పొటాటో(బంగాళదుంప జ్యూస్ )లోని అమేజింగ్ హెల్త్ బెనిఫిట్స్

By: mallikarjuna
Subscribe to Boldsky

మీకు తెలుసా, పచ్చి బంగాళదుంప వాపు , నొప్పుల తగ్గిస్తుందని మీకు తెలుసా, అంతే కాదు ఇది ఎనర్జీని మరియు వ్యాధినిరోధకతను ఇన్ స్టాంట్ గా పెంచుతుంది. అందుకు మీరు చేయాల్సిందల్లా రోజుకు రెండు సార్లు తీసుకుని, ఆరోగ్య ప్రయోజనాలను ఎంజాయ్ చేయడమే!

ఈ ప్రపంచంలోనే ఒక గార్డెన్ వెజిటేబుల్ గా బంగాళదుంపను పెంచుకుంటారు,తినడానికి గార్డెన్ వెజిటేబుల్ గా పిలుచుకుంటారు. వీటిలో ఉండే అత్యంత ముఖ్యమైన పోషకాలు ఆరోగ్యానికి ఉపయోగపడటం మాత్రమే కాదు, ఇది ఒక గార్డెన్ వెజిటేబుల్ గా బాగా ప్రసిద్ది చెందినది.

బంగాళదుంపలో 75% నీళ్ళు ఉంటాయి, ఇంకా గంజి, యాంటీఆక్సిడెంట్స్, ఇతర లక్షణాలు కూడా అధికంగా ఉండటం వల్ల ఇది బాగా ప్రసిద్ది చెందినది.

health

ఇది ఒక రిమార్కబుల్ వెజిటేబుల్ కాబట్టి, ఇందులో ఉండే కులీనరీ లక్షణాలు వల్ల వీటిని ఎక్కువగా ఉడికించి లేదా సూప్స్ రూపంలో లేదా మ్యాష్ చేసి లేదా వివిధ రకాల వంటకాల్లో జోడించి వండుకుని తింటుంటారు.

అయితే , ఈ గ్రేట్ వెజిటేబుల్ ను వండుకునే కాదు, పచ్చిగా జ్యూస్ రూపంలో కూడా తీసుకోవచ్చని అంటున్నారు నిపుణులు . వీటనిలో పోషకాలను, ఆరోగ్య విలువలను రెట్టింపుగా పొందాలంటే ఇలా జ్యూస్ రూపంలో తీసుకోవడం ఉత్తమం.

వాస్తవానికి చాలా మంది వారి రెగ్యులర్ డైట్ లో ఇలా తీసుకోవడం జరుగుతున్నది. ఎందుకంటే ఇలా తీసుకోవడం వల్ల వివిధ రకాల వ్యాధులను నివారించుకోవచ్చుజ చికిత్సను అందివ్వొచ్చున

అయితే చాలా మందికి పచ్చి బంగాళదుంప లోని గ్రేట్ బెనిఫిట్స్ గురించి తెలియకపోవడం వల్లదీన్ని అంతగా వాకపోవచ్చు. మరి మీరు ఆ ప్రయోజనాలేంటో తెలుసుకుని, ఉపయోగించడం ఇప్పుడే మొదలు పెట్టండి....

1. ఇందులో యాంటీ ఇన్ఫ్లమేటరీ లక్షణాలున్నాయి

1. ఇందులో యాంటీ ఇన్ఫ్లమేటరీ లక్షణాలున్నాయి

న్యాచురల్ రా పొటాటో జ్యూస్ లో పవర్ ఫుల్ యాంటీ ఇన్ఫ్లమేటరీ లక్షణాలున్నాయి. ఈ న్యాచురల్ రెమెడీ కండరాల నొప్పులు, జాయింట్ పెయింట్స్ కు న్యాచురల్ రెమెడీగా పనిచేస్తుంది.

రెగ్యులర్ డైట్ లో చేర్చుకోవడం వల్ల శరీంరలో ఇన్ఫ్లమేటరీ అసమతుల్యాన్ని బ్యాలెన్స్ చేస్తుంది. పెయిన్ రిలీవింగ్ గా ఎఫెక్టివ్ గా పనిచేసి, నొప్పి నివారిస్తుంది.

