వెన్ను నొప్పికి తక్షణ ఉపశమనాన్ని కలిగించే కొన్ని సహజ సిద్దమైన నూనెలు ఇవే!

By: Ashwini Pappireddy
Subscribe to Boldsky

వెన్నుముక నొప్పిని నిర్లక్ష్యం చేస్తే అది ఒక సందేహాస్పద సమస్యగా మారుతుంది. సాధారణంగా చిరాకుగా వున్నపుడు దాని ప్రభావం మనం చేసే పని మీద కూడా పడుతుంది.ఇది తరచుగా అందరిచే విస్మరించబడుతున్న సమస్య.

వెన్నుముక నొప్పి రావడానికి అనేక రకాల కారణాలున్నాయి.వెన్నెముక యొక్క అసమానత కారణంగా లేదా సరిగ్గా కూర్చోవడం లేదా నిలబడకపోవడం వలన కూడా ఈ సమస్య రావచ్చు.

సాధారణంగా, వృద్ధులలో ఈ వెన్ను నొప్పి ఉండటం చూస్తుంటాం.అయితే, నేడు, ఈ సమస్య సాధారణ యువకుల మీద కూడా ప్రభావితం చేస్తుంది.

back pain treatment

వెన్ను నొప్పి పై అపోహాలు -వాస్తవాలు

ప్రతిసారీ వెన్ను నొప్పి వచ్చినప్పుడు టాబ్లెట్స్ మింగడం మరియు పెయిన్ కిల్లర్స్ వాడటం అనేది ఆరోగ్యానికి మంచిది కాదు.ఇలాంటి పరిస్థితి లో సహజ నివారణల చర్యలు ఉత్తమమైనవి.

ఎసెన్షియల్ నూనెలను వాడటం వలన ఈ సమస్యకు మృదువైన పరిష్కారాన్ని ఇవ్వడంలో ప్రధాన పాత్ర పోషిస్తాయి.

వెన్ను నొప్పికి తక్షణ ఉపశమనం కలిగించే ముఖ్యమైన సహజ నూనెలు కొన్ని క్రింద ఇవ్వబడ్డాయి.

వెన్నునొప్పి చికిత్సకు ముందు కారణాలు తెలుసుకోండి...!

లావెండర్ ఆయిల్:

లావెండర్ ఆయిల్:

ఈ నూనె లోని రోగ నిరోధక మరియు అనాల్జేసిక్ లక్షణాలు నడుం నొప్పి ఉపశమనం కి ఒక

అద్భుతమైన మందుల పనిచేస్తుంది. బాగా పరీక్షించిన నొప్పి నివారిణిగా, ఒక అధ్యయనంలో వెన్నునొప్పికి ఆక్యుప్రెషర్ చికిత్సలో ఉపయోగించినప్పుడు ఇది 39 శాతం వరకు నొప్పిని తగ్గిస్తుంది అని తేలింది.

ఎక్కువ నొప్పి తో బాధపడుతున్న బాధితులలో ఇది వాకింగ్ వేగాన్ని మెరుగుపరుస్తుంది. అంతేకాకుండా ఒక ఆహ్లాదకరమైన వాసన కలిగి, ఈ నూనె వెన్నునొప్పి నుండి రిలాక్స్ ని ఇస్తుంది. బాధిత ప్రాంతంలో ఈ నూనెతోమసాజ్ చేయడం వలన రక్త ప్రవాహం మెరుగుపరుస్తుంది. ఇంకా దీర్ఘకాలిక నొప్పులనుండి ఉపశమనాన్ని కలిగిస్తుంది.

ఎలా అప్లై చేసుకోవాలి?

మీ స్నానపు నీటిలో లావెండర్ నూనె యొక్క కొన్ని చుక్కల ను కలపడం వలన నొప్పికి గొప్ప ఉపశమనాన్ని ఇస్తుంది మరియు కండరాలను విశ్రాంతినిస్తుంది. కూడా, మీరు లావెండర్ నూనెని ప్రమాదానికి గురైన ప్రాంతంలో అప్లై చేసి మసాజ్ చేయడం వలన దానిలోని ఒత్తిడిని తగ్గిస్తుంది.

చమోమిలే ఆయిల్:

చమోమిలే ఆయిల్:

రోగ నిరోధక లక్షణాలు కలిగి ఉండటం వలన, నొప్పి నివారణ పాత్రకు ప్రత్యేకించి మన శరీరం యొక్క వెన్నుముక కి నొప్పి నుండి ఉపశమనాన్ని కలిగించి పెయిన్ కిల్లర్ గా పనిచేస్తుంది.

ఇది ఒక సడలింపు సంచలనాన్ని ప్రేరేపిస్తుంది మరియు దాని లోని భాధ లక్షణాలు కండరాల బాధని నియంత్రిచడంలో సహాయం చేస్తుంది, తద్వారా నొప్పులు తిరిగి రాకుండా గొప్ప ఉపశమనం ఇస్తుంది.

