ఫ్లూ జ్వరాన్ని నిర్మూలించడానికి, మీ ఊపిరితిత్తుల శుభ్రపరచడానికి అద్భుతమైన ఇంటి చిట్కా !

By: SSN Sravanth Guthi
Subscribe to Boldsky

క్యారెట్ ను బహుళ ప్రయోజనాలు కలిగిన ఆహార పదార్ధాలలో ఒకటి గా పిలుస్తారు. అది ఇతర సానుకూల ప్రభావాలను కలిగి వుండటంతో పాటు ఫ్లూ జ్వరాన్ని నివారించడంలోనూ క్యారెట్లు సహాయం చేస్తాయి.

శ్వాసకోశ వ్యవస్థకు సంబంధించిన జలుబు, దగ్గు మరియు జ్వరాలు వంటి రుగ్మతలకు పూర్తి ఉపశమనం కలిగించడంలో క్యారెట్ చాలా సహాయపడుతుంది.

ఇక్కడ, క్యారెట్ తో చేయబడిన సిరప్ ను మీ ముందుకు తెస్తున్నాం, మరియు దీనికి నిమ్మకాయను మరియు తేనెను కలపగా వచ్చిన మిశ్రమము - శ్వాసకోశ వ్యవస్థకు వ్యతిరేకంగా పనిచేసే అద్భుతమైన రక్షణ వ్యవస్థగా ఉంది.

Natural Remedy For Cold & Flu

సహజ ఔషధం తయారీలో ఉపయోగించే అద్భుతమైన పోషక విలువల లక్షణాలను ఈ క్యారెట్ లో కలిగి ఉన్నాయి. కఫము, జలుబు జ్వరం వంటి సహజ రుగ్మతలను ఎదుర్కొనే సామర్ధ్యాన్ని క్యారెట్ కలిగి ఉంటాయి.

ఇందులో రోగ నిరోధక వ్యవస్థను బలపరచే విటమిన్ B మరియు C లు చాలా అధికంగా ఉంటుంది. జ్వరము మరియు జలుబు పై పోరాటం చేసే ఈ క్యారెట్ సిరప్ ను తయారుచేయడానికి మనకు క్యారెట్టు, నిమ్మ మరియు తేనె వంటి పదార్ధాలు కావలసి ఉన్నాయి,

కావలసిన పదార్థాలు :

5 - 6 పెద్ద క్యారెట్లు

1 నిమ్మకాయ (రసము)

4 - 5 స్పూన్ల తేనె

తయారీ విధానం :

ముందుగా క్యారెట్లను చిన్నవిగా కట్ చేసి, నీటిలో వేసి మృదువుగా అయ్యేంతవరకు కొన్ని నిమిషాల పాటు మరిగించాలి. అలా తయారైన మిశ్రమాన్ని చల్లార్చాలి. అలా తయారైన మిశ్రమం నుండి రసాన్ని వేరుచేయాలి. అలా వచ్చిన రసానికి ఒక పూర్తి నిమ్మకాయ రసాన్ని మరియు తేనెను కలపాలి. ఇలా తయారైన మిశ్రమాన్ని బాగా కలిపి, ఒక గాజుసీసాలో తీసి నిల్వ ఉంచాలి.

వాడే పద్ధతి :

మీయొక్క అనారోగ్య లక్షణాలను పూర్తిగా మానేంత వరకూ ఈ సిరప్ను 4/5 స్పూన్ల మోతాదులో ప్రతిరోజూ వినియోగించండి.

home remedy for flu

ఫ్లూ జ్వరాలను నివారించడంలో క్యారెట్లు ఎలా సహాయపడతాయి :

క్యారట్లలో బీటా-కెరోటిన్ అనబడే అద్భుతమైన మూల పదార్ధమును కలిగి ఉంది. ఇది శ్వాసకోశమునకు మరియు ప్రేగుల గోడలకు కలిగి ఉన్న శ్లేష్మపు పొరకు సహాయకారిగా ఉంటుంది. ఇది రక్తప్రవాహంలోకి బ్యాక్టీరియ చేరకుండా అడ్డుపడి వాటి వల్ల ఎదురయ్యే ఇబ్బందులకు దూరం చేస్తుంది. బీటా-కెరోటిన్ సమ్మేళనము, శరీరంలో విటమిన్ A గా మార్చబడి, ఇది కణజాల వృద్ధిని పెంచుతుంది మరియు రోగనిరోధకత శక్తిని పెంచుతుంది.

ఫ్లూ జ్వరాలను నివారించడంలో తేనె ఎలా సహాయపడతాయి :

తేనె రోగనిరోధక పనితీరును మెరుగుపరచటంలో సహాయపడుతుంది మరియు కణితుల పరిమాణమును మరియు బరువు తగ్గించేందుకు సాధ్యపడుతుంది. ఇదంతా కూడా తేనె యొక్క సహజమైన "రక్షణ సామర్ధ్యాల" లక్షణాలను కలిగి ఉన్న కారణంగా సాధ్యపడింది.

ఫ్లూ జ్వరాలను నివారించడంలో నిమ్మకాయ ఎలా సహాయపడతాయి :

నిమ్మకాయ శరీరంలోని జలుబును మరియు ఫ్లూ వైరస్ యొక్క బలాన్ని తగ్గిస్తుంది మరియు కఫాన్ని కూడా తగ్గిస్తుంది. మీ రోజువారీ ఆహారంలో నిమ్మకాయను వినియోగించటం వల్ల జలుబును మరియు ఫ్లూ జ్వరముల వంటి వ్యాధి నిరోధకతను పెంచుతుంది మరియు దాని యొక్క వైద్య ప్రక్రియను వేగవంతం చేస్తుంది.

home remedy for flu

ఈ సిరప్ను త్రాగటం వల్ల కలిగే అదనపు ప్రయోజనాలు:

శరీరంలోని జలుబును మరియు ఫ్లూ వైరస్ను ఎదుర్కోవడమే కాకుండా, ఈ సిరప్ కీళ్ళ నొప్పులను, కండరాల వాపుకు మరియు ఎముకలను వాపుకు తగ్గించటానికి సహాయపడుతుంది. ఇది ఒత్తిడిని, ఆందోళన కలిగించే కారకాలతో పోరాడతుంది మరియు నరాల పనితీరుకు సహాయపడుతుంది. ఇందులో విటమిన్లు, మరియు ఖనిజాలు - ఫాస్పరస్ మరియు పొటాషియం వంటి వాటిని కలిగి ఉన్న కారణంగా శరీరానికి కావలసిన శక్తిని ఇస్తుంది.

వీరికి సిఫార్సు చేయబడలేదు:

మీరు ఒక డయాబెటిక్ బాధితుడు గానీ అయితే, (లేదా) మీరు మూత్రవిసర్జన ఔషధాలను తీసుకొనే వారైతే, అలాంటి వారి కోసం ఈ పానీయమును ఖచ్చితంగా సిఫారసు చేయ్యబడదు.

English summary

Natural Remedy For Cold & Flu

Carrot has excellent nutritional properties that have been used in the preparation of natural medicines. Carrots have the ability to combat natural disorders like phlegm, cold, flu etc.
Story first published: Thursday, November 30, 2017, 16:00 [IST]
Subscribe Newsletter