ధూమపానమును విడిచిపెట్టడానికి 10 సులభమైన, సమర్థవంతమైన చిట్కాలు

By: SSN Sravanth Guthi
Subscribe to Boldsky

ఒక ప్రజాదరణ పొందిన ఒక కొటేషన్ ఇలా ఉంటుంది, "మీరు ధూమపానాన్ని విడిచిపెడాలనుకుంటే, మిమ్మల్ని మీరే ప్రేమించడాన్ని తెలుసుకోండి".

ఇంకా క్లియర్గా చెప్పాలంటే, మీ గురించి మరియు మీ ఆరోగ్యం గురించి మీరు నిజంగా శ్రద్ధ తీసుకున్నట్లయితే, ధూమపానాన్ని విడిచిపెట్టేందుకు మీరు ఖచ్చితంగా కృషి చేస్తారని పైన తెలిపిన కొటేషన్ నుండి మనము అర్థం చేసుకోవచ్చు, ఎందుకంటే ధూమపానం ఆరోగ్యానికి చాలా కీడు చేసేదిగా ఉంది!

సిగరెట్ మానేయాలనుకొనే వారికి అద్భుత చిట్కాలు

మనుషులుగా, ఏ సమయంలోనైన, ఎప్పుడైనా ఎన్నో వ్యాధుల ద్వారా మన జీవితాలు పూర్తిగా లేదా పాక్షికంగా ప్రభావితం కావచ్చని మనకు తెలుసు.

మనము ఆరోగ్యకరమైన జీవనశైలిని అనుసరిస్తున్నప్పటికీ, అనివార్య కారణాలవలన కొన్ని వ్యాధులు మనకు హాని చేయగలవు. కాబట్టి, వ్యాధులను నివారించడానికి అవసరమైన అన్ని చర్యలను తీసుకోవడానికి మనము ప్రయత్నం చేయాలి, అలా చెయ్యడం మన బాధ్యత కూడా.

quit smoking ideas tips

ధూమపానం అనేది ఒక విధమైన చెడ్డ అలవాటు, ఇది ఖచ్చితంగా ఒక వ్యక్తిని కొన్ని ఘోరమైన వ్యాధుల ప్రమాదానికి గురిచేస్తుంది.

నిజానికి, ధూమపానం మీద చేపట్టిన అధ్యయనం ప్రకారం ప్రకారం, ధూమపానం అనేది ప్రతి సంవత్సరం ప్రపంచవ్యాప్తంగా కొన్ని వేలమంది ప్రజల జీవితాన్ని బలి తీసుకుంటుంది!

ధూమపానంలో ముఖ్యంగా సిగరెట్లు నికోటిన్ తో మీ శరీరాన్ని పూర్తిగా నింపి వేయటం వలన, ఇది చాలా హానికరంగా ఉంటుంది.

ఒక వ్యక్తి ధూమపానం చేసినప్పుడు, అతని (లేదా) ఆమె ఊపిరితిత్తులు పెద్దగా ప్రభావితమవుతాయి, ఎందుకంటే అవి నికోటిన్ మరియు మసితో పూర్తిగా నిండి ఉంటుంది !

స్మోకింగ్ హ్యాబిట్స్: అపోహలు-వాస్తవాలు..!

సహజంగా, ధూమపానం బారిన పడిన బాధిత వ్యక్తి అనేక రోగాలు అనగా, శ్వాసకోశ రుగ్మతలు, ఊపిరితిత్తుల వ్యాధులు, ఊపిరితిత్తుల క్యాన్సర్, నోటి పూతల, అజీర్ణం, అంగస్తంభన, వంధ్యత్వం, నిరాశ మరియు ఆందోళన వంటి అనారోగ్యాలతో మరింత ఎక్కువగా బాధపడుతుంటాడు!

కాబట్టి, ధూమపానం అనే చెడ్డ అలవాటు మీకు దీర్ఘకాలికంగా ఉన్నట్లయితే అది ఖచ్చితంగా మీ ఆరోగ్యాన్ని క్షీణించడానికి దారితీసేటట్లుగా స్పష్టం అవుతోంది.

అయినప్పటికీ, ధూమపానం గురించి గమ్మత్తైన విషయమేమంటే, అది మానసిక వ్యసనములా మారి మానసిక రుగ్మతిలా మారుతుంది, కాబట్టి అలాంటప్పుడు ధూమపానం నుండి వైదొలగిపోవడానికి చాలా కష్టతరమవుతుంది.