ఎలా అప్లై చేయాలి?

వేరొక వ్యక్తి సహాయంతో ఈ చమురు ని ప్రభావిత ప్రాంతానికి అప్లై చేసి మసాజ్ చేయడం వలన నొప్పినితగ్గించవచ్చు.

యూకలిప్టస్ ఆయిల్:

యూకలిప్టస్ ఆయిల్:

మెత్తగా, సాఫ్ట్ మరియు విశ్రాంతి లక్షణాలు కలిగి ఉన్న యూకలిప్టస్ చమురు సహజ నొప్పి నివారిణి గా చెప్పవచ్చు. ఇది తీవ్ర శోథ నిరోధక మరియు అనాల్జేసిక్ లక్షణాలను కలిగి ఉంటుంది, ఇది నొప్పిని గొప్ప స్థాయిలో తగ్గిస్తుంది.

ఎలా అప్లై చేయాలి?

నూనెలో 20 చుక్కలు తీసుకొని మరియు వెన్నుముఖకి అప్లై చేసి మసాజ్ చేయడం వలన మృదువుగా చేస్తాయి. మొట్టమొదటిసారిగా మీరు ఈ నూనె ని అప్లై చేసినప్పుడు కొంత అసౌకర్యాన్ని అనుభవిస్తారు. ఇది దురద ని కలిగించే దాని యాంటీ ఇన్ఫ్లమేటరీ లక్షణాల వల్ల కావచ్చు. కానీ ఈ ప్రారంభ చిక్కులు త్వరలోనే మరుగున పడతాయి. రోజుకు రెండుసార్లు మర్దనా చేయడం వలన మంచి ఫలితాలను ఇస్తుంది.

బాసిల్ ఎసెన్షియల్ ఆయిల్:

బాసిల్ ఎసెన్షియల్ ఆయిల్:

వెన్నుముక నొప్పుల కోసం ప్రత్యేకంగా సిఫార్సు చేయబడిన నూనె ఇది. తులసి నూనె కండరాలు పట్టుకోల్పోవడంతో లో గొప్ప గా పని చేస్తుంది, అందువలన ఇది నొప్పి ని దూరం చేసి ఉపశమనాన్ని కలిగిస్తుంది.వెనుక కండరాలలో ఏదైనా స్పాసమ్స్ వున్నట్లైతే ఈ ఆయిల్ ని ఉపయోగించడం వలన పూర్తిగా ఉపశమనం పొందవచ్చు.

ఎలా అప్లై చేయాలి?

ఒక 3-4 చుక్కల బాసిల్ నూనెను వెన్నుముఖ కు అప్లై చేసి బాగా మసాజ్ చేయడం ద్వారా వెదజల్లే నొప్పి నుండి భారీ ఉపశమనాన్ని పొందవచ్చు.

మిరియాల నూనె:

మిరియాల నూనె:

శోథ నిరోధక మరియు అనాల్జేసిక్ లక్షణాలను కలిగి ఉండటం వలన, పిప్పరమింట్ నూనె నిజంగా రిఫ్రెష్ అయేలా చేస్తుంది. అలాగే, యాంటి-స్పాస్మోడిక్ లక్షణాలను కలిగి ఉండటంతో, అది బాధాకరంగా ఉండే కండరాలకు తక్షణ ఉపశమనం ఇస్తుంది.

ఎలా అప్లై చేయాలి?

ఈ నూనె డైరెక్ట్ గా అప్లై చేసేముందు దానిని కరిగించాలి.కేవలం కొన్ని చుక్కలు నొప్పిని తగ్గిస్తూ రోజంతా శక్తి స్థాయిని ఉంచడంలో సహాయపడతాయి.

అందువలన,కొన్ని ముఖ్యమైన నూనెలు నొప్పి తో బాధపడుతున్న బాధితులకు గొప్ప ఉపశమనం కలిగిస్తుందని చెప్పవచ్చు. ఇవి కేవలంనొప్పిని తగ్గించడం లో మాత్రమే ప్రయత్నిచడం కాకుండా ప్రభావిత ప్రాంతంలో రక్తం ప్రసరణకు తక్షణ ప్రోత్సాహాన్నిఇస్తాయి., తద్వారా మంట వలన కలిగే నొప్పిని తగ్గిస్తాయి.

ప్రత్యేకించి వెన్నుముక నొప్పికి ఇల్లాంటి ప్రత్యేకమైన ఆయిల్స్ కలిగివుండటం నిజంగా ఒక గొప్ప విషయం కదా అదికూడా సహజమైన పద్ధతిలో అందరికి అందుబాటులో ఉండటం వలన ఇవి చాలా సురక్షితమైనవి.

English summary

Natural Essential Oils For Back Pain

Back pain can be irritating and it affects your daily routine. Know about the best natural oils for back pain, here on Boldsky.
Story first published: Saturday, September 2, 2017, 8:00 [IST]
Subscribe Newsletter