For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

నవరాత్రి స్పెషల్ : తప్పనిసరిగా పాటించాల్సిన ఉపవాస నియమాలు

నవరాత్రి స్పెషల్ : తప్పనిసరిగా పాటించాల్సిన ఉపవాస నియమాలు..

By Mallikarjuna
|

నవరాత్రి సమయంలో 9 రోజుల ఉపవాసం వెనుక దాగున్న సైటిఫిక్ రీజన్స్ మీకు తెలుసా? అసలు ఉపవాసం అంటే ఏమిటి? శరీరపు భౌతిక అవసరాలను, మనసులో భావావేశాల వల్ల కలిగే కోరికలను తిరస్కరించటమే ఉపవాసం. అనేక రకాలైన ఆకారాలను, విధానాలను సృష్టించుకుని, తాను నిర్మించుకున్నవాటికి కట్టుబడిపోతూ ఉంటుంది మనసు. అది దాని లక్షణం. అలా కట్టుబడి ఉండటమనేది ఒక రకమైన క్రమశిక్షణం అయినా, దానితో కొన్ని సమస్యలూ ఉన్నాయి.

ఉదాహరణకు భోజనం చేయటాన్నే తీసుకోండి. చాలాసార్లు మనం బతకటం కోసం భోజనం చేస్తున్నాం తప్పితే భోజనం కోసం బతకటం లేదనే విషయాన్ని మరచిపోతూ ఉంటాం. శరీరం నిలబడటానికి కొంచెమే ఆహారం కావాలి, అలాగే మన కడుపు కూడా కొద్దిపాటి ఆహారాన్నే ఇముడ్చుకోగలదు.

కాని మన ఇంద్రియాలు మాత్రం ఇంకా కోరుతూ ఉంటాయి. మనం వాటి కోరికలు తీరుస్తూ ఉంటాం. అలా శరీరంపై ఎక్కువ భారం పడుతుంది. ఉపవాసం అనేది ఇలా భారంగా తయారైన శరీరాన్ని, కోరికలలో చిక్కుకుపోయిన మనసుకు మనమిచ్చే బహుమతి. అలవాటైపోయిన విధానాల నుండి వాటిని బయటపడేసి, కొత్త దిశను చూపించే అవకాశం ఉపవాసం.

ఆయుర్వేద విధానంలో నవరాత్రి ఉపవాసం

ఆయుర్వేద విధానంలో నవరాత్రి ఉపవాసం

మీ శరీరతత్వాన్ని బట్టి, శరీరంలో నిర్మూలించాల్సిన దోషాలనుబట్టి చిన్నచిన్న ఉపవాసాలను క్రమం తప్పకుండా చేయమని ఆయుర్వేదం చెబుతుంది.

ఉపవాసం వల్ల కలిగే ప్రయోజనాలు

ఉపవాసం వల్ల కలిగే ప్రయోజనాలు

ఆయుర్వేదంలో విస్తారంగా చెప్పబడ్డాయి. జఠరాగ్నిని ప్రజ్వలింపజేసి, జీర్ణాశయంలో పేరుకున్న విశేషాలను, మనసులోని కల్మషాలను తొలగిస్తుంది ఉపవాసం. వాయువులను తీసివేసి శరీరాన్ని తేలికపరుస్తుంది. మనసును, ఆలోచనలను తేటపరుస్తుంది. నాలుకను శుభ్రపరచి శ్వాసను తాజాగా చేస్తుంది. మొత్తంగా శరీర ఆరోగ్యాన్ని కాపాడుతుంది.

ఉపవాసాలను ఎక్కువ సమయం శాస్త్రం సమర్థించదు

ఉపవాసాలను ఎక్కువ సమయం శాస్త్రం సమర్థించదు

అయితే ఉపవాసాలను క్రమశిక్షణ లేకుండా, చాలా ఎక్కువకాలం పాటు చేయటాన్ని శాస్త్రం సమర్థించదు. దాని వలన శరీరంలో కణజాలం తగ్గిపోయి, శరీర తత్వంలో అనిశ్చితి ఏర్పడుతుంది. కాబట్టి ఉపవాసాన్ని సక్రమంగా, తక్కువ కాలావ్యవధులలో చేయటం మంచిది. అంటే వారంలో ఏదో ఒకరోజు అనుకుని ప్రతీ వారమూ అదే రోజున చేయటం లేదా నెలలో కొన్ని రోజులు నిర్ణయించుకుని చేయటం – ఇలా అన్నమాట. ఇది వారివారి శరీర తత్వాన్ని, ఎంత శ్రమపడతారనేదాన్ని బట్టి చేయాలి.

