లం వల్లన స్త్రీలకు కలిగే ప్రయోజనాలు :

9. బెల్లం వల్లన స్త్రీలకు కలిగే ప్రయోజనాలు :

ప్రతిరోజు ఒక చెంచా బెల్లాన్ని మహిళలు వినియోగించటం వల్ల చాలా ప్రయోజనాలను పొందగలరు. ఇది వారి శరీరంలో అనేమియా (రక్తహీనతను) నిరోధించడానికి మరియు ఋతు-సమస్యలను నివారించడానికి సమర్థవంతంగా పనిచేస్తుంది. ఇది మహిళల గర్భధారణ సమయంలో ఎర్రరక్త కణాల యొక్క స్థాయిని పెంచుటకు సహాయపడుతుంది. కాబట్టి, బెల్లాన్ని అధికంగా తీసుకోవటం వలన గర్భధారణ సమయంలో స్త్రీలు తమ శక్తిని పెంచుకోవచ్చు, దాని వల్ల అనేక ప్రయోజనాలను పొందవచ్చు.

10. బెల్లం వల్లన మగవారికి కలిగే ప్రయోజనాలు :

10. బెల్లం వల్లన మగవారికి కలిగే ప్రయోజనాలు :

రోజువారీ ఆహారంలో బెల్లాన్ని తీసుకోవటం వలన మగవారు చాలా రకాల ప్రయోజనాలను పొందగలరు. ఉసిరి పొడితో కలిపి బెల్లమును తినడం వలన మగవారిలో నాణ్యమైన శుక్రకణాలను పొందగలరు మరియు దాని యొక్క స్థాయిని బాగా పెంచ్చుకోగలరు. అలాగే ఇది తక్షణ శక్తికి మూల పదార్థంగా కూడ వుంది.

For Quick Alerts
ALLOW NOTIFICATIONS
For Daily Alerts

    English summary

    How Much Jaggery To Eat Every Day To Get Benefits

    Jaggery has various health benefits that can help in replenishing and nourishing the body, if consumed in the right proportion, on a daily basis. Jaggery is made out of sugar cane and has been used extensively in parts of Asia, Africa and some parts of America. It is extracted from cane juice without separating the molasses and crystals.
    Story first published: Friday, December 15, 2017, 13:00 [IST]
    We use cookies to ensure that we give you the best experience on our website. This includes cookies from third party social media websites and ad networks. Such third party cookies may track your use on Boldsky sites for better rendering. Our partners use cookies to ensure we show you advertising that is relevant to you. If you continue without changing your settings, we'll assume that you are happy to receive all cookies on Boldsky website. However, you can change your cookie settings at any time. Learn more