అందువల్ల, చాలామంది ధూమపానం విడిచిపెట్టడానికి ప్రయత్నించిన కానీ అది ఫలించలేదు. కాబట్టి, మీరు ధూమపానం విడిచిపెట్టాలని కోరుకునే వ్యక్తిగాని అయితే, ఇక్కడ కొన్ని సమర్థవంతమైన చిట్కాలు ఉన్నాయి!

మీరు స్మోక్ చెయ్యడాన్ని ఎందుకు ఇష్టపడుతున్నారు అనే జాబితాను సిద్ధం చేయండి :

మీరు స్మోక్ చెయ్యడాన్ని ఎందుకు ఇష్టపడుతున్నారు అనే జాబితాను సిద్ధం చేయండి :

మొట్టమొదట, మీరు ఎందుకు ధూమపానం చేస్తున్నారు మరియు ధూమపానం చేయటం వల్ల మీరు ఎందుకు మంచిదిగా భావిస్తున్నారో చెప్పడానికి గల కారణాల జాబితాను రూపొందించండి. మీరు ధూమపానాన్ని ఇష్టపడేవి కేవలం పైపై కారణాలు కావచ్చని ఈ దశలో మీకు తెలుస్తుంది.

మీరు ఎందుకు వదిలి వేయాలనుకున్నారో ఆ జాబితాను సిద్ధం చేయండి :

మీరు ఎందుకు వదిలి వేయాలనుకున్నారో ఆ జాబితాను సిద్ధం చేయండి :

ఆ తరువాత, మీరు ధూమపానాన్ని ఎందుకు విడిచిపెట్టాలనుకుంటున్నారో గల మరొక కారణాల జాబితాను రూపొందించండి. ఉదాహరణకు, ఇది మీ ఆరోగ్యాన్ని ఎలా ప్రభావితం చేస్తుందో మరియు మీ చుట్టూ ఉన్న వ్యక్తులను ఎలా ప్రభావితం చేస్తుంది అనే విషయాలపై. ఎప్పుడూ ఈ జాబితాను మీతో పాటే కలిగి ఉండండి మరియు పొగత్రాగడానికి మీ మనస్సు తొందరపెడుతున్నారని మీరు భావిస్తే అప్పుడు వాటిని చదవండి.

మొత్తం సిగరెట్స్ ప్యాక్లను కొనడం మానుకోండి :

మొత్తం సిగరెట్స్ ప్యాక్లను కొనడం మానుకోండి :

ధూమపానం విడిచిపెట్టి మరొక సమర్థవంతమైన మార్గం మొత్తం సిగరెట్స్ ప్యాక్లను కొనుగోలు చే య్యకుండా, కేవలం ఒకటి లేదా రెండు సిగరెట్లను మాత్రమే కొనుగోలు చేయడం. ఈ అలవాటు వలన మీరు ఒక రోజులో పొగ త్రాగే సిగరెట్ల సంఖ్యను నియంత్రిస్తాయి మరియు క్రమంగా తగ్గిపోతుంది, మీరు పూర్తిగా మానివేసి వరకు.

మీరు ఏ సమయంలో స్మోక్ చేస్తున్నారో దానికి సంబంధించిన జాబితాను సిద్దం చేయండి :

మీరు ఏ సమయంలో స్మోక్ చేస్తున్నారో దానికి సంబంధించిన జాబితాను సిద్దం చేయండి :

మీరు ఒక రోజులో సిగరెట్టు కోసం ఎదురుచూసిన నిర్దిష్ట సమయాలను గూర్చి ఒక చార్ట్ ను రూపొందించండి.

మీరు ఒక సిగరెట్ కోసం యాచించిన ఒక రోజులో నిర్దిష్ట సమయాల చార్ట్ను రూపొందించండి. ఈ రకమైన అలవాటు వల్ల మీరు పొగత్రాగాలన్న కోరికను పురిగొల్పినప్పుడు, మీకు ఒక ఆలోచన కలుగుతున్నందువల్ల, ఆ సమయంలో మీరే మీ దృష్టిని మళ్ళించడానికి ఇతర కార్యకలాపాలలో మునిగిపోవచ్చు.