ఉల్లి, వెల్లుల్లి ఈ సమయంలో తినడం మంచిది కాదు :

ఉల్లి, వెల్లుల్లి ఈ సమయంలో తినడం మంచిది కాదు :

ఆయుర్వేద నిపుణుల ప్రకారం ఉల్లిపాయలు మరియు కామన్ సాల్ట్స్ ఫుడ్స్ ను ఎక్కువగా ఇష్టపడుతారు. కానీ ఈ సమయంలో ఇవి శరీరానికి నెగటివ్ ఎఫెక్ట్స్ ను కలిగిస్తుంది. అందువల్ల చాలా మంది ఈ నవరాత్రుల్లో ఉల్లి, వెల్లుల్లి, అల్లం వంటి పదార్థాలకు దూరంగా ఉంటారు. మరి నవరాత్రి సమయంలో ఎలాంటి ఆహారాలు తినాలి? పండ్లు, కుట్టుకు కా అట్టా (బక్ వీట్ ఫ్లోర్), సాల్ట్, (రాక్ సాల్ట్) , గుమ్మడి, సొరకాయ, వాటర్ చెస్ట్ నెట్ వంటి సీజనల్ వెజిటేబుల్స్ తినాలి.

నవరాత్రుల్లో ఉపవాసం ఉండటానికి కొన్ని హెల్తీ రూల్స్ ఉన్నాయి. అవేంటంటే

నవరాత్రుల్లో ఉపవాసం ఉండటానికి కొన్ని హెల్తీ రూల్స్ ఉన్నాయి. అవేంటంటే

ద్రవాలు ఎక్కువగా తీసుకోవాలి:

శరీరాన్ని హైడ్రేషన్ లో ఉంచుకోవాలంటే ద్రవాలు ఎక్కువగా తాగాలి. కోకనట్ వాటర్, లెమన్ వాటర్, పాలు, బట్టర్ మిల్క్, వంటివి ఎక్కువగా తీసుకోవాలి.

నవరాత్రుల్లో ఉపవాసం ఉండటానికి కొన్ని హెల్తీ రూల్స్ ఉన్నాయి. అవేంటంటే

నవరాత్రుల్లో ఉపవాసం ఉండటానికి కొన్ని హెల్తీ రూల్స్ ఉన్నాయి. అవేంటంటే

ఎక్కువ సమయం కాలీకడుపుతో ఉండకూడదు:

ఎలాంటి ఆహారం తీసుకోకుండా ఎక్కువ సమయం కాలీపొట్టతో ఉండకూడదు. అలా ఉండటం వల్ల ఎసిడిటికి కారణమవుతుంది. నట్స్, హెల్తీ ఫైబర్ ఫుడ్స్, స్నాక్స్ తీసుకోవాలి.

నవరాత్రుల్లో ఉపవాసం ఉండటానికి కొన్ని హెల్తీ రూల్స్ ఉన్నాయి. అవేంటంటే

నవరాత్రుల్లో ఉపవాసం ఉండటానికి కొన్ని హెల్తీ రూల్స్ ఉన్నాయి. అవేంటంటే

సగ్గుబియ్యం, ఆలూ టిక్కీ, వంటి ఆహారపదార్థాలు నవత్రుల్లో ఉపవాస సమయంలో ఎనర్జీని ఇస్తాయి. అయితే ఎక్సెస్ ఆయిల్ ఉన్న ఎలాంటి ఆహారాలను తీసుకోకూడదు. సాబుదాన కిచిడి, కీర్ వంటి రిసిపిలు తయారుచేసి అల్పాహారంగా తీసుకోవచ్చు.

నవరాత్రుల్లో ఉపవాసం ఉండటానికి కొన్ని హెల్తీ రూల్స్ ఉన్నాయి. అవేంటంటే

నవరాత్రుల్లో ఉపవాసం ఉండటానికి కొన్ని హెల్తీ రూల్స్ ఉన్నాయి. అవేంటంటే

పెరుగు:

పెరుగులో కూలింగ్ లక్షణాలు ఉండటం వల్ల పొట్టను హెల్తీగా ఉంచుతుంది. ఉపవాసంలో వీటిని తప్పనిసరిగా తీసుకోవాలి.

నవరాత్రుల్లో ఉపవాసం ఉండటానికి కొన్ని హెల్తీ రూల్స్ ఉన్నాయి. అవేంటంటే

నవరాత్రుల్లో ఉపవాసం ఉండటానికి కొన్ని హెల్తీ రూల్స్ ఉన్నాయి. అవేంటంటే

సమక్ రైస్ తీసుకోవచ్చు :

సమక్ రైస్ వీటినే జంగిల్ రైస్ అని పిలుస్తారు, వీటితో వండిన అన్నం ఉపవాసం ఉన్నవారు అల్పాహారంగా తీసుకోవాలి. శరీరానికి కావల్సిన పోషకాలను ఎక్కువగా అందిస్తుంది. సులభంగా జీర్ణం అవుతుంది. క్యాలరీలు తక్కువగా ఉంటాయి.

English summary

Navratri Fasting rules you must know

The former is called as Vasanta (spring) Navratri and the latter is known as Sharad (autumn) Navratri. Ther period of Navratris are marked by elaborate pujas and worship of the nine forms of Maa Durga and fasting. Navratri fasting is believed to bestow prosperity, health and happiness on the devotees.
Desktop Bottom Promotion