2. డిటాక్సిఫికేషన్ ను క్రమబద్దం చేస్తుంది

2. డిటాక్సిఫికేషన్ ను క్రమబద్దం చేస్తుంది

పచ్చి బంగాళదుంప జ్యూస్ లో ఉండే యాంటీ ఆక్సిడెంట్స్ శరీరంలో పేరుకుపోయిన వ్యర్థాలను తొలగించడంలో ముఖ్యంలో కాలేయం, ప్రేగుల్లో మరియు కిడ్నీల్లోని వ్యర్థాలను తొలగించడంలో గ్రేట్ గా సహాయపడుతుంది

పొటాటో జ్యూస్ లో ఫైబర్, విటమిన్స్, మరియు మినిరల్స్ ఎక్కువగా ఉడే వ్యర్థాలను తొలగించడానికి రక్తం వడపోయడంలో గ్రేట్ గా సహాయపడుతుంది.

ఈ జ్యూస్ కొలెస్ట్రాల్ ఫ్రీ మరియు శరీరంలో రక్త ప్రసరణ మెరుగ్గా జరుగుతుంది. దాంతో ప్రీమెచ్యుర్ ఏజింగ్ ను నివారిస్తుంది. .

3. వ్యాధి నిరోధకతను మెరుగుపరుస్తుంది

3. వ్యాధి నిరోధకతను మెరుగుపరుస్తుంది

పచ్చి బంగాళదుంప జ్యూస్ లో న్యాచురల్ ఆల్కలైన్ గుణాలున్నాయి. ఇది ఒక్కసారి గ్రహించడం వల్ల బ్లడ్ షుగర్ లెవల్స్ ను మ్యానేజ్ చేస్తుంది.

ఈ లక్షణాలు శరీరంలో పిహెచ్ లెవల్స్ ను బ్యాలెన్స్ చేస్తుంది. దాంతో దీర్ఘకాలిక వ్యాధులను నివారిస్తుంది. అలాగే అసిడిక్ నేచర్ ను తగ్గిస్తుంది

ఇంకా ఇందులో ఉండే విటమిన్ సి , న్యూట్రీషియన్స్ వ్యాధి నిరోధకతను పెంచడంలో గ్రేట్ గా సహాయపడుతుంది అంటే జలుబు దగ్గు వంటి ఇన్ఫెక్షన్స్ ను నివారిస్తుంది

4. గౌట్ తో పోరాడుతుంది

4. గౌట్ తో పోరాడుతుంది

రోజుక రెండు కప్పుల పచ్చిబంగాళదుంప జ్యూస్ తాగడం వల్ల యూరిక్ యాసిడ్ క్రిస్టల్తో బాధపడే వారికి వారి జాయింట్ పెయిన్ నివారించడానికి ఎఫెక్టివ్ గా పనిచేస్తుంది.

ఇందులో ఉండే యాంటీ ఆక్సిడెంట్స్ శరీరంలోని వ్యర్థాలను శుభ్రం చేయడంలో చురుగా పనిచేస్తుంది. ఇన్ఫ్లమేషన్ మరియు నొప్పికి కారణమయ్యే వాటిని తొలగిస్తుంది. మరియు కిడ్నీలకు శుభ్రం చేస్తుంది. రోజూ బంగాళదుంప రసం తాగడం వల్ల కిడ్నీ స్టోన్స్, కిడ్నీ బ్లాక్ లను తొలగిస్తుంది

5. అజీర్తీతో పోరాడుతుంది

5. అజీర్తీతో పోరాడుతుంది

అజీర్ణం, యాసిడ్ రిఫ్లెక్షన్ నివారించుకోవడానికి పచ్చి బంగాళదుంప జ్యూస్ ఉపయోగపడుతుంది.

అందుకు మీరు చేయాల్సిందల్లా భోజనం చేసిన ప్రతి సారి కొన్ని టేబుల్ స్పూన్ల పచ్చి బంగాళదుంప జ్యూస్ తాగడం మంచిది

ఇది పొట్ట బారాన్ని తగ్గిస్తుంది, అజీర్తి సమస్యలను నివారిస్తుంది. పొట్టలో ఆమ్లరసాలు ఎక్కువ ఉత్పత్తికాకుండా నివారిస్తుంది. వాపు తగ్గిస్తుంది. చాలా మంది గ్యాస్ట్రిటైటిస్, ఆపానవాయువు, స్టొమక్అల్సర్ కు దీన్ని ఎక్కువగా ఉపయోగిస్తుంటారు.