కొత్త అభిరుచులను అలవరుచుకోండి :

కొత్త అభిరుచులను అలవరుచుకోండి :

పొగ తాగాలన్న కోరిక కలిగినప్పుడు, మీరు మీ దృష్టిని కొత్త అలవాట్లను మీద మరియు కొత్త కార్యక్రమాల మీద ఆసక్తిని అలవరుచుకోండి. జిమ్ కి వెళ్లడం, జాగింగ్ చేయడం, చదవడం, చెడు అలవాటు లేని స్నేహితులతో సమావేశం అవ్వడం వంటి మొదలైనవి, మీరు పరిగణించగలిగే కొన్ని విషయాలు.

మంచి మానసిక-స్థితి మీకు సహాయం చేస్తుంది :

మంచి మానసిక-స్థితి మీకు సహాయం చేస్తుంది :

ధూమపానాన్ని విడిచిపెడుతున్నప్పుడు, మీరు మంచి మానసిక స్థితిని కలిగి ఉండి మీరు మరింత ప్రభావవంతంగా పని చేస్తారని ఇటీవలి అధ్యయనాలు కనుగొన్నాయి. కాబట్టి, మీరు మంచి మానసిక స్థితిలో ఉన్నప్పుడు ధూమపానం విడిచిపెట్టి ఒక చిన్న ప్రయత్నమును చేయండి.

మీకు మీరే విందులలో పాల్గొనండి :

మీకు మీరే విందులలో పాల్గొనండి :

మీరు ఒక డబ్బా (కూజా)లో సిగరెట్లను కొనుగోలు చేయకుండా దాచిన డబ్బును, నెల చివరిలో మీరు దాచిన మొత్తం డబ్బును మీ కోసం మీరే ఖర్చు చెయ్యండి. ధూమపానం విడిచిపెట్టినప్పుడు మీరు ఎంత డబ్బును ఆదా చేయగలరో ఈ అలవాటు మీకు చూపిస్తుంది.

ఆరోగ్యకరమైన స్నాక్స్ను తీసుకువెళ్లండి :

ఆరోగ్యకరమైన స్నాక్స్ను తీసుకువెళ్లండి :

కాయలు, పండు లేదా గింజలు వంటి ఆరోగ్యకర స్నాక్స్ ప్యాకెట్లను మీతో తీసుకెళ్లండి. పొగ త్రాగాలన్న కోరిక కలిగినప్పుడు, ఈ అల్పాహారాన్ని తీసుకోవడం వల్ల పొగ త్రాగలన్న కోరికలను తగ్గిస్తుంది.

బ్రేక్స్ సమయంలో స్మోక్ చేసే మీ సహోద్యోగులతో చేరకండి :

బ్రేక్స్ సమయంలో స్మోక్ చేసే మీ సహోద్యోగులతో చేరకండి :

బ్రేక్స్ సమయంలో స్మోక్ చేసే మీ సహోద్యోగులతో చేరకండి, ఎందుకంటే అది పొగత్రాగే అలవాటును మరింతగా ప్రేరేపిస్తుంది. బదులుగా, మీరు బయట వీధుల్లో ఒక నడకకు ప్రారంభించండి (లేదా) మీ ఫోన్లో ఆటలనైన ఆడవచ్చు.

ధూమపానం వల్ల అనారోగ్యానికి కారణం అయ్యే రోగాల జాబితాను సిద్దం చేయండి :

ధూమపానం వల్ల అనారోగ్యానికి కారణం అయ్యే రోగాల జాబితాను సిద్దం చేయండి :

మీరు పని చేసే డెస్క్ వద్ద మరియు మీ ఇంటి చుట్టూ కొన్ని ప్రదేశాలలో ధూమపానం వల్ల అనారోగ్యానికి కారణం అయ్యే రోగాల జాబితాను పోస్ట్ చేయ్యండి. ఈ అలవాటు వల్ల మీరు త్వరగా ధూమపానాన్ని విడిచిపెట్టడానికి మిమ్మల్ని ప్రోత్సహిస్తుంది.

English summary

10 Simple Yet Effective Tips To Quit Smoking For Good!

Smoking, especially cigarettes, can infuse your body with nicotine, which can be very harmful. Here are 10 simple yet effective tips to quit smoking.
Story first published: Saturday, November 11, 2017, 14:00 [IST]
Subscribe Newsletter