పప్పాయ లీఫ్ జ్యూల్ లో ఆశ్చర్య పరిచే ఆరోగ్య ప్రయోజనాలు...

Posted By:
Subscribe to Boldsky

బొప్పాయి ఒక వండర్ ఫుల్ స్వీట్ ఫ్రూట్ . ఇది మనకు నేచర్ ప్రసాధించిన ఒక వరం. బొప్పాయిలో అనేక ఆరోగ్య ప్రయోజనాలతో పాటు స్కిన్ మరియు హెయిర్ బెనిఫిట్స్ కూడా ఉన్నాయి. ముఖ్యంగా బొప్పాయి చెట్టు ఆకుల్లో మనకు తెలియని మరెన్నో ఔషధగుణాలున్నాయి . బొప్పాయి ఆకులు తినడానికి చేదుగా ఉన్నా ప్రయోజనాలు మాత్రం మెండుగా ఉన్నాయి . వివిధ రకాల అనారోగ్య సమస్యలను నివారించే న్యూట్రీషియన్స్ బొప్పాయి ఆకులలో అద్భుతంగా ఉన్నాయి . బొప్పాయి ఆకులో వున్నన్ని విటమిన్లు మరెందులోను లేవంటారు వైద్యులు. బొప్పాయి ఆకుల్లో విటమిన్ ఎ, బి, సి, డి మరియు ఇ, క్యాల్షియంలు పుష్కలంగా ఉన్నాయి. ఈ పండును ఆహారంగా తీసుకుంటే ఆరోగ్యం చాలా బాగుంటుందంటున్నారు ఆరోగ్య నిపుణులు. ముఖ్యంగా డేంగ్యు ఫీవర్ ను నివారించడం కోసం, రక్తంలో ప్లేట్ లెట్స్ పెంచుకోవడం కోసం బొప్పాయి లీవ్స్ ను అధికంగా ఉపయోగిస్తుంటారు.

చాలా మందికి బొప్పాయి గురించి తెలుసు కానీ బొప్పాయి ఆకులు అద్భుతమైన ఆరోగ్య ప్రయోజనాలు గురించి తెలియదు. ఆసియా, ఆస్ట్రేలియా దేశాల్లోని ఆదివాసీలు ఎక్కువగా బొప్పాయి ఆకులను ఔషధాలు వాడతారు. బొప్పాయి ఆకుల్లోని ఔషధ గుణాల గురించి జపాన్‌లో అనేక పరిశోధనలు జరుగుతున్నాయి. ఫ్లోరిడా విశ్వవిద్యాలయం విద్యార్థులు చేసిన పరిశోధనల్లో క్యాన్సర్‌, ముఖ్యంగా గర్భాశయ, ప్రోస్టేట్‌, కాలేయం, రొమ్ము, ఊపిరితిత్తుల క్యాన్సర్‌ను నివారించే గుణాలు బొప్పాయిలో ఎక్కువగా ఉన్నాయి. అందుకే ప్రస్తుత రోజుల్లో బొప్పాయి ఆకులకు చాలా పాపులారిటి పెరుగుతున్నది. కార్డియో వాస్కులర్ డిసీజ్ నుండి ప్రేగుల్లోని పరాన్న జీవులను నివారించడం వరకూ చాలా గొప్పగా సహాయపడుతుంది.

 Incredible Health Benefits Of Papaya Leaf Juice

అంతే కాదు బ్లడ్ షుగర్ లెవల్స్ ను బ్యాలెన్స్ చేస్తుంది . మన శరీరానికి అవసరం అయ్యే వ్యాధినిరోధక శక్తిపెంచుతుంది . ప్రాణాంతక క్యాన్సర్, డేంగ్యును నివారిస్తుంది. బొప్పాయి ఆకులను జ్యూస్ రూపంలో తీసుకోవచ్చు. యాంటీ క్యాన్సర్ గుణాల వల్ల క్యాన్సర్ ను నివారిస్తుంది. ఇది కొద్దిగా చేదుగా ఉన్నా, దీన్ని ఇతర ఫ్రూట్ జ్యూసులతో కలిపి తీసుకోవచ్చు . బొప్పాయి ఆకుల రసాన్ని ఇంట్లోనే సులభంగా తయారుచేసుకోవచ్చు. మరియు దీన్ని ప్రతి రోజూ తీసుకోవడం వల్ల మన శరీరంలోని మనకు తెలియని అనేక అనారోగ్య సమస్యలనుండి రక్షిస్తుంది. మరి బొప్పాయి ఆకుల జ్యూస్ రూపంలో తీసుకోవడం వల్ల పొందే టాప్ బెనిఫిట్స్ గురించి తెలుసుకుందాం...

కాలేయ ఆరోగ్యాన్ని సపోర్ట్ చేస్తుంది:

కాలేయ ఆరోగ్యాన్ని సపోర్ట్ చేస్తుంది:

బొప్పాయి లీఫ్ జ్యూస్ తాగడం వల్ల ఇది వివిధ రకాల లివర్ సమస్యలను దూరం చేస్తుంది. ముఖ్యంగా సిర్రోసి, లివర్ క్యాన్సర్ , జాండిస్ వంటి లక్షణాలను దూరం చేస్తుంది.

