టీ పై పేరుకున్న మీగడను తీయ్యకుండా తాగుతున్నారా? అయితే ఏమౌతుందో తెలుసా..?

Posted By:
Subscribe to Boldsky

ఈ యాంత్రిక యుగంలో అన్నిపనులు వేగంగానే ఉంటున్నాయి. కనీసం ఓ పది నిమిషాలు టీ తాగడానికి కూడా సరైన దృష్టి పెట్టలేని పరిస్థితి కొందరిని చూస్తే తెలుస్తుంది. నిజానికి టీ అంటే ఇష్టం ఉండనిది ఎవరికి చెప్పండి. ఏ కాలంలోనైనా వేడి వేడిగా టీ అలా నెమ్మదిగా గొంతులోకి దిగుతుంటే వచ్చ మజాయే వేరు కదా...ముఖ్యంగా చలికాలంలో అయితే టీ ఇచ్చే ఉత్తేజమే వేరు, నీరసంగా, అలసటగా.. లేజీగా ఉన్నవారు కూడా టీ తాగితే ఉత్తేజం పొందుతారు. ఉత్సాహాంగా పనిచేస్తారు.

Is cream on tea good for health..?

ఇదే సరే, ఇంతకీ టీ తాగేటప్పుడు మీరు ఒకటి గమనించారా..? కొద్దిసేపు టీ అలాగే ఆలస్యంగా తాగుతుంటే టీ మీద మీగడ తెట్టులా పేరుకుంటుంది గమనించారా? అవును అదే...అయితే ఏంటంటారా..? ఏమీ లేదండీ అలా మీగడ పేరుకుపోయిన టీని తాగితే మంచిదా..? లేదంటే ఆ మీగడ తీసేసి టీ తాగాలా అన్న సందేహం కొంత మందికి వచ్చుంటుంది. కొంత మంది ఏముందిలే టీనే కదా అని తాగేసేవారు ఉంటారు. అయితే అలా టీ మీద పేరుకున్న మీగడతో ఉన్న టీ తాగడం వల్ల ఏం జరగుతుందో తెలుసుకుందాం..

మీగడ ఎలా ఏర్పడుతుంది

మీగడ ఎలా ఏర్పడుతుంది

సహజంగా అలా చాయ్ మీద మీగడ పేరుకుపోవడమనేది అందులోని కలిపే పాల వల్ల వస్తుంది. పాలను కొద్దిగా వేడి చేసినప్పుడు అందులో ఉండే తేలికపాటి కొవ్వులు దాని మీద పొరలా వచ్చి మీగడలా పేరుకుంటాయి. ఆ క్రమంలో ఆ పాలతో ఛాయ్ పెడితే ఆ టీ కూడా మీగడ పొరలా వస్తుంది. దీర్ఘ కాలికంగా అలా తాగితే మాత్రం కొన్ని అనారోగ్య సమస్యలు ఎదుర్కోక తప్పదు. అవేంటో మరికొంత వివరంగా తెలుసుకుందాం..

ఫ్యాట్స్ ఎక్కు :

ఫ్యాట్స్ ఎక్కు :

మీగడలో పాలకన్నా అధికంగా కొవ్వు పదార్థాలు ఉంటాయి. పాలకన్నా దాదాపుగా 20 నుండి 36 శాతం వరకూ అందులో శాచురేటెడ్ ఫ్యాట్స్, ట్రాన్స్ ఫ్యాట్స్ ఉంటాయి. ఇవి మన శరీరానికి నిత్యం ఎంతో కొంత అవసరమే..

మోతాదకు మించితే ప్రమాదం:

మోతాదకు మించితే ప్రమాదం:

అలా టీ మీద పేరుకున్న మీగడను టీతో పాటు తాగడం వల్ల , అదీ మోతాదుకు మంచి తాగడం వల్ల రక్త నాళాల్లో పేరుకుపోతాయి. దీని వల్ల గుండె జబ్బులు వచ్చేందుకు అవకాశం ఉంటుంది. చెడు కొలెస్ట్రాల్ పెరుగుతుంది. మంచి కొలెస్ట్రాల్ తగ్గుతుంది. తద్వారా దీర్ఘకాలికంగా ఎన్నో సమస్యలు వస్తాయి. కాబట్టి టీ తాగే వారు మీగడను తీసేసి తాగితేనే మంచిది.

అయితే మోతాదుకు తక్కువైతే మాత్ర మీగడ ఉన్నా ఏమీ కాదు.

అయితే మోతాదుకు తక్కువైతే మాత్ర మీగడ ఉన్నా ఏమీ కాదు.

అయితే మోతాదుకు తక్కువైతే మాత్ర మీగడ ఉన్నా ఏమీ కాదు. అది ఎక్కువైతేనే సమస్య మరి, ఎంత మోతాదు వరకూ ఆ ఫ్యాట్స్ ను మనం తీసుకోవచ్చు అంటే, రోజుకు 2 గ్రాముల వరకూ వాటిని తినవచ్చు. అంతకు మించకుండా చూసుకోవాలి.

English summary

Is cream on tea good for health..?

You already know that tea can improve your skin and help keep you fit and trim, but did you know that it also does amazing things for your health?
Story first published: Tuesday, April 11, 2017, 12:01 [IST]
Please Wait while comments are loading...
Subscribe Newsletter