6. కార్డియో వ్యాస్కులర్ ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తుంది

6. కార్డియో వ్యాస్కులర్ ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తుంది

ఇందులో ఉండే గుణాల వల్ల కొలెస్ట్రాల్ లెవల్స్ ను క్రమబద్దం చేస్తుంది. రక్తప్రసరణను మెరుగుపరుస్తుంది. పచ్చి బంగాళదుంప జ్యూస్ లో ఉండే గుణాలు, ఇన్ఫ్లమేషన్ ను తగ్గిస్తుంది. హార్ట్ సమస్యలను నివారిస్తుంది. దీర్ఘకాలికవ్యాధులను నివారిస్తుంది. ఇంకా హైపర్ టెన్షన్ మరియు ఆర్టియోరస్కోలరోసిన్ ను నివారిస్తుంది పొటాటో జ్యూస్ తాగడం వల్ల ఇన్ఫ్లమేషన్ తగ్గిస్తుంది

7. ఇన్ స్టాంట్ ఎనర్జీ అందిస్తుంది

7. ఇన్ స్టాంట్ ఎనర్జీ అందిస్తుంది

పచ్చి బంగాళదుంప జ్యూస్ తాగడం వల్ల మానసిక ప్రశాంతత ఏర్పడుతుంది. రోజంతా మానసింకగా ఉత్సహాంగా ఉండటానికిసహాయపడుతుంది.

పొటాటో జ్యూస్ లో ఉండే స్ట్రార్చ్ మరియు ఫైబర్ కంటెంట్ క్యాలరీ బర్నింగ్ కు సహాయపడుతుంది. మరియు ప్రత్యుత్పత్తివ్యవస్థను మరింత బెటర్ గా ఉంచుతుంది.

8. చుండ్రుతో పోరాడుతుంది

8. చుండ్రుతో పోరాడుతుంది

పచ్చి బంగాళదుంప రసాన్ని నేరుగా జుట్టుకు అప్లై చేయడం వల్ల తలలో ఈస్ట్ ఇన్ఫెక్షన్ తో పోరాడి, తలలో చుండ్రును నివారిస్తుంది

ఇందులో ఉండే యాంటీఫంగల్ లక్షణాలు ఫంగస్ పెరగకుండా చేస్తుంది. పిహెచ్ లెవల్స్ ను క్రమబద్దం చేస్తుంది. తలను శుభ్రపరచడానికి ప్రోత్సహిస్తుంది.

అదే సమయంలో జుట్టుకు అవసరమయ్యే పోషకాలను కూడా అందిస్తుంది. జుట్టు ఆరోగ్యంగా మంచి మెరుపుతో పెరిగేందుకు సహాయపడుతుంది.

పచ్చి బంగాళదుంప జ్యూస్ ఎలా తయారుచేయాలో తెలుసుకుందాం

పచ్చిబంగాళదుంప జ్యూస్ తయారుచేయాడనికి రెండు మూడు ఫ్రెష్ గా ఉండే బంగాళదుంపలు తీసుకోవాలి. బడ్స్, బ్లాక్ స్పాట్స్ ఉన్నవి తీసుకోకూడదు. ఇలాంటి వాటిలో సలోనిన్ కంటెంట్ ఆరోగ్యానికి హాని కలిగిస్తాయి .

కావల్సిన వి

3 ఫ్రెష్ బంగాళదుంపలు

1 cup నీళ్ళు(200మిల్లీలు)

తయారీ

ముందుగా బంగాళదుంపల మీద ఉన్న పొట్టును తొలగించాలి. తర్వాత శుభ్రంగా కడిగి చిన్న ముక్కలుగా కట్ చేసి, మిక్సీలో వేసి, ఒక కప్పు నీళ్ళు పోసి, మొత్తగా పేస్ట్ చేయాలి.

మెత్తగా పేస్ట్ అయిన తర్వాత. రెండు భాగాలుగా చేసి ఒక బాగం ఉదయం , మరొక భాగం రాత్రి తాగాలి.

అవసరం అయితే, జ్యూసర్ ఉంటే నీళ్ళు చేర్చకుండా జ్యూస్ తయారుచేసి తాగవచ్చు. పచ్చిబంగాళదుంప జ్యూస్ తాగిన తర్వాత శరీరంలో జరిగే ఈ అద్భుతమైన మార్పులను గమనించండి. ఈ అద్భుతమైన జ్యూస్ రెమెడీని మైండ్ లో గుర్తించుకుని, ఒకసారి ట్రై చేసి చూడండి.!

English summary

Incredible Things Raw Potato Juice Can Do for Your Body

Incredible Things Raw Potato Juice Can Do for Your Body. Read to know more about it...
Subscribe Newsletter