రక్తంలో ప్లేట్ లెట్ కౌంట్ పెంచుతుంది:

రక్తంలో ప్లేట్ లెట్ కౌంట్ పెంచుతుంది:

బొప్పాయి ఆకులు బ్లడ్ ప్లేట్ లెట్ పెంచే శక్తిసామర్థ్యాలు పుష్కలంగా ఉన్నాయి . ఈ బొప్పాయి ఆకు బ్లడ్ కౌంట్ ను చాలా వేగంగా పెంచుతుంది . ప్రతి రోజూ రెండు టేబుల్ స్పూన్ల బొప్పాయి ఆకుల రసాన్ని త్రాగడం వల్ల ప్లేట్ లెట్ కౌంట్ ను నేచురల్ గా పెంచుతుంది.

జీర్ణవ్యవస్థను మెరుగుపరుస్తుంది:

జీర్ణవ్యవస్థను మెరుగుపరుస్తుంది:

బొప్పాయి లీప్స్ లో అమిలైజ్ , కీమో పెపైన్, ప్రొటేస్ మరియు పెపైన్ అధికంగా ఉంటుంది. ఇది జీర్ణ వ్యవస్థను మెరుగ్గా మార్చుతుంది.

వ్యాధులను నివారిస్తుంది:

వ్యాధులను నివారిస్తుంది:

బొప్పాయి లీఫ్ లో ఉండే ఎసిటోజెనిన్ , వ్యాధినిరోధకతను పెంచుతుంది, మలేరియా, డేంగ్యు నిపవారిస్తుంది, క్యాన్సర్ ను అరికడుతుంది

పీరియడ్స్ ను క్రమబద్దం చేస్తుంది:

పీరియడ్స్ ను క్రమబద్దం చేస్తుంది:

ఈ జ్యూస్ ను రెగ్యులర్ గా తాగడం వల్ల పిఎమ్ ఎస్ లక్షణాలను నివారిస్తుంది మరియు మెనుష్ట్రువల్ సైకిల్ ను బ్యాలెన్స్ చేస్తుంది

ఇన్ఫ్లమేషన్ తగ్గిస్తుంది:

ఇన్ఫ్లమేషన్ తగ్గిస్తుంది:

బొప్పాయి జ్యూస్ లో పవర్ ఫుల్ యాంటీ ఇన్ఫ్లమేటరీ లక్షణాలు అధికంగా ఉన్నాయి. ఇవి శరీరంలో ఇన్ఫ్లమేషన్ తగ్గిస్తుంది. ఇతర సమస్యలను నివారిస్తుంది. బొప్పాయి లీఫ్ జ్యూస్ తాగడం వల్ల ఇది మరో గొప్ప హెల్త్ బెనిఫిట్ .

ఎనర్జీ లెవల్స్ ను పెంచుతుంది:

ఎనర్జీ లెవల్స్ ను పెంచుతుంది:

బొప్పాయి లీఫ్ జ్యూస్ ను రెగ్యులర్ గా తాగడం వల్ల ఎనర్జీ లెవల్స్ పెరుగుతాయి. అలసటతో పోరాడుతుంది.

బ్లడ్ షుగర్ లెవల్స్ ను తగ్గిస్తుంది:

బ్లడ్ షుగర్ లెవల్స్ ను తగ్గిస్తుంది:

బొప్పాయి జ్యూస్ రక్తంలో ఇన్సులిన్ లెవల్స్ ను తగ్గిస్తుంది. బ్లడ్ షుగర్ లెవల్స్ ను కంట్రోల్ చేస్తుంది. డయాబెటిస్ ను కంట్రోల్ చేస్తుంది.

బ్లడ్ షుగర్ లెవల్స్ ను తగ్గిస్తుంది:

బ్లడ్ షుగర్ లెవల్స్ ను తగ్గిస్తుంది:

బొప్పాయి జ్యూస్ రక్తంలో ఇన్సులిన్ లెవల్స్ ను తగ్గిస్తుంది. బ్లడ్ షుగర్ లెవల్స్ ను కంట్రోల్ చేస్తుంది. డయాబెటిస్ ను కంట్రోల్ చేస్తుంది.

కార్డియో వాస్క్యులర్ డిసీజ్ ను నివారిస్తుంది :

కార్డియో వాస్క్యులర్ డిసీజ్ ను నివారిస్తుంది :

బొప్పాయి లీప్స్ జ్యూస్ లో ఉండే యాంటీ ఆక్సిడెంట్స్ వ్యాధినిరోధకశక్తిని పెంచుతాయి. దాంతో కార్డియో వ్యాస్కులర్ సిస్టమ్ కు రక్షణ కల్పిస్తాయి. ఎలాంటి హాని జరగకుండా నివారిస్తుంది.

English summary

Incredible Health Benefits Of Papaya Leaf Juice

Papaya leaves are known to be one of the best natural remedies that can help cure several diseases. It is known to be the best cure for dengue fever and cancer as well.
Story first published: Friday, March 31, 2017, 17:22 [IST]
Subscribe Newsletter